Breaking News

వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ? Illegal relationship is not a crime, is it a triple talaq crime? Asaduddin asked.

వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ?

ప్రశ్నించినవారు : నీహారికా మేడమ్ గారు.

82 comments:

  1. ఈ తీర్పు వల్ల మగవాళ్ళకి వచ్చిన నష్టం కూడా లేదు. "నేను వాడి పెళ్ళాంతో సంబంధం పెట్టుకుంటే వాడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. చెయ్యలేడు, సివిల్ కోర్ట్‌లో విడాకుల కోసం మాత్రం అప్లై చెయ్యగలడు" అనే ధైర్యం మగవాళ్ళకి ఉంటుంది. దీని వల్ల ఆడవాళ్ళకి వచ్చే లాభం కూడా లేదు. కుటుంబ పరువుకి భయపడే స్త్రీలు చట్టాలు ఉన్నా, లేకపోయినా అక్రమ సంబంధాలు పెట్టుకోరు. ఈ తీర్పు నాకేమీ సంతోషం కలిగించలేదు.

    ReplyDelete
  2. మొత్తం వివాహ వ్యవస్థ నే ఎత్తేస్తే పోలా?
    ఇవ్వన్నీ మనిషిని పశువుగా మార్చి దేశ సంస్కృతిని సర్వనాశనం చేసే చట్టాలే. హిందూమతం నాశనం అవుతుందని గగ్గోలు పెట్టే ప్రబుద్ధులు వీటి పట్ల ఎందుకు స్పందించరో ఇప్పటికీ నాకు అర్థం కాదు.

    ReplyDelete
    Replies
    1. వివాహేతరసంబంధాలు నేరంకాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనిచెప్పి మగాళ్ళేమీ సంబరాలు చేసుకోనవసరంలేదు. ముందుగా ప్రపోజల్ చేయగలిగే హక్కు మాత్రం స్త్రీలదగ్గరే ఉంది. ముందు మగాడు సెక్సువల్ ప్రపోజల్ చేసినప్పుడు ఇష్టమైతే ప్రొసీడ్ అవుతారుగానీ ఒకవేళ ఇష్టం లేకపోతేమాత్రం స్త్రీలు సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టే అవకాశం ఉంది. 

      Delete
  3. జిలేబీ చట్టం తన పని తాను చేసుకు పోతుంది ... మీ ఇష్టం !

    ReplyDelete
  4. >>అది వ్యతిరేకమా? సొషల్ మీడియాలో చదివి హరిబాబు రాసిందాన్ని ఖండించకపోతే, కాష్మీర్లో అలాంటివే మెస్సేజ్లు చూపించుకోని పోలీసులపై రాల్లు విసిరడంకూడా కర్రక్టే అనిఒప్పుకోండి

    నేన్నదేంటీ.. ఈ సైకో హరిబాబు రాసుకునేదేంటీ??
    http://harikaalam.blogspot.com/2018/09/blog-post_27.html

    పల్లెప్రపంచంలో కామెంట్లు డిజేబుల్ చేసిన ప్రతిసారీ.. ఫుల్లుగా మందుకొట్టి.... ఈ చేతగాని దద్దమ్మ... పోయిన పరువు కాపాడుకోడానికి ఇలాంటి సొల్లు వాగుతుంటాడు. సిగ్గా.. శరమా.. వీడి బతుక్కి..

    ReplyDelete
    Replies
    1. చిరంజీవి గారూ.. మీ ఆవేదన అర్ధం అయ్యింది. మీరు గట్టిగా స్పందించడంలో న్యాయం ఉంది. అయితే వ్యక్తిగత విమర్శలు చేయవద్దు. చదూవరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి క్షమించగలరు.

      Delete
    2. మోడరేషన్ పెట్టుకున్న వాడెలనూ నా రిప్లైస్ ఒప్పుకోడు. వ్య్క్తిగతంగా కాదు.. వాడి మొఖమ్మీద ఉమ్మేసి చెప్పినా. అది వాడి విజయంగానే టముకేసుకుంటాడు. రోగం ముదిరిన వాడ్నలా తృప్తిపడనివ్వండి..

      Delete
  5. ముందు అడల్టరీ (వివాహేతర సంబందానికి చెందిన చట్టం) గురించి తెలుసుకుని మాట్లాడండి ...

    ఇప్పుడు కొన్ని కేసులు తీసుకుందాం.. భార్యా, భర్త .. వారి వివాహేతర సంబందాలు..


    కేస్ 1: భార్య వివాహేతర సంబందం పెట్టుకుంది.
    ఫలితం : నేరం.
    ఎవరిది : వివాహితతో వివాహేతర సంబందం పెట్టుకున్న వ్యక్తిది (మగవాడు).
    ఎవరు కంప్లైంట్ ఇవ్వవచ్చు: వివాహేతర బందం పెట్టుకున్న స్త్రీ యొక్క భర్త.

    కేస్ 2: భర్త వివాహేత సంబందం పెట్టుకున్నాడు.
    ఫలితం: నేరం కాదు.
    ఎవ్వరూ కేస్ పెట్టలేరు.

    ఈ చట్టం పూర్తిగా వివక్షా పూరితమైనది. ఆడవారికి అన్యాయం చేస్తోంది అనిపిస్తోంది కదా ! అది నిజం. మరి ఈ చట్టాన్ని పురుష హక్కుల కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. వారు ఈ చట్టాంకి వ్యతిరేకంగా చాలా సార్లు పోరాడారు. ఎందుకు ?

    ఇక్కడ కిటుకేమిటంటే.. ఈ చట్టం ద్వారా కేవలం మగవాడిని మాత్రమే శిక్షించవచ్చు. వివాహితతో , వివాహేతర సంబందం పెట్టుకున్న పురుషుడు మాత్రమే శిక్షించబడుతున్నాడు .. కానీ, ఆ వివాహేతర సంబందం పెట్టుకున్న స్త్రీ మాత్రం శిక్షించబడడం లేదు.

    ఇద్దరు కలిసి పెట్టుకున్న వివాహేతర సంబందములో .. కేవలం పురుషుడికి మాత్రమే శిక్ష పడడం .. స్త్రీ మాత్రం "కేవలం బాధితురాలు" మాత్రమే అవ్వడం (చట్టం అదే చెబుతుంది) ఏమిటి ? అయితే ఇద్దరూ నేరస్థులే అవ్వాలి కదా ? అన్నది పురుష హక్కుల కోసం పోరాడే వారి మాట. దీని గురిచి .. MRAలు చాలా సార్లు అభ్యంతరాలు లేవనెత్తారు.

    పురుష హక్కుల కార్యకర్తలు దీని గురించి ఎప్పటినుండో పోరాటం చేస్తున్నారు .. ఇది వరకు దీన్ని "స్త్రీలకు కూడా నేరం" గా మార్చండి అని పోరాటాలు చేశారు. అప్పట్లో నేషనల్ కమీషన్ ఫర్ ఉమన్ మాత్రం దీన్ని వ్యతిరేకించించ్ది. "వివాహేతర సంబందం" స్త్రీలకు మాత్రం నేరం కాకూడదని .. కావాలంటే పురుషున్ని మాత్రం శిక్షించొచ్చనీ సెలవిచ్చింది.

    2006లో వచ్చిన ఒక ఆర్టికల్ మీరు కావాలంటే ఇక్కడ చదవచ్చు ..
    http://www.498a.org/contents/paperArticles/That%20shrew%20called%20NCW.pdf

    సో, ఈ చట్టం యొక్క గొప్పతనం ఏమిటంటే.. ఈ చట్టాలు స్త్రీవాదులూ, పురుష హక్కుల కోసం పోరాడేవారూ ఇద్దరూ వ్యతిరేకించారు. That's the beauty of this law.

    మరి ఈ చట్టాన్ని ఎవరు చేశారు ? అంటే అప్పుడెప్పుడో బ్రిటీషోల్ల కాలం నాటి చట్టం ఇది. ఈ చట్టాన్ని పీకేస్తే నష్టం ఏముంది ?

    మరి వివాహేతర సంబందం నేరం కాదు అంటే.. వివాహ వ్యవస్థ ఏమైపోవాలి? అది నాశనం అవ్వదా ?

    మంచి ప్రశ్న. వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే.. వివాహేతర సంబంధాలను నిషేదించాల్సిందే.. కఠిన శిక్షలు ఉండాల్సిందే. దాని కోసం కొత్తగా ఒక చట్టం చేయమని ఇప్పుడు ప్రభుత్వాలను నిలదీయాలి.

    వివాహేతర సంబందం పురుషుడు పెట్టుకున్నా, స్త్రీ పెట్టుకున్నా శిక్ష పడి తీరాలి. దానికోసం ఒక కొత్త చట్టం రావాలి. అది జెండర్ న్యూట్రలుగా ఉండాలి (ఇద్దరికీ శిక్ష పడితే అది జండర్ న్యూట్రలుగా ఉన్నట్టే మరి).

    ReplyDelete
    Replies
    1. మైనారిటీ తీరిన వ్యక్తుల మధ్య నాలుగు గోడల వెనుక జరిగిన వ్యవహారాలు వారిరువురికి & వారివారి భార్యాభర్తలకు మాత్రమే సంబంధించింది అన్నది తీర్పు సారాంశం. నాకయితే ఇందులో ఎటువంటి తప్పు అగుపించలేదు.

      వివాహ వ్యవస్థ పటిష్టం చేయాలంటే ఆలోచనలో మార్పులు రావాలి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, పరస్పర గౌరవం & అన్యోన్యత. పోలీసులు, కోర్టులు, కుటుంబ/మతపెద్దలు మొగుడూ పెళ్ళాల నడుమ దూరడం వలన సమస్యలు తగ్గవు సరికదా పెరుగుతాయి.

      Delete
    2. >>>వివాహ వ్యవస్థ పటిష్టం చేయాలంటే ఆలోచనలో మార్పులు రావాలి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, పరస్పర గౌరవం & అన్యోన్యత >>>

      ఇవన్నీ ఉంటే వివాహేతర సంబంధాలు ఎందుకు ఉంటాయి ? అవి సాధించలేకే గదా నేరం కాదు అని తీర్పు ఇచ్చింది ?

      వివాహ వ్యవస్థ పటిష్టతకి కొన్ని మార్గదర్శకాలు ఉండాలి.

      1.సంతానం కలుగక ముందే భార్యాభర్తలిద్దరిలో ఎవరు విడాకులు కోరుకున్నా ఆధార్ కార్డు ఇచ్చినంత సులువుగా విడాకులు ఇచ్చేయాలి.

      2.సంతానం కలిగితే భార్యాభర్తలిద్దరిలో ఎవరు విడాకులు కోరుకున్నా ఆధార్ కార్డు ఇచ్చినంత సులువుగా విడాకులు ఇచ్చేయాలి. తల్లిదండ్రులు విడిగా ఉన్నా 14 సం వరకూ సమిష్టిగా పిల్లల అవసరాలు చూడాలి లేదా ఇద్దరి దగ్గరా డబ్బు తీసుకుని ప్రభుత్వమే వారి పెంపకాన్ని చేపట్టాలి.

      3.రెండవ వివాహాన్ని వివాహంగా వ్యవహరించకూడదు.ఒక మనిషి ఒకటే వివాహం, ఒకటే కుటుంబం ఉండాలి.మిగతావన్నీ సహజీవనాలుగా వ్యవహరించాలి.

      4.సహజీవనంలో హక్కులు,బాధ్యతలు ఉండరాదు.

      5.సహజీవనానికీ, వివాహ వ్యవస్థకీ తేడా స్పష్టంగా కనిపించాలి.

      6.ఒక వ్యక్తి ఒక భాగస్వామితో ఉంటేనే ఆదర్శ దంపతులుగా వ్యవహరింపబడాలి.

      7.భాగస్వామి చనిపోయి ద్వితీయ వివాహం చేసుకున్నా, ఒకరికంటే ఎక్కువమందితో సంబంధం కలిగిఉన్నా వ్యభిచారులుగానే పరిగణించాలి.

      8.వివాహేతర సంబంధం నేరం కానపుడు వ్యభిచారం కూడా నేరం కాకూడదు.

      9.విడాకులు ఎవరు కోరుకుంటే వారే భరణం చెల్లించాలి.

      10.విడాకుల వల్ల తల్లిదండ్రులకు కూడా అప్రతిష్ట వస్తుంది కాబట్టి భార్యాభర్తలిద్దరూ వారి వారి తల్లిదండ్రులకు కూడా భ్రుతి చెల్లించాలి.

      Delete
    3. నేను మీతో ఏకీభవిస్తున్నాను.

      సంబంధాలు అనేవి నమ్మకానికి సంబంధించిన విషయం. అవేమీ సివిల్/క్రిమినల్ కేసులకు లోబడేవి కాదు. మన ఆలోచనల్లో మార్పు రావాలి. అభివృధ్ధి చెందిన దేశాల్లో, అక్రమ సంబంధాలు అనేవి కేవలం కుటుంబ వ్యవహారం. సెక్స్/వర్జినిటీల గురించిన obsession మనం వదిలించుకోవాలి.

      Delete
    4. వేశ్యావృత్తి వల్ల స్త్రీలకి ఏ రకమైనా స్వేచ్ఛా రాదు. ఆడవాళ్ళు గడపదాటని రోజుల్లో కూడా భోగం కులానికి చెందిన స్త్రీలు వేశ్యావృత్తి చేసేవాళ్ళు. హిస్టరీ ఆఫ్ కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ నిజామ్స్ డొమినియన్స్ పుస్తకం చదవండి. ఒకడి పెళ్ళాం మీద ఇంకొకడు కన్ను వెయ్యకుండా చెయ్యడానికే ఊరందరికీ ఉమ్మడి పెళ్ళాలు కొంత మంది ఉండే వ్యవస్థని ప్రవేశపెట్టారని ఆరుద్ర గారు గుడిలో సెక్స్ అనే పుస్తకంలో వ్రాసారు.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. @Jai Gottimukkala,


      //వివాహ వ్యవస్థ పటిష్టం చేయాలంటే ఆలోచనలో మార్పులు రావాలి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, పరస్పర గౌరవం & అన్యోన్యత. పోలీసులు, కోర్టులు, కుటుంబ/మతపెద్దలు మొగుడూ పెళ్ళాల నడుమ దూరడం వలన సమస్యలు తగ్గవు సరికదా పెరుగుతాయి.

      అయితే మీరు గృహహింస చట్టాన్ని, 498A చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారన్న మాట :-)

      Delete
    7. "అయితే మీరు గృహహింస చట్టాన్ని, 498A చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారన్న మాట"

      No, that is a criminal matter. I meant only the so called victimless "crimes".

      Delete
    8. @Jai Gottimukkala

      Domestic violence Act is mostly a civil law, 498A is criminal one ..

      Delete
  6. ఇప్పుడు అసదుద్దీన్ ప్రశ్న దగ్గరకి వద్దాం ..

    ట్రిపుల్ తలాక్ ఎందుకు నేరం ?

    సింపుల్, భార్యకు ఇష్టం ఉన్నా లేకపోయినా .. "తలాక్, తలాక్, తలాక్ ..." అని మూడు సార్లు వాట్సాపులో మెస్సేజు పెట్టినా విడాకులు వచ్చేసినట్టే అంటే .. ఎలా ? దానికి ఒక పద్దతి పాడూ ఉండవా ? దీని వల్ల ముస్లిం మహిళలు అనేక మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసా ?

    మరి ఇది నేరం కాదంటే ఎలా ?

    వివాహ వ్యవస్థని పటిష్టం చేయాలి, వివాహేతర సంబందాలు నిషేదించాలి. అలానే ట్రిపుల్ తలాక్ కూడా నిషేధించాలి. వివాహ వ్యవస్థని కాపాడాలి.

    అది కదా న్యాయం..!!

    ReplyDelete
  7. హిందూ వివాహ చట్టం ప్రకారం సపిండులు (ఒకే తాతకి పుట్టినవాళ్ళు) మధ్య వివాహం నేరం. వ్యక్తి స్వేచ్ఛ పేరు చెప్పి హిందూ వివాహ చట్టాన్ని రద్దు చేసే దమ్ము సుప్రీం కోర్ట్‌కి ఉందా?

    ReplyDelete
    Replies
    1. హిందూ వివాహ చట్టం ...
      దీని మీద చాలా మందే పోరాటం చేస్తున్నారు (HMA). ముఖ్యంగా పురుష హక్కుల కార్యకర్తలు. కాకపోతే మీరు చెప్పిన రీజన్ వల్ల కాదు. వేరే వివక్షా పూరితమైన కొన్ని నిబందనల వల్ల.

      Delete
  8. >>>వివాహేతర సంబందం పురుషుడు పెట్టుకున్నా, స్త్రీ పెట్టుకున్నా శిక్ష పడి తీరాలి. దానికోసం ఒక కొత్త చట్టం రావాలి. అది జెండర్ న్యూట్రలుగా ఉండాలి ఇద్దరికీ శిక్ష పడితే అది జండర్ న్యూట్రలుగా ఉన్నట్టే మరి>>>

    సెక్షన్ 497 లో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడికి 5 సం ల జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధించే అవకాశం ఉంది.స్త్రీకి ఎటువంటి శిక్షా లేదు.ఇది పురుషులు వ్యతిరేకించారు.

    వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించడం వల్ల రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఉల్లంఘన జరుగుతుంది అని అన్నారు దీనికి స్త్రీ పురుషులిద్దరూ అంగీకరించారు.

    ఒక ప్రవాసీయుడు 2017 లో ఈ కేసు వేసారు. వివాహేతర సంబంధాలు నేరం కాదు అంటే వివాహ వ్యవస్థ ఏమయిపోతుంది అని కేంద్రం కూడా ఆందోళన వెలిబుచ్చింది.

    ట్రిపుల్ తలాక్ కీ వివాహేతర సంబంధానికీ ఒక లింక్ ఉంది.ముస్లిం లు విడాకులు కావాలంటే మూడుసార్లు తలాక్ అంటే సరిపోతుంది.హిందూ మతంలో విడాకులు కావాలంటే అంత సులువుగా విడాకులు రావు.

    ప్రస్తుతమున్న చట్టం ప్రకారం భారీగా ఆస్థులు,భరణం ఇచ్చుకోవాలి కాబట్టి విడాకులు ఇవ్వడానికి పురుషులు ఒప్పుకోరు. అపుడు ఆ స్త్రీని వదిలించుకోడానికి రెండు మార్గాలు ఒకటి ఆ స్త్రీని మతిస్థిమితం లేనిదానిగానైనా చూపాలి లేదా అక్రమసంబంధం కలిగిఉన్నదని అయినా చెప్పాలి.ఈ రెండు పరిస్థితుల్లో కూడా విడాకులు వస్తాయి కానీ భరణం ఇచ్చుకోవలసిందే.

    నేను అడిగేది ఏమిటంటే వివాహేతర సంబంధం నేరం కాదు కానీ ఆ కారణంగా విడాకులు కోరే అవకాశం ఉంది. అక్రమ సంబంధం విషయంలో సమానత్వాన్ని కోరిన స్త్రీలు భరణం విషయంలో కూడా సమానత్వాన్ని కోరాలి. పురుషులే ఎందుకు భరణం చెల్లించాలి ? బాధిత భర్తకి స్త్రీలు కూడా భరణం చెల్లించాలి.

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారూ, భరణం (maintenance) సీయారూపీసీ సెక్షన్ 125 పరిధిలో వస్తుంది. The primary purpose of this is prevention of unnecessary vagrancy. ఆర్ధిక స్తోమతు కలిగిన వ్యక్తులు తమపై ఆధారపడ్డ కుటుంబసభ్యులను (dependent family members) పోషించకపోతే వారు నిరాశ్రయులు అవుతారు తద్వారా సమాజానికి భారం పెరుగుతుంది. విడాకుల వలన మహిళలు రోడ్డు మీద పడకూదన్న ఉద్దేశ్యంతో "భార్య" పద నిర్వచనలో "విడాకుల అనంతరం పునర్వివాహం కానీ మహిళలు" కలిపారు.

      Explanation b: "wife" includes a woman who has been divorced by, or has obtained a divorce from, her husband and has not remarried

      మీరన్నట్టు చట్టంలో "భార్య" పదం బదులు "సహధర్మచారి" (spouse instead of wife) వాడితే బాగుండేది. ఎప్పుడో ఒకప్పుడు "నా భార్య నన్ను పోషించేది, ఇప్పుడు విడాకుల వలన నా జీవనాధారం పోయింది" అంటూ మగపురుషుడు ఎవరయినా కోర్టుకు ఎక్కితే తదనుగుణంగా తీర్పు వస్తుందనుకుంటా. Let us wait & watch.

      అమెరికా లాంటి దేశాలలో పెండ్లికి ముందే ఒప్పందం ("prenup") కుదుర్చుకునే సంప్రదాయం కూడా ఉంది. ఒకవేళ పెళ్లి పెటాకులయితే వాటాలు ముందే రాసుకుంటారు.

      Delete
    2. మీరన్నట్లు ఇదివరకు స్త్రీలకు చదువు ఉద్యోగం ఉండేవి కావు కాబట్టి భరణం ఇచ్చారు.ఇపుడు స్త్రీలకు చదువు ఉద్యోగం రెండూ ఉన్నాయి కాబట్టి భరణం తీసివేయవచ్చు కానీ ఇద్దరిలో మరొకరికి అన్యాయం జరుగుతున్నది లేదా పోషించుకోలేని స్థితిలో భరణం ఇచ్చుకోవలసిందే.దీనివల్ల విడాకులు కోరుకునేవారికి తేలిగ్గా విడాకులు వస్తాయి.భరణం కోరుకున్నవారికి భరణమూ వస్తుంది.

      ట్రిపుల్ తలాక్ లో భరణం చెల్లిస్తున్నా విడిపోవడానికి ఇష్టపడకపోవడానికి కారణం భాగస్వామి తేలిగ్గా వదిలించేసుకుంటున్నాడు అని అసూయ పడడమే !

      పురుషుడు తేలికగా బ్రతకగలనని ధీమా వ్యక్తం చేసినపుడు స్త్రీ కూడా అంతే తేలికగా వ్యవహరించగలగాలి.

      Delete
    3. "ఇపుడు స్త్రీలకు చదువు ఉద్యోగం రెండూ ఉన్నాయి కాబట్టి భరణం తీసివేయవచ్చు"

      భరణం మొత్తాన్ని కోర్టులు నిర్ణయించే క్రమంగా పరిగణనలో తీసుకునే విషయాలు: భర్త సంపాదన/భరణం చెల్లించే స్తోమతు, భార్య జీవనశైలి & ఆవిడకు ఉన్న ఇతర ఆదాయవకాశాలు. ఆవిడకు సొంత ఆదాయం దండిగా ఉంటే కోర్టు దమ్మిడీ భరణం ఇవ్వదు.

      Delete
  9. హిందూ వివాహ చట్టం ప్రకారం భర్తకైనా ఉద్యోగం లేకపోతే భార్య అతనికి భరణం ఇవ్వాలి. ఉద్యోగం లేని పురుషుడు ఉద్యోగం ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకున్న సందర్భాలు హిందూ సమాజంలో చాలా తక్కువ కనుక భార్య భర్తకి భరణం ఇవ్వడం ఇక్కడ కనిపించదు.

    ReplyDelete
  10. అక్రమ సంబంధం అనేది సివిల్ మేటర్. అయితే ఐ.పి.సి. నుంచి ఒక సెక్షన్‌ని డిలీట్ చేసే అధికారం సుప్రీం కోర్ట్‌కి లేదు, అది పార్లమెంట్‌కి మాత్రమే ఉంది. 497 సెక్షన్ డిలీట్ చెయ్యబడని ఐ.పి.సి. పబ్లికేషన్ కాపీయే పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర ఎప్పటిలాగే ఉంటుంది. 497 సెక్షన్‌ని పోలీసులు భవిష్యత్‌లో ఉపయోగించరని గ్యారంటీ లేదు. పార్లమెంట్ ఐ.పి.సి.ని సవరిస్తూ బిల్ పాస్ చేస్తేనే 497 సెక్షన్ అందులోంచి తొలిగించబడుతుంది. చట్టం యొక్క చెల్లుబాటుని కేవలం కోర్టు తీర్పుల ద్వారా నిర్ణయించడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు.

    ReplyDelete
    Replies
    1. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని దేశములోని అన్ని కోర్టులు చచ్చినట్టు ఆమోదించి తీరాలి ప్రవీన్. లేకపోతే అది కోర్టు దిక్కారం కిందకి వస్తుంది. అది పోలీసులకి కూడా వర్తిస్తుంది. ఒకవేల కేసులు పెట్టినా వాటిని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు.

      Delete
    2. పార్లమెంట్ బిల్ పాస్ చేస్తే పోలీసులు 497 కేసులు వ్రాయలేరు. డిలీటెడ్ సెక్షన్‌తో ఎఫ్.ఐ.ఆర్. వ్రాయడం సాధ్యం కాదు. 497 డిలీట్ అవ్వలేదు కాబట్టే కదా పోలీసులు దాన్ని మళ్ళీ ఉపయోగించగలరని అంటున్నాను.

      Delete
    3. నా అభిప్రాయం ప్రకారం ఒక పెళ్ళి కాని స్త్రీతోనో, భర్త చనిపోయిన స్త్రీతోనో ఇంకో పెళ్ళి కాని పురుషుడు లేదా భార్య చనిపోయిన పురుషుడు సెక్స్ చెయ్యడం తప్పు కాదు. భర్త ఉన్న స్త్రీతో సంబంధం పెట్టుకోవడం మాత్రం తప్పే. ఆమెకి తన భర్తకి విడాకులు ఇచ్చి రెండో పెళ్ళి చేసుకునే హక్కు చట్టపరంగా ఉంది. అటువంటప్పుడు అక్రమ సంబంధాలు ఎందుకు? అక్రమ సంబంధం అనేది సివిల్ మేటర్ అని ఒప్పుకుంటాను కానీ అదేదో వ్యక్తి స్వేచ్ఛని ప్రసాదించేది అనుకోను.

      Delete
  11. >>>ఎందుకలా? పెళ్ళి చేసుకున్నాక తన భాగస్వామికీ తనకూ అభిప్రాయాల్లో సరిపడదు అని తెలిసొచ్చి, వేరే పెళ్ళి చేసుకుంటే అది పెళ్ళి కాకూడదా?>>>

    ఖచ్చితంగా ఏ ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కటిగా ఉండవు,అఖరికి కవల పిల్లలు కూడా వేర్వేరు అభిప్రాయాలు కలిగిఉంటారు. ఈ విషయాన్ని 21 సం నిండిన వ్యక్తులు అర్ధం చేసుకోవాలి.

    అభిప్రాయాలు కలవడం లేదని విడిపోవడం ఎందుకు ?

    అభిప్రాయాలు కలవకే కదా అన్నదమ్ములు విడిగా ఉంటున్నారు. విడాకులకు నేను వ్యతిరేకం కాదు.ద్వితీయం కూడా వ్యభిచారమే అంటున్నా !

    ReplyDelete
    Replies
    1. "అభిప్రాయాలు కలవడం లేదని విడిపోవడం ఎందుకు ?"

      Then. Should the people be coerced to stay together even though they are not compatible to one another? In which way is not a living hell?

      Delete
    2. బలవంతంగా కలిసి ఉండమని నేను చెప్పలేదే ? విడాకులు తీసుకోదలిచితే వేగంగా ఆధార్ కార్డు ఇచ్చినంత త్వరగా ఇవ్వమంటున్నాను.
      ఇష్టం లేని వ్యక్తులను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని కూడా చెప్పాను.

      Delete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. I have no such interest in supporting a charlatans. You clearly are disillusioned on par with the fanatics.

      I am sure that your version of "ideal couple" is a actually "sad couple" that feels miserable but shows happiness for the sake of the society, has an external locus of control, people pleasing and crying-alone types.

      Delete
    2. Show me one person who don't have sadness in their life.

      Delete
    3. I am happy.

      Being visited by sadness is one ting. Having to live with sadness another thing. Apparently you are a sad person. So I don't have any interest in knowing about your sad and ideal couple. :-D

      Delete
    4. Oh God, here I got a happiest person in the world. Thanks a lot !

      Delete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. Sheer nonsense.

      Just some bookish blabbering which you clearly did not understand. Get real and try to understand the real problems. Open your eyes or else you too will become irrelevant like those religious fools.

      Delete
    2. Yogi is a unicorn. Non existent. You need to get rid of this religious bullshit from your head. Only then would you be able to think clearly.

      Delete
    3. I say you better reading stop reading those useless religious books. Read some sociology, read some science. But please don't fill your heads with that religious mumbo jumbo.

      Bye

      Delete
    4. This comment has been removed by the author.

      Delete

  14. Laughable. It's the parents that take money when getting married.

    Where are you now ? Who is giving dowry ? Show me one girl who is ready to give dowry ? All are earning here.

    ReplyDelete
    Replies
    1. Again!! Get real!! Open your eyes to see the facts around you.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఉద్యోగం ఉంటే దండిగా కట్నం ఇస్తారు, సెంట్ భూమి కూడా లేకపోయినా. నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు దొంగ సర్టిఫికేట్‌లతో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి, ప్రభుత్వ ఉద్యోగుల కూతుర్లనే పెళ్ళి చేసుకున్నారు. ఒకడు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు కానీ ఇంకొకడు ఇప్పుడు కూడా హాయిగా తిరుగుతున్నాడు.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. కొందరికి అది సమస్య కాదులెండి. అలాంటి యువకుడు ఒకడు 50 ఏళ్ళ ముసలావిడతో కలిసి ఉంటున్నాడు.

      ఐ.టి. ఉద్యోగం ఉంటే ఏ ఆస్తి లేకపోయినా కోటి రూపాయలు కట్నం వస్తుందని నాకు చెప్పినది మాత్రం శ్రీశైలం దగ్గర ఈగలపెంట నుంచి వచ్చిన ఒక యువకుడు. అతను నాకు ఐ డోంట్ వాంట్ డౌరీ స్వయంవరంలో పరిచయమయ్యాడు. అతను చేసేది ఇరవై వేలు జీతానికి ప్రైవేట్ ఉద్యోగం. అతనికి పెళ్ళి సెట్ అయ్యిందో, లేదో నాకు తెలియదు.

      Delete
    6. Seriously guys, what is the percentage of marriages where money exchange doesn't happen between parents you think?

      Let's help Neeharika come out of her Rabbit's hole of idealism.

      Delete
    7. ఆ ఈగలపెంట యువకుడి వయసు కూడా 35 ఏళ్ళు పైనే, కులం కోమటి. అతను తన కులంవాళ్ళ దగ్గరకి వెళ్తేనే ఐ.టి. ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటున్నారట. ఎంత పల్లెటూరివాళ్ళ దగ్గరకి వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగికే ఇస్తామంటున్నారట. దాంతో అతను ఐ డోంట్ వాంట్ డౌరీ స్వయంవరానికి వెళ్ళాడు. ఐ.టి. ఉద్యోగం ఉంటే కోటి రూపాయలైనా కట్నమిచ్చేస్తారు, గుమాస్తా ఉద్యోగం చేస్తే మాత్రం వాడికి విషయమే లేదనుకుంటారు.

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. ఎంతైనా వాళ్ళు మగబిడ్డ పుడితేనే సంతోషిస్తారు. ఆడపిల్ల పుడితే కట్నం ఇవ్వాల్సి వస్తుందని బాధపడతారు తప్ప ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చెయ్యగలం కదా అని సంతోషించరు.

      Delete
  15. Why should they mind how their children live? Why should they take pride or feel lesser by the actions of their children?"

    Really, why Maruti Rao killed his son in law ?

    ReplyDelete
    Replies
    1. Because he was not thinking like I am. He is too obsessed with his daughter's life.

      Delete
    2. I did prove that he did commit the crime because he was not minding just his business. "Everyone does the same...don't you ?" What is this now? Diversion.

      Oh by the way, I would not.

      Delete
  16. బుచికోయమ్మ బుచికి ఏమి బుచికీల్రాబాబు

    ReplyDelete
  17. http://avaninews.com/article.php?page=1766
    గృహ హింస నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో (గృహ హింస ఉన్నప్పటికి నమోదు దాకా వచ్చేవి కేవలం 10 శాతం మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి) దాదాపు సగం పైన ఫిర్యాదులు తమ భర్తల వివాహేతర సంబంధాలు లేదా చట్టవిరుద్ధంగా చేసుకున్న రెండో, మూడో పెళ్లిళ్ల గురించే ఉంటాయి. కానీ కోరలు లేని ఈ చట్టం వల్ల ఆ స్త్రీలకు ఒరిగేదేమీ ఉండటంలేదు. చాలా మంది స్త్రీలు భార్యను పిల్లలను గాలికి ఒదిలేసి వివాహేతర సంబంధాల్లోకి, సహజీవనాల్లోకి, దొంగపెళ్ళిళ్ళకి పాల్పడే భర్తలకు శిక్ష ఉండాలని కోరుకుంటారు. కానీ అన్ని చట్టాలు స్త్రీలకేనా ఆని ఈసడించే ఈ దేశంలో అటువంటి పురుషులని శిక్షించే చట్టం ఒక్కటి కూడా లేదు.

    ReplyDelete
  18. ట్రిపుల్ తలాక్ గొడవ అంతా ముస్లిం వ్యతిరేక వోట్ల కోసమే. ఆడపిల్ల పుట్టిందని పెళ్ళాన్ని వదిలేసేవాళ్ళు హిందువులలో లేరా? ముస్లింలలోని ట్రిపుల్ తలాక్ మాత్రం పెద్ద చర్చనీయాంశమైపోయింది!

    ReplyDelete
    Replies
    1. హిందువులలో పోరాడాలంటే ఎవరికీ అంత శక్తి ఉండదు. ఒక పోరాటానికి జీవితం ధారపొయ్యాలి. ఎవరు అంత సాహసం చేస్తారు ?

      Delete
  19. మన దరిద్రం... ఈ దేశంలో సైకోగాల్లు పూజ్యులు..

    https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/42636063_1756929874356403_3012848291751657472_n.jpg?_nc_cat=111&oh=57d288791b13322073a0e277c4047d3d&oe=5C62F8B3

    ReplyDelete
    Replies
    1. మత పండితుల పాండిత్యం అంత కంటే గొప్పగా ఉండదు.

      Delete
    2. father daughter ki Madhya incest relationship undalanta. I think it's Indus Martin. I was shocked to read it. Possessive Ness ki incest relationship ki difference Kuda theliyani athanni chustuntam bhayamestundi.

      Delete
  20. Who is Indus Martin? No fool advocates incest with own family members.

    ReplyDelete
    Replies
    1. Just now I checked Indus Martin's wall on Facebook. He did not write anything advocating incest. "వేరేవాళ్ళ అమ్మలక్కలని బూతులు తిట్టే దేశభక్తులు 497 తీర్పు విషయంలో ఎందుకు నోరు మూసుకున్నారు? వాళ్ళు కూడా ఎవరి పెళ్ళాల మీదో కన్నేసారా?" లాంటి ప్రశ్నలు మాత్రం అడిగాడు.

      Delete
    2. 497/498 వంటి సెక్షన్లు రావడానికి స్త్రీల పోరాటంతో పాటు పురుషుల మద్దతు తోనే వచ్చాయి. స్త్రీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ అయినా అంతే ! 497 ని తండ్రి సమర్ధిస్తే కొడుకు కొట్టివేసారు. తండ్రి కాలంలో తీర్పులు ఇపుడు చెల్లవు కాబట్టి కొట్టివేసారు. మీరొక మంచి పాయింట్ చెప్పారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదం పొందితేనే అది జరుగుతుంది అని అన్నారు. అటువంటి విషయాలు మీరు చెపితే మాకూ మంచిది, తెలుసుకుంటాం కదా ?

      Delete
  21. ఈ వ్యాఖ్య కొంచెం పెద్దది కావచ్చును. దయచేసి చదువరులు మన్నించాలి.

    బ్లాగునిర్వాహకులు ఒకవిషయయం గమనించాలి. బ్లాగుకు ఒక దిశ కాని ఆశయం కాని ఉండటం మంచిది. అలాగే బ్లాగులోని విషయాలు - టపాలైనా ఆ టపాలకు వచ్చే వ్యాఖ్యలైనా - సభ్యతకు, సభామర్యాదకు భంగకరం కాని విధంగా ఉండాలి. అలా బ్లాగును నిర్వహించటం ఒక బాధ్యత. తప్పుడు ధోరణి టపాలనూ వ్యాఖ్యలనూ ప్రచురించటాన్ని హర్షించలేము.

    అలాగే వ్యాఖ్యాతలు కూడా టపాకు సంబంధించి మాత్రమే తమ అభిప్రాయాలు వెలుబుచ్చటం ఉచితం. తమలో తాము వాదించుకోవటమూ, శాఖాచంక్రమణాలు చేయటమూ శోభించదు. వ్యాఖ్యలు ఎక్కువ రావటం బ్లాగునిర్వాహకులకు ఆనందం కలిగించే సంగతే. కాని నిరర్థక వ్యాఖ్యలు రాసిని పెంచి - వాసిని తగ్గించి వేస్తే ఆనందం ఏముంటుందీ? మంచి వ్యాఖ్యలను వెదుకుకోవలసి వస్తే చదువరులు చిరాకుపడుతారు కదా.

    వ్యాఖ్యాతలు నేరుగా ఇతర వ్యాఖ్యాతలను ఉద్దేశించి నిలదీస్తూ మాటలాడటం అంత ఉచితం కాదు - ఏ వ్యాఖ్యపైనైనా అభ్యంతరం ఉంటే బ్లాగునిర్వాహకులను ఉద్దేశించి తమ అభిప్రాయం విన్నవించటం సరైనది కాని యుద్దాలకు దిగటం మంచి పధ్ధతి కాదు. బ్లాగు నిర్వాహకులు అటువంటి ధోరణులను అరికట్టటక పోవటం ఒకరకంగా ప్రోత్సహించటం క్రిందకే వస్తుంది.

    కొందరు వ్యాఖ్యాతలు వాడే భాష సభామర్యాదావిరుధ్ధంగా ఉంది. వారు గమనించుకోవలసిన అగత్యం ఉంది. వారు గమనించినా మానినా బ్లాగునిర్వాహకులు ఆ విషయంలో తమ బాధ్యతను గుర్తెరుగక తప్పదు. మాద్దృష్టికి వస్తే తొలగిస్తాము లేదా ఎప్పుడో వీలైనప్పుడు పరిశీలించుతాము అన్నది సరైన విధానం కాదని నా అభిప్రాయం.

    వ్యాఖ్యాతలు తమతమ వ్యక్తిగతమైన సమాచారాన్ని పంచుకోవలసిన అవసరం ఉందనుకోను. చదివే వారికి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా బహిరంగపరచటం చాలా తప్పు. ఈ విషయం ముఖ్యంగా ప్రవీణ్ వంటివారు గ్రహించాలని నా విజ్ఞప్తి చేయక తప్పటం లేదు. బ్లాగునిర్వాహకులు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలను ప్రచురించకుండా జాగ్రతగా బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి.

    కేవలం నా అబిప్రాయాలనండి లేదా సలహాలనండి సదుద్దేశంతోనే చెప్పాను. ఇందులో దురుద్దేశం కాని నా స్వార్థం కాని ఏమీ లేదని అర్థం చేసుకుంటే సంతోషం. ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించండి - ఇలా ఉబోసలు ఇవ్వటం నా బలహీనత, తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాను, కాని అంత సులువుగా మానుకోలేక పోతున్నాను.

    ReplyDelete
  22. @శ్యామలీయం
    // “ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా బహిరంగపరచటం చాలా తప్పు. ఈ విషయం ముఖ్యంగా ప్రవీణ్ వంటివారు.” //
    —————-
    గ్రహించవలసిన వారు ఇతరులు కూడా ఉన్నారండి శ్యామలరావు గారూ.

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. కోర్టు తీర్పు వల్ల నిజ జీవితం మారుతుందా, లేదా అనేది సందేహమే. ఎందుకంటే ఇండియాలో ప్రబలంగా ఉన్నది హిందూ మతమే తప్ప వ్యక్తి స్వేచ్ఛ కాదు.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్