తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత!
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం!!
భావం:
ఓ అర్జునా సర్వ విధముల అతనినే శరణు పొందుము. అతని యనుగ్రహముంటే సర్వోత్తమగు శాంతిని, శాశ్వతమగు మోక్ష పదవిని నీవు పొందగలవు.
పై శ్లోకం గీతలోని 18:62 నుండి సేకరించబడినది.దీని యొక్క విశ్లేషణ మీరు అందించగలరా?
ఈ విధంగా ఒక గీతాశ్లోకాన్ని బహిరంగ చర్చకు పెట్టవలసిన అవసరం యేముంది? భగవద్గీతకు అనేకమంది పెద్దలు వ్రాసిన ప్రామాణిక వ్యాఖ్యానాలున్నాయి కదా, అందుబాటులో. .మీరు స్వయంగా చదువుకొనవచ్చును. హఠాత్తుగా ఒక శ్లోకం వెంటబడినంతమాత్రాన అది పూర్తిగా బోధపడకపోవచ్చును. గీతాధ్యయనం అవసరం కావచ్చును. అటువంటి సంధర్భంలో ఇక్కడ చర్చించటం వలనా ప్రయోజనం ఉండదు. ఇది సరైన విధానం కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం వేరుగా ఉంటే ఉండవచ్చును.
ReplyDeleteశ్యామలీయంగారు నిజానికి ఒక శ్లోకాన్ని విశ్లేషించుకోవాలంటే గీతలోని ఇంకా అనేక శ్లోకాలను పరిశీలించాలి.నిజమే. గీతను అధ్యయనం చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది.ఏ విధంగా చూసినా ఇది ఒకందుకు మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు భగవద్గీత మరుగున పడినంతగా ఏ గ్రంధం కూడా పడలేదు. హిందువులలో అత్యధికులు భగవద్గీతంటే తెలియనివారే, చదవని వారే! చాలా మంది పెద్దలు భగవద్గీతపై ఆధారపడు అని చెప్పాల్సింది పోయి ఆయా,ఆయా పండితుల వ్యాఖ్యానాలపై ఆధారపడు అని చెప్తారేగాని స్వతహాగా గీతను చదివి అవగాహన చేసుకో అని చెప్పరు. అందుకేనేమో హిందువులలో వేదాన్ని,గీతను పట్టుకోవల్సింది పోయి బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు.నా దృష్టిలో ఈనాడు జరుగుతున్న మతమార్పిడులకు ప్రధాన కారణం ఈ పండితవర్గమనే నా అభిప్రాయం. పండితుల సొంత వ్యాఖ్యాలపై ఆధారపడితే వారి ఆలోచనలలోనే ఇరుక్కుపోతాముగాని గీత యొక్క జ్ఞాన సముపార్జన జరుగుతుందా సర్? ఒక్కసారి ఆలోచించండి? రకరకాలుగా బోధించిన పండితుల వ్యాఖ్యాలపై ఆధారపడమంటారా? స్వచ్చమైన సనాతన థర్మాన్ని ప్రతిపాదించిన భగవద్గీతను అధ్యయనం చేయమంటారా? ఒక్కసారి మీరే చెప్పండి సర్? మీరు పెద్దవారు, గౌరవనీయులు మిమ్మల్ని ప్రశ్నించేటంతటివాడిని కాను. కాబట్టి ఒక శిష్యుడు అడిగి తెల్సుకోవాల్సింది గురువుగారినే కనుక మీ యొక్క శిష్యునిగా అడుగుతున్నాను. మళ్లీ చెప్పింది నాకు మరొక పెద్ద గురువుగారు ఉన్నారు.ఆయనే కృష్ణం వందే జగద్గురు. ఆయన బోధించిన గీతలో మళ్లీ మీరు చెప్పిన విషయాన్ని సరి చూసుకుంటాను సర్.కృతజ్ఞతలు.
DeleteQ: పండితుల వ్యాఖ్యానాలపై ఆధారపడు అని చెప్తారేగాని స్వతహాగా గీతను చదివి అవగాహన చేసుకో అని చెప్పరు. ఎందుకలా?
DeleteA: అయ్యా, ప్రతివిషయాన్నీ మనం కేవలం స్వప్రజ్ఞతోనే తెలుసుకోలేము. పెద్దలైనవారు ఇప్పటికే చేసిన కృషి మనకు మార్గదర్శకం కావటంలో దోషం లేదు. అది చాలా అవసరం కూడా. పెద్దలసహాయంతో మనం స్వయంగా అర్థంచేసుకొని విశ్లేషించగల పరిణతి సాధించిన పిదప మనమూ స్వయంగా లోతులు తెలుసుకుందుకు ప్రయత్నించటం మంచిపధ్ధతి.
ఈతరాని పిల్లవాడికి నీవు స్వయంగా గోదావరీ ప్రవాహంలో దూకి ఈతనేర్చుకోవటం మంచిది అని ఎవరైనా సలహా ఇస్తారా? ఈతలో ప్రవీణులైన పిమ్మటనే ప్రవాహంలో దూకి ఈత కొట్టినా ప్రవాహానికి ఎదురీదినా బాగుంటుంది. అలాగే ఏ శాస్త్రాన్ని ఐనా సరే పరిభాష, ప్రాథమిక విషయాలు, మూలసిధ్ధాంతాలూ, సంప్రదాయాలూ వంటివీ గురుముఖతః నేర్చుకున్నాక, కొన్నికొన్ని ఉన్నతమైన గభీరమైన విషయాలను గురుముఖతః చదువుకున్నాక, ఏదైనా స్వయంకృషికి పూనుకోవటం ఆరోగ్యకరమైన సంప్రదాయం.
సంగీతంలో త్యాగరాజస్వామివారి పంచరత్నకీర్తనల్లో నాలుగు గురువుగారు స్వయంగా దగ్గరుండి సాధన చేయిస్తారు. మిగిలిన కీర్తనను స్వయంగా నేర్చుకొని అభ్యాసం చేయమంటారు.అప్పటికి తగిన పరిణతి వచ్చి ఉంటుందనే. లేదూ సంగీతాన్ని పుస్తకాలు చదివి నేర్చుకుంటానంటే అలాంటి వారికి నమస్కరించటమే చేయగలం.
అనుష్ఠానవేదాంతంలో శిఖరాయమానమైన గీతను స్వయంగా నేర్చుకుంటాను నాకు వేదాంతశాస్త్రంతో పరిచయం లేకపోతేనేమి అంటే కేవలం అభినందించి ఊరుకోవటమే చేయగలిగినది.
Q: రకరకాలుగా బోధించిన పండితుల వ్యాఖ్యాలపై ఆధారపడమంటారా? స్వచ్చమైన సనాతన థర్మాన్ని ప్రతిపాదించిన భగవద్గీతను అధ్యయనం చేయమంటారా?
వేదాంతం గహనమైనది. వివిధసైధ్ధాంతిక సంప్రదాయలకు చెందిన పండితులు తమతమ సిధ్ధాంతాల కాంతుల్లో గీతను చూపటానికి చేసిన వ్యాఖ్యానాలవలన గీత ప్రతిష్ఠ ఇవరకు కొంచెం మసకబారిన మాట వాస్తవం. పరస్పరవిరుధ్ధమైన అన్వయాలు పరిస్థిని దిగజార్చిన మాట ఒప్పుకుని తీరాలి. నాకు తెలిసినంతవరకూ అద్వైతసిధ్ధాంతవ్యాఖ్య కృష్ణహృదయానికి దగ్గరగా ఉందని అనిపిస్తుంది. నన్నడిగితే శంకరభాష్యం ఉత్తమం అంటాను. మనం అర్థం చేసుకోవటం పెరిగినకొద్దీ సిధ్ధాంతపరమైన గందరగోళాలూ దూరం అవుతాయి.
గ్వాలియర్ మహారాణి అహల్యాబాయిగారు రోజూ గీతా వ్యాఖ్యాన శ్రవణం చేసేవారు. ఒకసారి మొదటినుండి వింటున్నారు. చదివే పండితుడు 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అనగానే అహల్యాబాయిగారు ఆలోచనలో పడిపోయారట. చాలా సేపటికి ఇలా అన్నారట. అయ్యా, దీనిని 'క్షేత్రే క్షేత్రే ధర్మం కురు' అని అన్వయం చేసుకుంటే ఎలాఉంటుందీ అని. అదివిన కొద్దీ మనస్సు పరిణతి చెందినకొద్దీ గీతామాధుర్యం ఎప్పటికప్పుదు క్రొత్తగా ఉంటుంది. సనాతనధర్మధ్వజం ఐన గీతను మనం స్వంతంగా గ్రహించటానికి ఒకరికన్న ఎక్కువమంది గురువులు సహాయం చేయనివ్వండి. ఇబ్బంది పడవద్దు.
సార్ మీ మొదటి పాయింటు బాగుంది కానీ ఉదాహరణకు ఈత లాంటి skill బదులు లోతయిన విషయాలతో కూడిన theory of relativity వంటివి ఇస్తే బాగా అర్ధం అయ్యేది.
Deleteమీ రెండో పాయింటు అర్ధం అయినా అంట మింగుడు పడడం లేదు. ఒక్కసారి గీత మరుగున పడిందన్న చౌదరి గారి పాయింటును కలిపి చూస్తె, మీరు చెప్పిన పరస్పర విరుద్ధ అన్వయన ఇలా జరగడానికి కారణం అనిపించక మానదు.
పండితుల మధ్య పూర్తి అంగీకారం ఉండకపోవోచ్చు. అక్కడక్కడ వారి విశ్లేషణల మధ్య తీవ్రమయిన బేధాలు ఉండొచ్చు. అయినప్పటికీ అందరు (లేదా అత్యధికులు) స్తూలంగా ఒప్పుకునే అంశాలు ఉంటాయి కదా.
ఈ అంశాలు గీత యొక్క ముఖ్యార్ధం అయి ఉంటె, దీనిని జనసామాన్యం లోకి తీసుకెళ్లవచ్చు. పండితుల మధ్య విబేధాలను వారికి వదిలేసి గీతా సారాంశాన్ని బహుళ ప్రచారం చేస్తే అందరికీ లాభం. అలా జరిగితే మీ మొదటి పాయింటు ప్రకారం శ్లోకాల (లేదా గూడార్తాల) స్థాయి చర్చలు బాహాటంగా కానరావు.
జై గారు,
Deleteమీకు శ్యామలీయం గారి ఉద్దేశం అర్థమైనట్టు లేదు. ఆయన చెప్తున్నదాని ప్రకారరం భగవద్గీత మొత్తం అత్యంత గహనమైనది. అందులో సామాన్యుడి వద్దకు చేర్చదగ్గది కాని, జన సామాన్యంలో చర్చించ గలిగేది కాని ఏదీ లేదు. ఆయన ఈత ఉపమానం కూడా అలాంటిదే.
ఈత రానిదే నీటిలో దిగరాదు. కాని నీటిలో కాక ఇంకెక్కడ నేర్చినా ఈత రాదు. కాబట్టి ఈత రానివారికి ఎప్పటికీ అది రానే రాకూడదు. వచ్చినవారు "ఆహా ఈత అలా వుంటుంది, ఇలా వుంటుంది" అని చెప్తుంటే అది రానివారు విని తరించాల్సిందేనన్నమాట!
@శ్రీకాంత్ చారిగారూ,
Deleteమీకు నాపైగల నిష్కారణవైరభావం ఉచితానుచితాలను విస్మరింపజేస్తున్నదా?
'ఈత రానివారికి ఎప్పటికీ అది రానే రాకూడదు' వంటి దురర్థాలు తీయటానికి మీకెలా మనస్కరించిందో నాకు బోధపడటం లేదు. ఈతరాని పిల్లవాడికి .... అని మొదలు పెట్టి, "గురుముఖతః చదువుకున్నాక, ఏదైనా స్వయంకృషికి పూనుకోవటం ఆరోగ్యకరమైన సంప్రదాయం." అని నేను వెలుబుచ్చిన అభిప్రాయానికి మీరు మనస్ఫూర్తిగానే ఇటువంటి దుర్వ్యాఖ్యానం చేస్తున్నారంటే అది నమ్మశక్యంగా లేదు.
గీతాబోధన కోసం వేదాంతసిధ్దాంతకర్తలూ, అనేకులు యోగీంద్రులూ వివరంగా వ్రాసారూ అంటే 'అది కేవలం హాస్యానికే, గీతలో అంతవిశేషం ఏమీ లేదూ', అని మీ అభిప్రాయం అనుకోమంటారా? జనం సామాన్యార్థాలతో చదువుకుంటే పైపై భావం మాత్రం బోధపడినా తరచుగా అంతరార్థాలు మరుగునే ఉండిపోతాయి. కాబట్టే, యెఱుకగలవారి బోధలనుండి గీతార్థసారం గ్రహించవలసింది మొదట. అలా పరిణతి సాధించిన పిమ్మటనే గీతాహృదయాన్ని మరింతగా స్వయంగా అధ్యయనం చేయటం ఉచితం అని నేను అభిప్రాయపడితే, మీరేమో 'సామాన్యుడి వద్దకు చేర్చదగ్గది కాని, జన సామాన్యంలో చర్చించ గలిగేది కాని ఏదీ లేదు' అని నేను చెప్పినట్లు నిర్థారిస్తున్నారు. సామాన్యులు సామన్యులనుండి కాక విశేషజ్ఞులనుండి తెలుసుకొనటం ఉచితం అన్న మాట మీకు నచ్చకపోతే ఒక నమస్కారం. పెద్దలు చెప్పింది మనబోటి సామాన్యులకే. మీరైతే, అటువంటి వారివద్ద వినయంగా అభ్యసిస్తారో మానుతారో మీయిష్టం. నా అభిప్రాయం నేను చెప్పాను. మీకు నచ్చకపోతే నాకేమీ అభ్యంతరం లేదు. దయచెసి దుర్వ్యాఖ్యానాలు చేయకండి.
నేను సరిగ్గా మిమ్మల్ని అంచనా వేస్తున్నానో లేదో నాకు తెలియదు. నాకు అర్థమైనంతవరకూ మీ కోరిక ఏమిటంటే, ఎక్కడెక్కడ నేనొక అభిప్రాయాన్ని వెలిబుచ్చానో అక్కడక్కడకు వచ్చి నా మాటల్ని అపహాస్యం చేయటమే. అదే మీరు తక్షణకర్తవ్యంగా స్వీకరించినట్లు అనిపిస్తోంది ప్రస్తుతానికి. నా భావన తప్పుకావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ పుటలో నేను వ్రాసిన కాసిని మాటలూ శ్రీK.S.చౌదరిగారు అడిగిన పిమ్మటనే వ్రాసినవే కాని నా వ్యాఖ్యానకండూతికారణంగా కాదు. నేను మొదటచేసిన వ్యాఖ్య కేవలం కండూతికాదా ఇక్కడకు రావటానికి నాకేమి అర్హత ఉంది అని మీరు ప్రశ్నించవచ్చును. అలా చేసినందుకు గాని మీకు నేను క్షమార్పణ చెప్పుకోవాలంటే అలాగే కానివ్వండి.
మీరు నాకన్నా పిన్నలో పెద్దలో నాకు తెలియదు. పిన్నలైతే ఆశీర్వాదసహస్రం. పెద్దలైతే నమస్కారసహస్రం. ఈ వయస్సులో నాకు ఎవరితో నైనా వాదవివాదాలతో ప్రొద్దుపుచ్చాలన్న ఇఛ్ఛలేదు.
@జైగారూ,
@చౌదరిగారూ,
మన్నించాలి. ఈ పుటలో ఇంక వ్రాయటానికి నాకు మనస్కరించటం లేదు. నిజానికి ఇప్పటికే హెచ్చుగా ప్రసంగించానేమో, నా అర్హతకు మించి.
మీకేమైనా సందేహనివృత్తికావలసి ఉంటే, అందుకు నాకేమైన లేశమాత్రపు టర్హత ఉందని మీరు భావిస్తే, దయచేసి నాకు మీరు మెయిల్ చేసి అడగవలసిందిగా ప్రార్థన.
స్వస్తిరస్తు.
శ్యామలీయంగారు...చర్చలలో కామన్ గా ఏవో కొన్ని వాదోపవాదాలు జరుగుతుంటాయి.అవి ఎవరూ పట్టించుకోరు, మీరు కూడా పట్టించుకోవద్దు.ఎప్పటిలా మీరు దయచేసి పాల్గోండి.మీరంటే అందరికీ గౌరవభావం ఉంది.ఇక శ్రీకాంత్ చారిగారు కేవలం తన అభిప్రాయం వెలిబుచ్చారు తప్ప మిమ్మల్ని టార్గెట్ చేసిన ఉద్దేశ్యం లేదనుకుంటున్నాను.మనందరమూ బాధ్యత కలిగిన వ్యక్తులుగా వ్యవహరించాలి తప్ప టార్గెట్ చేసుకుని విమర్శించుకోవడం భావ్యం కాదు.ఎప్పటిలా మీరు రచ్చబండలో కొనసాగుతారని ఆశిస్తున్నాను సర్!
Deleteమన్నించాలి చౌదరిగారు, ఇటీవలికాలంలో శ్రీశ్రీకాంత్ చారి గారు ఇలా నన్ను target చేసుకొని ఎద్దేవాచేసి మాట్లాదటం తరచుగా జరుగుతోంది. ఇది అందరూ గమనించే ఉంటారు కూడా. అందుచేత వారికి విపులంగా విన్నవించుకోవలసి వచ్చింది.
Deleteఇకపోతే వాదోపవాదాలన్నారు. వాదనకోసం ఐతే నాకు ఏ విషయం పైనగాని వ్రాసే ఉద్దేశం లేదు. ఎవరితోనూ వాదించేందుకు ఆసక్తి లేదు. క్షమించాలి.
శ్యామలీయం గారు,
Deleteమిమ్మల్ని టార్గెట్ చేయవలసిన అవసరమూ, వ్యవధానమూ నాకు లేవని గమనించ గోరుతాను. ప్రతి రోజూ మీరు ఎన్ని సార్లు కామెంటుతున్నారు, వాటిలో ఎన్నిటికి నేను ప్రతి వ్యాఖ్యలు చేశాను అన్నది ఒక సారి ఆత్మ విమర్శ చేసుకుంటే తమరికి సత్యం బోధపడగలదు. ప్రతి ఒక్కరి కామెంట్ల మధ్యలోకి దూరి తమకు తోచిన ఉచిత సలహాలిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని చూసేవారెవరో మాత్రం అందరికీ తెలిసినదే.
ఎక్కడో ఎందుకు? ఈ బ్లాగులోనే తమరి ప్రవర్తన కొట్టొచ్చినట్టు కనపడింది. చౌదరి గారు ఒక శ్లోకం ఇచ్చి వివరణ కోరినపుడు తెలిస్తే చెప్పొచ్చు. తెలియక పోతే మానెయ్యొచ్చు. కాని మీరు "ఒక గీతాశ్లోకాన్ని బహిరంగ చర్చకు పెట్టవలసిన అవసరం యేముంది?" అని గద్దింపులు మొదలు పెట్టారు. తమరికి గీతపై అనేక వ్యాఖ్యానాలు తెలిసినట్టూ బిల్డప్పు ఇచ్చారు. అందులోనూ శంకరుడిది ప్రామాణికమని కూడా సెలవిచ్చారు. ఇన్నీ తెలిసిన పండితోత్తములు బ్లాగరు అడిగిన అసలు ప్రశ్నకి ఎందుకు స్పందించరో అర్థం కాదు.
ఇక మీరన్న మాటలు చూద్దాం. "ఈతరాని పిల్లవాడికి నీవు స్వయంగా గోదావరీ ప్రవాహంలో దూకి ఈతనేర్చుకోవటం మంచిది అని ఎవరైనా సలహా ఇస్తారా? ఈతలో ప్రవీణులైన పిమ్మటనే ప్రవాహంలో దూకి ఈత కొట్టినా ప్రవాహానికి ఎదురీదినా బాగుంటుంది." అంటే ఏమిటిట? గోదావరి ఒడ్డున బతికే పిల్లవాడు గోదావరిలో ఈత నేర్చుకోక ఇంకెక్కడికో వెళ్ళి నేర్చుకుంటాడా? సముద్రం ఒడ్డున బ్రతికే జాలరి కొడుకు సముద్రంలో కాక మరెక్కడ ఈత నేర్చుకుంటాడు? దీన్ని బట్టి అర్థం కావడం లేదూ, మీ ఉద్దేశం ఏమిటో?
గీత గురించి ప్రశ్నలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అలాంటి ప్రశ్నలు వెస్తే ఏదో కొంప మునిగిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు మీరు. అసలు అవి చర్చకే రావద్దని ఆదేశించడానికి ప్రయత్నించారు పలుమార్లు. 'ఈత రానివారికి ఎప్పటికీ అది రానే రాకూడదు' అన్నది దురర్థమైతే అసలు గీతను బహిరంగంగా చర్చించనే కూడదు అనీ మీరు అంటున్న దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కాస్త చెపుతారా? ఇటువంటి వక్రభాష్యాలు చెప్పి కాదా మత గ్రంథాలను సామాన్య ప్రజానీకానికి అందకుండా వేల సంవత్సరాల పాటు తొక్కిపట్టింది?
చివరగా తమరికి ఒక సూచన. విషయపరంగానే తప్ప కావాలని తమకి వ్యతిరేకంగా రాయడం పట్ల ఎటువంటి ఆసక్తి వుండదని మీరు తెలుసుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు చాదస్తపు వ్యాఖ్యలు రాస్తే వాటిని వ్యతిరేకించే వ్యాఖ్యలు కూడా వస్తూనే వుంటాయి మరి!
+1
ReplyDeleteచౌదరి గారూ, 18:66 శ్లోకానికి ఇది దగ్గరగా ఉన్నట్టుంది.
ReplyDeleteఅయ్యా శ్రీకాంత్ చారి గారూ..
ReplyDeleteశ్యామలీయం గారి పట్ల మీ ప్రవర్తన అస్సలు బాగా లేదు. శ్యామలీయం గారి పట్ల ఇలాంటి ప్రవర్తనను చూపించటం ఇదే మొదటిసారి కాదు మీకు. ఆయన అంత చక్కగా వివరిస్తున్నపుడు మధ్యలో మీరు ఆయన మాటలకు పెడార్ధాలు తీయడం బాగా లేదు.
నేను మీ ప్రవర్తనను ఖండిస్తున్నాను.
-కిరణ్
అయ్యా కిరణ్ గారు,
Deleteఆయన ఏమని వివరించారు? మీకర్థమయింది కాస్త శెలవిస్తారా?
ReplyDeleteదీని విశ్లేషణ సింపుల్ గా గజేంద్ర మోక్షము !
జిలేబి
కొండలరావుగారి ఉవాచ, నన్నుద్దేశించి " ఇందులో మీరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు నాకనిపిస్తుంది. "
ReplyDeleteకొండలరావుగారూ , అంతా చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మీకు శ్రీకాంత్ చారిగారు నన్ను ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించనే లేదు కదండీ?
మీ విజ్ఞతకు నా నమోవాకములు!
దయచేసి నన్ను క్షమించండి. ఒకరికి చెప్పటానికి నేనెంతవాడిని!
నన్నొక బ్లాక్‍మెయిలరుగా ముద్రవేయగల జ్ఞానులమధ్య నిలబడే అర్హత నాకు లేదని భావించి తప్పుకుంటున్నాను.
శ్యామలీయం గారు, క్షమించాలి. శ్రీకాంత్ చారి గారు మిమ్ములను ఎద్దేవా చేశారని మీరనుకుంటున్నారు. మీ వ్యాఖ్యానానికి అతను రిటార్ట్ గా అలా వ్యాఖ్యానిచాడని నేననుకుంటున్నాను. మీరు చౌదరిగారి శ్లోకానికి వివరణ తెలిస్తే చెప్పాలి. లేదా ఇగ్నోర్ చేయాలి. అలా కాక మీరు కొన్ని సలహాలు ఇచ్చారు. దానికి చారి గారు కామెంట్ చేశారు. ఇక్కడ ఆయననకి ఆ అవకాశం మీరే ఇచ్చారనేది నా అభిప్రాయం. ఇంతకు మించి ఈ అంశాన్ని వాదించను. మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలనేది నా ఆరోపణ.
Deleteకొండలరావుగారూ,
Deleteమీవంటి విజ్ఞులను మన్నించేంత పెద్దవాడిని కానేకాను.
ఒకరికి సలహా ఇచ్చేంత వాడిని కానని తెలియక మాట్లాడటం నాదే పొరపాటు. శ్రీచౌదరిగారు అడగటం వలననే నేను కొంత కొనసాగింపుగా వ్రాయటం జరిగింది. నాకు ఒకరికిచెప్పే యోగ్యతలేదని నేనే ఆయనకు విన్నవించుకోవలసింది. తద్భిన్నంగా బాల్యవిచేష్ఠగా ఏవేవో తెలిసీతెలియని మాటలు వ్రాసాను. నాది పెద్ద పొరపాటే. మన్నించవలసింది.
ఆత్మపరిశీలన ఎవరైనా ఎప్పుడూ చేసుకుంటూ ఉండవలసినదే అని మీబోటి పెద్దలు చెప్పగా విన్నాను చాలాసార్లు. అలాగే చేసుకుంటూన్నాను. తదనుసారిగానే వర్తించటానికి తప్పక ప్రయత్నిస్తాను . మీ సలహాకు సదా కృతజ్ఞుడను.
:(
Deleteశ్యామలీయం గారిపై నా కామెంటులో emotional blackmailling అనే పదాన్ని వెనుకకు తీసుకుంటున్నాను. మిగతా విషయంపై కూడా ఆయనకు మెయిల్ చేయగలిగే చనువు ఉంది. ఇక్కడ కామెంట్ చేయకుండా ఉండాల్సినదనిపించింది. శ్యామలీయం గారికి ఈ విషయమై క్షమాపణ చెపుతున్నాను. చర్చల విషయంలో మాత్రం నేను శ్యామలీయంగారి అభిప్రాయంతో ఏకీభవించను.
Deleteశ్రీకాంత్: శ్యామలీయం మాస్టారిని మీరు టార్గెట్ చేసినా చేయకపోయినా ఆ భావన వారికి కలిగిందనేది విదితం. అసలే ఆయన మనస్తత్వం సున్నితం. కనుక ఆ భావనను దూరం చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
ReplyDeleteమీరు లేవనెత్తిన ప్రశ్న బాగుంది. దాన్ని మరో రకంగా (వేరేవారి ప్రస్తావన లేకుండా) కూడా చేప్పోచ్చేమో?
జై గారు,
ReplyDeleteమీ సూచనకు ధన్యవాదాలు. శ్యామలీయం గారి పట్ల వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. కాని పవిత్రత ముసుగులులో వాస్తవాలు వెలికి రాకుండా గొంతు నొక్కాలనే వారి ప్రయత్నం పై మాత్రం తప్పక వ్యతిరేకత వుంటుంది.
ఇక సున్నితత్వం విషయానికి వచ్చినపుడు... సున్నిత మనస్కులు ఇతరులపై కూడా అంటే సున్నితంగా ప్రవర్తించాలి. కాని నన్ను వదిలేస్తే కొండలరావు గారిపై వారు వాడిన భాషను ఒక సారి గమనించండి.
కొండలరావుగారి "ఉవాచ",
మీ "విజ్ఞత"కు నా నమోవాకములు!
నన్నొక బ్లాక్‍మెయిలరుగా ముద్రవేయగల "జ్ఞానుల"మధ్య...
మీవంటి "విజ్ఞుల"ను మన్నించేంత... (మొదట ఉపయోగించిన పదం చేత ఇది కూడా మసకబారింది)
"మీబోటి" పెద్దలు చెప్పగా విన్నాను (పైన అనాల్సినవన్నీ అన్న తర్వాత మీబోటి పెద్దలు అనడం?)
ఇది సున్నిత మనస్కులు భాషను ఉపయోగించే పద్ధతా?
శ్రీకాంత్ చారిగారు..మీకు శ్యామలీయంగారికి మధ్య విరోధం ఉందో లేదొ నాకు తెలియదుగాని ఈ టపాలో మీరు అడిగిన ప్రశ్న మాత్రం 100% కరెక్ట్. పవిత్రం పేరు చెప్పి వాస్తవాలు అణగదొక్కడం దారుణమే! నిజమైన సనాతన థర్మం మసగబారడానికి కారణాలలొ ఇది ఒకటని నా అభిప్రాయం.
Deleteగురుముఖత: నేర్చుకోవాలనే శ్యామలీయంగారి ఒక విషయంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే గురువుల దగ్గర సూక్ష్మజ్ఞానం, స్థూలజ్ఞానం అనేవి ఉంటాయి.సామాన్యుల దగ్గర స్థూలజ్ఞానం తప్ప సూక్ష్మజ్ఞానానికి కొంత సమయం పడుతుంది.అలాగని ఉండదని కాదు. అయితే 100% గీతపై ఆధారపడాలిగాని, ఎట్టి విషయంలోనూ 100% గురువుల ఆధారపడితే అధోగతే! సూక్ష్మ,స్థూల జ్ఞాన పండితులు ఇప్పుడు బహు అరుదు.నిజానికి గీత అయినా ఏ థార్మిక శాస్త్రమైనా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. అది తెరిచి చూసి చర్చింకోవడం ప్రారంభిస్తే సూక్ష్మ,స్థూల జ్ఞానాలు తప్పకుండా సమకూరుతుంది.ఆ ఉద్దేశ్యంతోనే సూక్ష్మ జ్ఞానం అవగాహన కొరకే ఈ గీతా శ్లోకాన్ని చర్చకు పెట్టాను. ఇవి పండితుల వడిలో మాత్రమే ఉండడానికి, లేక పూజగదిలో కుంకుమ,పసుపు చల్లి పూజించడానికి రాలేదు.ఒకరొకొకరు అనుచరించడానికి, చదివి ఉత్తమ లక్షణాలు పెంపొందించుకోవడానికి ఉన్నాయనీ గ్రహిస్తేనే మంచిది. ఈ విషయాలు గీతలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి.ఇకపోతే పెట్టిన గీతా శ్లోకానికి ఏ ఒక్కరూ ఓ చిన్న వివరణ కూడా ఇవ్వలేదు.ఒకరిద్దరు తప్ప. దీనిని బట్టి గీత చదవని పరిస్థితే కనిపిస్తుంది.మహత్తరమైనగీత మరుగున పడిపోయిందనే విషయం తేటతెల్లమవుతుంది.ఏది ఏమైనా వేద సంపదను అన్ని విధాల జన సామాన్యంలోకి తేవాల్సిందే! కొండలరావుగారు అనుమానం వ్యక్తం చేసినట్టు దీని వెనుక ఏదో పండితుల కుట్ర ఉంది.వేద థర్మంలో ఏదో ఉంది కాబట్టే దాయడం జరుగుతుంది.ఇవ్వన్నీ జన సామాన్యలోకి వచ్చిందంటే ఈరోజు సనాతనథర్మం ముగులో చెలామణీ అవుతున్న కాల్పనిక థర్మం పటాపంచలు కావడం ఖాయం.
ReplyDeleteనేను శ్యామలీయం గారి మొదటి వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.బ్లాగులలో కొంతమంది తమకు నచ్చని వారిని నిరుత్సాహ పరిచేందుకు నిరంతరమూ ప్రయత్నిస్తున్నారేమోననే అనుమానం కలుగుతుంది.ప్రతీ వ్యాఖ్యకు పెడర్ధాలు తీయడం వల్ల ఎదుటి వారి మనసుకు గాయం చేయడం తప్ప మరో ప్రయోజనమేమీ నెరవేరదు.ఇక్కడ భగవద్గీతలోని క్రింది శ్లోకాన్ని గుర్తు చేయటానికి సాహసిస్తున్నాను.
ReplyDeleteఅనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితంచయత్!
స్వాధ్యాయభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే!
(ఇతరుల మనస్సుకు భాధ కలిగించనిది,సత్యమైనది,ప్రియమైనది, మేలుకలిగించునది అయిన వాక్యము పలుకుట వేదములను, శాస్త్రములను, అభ్యసించుటవలె వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది)
వాచిక తపస్సు అంటే వేదాన్ని,శాస్త్రాలను అధ్యయనం చేయడమే గాని విభిన్న పండితుల వ్యాఖ్యాలపై ఆధారపడడం కాదు. అది కలిగిననాడు మీరు (గీత ప్రకారం) సెలవిచ్చిన సద్గుణాలన్నీ అలవడతాయి. ఇకపోతే నాకైతే ఎవరూ ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించినట్టుగా అనిపించలేదు. కేవలం అభిప్రాయ ఖండన తప్ప.
Deleteఆ శ్లోకంలో చెప్పింది అనవసరంగా ఇతరులకు బాధ కలిగించగూడదని అనుకుంటాను. జరుగుతున్నది చెడు అయినపుడు గురువు, బంధువు అని, వారికి బాధ కలుగవచ్చు అని కూడా చూడకుండా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించమని గీతలోనే చెప్పారు. ఎదుటి వారు చెప్పేది తప్పు అయినపుడు మొహమాటపడకుండా దాన్ని ఖండించమన్నదే గీతకారుడి ఉద్దేశం.
Delete@శ్రీకాంత్ చారి:
ReplyDeleteLooks like you have good understanding about Geetha. Why can't you write your own interpretation of it and publish. Future generations might read / follow it :)
శ్లోకం ఇచ్చారు.భావం కూడా చెప్పారు.యెదటి వారి నుంచి విశ్లేషణ కోరుతున్నారు!మీరు యెలాంటి విశ్లేషనని ఆశిస్తున్నారు?యెవరు పడితే వాళ్ళు పీకి పాకం పెట్టడానికి కావలసిన విశ్లేషణా లేక అర్ధాన్ని వివరించి వ్యాఖ్యానించి సందేహాల్ని పోగొట్టే విశ్లేషణా- యేది మీరు ఆశిస్తున్నారు?
ReplyDeleteరెండోది మీ వుద్దేశం అయితే అంతగా అక్కడ అర్ధం కానిది యేముంది?సంపూర్ణ శరణాగతి గురించి చెప్పే సందర్భంలో భగవంతుణ్ణ్ణి నమ్మదం అంటూ జరిగీతే ఆ నమ్మకం యెలా వుండాలో చెప్తుంది ఈ శ్లోకం.
శ్యామలీయం మాస్టారు అలా వ్యతిరేకించదంలో అర్ధం వుంది.ఇదివరలో వేరేచోట గీత గురించిన చర్చలో పాల్గొని నేను స్వయంగా దెబ్బతిని వున్నాను.గీత అనేది 18 అధ్యాయాలతో 700 పై చిలుకు శ్లోకాలు వున్న అనేక విషయాల కలగలుపు.అయినా 18 అధ్యాయాలు కూడా ఒక ముఖ్యమయిన విషయానికి స్మబంధించి సపోర్టు కోసం చెప్పే విభిన్న విషయాల్ని ఒక్కచోట చెర్చిన భావ సంకలనం.నాలుగో అధ్యాయంలో ఒకచోట పది శ్లోకాల పాటు చెప్పిన భావాన్ని హఠాత్తుగా ఆపేసి మరో భావాన్ని యెత్తుకుని మళ్ళీ హఠాత్తుగా పదిహేడో అధ్యాయంలో మరోచోట ఆ పది శ్లోకాలకి కొనసాగింపుని యెత్తుకునే సందర్భాలు కూడా వున్నాయి.వీటన్నింటిని కలిపి చదివితే గానీ అర్ధం కాని గీతలో ఒక శ్లోకాన్ని ప్రత్యేకంగా విశ్లేషించదం వల్ల యేమి ప్రయోజనం?మత్తై 16:17 అనీ పేతురు 12:24 అనీ బైబిలు లో కూడా వున్నాయి.అంతా ఒక్కచోటే వుండాలి,ఆ ఒకే ఒక ముక్కలోనే నాకంతా తెలియాలి అనడం అత్యాశ!
మిగతా భాగాల్లో దీనికి సంబంధించిన విశ్లేషణ వుంది,అది కూడా తెలియాలి మీకు అని చెప్పినా వినకుండా అక్కడెక్కడో యేమి చెప్పాడనేది నాకనవసరం, ఈ ఒక్క శ్లోకంలో నేను పట్టిన తప్పు తప్పా కాదా ఇక్కడికిక్కడే తేల్చి చెప్పమనే మూర్ఖపు వాదనలు ఇక్కడ కూడా చెయ్యాలనుకుంటే మాత్రం గీత పట్ల గౌరవం వున్న వాళ్ళు యెవరూ చర్చలో తలదూర్చరు - ముఖ్యంగా ఒకసారి తల బొప్పి కట్టించుకున్న నేను!
@ హరిబాబు గారు : బైబిల్లోని పాత నిబంధనకి "వేర్వేరు వ్యక్తుల అభిప్రాయంలో యేసు" అన్నది టాపిక్కు. ఆ అభిప్రాయాలన్నీకూడా paid(by pax Roamn) అన్నది చారిత్రక సత్యం (బైబిలు రచించబడేనాటికి ఇటు యేసుకానీ, అటు మాధ్యూ లేదా పీటరుకానీ జీవింవిలేరు). Bible is supposed to be the account of the account of the Truth.
ReplyDeleteగీత అలాకాక ఒకే వ్యక్తి/దేవుడు ఒక సందర్భంలో వివరించినది. if it is not self-consistant, my friend, I wonder how it could be 'The Great'.
'supposed to be'
ReplyDeleteగీత లౌకికుల చేత లౌకికుల మధ్య లౌకికంగా చర్చించదగినది కాదు. ఆధ్యాత్మికుల చేత ఆధ్యాత్మికులకు ఆధ్యాత్మికంగా బోధింపబడవలసినది మాత్రమే.అది ప్రతి ఒక్కఱికీ అర్థమయ్యే సబ్జెక్టు కాదు. దాని మీద చర్చించే శక్తి గానీ ప్రతిభ గానీ, అనుభవం గానీ సామాన్యులకు ఉండదు. వారు ఆ విషయమై ప్రామాణికులైన పండితుల వద్ద లేదా కనీసం పురోగత సాధకుల వద్ద కూర్చుని నేర్చుకోవలసినవారు మాత్రమే. నేను చిన్నప్పటినుంచీ చదువుతున్నా నాకిప్పటికి అందులో "బహు కొద్ది" శ్లోకాలు మాత్రమే అర్థమయ్యాయి. ఇది భాషాసమస్య కాదని గమనించగలరు.
ReplyDeleteఆధ్యాత్మికులకే గీత అర్ధమవుతుందన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వారు మాత్రమే సరిగా ఉన్న విషయాన్ని చర్చించగలరు. (ఆధ్యాత్మిక ముగుసులో ఉన్నవారికి కూడా ఇదసలు అర్ధం కాదు.)
Deleteభగవద్గీత ఒక హడావిడిలో బోధించబడినది. అన్ని దైవసందేశాలలాగే అది కూడా telegraphic in nature. కనుక కొంత మన ఊహకి వదిలిపెట్టేశాడు దేవుడు. ఆయన భార్య అయిన ప్రకృతి కూడా అంతే కదా! ఆవిడ కూరగాయల్ని ఇస్తుంది. వండుకోవడం మన పనే. ఆవిడ స్వయంగా వండదు. అలాగే భగవంతుడు పూర్తిగా చెప్పలేదని నెపం వేయడం సరికాదు. అయితే ఆయన అలా వదిలిపెట్టడం అనేక భాష్యాలకి దారితీస్తోంది. ఆ భాష్యాల మీద ఆధారపడకుండా ఆ ఖాళీలని మన సాధనతో అనుభవంతో పూరించుకోవాల్సి ఉంటుందని నా అభిప్రాయం.
ReplyDeleteబాగా చెప్పారు. లౌకికులకు భగవద్గీత గ్రంథం అవసరంలేదు. వాళ్లా దృష్టి సంపాదన, ఆధికారం పైన ఉంట్టుంది. డబ్బు ఎలా సంపాదించాలి, ఖర్చు చేయాలి,దాచుకోవాలి గురించి తెలుసుకొంటే ఉపయోగం. గీత చదివితే వాటి గురించి ఎమి తెలియదు. అయితే కొంతమంది ఇదేనా జీవితం? ఆధ్యత్మికత అక్కరలేదా అని గీతను, ఇతర మతగ్రంథాలను చదువుతు, అది అర్థం కాక బుర్రను పాడుచేసుకొంటారు. సమయం వృథా చేస్తారు. ఇక తెలుగులో ప్రొగ్రెసివ్ రాయితలు గీతను పాపులర్ చేశారు. మార్క్సిజం లో మతం గురించి మార్క్స్ చెప్పిన చెత్త అంతా గీత, మను స్మృతి మొదలైన వాటికి అన్వయించటం మొదలుపెట్టారు. 1900 సం|| కాలంలో ఎంతమంది గీతను చదివారు. ఎన్ని ఇళ్లలలో ఆ గీత ఉండింది?
Deleteమనుస్మృతి విషయానికొస్తే,ఏ వర్షన్, ఏ రాజుల కాలం లో, ఏ ప్రాంతం లో ఎంతకాలం అమలు జరిగిందో ఇప్పటివరకు ఎవ్వరు రాసినట్లు చూడలేదు. మనుస్మృతి లో ఇలా రాశారంటూ, ప్రొగ్రెసివ్ రచయితలు అనుకొనే వాళ్ళు వాదాలలో కోట్ చేస్తూంటారు.
Bg 18.62
ReplyDeletetam eva śaraṇaṁ gaccha
sarva-bhāvena bhārata
tat-prasādāt parāṁ śāntiṁ
sthānaṁ prāpsyasi śāśvatam
Word for word:
tam — unto Him; eva — certainly; śaraṇam gaccha — surrender; sarva-bhāvena — in all respects; bhārata — O son of Bharata; tat-prasādāt — by His grace; parām — transcendental; śāntim — peace; sthānam — the abode; prāpsyasi — you will get; śāśvatam — eternal.
Translation:
O scion of Bharata, surrender unto Him utterly. By His grace you will attain transcendental peace and the supreme and eternal abode.
Purport:
A living entity should therefore surrender unto the Supreme Personality of Godhead, who is situated in everyone’s heart, and that will relieve him from all kinds of miseries of this material existence. By such surrender, not only will one be released from all miseries in this life, but at the end he will reach the Supreme God. The transcendental world is described in the Vedic literature (Ṛg Veda 1.22.20) as tad viṣṇoḥ paramaṁ padam. Since all of creation is the kingdom of God, everything material is actually spiritual, but paramaṁ padam specifically refers to the eternal abode, which is called the spiritual sky or Vaikuṇṭha.
In the Fifteenth Chapter of Bhagavad-gītā it is stated, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ: the Lord is seated in everyone’s heart. So this recommendation that one should surrender unto the Supersoul sitting within means that one should surrender unto the Supreme Personality of Godhead, Kṛṣṇa. Kṛṣṇa has already been accepted by Arjuna as the Supreme. He was accepted in the Tenth Chapter as paraṁ brahma paraṁ dhāma. Arjuna has accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead and the supreme abode of all living entities, not only because of his personal experience but also because of the evidence of great authorities like Nārada, Asita, Devala and Vyāsa.
http://www.vedabase.com/en/bg/18/62
చౌదరి గారు, శ్యామలీయం గారి ప్రథమ వాఖ్య కు మీ తిరుగు వాఖ్యను చూసిన పిమ్మట, అక్కడ మీరు ప్రస్తావించినటువంటి "" వాక్యాన్ని చదివాక నాకు ఒకటి అర్థం అయినది, మీరు చూసిన పెద్దలు అసలు పెద్దలు కారు వారి మాటలు విని అనవసరంగా అపోహలు పెంచుకోకండి, చంకలో పెట్టుకొని తిరగనంత మాత్రాన ఆ మహా కవ్యానికి వచ్చిన ఉపద్రవం ఏమియూ లేదు. ఘంటసాల గారి పుణ్యాన మన తెలుగు వారూ, భాజాపా వారి పుణ్యాన మిగిలిన భారతీయులు అంతో ఇంతో గీత ఙానాన్ని పొందుతూనే ఉన్నారు, ఆర్యావర్తము నుండి పశ్చాత్య దేశాల దాక ఎన్నో దేశాలు గీత విలువను తెలుసుకొన్నాయి, గీత లోని శ్లోకములన్నియూ ఉపనిషత్తుల సంగ్రహముననిన్నూ , ఉపనిషత్తులన్నియూ వేదములనుండి గ్రహించబడినవనిన్నూ మనకు విదితమే. తెలిసినంత వరకు వేద శ్లొకాలన్నీ ద్రష్టలచే దర్శించబడి పరంపరగా భావి తరాలకు అందింపబడినవి, ఆ పరంపర లో కాలానుగునమైన మార్పులు చేర్పులూ జరపబడి ఉంటాయి, మెజారిటీ వర్గాలు ఆడిపోసుకునే తాత్పర్యాలు, కృష్ణ పరమాత్ముడు గాని, ద్రష్ట లు గాని చెప్పి ఉండి ఉంటారు అని అనుకొవడం లో మనము కలి వారసులుగా నిరూపించుకుంటున్నాము, విగ్నతతో కూడిన వారెవరైన హంస వలె నీర క్షీర న్యాయాలను పాటిస్తారు, వితండ వాదం జరిపించి పట్టుదలకు పోయి ఉన్నవి లేనివి కల్పించుకొని అపోహలు సృష్తించుకొని కీచులాడుకోవడం ద్వారా పొందు లాభం మీకు ఎరుక అనే భావిస్తున్నాను. మీరనుకున్నట్టు హైందవ జాతి లోని నిమ్న వర్గాలు పరాయి ధర్మాలను అనుసరించడానికి పండిత వర్గాలు ఏ మాత్రం కారణం కాదు, ఒక శూద్రునిగా చెప్తున్నాను, పాలక వర్గములోని లోటు పాట్లు, కాల క్రమేనా వచ్చిన బూర్జువల అధికారం వెరసి నిమ్న వర్గాల అణచివేత, తెల్ల దొరల కాలమందు సమస్యలను వారె సృష్టించి వారి మిషనరీల ద్వారా కొంత ఉపశమనం కలిగించి సనాతన ధర్మానికి క్రైస్తవం ఒక ఆల్టర్నేటివ్ గా చూపించి దండుకున్నారే గాని, పండిత వర్గాన్ని మాత్రమే విమర్శించడం వారిని కించపరిచే కుతూహలమే తప్ప మరొక్కటి కాదని నా అభిప్రాయము. మీరందరు పోట్లాడుకున్నట్లు మన కింకర్తవ్యం ఏదో మతాన్ని గాన్ని మత గ్రంథాలను గాని రక్షించేయడం కాదు, వాటిని రక్షించడానికి మనం ఏ పాటి?, మతం మరియు మత గ్రంథాలు మన జీవితాన్ని నడిపించే చుక్కాని తో సమానం, వాటితొ మీరు గమ్యాన్ని చేరవచ్చు, మరింకేమైనా చేయవచ్చు. ఇన్ని చెప్పిన కృష్న పరమాత్ముడే చెప్పాడు, యద్భావం తద్భవతి అని , కావున పై శ్లొకం యొక్క భావం మీలో ఉన్న భావమే, భావమేమీ లెకున్నచో, ఆస్తికులు నాస్తికులు ఎంతో మంది గీత కు భాష్యాన్ని ఇచ్చి ఉంటారు వాటిని చదివి అర్థాన్ని సంగ్రహించగలరు.
ReplyDelete@శ్యామలీయం గారు: మీకు ఉన్న సంపద మీ అనుభవం, అందులో నుంచి మీరు గ్రహించినది మీకు తోచినది మీరు చెప్పండి, దాన్ని అర్థం చేసుకోవడం లేదా కోకపోవడం మా ప్రారబ్ధం, చేతికి అయిదు వేల్లు ఒకలా ఉండవు, నాణేనికీ ఒక వైపే ఉండదు, కావున మీ అభిప్రాయాన్ని చెప్పిన పిమ్మట ఒక్కొక్కరు ఒక్కోరకంగా భావిస్తారు, వారి వారి అభిప్రాయాలనూ వ్యక్తీకరిస్తారు, వేల వత్సరాలు భరత ఖంఢాన్ని నడిపించిన సనాతన ధర్మం లో కొత్తగా కనిపెట్టవలసిన నిక్కములేమియూ లేవు. ఒక్క మన అగ్నానపు అపోహలను తొలగించుకోవటం తప్ప.
--Raaju