రామాయణంలోని హనుమంతుడు ఎస్సీ కాబట్టే....తొక్కేశారు : సావిత్రీబాయి ఫూలే
BJP-MP-Savitri-Bai-Phule-says-Lord-Hanuman-was-a-slave-of-manuwadi-people-Rachabanda |
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సృష్టించిన ఈ కలకలంలో తాజాగా అదే రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ హనుమంతుడు కూడా మనిషి అని ఆయన కోతి కాదని తెలిపారు. దళితుడైనందుకు హనుమంతుడు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. అసలు దళితులను ఎందుకు మనుషులుగా గుర్తించరని సావిత్రీబాయి ఫూలే ప్రశ్నించారు. `హనుమంతుడు దళితుడే. ఆయనను మనువాదులకు బానిసగా మార్చారు. రాముడి కోసం ఆయన ఎంతో చేశారు. కానీ చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి ఆయన ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు` అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అయోధ్య విషయాన్ని బీజేపీ తెరమీదకు తెస్తుందని అసలు అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిన అవసరం లేదని సావిత్రీ బాయిఫూలే తెలిపారు. నిరుద్యోగాన్ని దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను రామ మందిరం పరిష్కరించగలదా? అని బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే నిలదీశారు.
బీజేపీ.. ఓట్లకోసం దిగజారి ఎంత నీచపు పనులైనా చేస్తుంది. దానికి దేశం సర్వనాశనమైనా పర్వాలేదు. అధికారంలో ఉంటే చాలు. చివరకు రామాయణంలో దేవతలమధ్య కూడా విద్వేషాలు రగిలించారు. హిందూ తమ్ముల్లూ!.. ఇంకా మీకు మోధీతోనే మత ఉద్దరణ జరుగుతుందనీ, సైకోగాల్లవల్లే మతం కాపాడబడుతుందనీ అనుకుంటే.... __________
ReplyDelete