మీరు చెప్పినది వాస్తవమే అయినప్పటికీ దాన్ని ఆధారం చేసుకుని మిగతా దేశాలు కూడా ప్రభావితమవుతాయి కదా! ఇదే జరిగితే వినాశనమే! దేవుడు ఆది నుండి పురుషులనుగాను, స్త్రీలనుగాను సృష్టించాడు. ఈ స్వలింగ సంపర్కం ప్రకృతికే విరుద్ధం.ఇదొక వికృత చ్రేష్ట.దీనిని ప్రతీవక్కరూ ఖండించవలసిందే!
ముందు మీరు కోరుకున్న షరియా చట్టాలు అమెరికాలో అమలులో లేవు అన్న విషయం గుర్తించండి. దేవుడు చేసాడని చెప్పబడుతున్న నియమాలు చట్టంలో చేర్చాలా వద్దా అన్నది ఆయా దేశాలు చూసుకుంటాయి. ఎక్కడో ఏదో దేశంలో ఇచ్చిన తీర్పులో "నమ్మకస్తులలో" ఫిత్నా వస్తుందనే భయం మీకెందుకు?
షరియా చట్టాలు గురించి నాకెందుకు? దేవుడి చట్టము అని మీరు చెప్పుతున్న విషయాలు ప్రధానంగా వారికే వర్తిస్తాయి అని గమనించ గలరు.ఎందుకు అంటే నేను పేరుకొన్న వాక్యం బైబిల్ లోనిదే గదా? అమెరికా క్రైస్తవ దేశం కాదా? స్వలింగ సంపర్కం గూర్చి లేనిపోని దరిద్రాన్ని గురించి ఇతరులకు ఆలోచన కలిగించడమే.
Article 6: No religious Test shall ever be required as a Qualification to any Office or public Trust under the United States
Tripoli treaty article 11: As the Government of the United States of America is not, in any sense, founded on the Christian religion; as it has in itself no character of enmity against the laws, religion, or tranquillity, of Musselmen; and as the said States never have entered into any war or act of hostility against any Mehomitan nation, it is declared by the parties that no pretext arising from religious opinions shall ever produce an interruption of the harmony existing between the two countries
Amendment 1: Congress shall make no law respecting an establishment of religion, or prohibiting the free exercise thereof
వేరే దేశంలో చట్టాలు గురించి తెలిసినంత మాత్రాన మనసు చలించే దుర్భర పరిస్తితిలో ఉన్న వారికి నా ప్రగాఢ సంతాపం. మనసు అదుపులో పెట్టుకోలేని దౌర్భాగుల గురించి తపన వలదు మిత్రమా.
ప్రస్తుతం జీవిస్తున్న మేధావుల అభిప్రాయాలకూ, మనుషుల మనోభావాలకూ ఏ విలువా ఉండదు. అదే వేల సంవత్సరాల క్రిందట పుట్టిన నిశానీగాళ్ళు చేసిన అతీమతీ లేని చట్టాలనుమాత్రం నెత్తినపెట్టుకొని ఊరేగాలి. ఇంతకంటే మీరు ఎక్కువగా వాదిస్తే మీ తలకాయ తీసేస్తాము జాగ్రత్త. హన్నా!
వాడెవడో మీకు నచ్చనిది చేస్తే, మీపాటికి మీరు "పవిత్రం"గా మీ జీవితాలు వెలగబెట్టుకోవచ్చుకదా? వాడివల్ల ప్రభావితం కావలసిన తప్పనిసరి తద్దినం మీకేమీలేదే! అంటే ప్రక్కవాడు "మంచి" పనులు చేసినంతవరకే మనకూ "మంచి" పనులు చెయ్యాలనిపిస్తుందా?
స్వలింగ సంపర్కం ప్రకృతి విరుధ్ధమా? అలాగా? మీదగ్గరున్న ఆధారాలేమిటో -నమ్మకాలుకాదు- కొంచెం వివరిస్తారా? స్వలింగ సంపర్కపుగాధలు ఏమతంలో లేవు? నాతో చెప్పింతురేమయ్యా? వాడెవడో వాడికి నచ్చినట్లు జీవిస్తే మనకెందుకు చెప్పరానిచోట నొప్పిపుట్టాలి?
హిందువులు: దేవదత్ పట్నాయక్ రాసిన "Shikhandi : And Other Tales They Don’t Tell You" తో మొదలుపెట్టండి ముస్లిములు: Why am I not a Muslimతో మొదలుపెట్టి స్వలింగ సంపర్కం అరబ్బుదేశాల్లోనే ఎక్కువన్న విషయం ఎఱుకపడేంతవరకూ చదువుతుపొండి. అన్నట్లు.. సోడొమీ మొఘలువంశ పవిత్రాచారమని మీకు తెలుసా? క్రైస్తవులు: మీకంత శ్రమఖ్ఖర్లేదు. మీరు క్షుణ్ణంగా బైబిల్ చదవండి చాలు.
శుక్రాచార్యగారు: నిన్న వివరించడం మర్చిపోయాను. దేవదత్ పట్నాయక్ గారి పుస్తకంలో ఒకప్పుడు హిందువులు ఎంత సహనంగా ఉండేవారు అని వివరిస్తారు. పురుషదేవతలు స్త్రీరూపమెత్తి సంచరించడం, అలా సంచరిస్తూ ఇంకొక పౌరుషుని బిడ్డకు తల్లవ్వడం వంటి పనులను అప్పట్లో ఎవ్వరూ తప్పుగా భావించలేదు. కొండొకచో అలా పుట్టిన బిడ్డలుకూడా దేవతలుగానే పూజలందుకున్నారు.
హిందూ మత గ్రంథాలపై దేవదత్ పట్నాయక్ ఇంటెర్ ప్రిటేషన్ సుపర్ ఫిషియల్. దేశం లో ఎంతో మంది గొప్ప రచయితలు ఉన్నా, జ్ణాన పీఠ అవర్డ్ లు పొందిన వారు ఉన్నా వారి గురించి చాలా మందికి తెలియదు.అదే మీడియా వారి హైప్ వలన చేతన్ భగత్ కి ఎక్కడలెని ప్రచారం, అతనొక గొప్ప రచయిత అయినట్లు బిల్డప్. అలాగే దేవదత్ కూడాను. ఆయనను హిందు మత మేధావులు ఎవరు గొప్ప జ్ణాని అని గుర్తించరు. హిందు మైథాలజిని ఇంగ్లిష్ లో రాసుకొనె ఒక సామన్య పండితుడు. ఆయన రాసినవి టైంస్ ఆఫ్ ఇండియాలో టైంపాస్ కి చదువుకోవచ్చు. అంతే. హిందువులు సహనం కోల్పోయినట్లు కమ్యునిస్ట్ మేధావుల ప్రచారం . అందులో వాస్తవం లేదు.
1. a traditional or legendary story, usually concerning some being or hero or event, with or without a determinable basis of fact or a natural explanation
2. any invented story, idea, or concept
3. an imaginary or fictitious thing or person.
4. an unproved or false collective belief that is used to justify a social institution.
@ఎడ్జ్, మీరు దేవదత్ ను కోట్ చేశారు.ఆయన పుస్తకాలలో హిందూ మైథాలజి గురించి రాస్తున్నాని ఆయనే చెప్పికొన్నాడు. కనుక నేను ఇక్కడ హిందూ మైథాలజిని రాయటం జరిగింది. కొనేళ్ల క్రితం సదరు దేవ్దత్ బ్లాగులో దానిని పట్టుకొని మీరెక్కడికో వెళ్లి పోయారు.
దేవదత్ ఒక కార్పోరేట్ బాయ్. బిగ్ బజార్ కిషోర్ బియని, దేవదత్ పట్నాయక్ తో కలసి పనిచేసిన వాళ్ల సెమినార్ కి అటెండ్ అవటం జరిగింది. ఆయన బోర్డ్ మీటింగ్ లో ఏవిధం గా వాల్యు యాడ్ చేస్తాడో చెప్పారు. ఆయన రాసిన పుస్తకాలు చదివాను. అతనితో కలసి పనిచేసిన వారి అనుభవాలు విన్నాను. ఆయన గురించి ఒక అవగాహన ఉంది.
మేధావులు అని ఎవరైతే చెప్పబడుతున్నారో వారిలోకన్నా "సామాన్య పండితు"లలోనే నాకు consistancy కనబడింది. మనరాస్ట్రంలోనే ప్రవచనాలపేర చక్రవర్తి బిరుదాంకుతులైన ఒక పెద్దాయన చెప్పేవి అటు నిఖార్సైన హిందువులు, ఇటు బుర్రపెట్టి independentగా ఆలోచించగలిగినవాళ్ళూకూడా జీర్ణించుకోలేరు.
మీరు మీ "మేధావుల" లిస్టొకటివ్వండి సార్. కొంచెం ఆసక్తిగా ఉన్నాను.
శ్రీరాం... EDGE వేరు నేను వేరు. మీ భ్రమలకు మిమ్మల్ని వదిలేస్తున్నాను.
దేవదత్ హిందూఇజాన్ని విమర్శించినట్లు నేనెక్కడా చదవలేదు. ఆయన పుస్తకాలు హిందూఇజమ్మీద నాకు సదభిప్రాయాన్నే కలిగించాయి. నావరకు నాకు ఒక పుస్తకాన్ని రాసేముందు అయన చేసే research నచ్చుతుంది. మీ అవగాహనను పంచుకొని మమల్ని convince చెయ్యగలరని ఆశిస్తూ...
@విశేషజ్ఞ విశేషజ్ఞ, హిందూ మతములో సహనం ఏ కాలములో ఉండాల్సినది ఆ కాలములో ఉంటూనే ఉంది. ఒకప్పుడు పురుషులు ఎంతమందినైనా పెళ్ళిచేసుకోవచ్చు. ఆ కాళములోనే స్త్రీలు ఇలా సూర్యున్ని చూసి, చంద్రున్ని చూసి పిల్లలను కనేవారు. కాబట్టి, బ్యాలన్సయ్యేది. ఈ కాలములో అలా కాదు కదండి? మగాడు ఏకపత్నీ వ్రతుడిలా ఉండాల్సిందే. ఉండకపోతే నేరమంటుంది చట్టం. అప్పటికీ, స్త్రీ పతివ్రత అయ్యుండక్కర్లేదు. చట్టం ప్రకారం స్త్రీ అక్రమ సంబంధం కలిగి ఉండడన్ నేరం కాదు. ఇంతకంటే ... సహనం మనం ఎలా ఆశించగలం చెప్పండి??
సహనం హిందూ సమాజంలో మాత్రం ఉన్నదని నేను అనుకోవడంలేదు. వారు ఘనంగా రాసుకున్న పుస్తకాలలో ఉండుంటే ఉండొచ్చుగాక. హరిహరసుతుణ్ణి దేవునిగా కొలిచే హిందువులే స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తారు. కృష్ణుణ్ణి సైతం కొలవగల హిందువులే వాలెంటైన్స్‌డేని వ్యతిరేకిస్తూ కర్రచేతిలోకి తీసుకుంటారు. న్యూయియర్‌ను వ్యతిరేకింఛే మేధావులకు, యోగాకూడా ఒక కార్పొరేట్ సాంప్రదాయమేననీ, అదికూడా ఒక దినోత్సవమేననీ పట్టదు.
Hinduism is not even a morsel better than Islam or Christianity. Unless we are freed from these doctrines, we will blow ourselves up and will serve ourselves up as good examples to other civilization that might be flourishing on other planetary systems.
నేను దాదాపుగా 14 సంవత్సరములనుండి CHURCH లో ప్రకటిస్తున్న అమెరికా క్రైస్తవ దేశం కాదు అని మరియు రోమన్ క్యాథలిక్కులు క్రైస్తవులు కాదని.అమెరికా 80 పెర్సెంట్ క్యాథలిక్ COUNTRY.రోమన్ క్యాథలిక్లకు క్రైస్తవులకు చాలా భేదం వుంది.గమనించగలరు.
It’s always a pleasure to see ignorance being devastated with so much ease and clarity. Right on, brother!
చౌదరిగారు, మీకో ఫ్లాష్ న్యూస్… ఆమ్రికా క్రైస్తవ దేశం కాదు, భారద్దేశం హిందూ దేశమూ కాదు. రోజువారీ ధర్మశాస్త్రాల డోసు బాగా తగ్గించి, విజ్ఞానశాస్త్రాల మోతాదు కొద్దికొద్దిగా పెంచుకుంటూ పొండి. త్వరలోనే కోలుకుంటారు.
మీరాతలన్నీ అటూ ఇటూగాని రాతలు. మీరాతలు వేదజ్ఞులూ అంగీకరించరు. అటు ముస్లిములూ అంగీకరించరు. ఇహ మండి. అహమ్మద్ గారు వ్రాసే ఆంగ్ల "కవిత"ల్లో adjectiveకీ nounకీ తేడా కనబడదు. మళ్ళీ ఆయన అంత్య ప్రాసలోతప్పితే వేరే ఇంకే చందస్సులోనూ వ్రాయరు.
చాలా మంచిగా చెప్పారు Edge గారు.మీరన్నట్టు అమెరికా క్రైస్తవ దేశం కాదు, ఇండియా హిందూ దేశం కాదు.అయితే,మొదట వున్నది ధర్మశాస్త్రం,ఆ తర్వాతే విజ్ఞాన శాస్త్రం.ఇది నా అభిప్రాయము.
శ్యామలీయం గారు "షరా: ఈ మాటకు అర్థం రచ్చబండవారితో చర్చా గోష్టికి సమయం ఇవ్వటం కాదు" అన్నారు. పైగా వారి వ్యాఖ్య నన్ను ఉద్దేశించి చేసారు తప్ప విశేషజ్ఞ విశేషజ్ఞ గారిని కాదు. వారిని ఈ చర్చలో ఈడ్చాలనే ప్రయత్నం ఎందుకండీ?
స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధమే. కాని ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఎన్ని పనులు జరగడం లేదు?
రంజాన్ నెలలో, కొన్ని హిందూ, జైన పండగల్లో కడుపు మాడ్చుకుని ఉపవాసాలుండడం ప్రకృతి సహజమా? కలుషితమైన జలాల్లొ భక్తి, బాప్టిజం పేరుతో మునగడం సరైన పద్ధతా? పండగలకు, పబ్బాలకు ఆజాన్‌లకు, ప్రార్ధనలకు 10000 వాట్‌ల మైక్ సెట్లు పెట్టి ఊదరగొట్టడం సహజ ప్రకృతా? ఒకే భార్య ఉండాలి అనడం, నలుగురివరకూ చేసుకోవచ్చనడం, వీటిలో ఏది ప్రకృతి సహజం? బుర్ఖా ధరించాలనడం ఏవిధమైన ప్రకృతి న్యాయం? ఇంకా మాతం చేసుకోవడం, శిలువ వేసుకోవడం, ఇలా ఎన్నో కనపడతాయి.
వీటన్నిటికీ వర్తించని ప్రకృతి సహజత్వం దీనికే ఎందుకు అడ్డు వస్తుంది?
శ్యామలీయంగారిని ఈడ్చాల్సిన అవసరం దేనికి జై గారు.వారు చర్చలలో పాల్గొని మరిన్ని విషయాలు తెలియజేస్తే అందరికీ ఉపయోగం.అయినా సరైన చర్చకు వస్తున్నప్పుడు ఆయన ప్రక్కకు వెళ్లిపోవడం షరా మామూలే గదా సర్?
స్వలింగ సంపర్కం ప్రకృతి విరుధ్ధమనే అభిప్రాయానికి మీరెలా వచ్చారో తెలుసుకోవచ్చా? స్వలింగ సంపర్కం జంతుప్రపంచంలో కనబడే విషయమే (ఇప్పుడది జంతు ప్రవృత్తి అంటూ చెప్పకండి దయచేసి). ఒకవేళ ఇది అసహజమే అనుకున్నా అరవయ్యేఖ్ళ్ళ షేకులు పదమూదు పద్నాలుగేళ్ల పిల్లల్ని పెళ్ళిచేసుకొనడమేమిటి? ఇదిమాత్రం ప్రకృతి సహజమేం? ఆదర్శపురుషుడు పన్నెండేళ్లపిల్లతో సంభోగంచెయ్యడమేమిటి? అదిమాత్రం ఆదర్శమేం?
నేను సమర్ధిస్తున్నది వ్యక్తి స్వేఛ్ఛను. స్వలింగసంపర్కులేమీ తలుపులు మూసుకొని ఎక్కడ దోపిడీలు చేద్దాం, ఎక్కడ బాంబులు పెడదాం అని మల్లగుల్లాలు పడడంలేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతికితే మనకు కలిగే నష్టమేమీలేదు. వాళ్లందరూ మనకు నచ్చినవిధంగానే బ్రతకాలని బెదిరించడానికి మనకున్న హక్కేమిటి అధికారమేమిటి? ఇంకొకరి జీవితాన్నీ, అలవాట్లనీ శాశించాలన్న ఈ 'కుతి' ఏమిటి? మెజారిటీల అలవాట్లే ప్రకృతి సహజమాఇనవా? అసలు ప్రకృతి సహజం అన్నదాన్ని ఎలా నిర్వచిస్తారు?
"నేను సమర్ధిస్తున్నది వ్యక్తి స్వేఛ్ఛను. స్వలింగసంపర్కులేమీ తలుపులు మూసుకొని ఎక్కడ దోపిడీలు చేద్దాం, ఎక్కడ బాంబులు పెడదాం అని మల్లగుల్లాలు పడడంలేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతికితే మనకు కలిగే నష్టమేమీలేదు. వాళ్లందరూ మనకు నచ్చినవిధంగానే బ్రతకాలని బెదిరించడానికి మనకున్న హక్కేమిటి అధికారమేమిటి? ఇంకొకరి జీవితాన్నీ, అలవాట్లనీ శాశించాలన్న ఈ 'కుతి' ఏమిటి? మెజారిటీల అలవాట్లే ప్రకృతి సహజమాఇనవా? అసలు ప్రకృతి సహజం అన్నదాన్ని ఎలా నిర్వచిస్తారు?"

నేను సింపుల్ గా ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నాను.ప్రపంచ దేశాలన్నీ కలసి ఈ స్వలింగ సంపర్కుల మీద ఏళ్ల తరబడి ఎన్ని చర్చలు జరిపిన,రాబోవు రోజులలో అన్ని దేశాలలో వారికొరకు చట్టం తీసుకు రావటాన్ని ఎవరు ఆపలేరు.అటువంటిది ఇక్కడ చర్చ చేసి ఉపయోగమేమిటి?
స్వలింగ సంపర్కం ప్రకృతి సహజమా కాదా అని తెలుసుకోవాలంటే చదవాల్సింది ధర్మశాస్త్రాలు కాదు… జీవశాస్త్రము, పరిణామ సిద్ధాంతం లాంటి విజ్ఞాన శాస్త్రాలు. కొంచం జటిలమైన విషయం, మీకు ఆసక్తి ఉంటే తప్పక చర్చిద్దాం.
ఈ లోపు మీబోటి మేధావులు మాబోటి సామాన్యులు అందరము ఖచ్చితంగా అంగీకరించే ఒక సులభమైన విషయం… పురుషాంగానికి శిశ్నాగ్రచర్మము(foreskin on penis) పుట్టుకతో అతి సహజంగా వచ్చింది కదా. మరి, మీ ధర్మశాస్త్రం ప్రకారం ఆ శిశ్నాగ్రచర్మాన్ని కోసేస్తారెందుకు? అది ప్రకృతి విరుద్ధం కదా?
అమెరికాలో స్వలింగ సంపర్కం కొత్తగా ఇప్పుడే ఏమి చట్టబద్ధం చేయబడలేదు, అదెప్పటినుంచో ఉన్నదే. స్వలింగ వివాహాలు చట్టబద్ధమే అని supreme court ఇప్పుడు స్పృష్టం చేసింది.
స్వలింగ సంపర్కుల వివాహాలు కూడా అనేక అమెరికా రాష్ట్ర్రాలలో (మరియు ఎన్నో ఐరోపా దేశాలలో) చట్టబద్దమే. ప్రస్తుతం చర్చిస్తున్న తీర్పు అమెరికా దేశమంతటికీ వర్తిస్తుంది తప్ప ఇతరత్రా కొత్తేమీ కాదు.
నేను,బైబిలులో దేవుని మాటను బట్టి చెప్తున్నాను.స్వలింగ సంపర్కాన్ని మొట్ట మొదట వ్యతిరేకించి దేవుడే..మానవుడు కాదు.ఈ స్వలింగ సంపర్కమే కాకుండా జంతు సంపర్కము కూడా దేవుడు వ్యతిరేకించారు.అయితే ఇప్పుడు ప్రస్తుత స్థితి,బైబిలులో వ్రాయబడినట్టు మృత సముద్రము దగ్గర నున్న ఆనాటి సోదోమో గోమోర్రో అనే రెండు పట్టణాలు పూర్తిగా స్వలింగ సంపర్కులున్న పట్టణాలు.వాటిని దేవుడు అగ్నితో కాల్చి నాశనం చేస్తాడు.అయితే అక్కడ ఆ స్వలింగ సంపర్కుల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకున్న లోతు అనే పేరు కలిగిన నీతిమంతుడు మాత్రము దేవునిచేత రక్షించబడి ఆ పట్టణాలను వదిలి బయటకు వస్తాడు.ఓకే ఆ చాప్టర్ క్లోస్.ఇప్పుడు అవే పరిస్థితులు వస్తాయని యేసు క్రీస్తు ముందుగానే ప్రకటించాచు.లూకా 17:28 లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. 29 అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. 30 ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును. కాబట్టి,చర్చలతో ఈ అపవిత్ర కార్యాలు చట్టబద్దం కాకుండ మనము ఎవ్వరము ఆపలేము.మన ప్రయత్నాలు విఫలము అవుతాయి.మనం ఏమీ చెయ్యలేము.ఏమిజరగాలని వుందో అది జరుగుతుంది.
స్వలింగ సంపర్కంపై చర్చిస్తున్న మిత్రులందరికీ నమస్కారములు! ప్రస్తుత ప్రపంచం ప్రపంచీకరణ కారణంగా ఒక కుగ్రామంగా మారిపోయింది. కనుక ఏ మూలన ఏ కాస్త మంచి జరిగినా ఏ కాస్త చెడు సంభవించినా వాటి పరిణామాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరూ మేమూ మనమందరం కాస్త తక్కువో ఎక్కువో అనుభవించకతప్పడం లేదు కదా! కాబట్టి- విజ్ఞునులైన మనమందరమూ పరస్పరము వ్యంగ్యోక్తులు విమర్శ ప్రతివిమర్శలు లేకుండా చర్చించుకోవటంలో మన ఉమ్మడి ప్రయోజనం ఉందన్నది మనలో ఎవరికీ తేలియనిది కాదు. ఏ స్వలింగ సంపర్కం గురించి అతి సామాన్య విషయముగా కొంత మంది మాటలాడారో వారి కొడుకులలోనో, కూతుళ్ళలోనో, మనవళ్లలోనో లేక మానవరాళ్లలోనో ఆ దుష్క్రియ అలవాడితే అంతే సామాన్యంగా స్పందిచగలరా? ఈ చర్చలో పాల్గొన్న మనం కొద్దిమందే కావచ్చు. కానీ మన ఈ చర్చలను చదివేవారూ మరియు వాటిని ప్రామాణికముగా తీసుకొని అనుసరించేవారూ వందల మంది ఉంటారు. కనుక మన చర్చలు నిర్మాణాత్మకముగానూ సందేశాత్మకముగానూ ఉంటే మనం వెచ్చించే సమయానికి అర్ధమూ పరమార్ధమూ ఉంటుందన్నది నా అభిప్రాయము. మన్నించగలరు. ముహమ్మద్. M. A. అభిలాష్. 9666 4888 77
ప్రస్తుత ప్రపంచం ప్రపంచీకరణ కారణంగా ఒక కుగ్రామంగా మారిపోయింది. కనుక ఏ మూలన ఏ కాస్త మంచి జరిగినా ఏ కాస్త చెడు సంభవించినా వాటి పరిణామాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరూ మేమూ మనమందరం కాస్త తక్కువో ఎక్కువో అనుభవించకతప్పడం లేదు కదా! ఏ స్వలింగ సంపర్కం గురించి అతి సామాన్య విషయముగా కొంత మంది మాటలాడారో వారి కొడుకులలోనో, కూతుళ్ళలోనో, మనవళ్లలోనో లేక మానవరాళ్లలోనో ఆ దుష్క్రియ అలవాడితే అంతే సామాన్యంగా స్పందిచగలరు. సూపర్ చెప్పారు. పురుషుడు-పురుషుడు కి, అలాగే స్త్రీలకు స్త్రీలకు మధ్య లైంగిక సంబంధాల? పైన కామెంట్లు చేసిన వారందరూ (చౌదరీలాంటి స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకించేవారు తప్ప) స్వలింగ సంపర్కం పట్ల కోరికతో ఆవురావురుమని ఉన్నారనిపిస్తోంది. ఖర్మకాలి భారతదేశంలో పుట్టారుగానీ ఆప్రాశ్చాత్య దేశాలలో పుట్టి ఉంటే వీళ్ళందరూ స్వలింగసంపార్కులయిపోదురు. ఇక్కడ గతి లేక సమర్ధించడంలో ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్యం? స్వలింగసంపర్కాన్ని సమర్ధింకడానికి సిగ్గు కూడా పడడం లేదు. అభిలాష్ కామెంట్ ఆలోచనీయం. వీళ్ళ కూతుర్లో, కుమారులో స్వలింగ సంపర్కం కలిగి యుంటే గొప్పగా ప్రకటించుకుందురో, లేక కుమిలికుమిలి ఏడ్చుతూ కూర్చుందురో? పై కామెంట్లలో గొప్ప జ్ఞానులు అని చెప్పుకోడానికి ఊగుతున్నారే గాని ఇంగితజ్ఞానం గాలికొదిలేశామన్న విషయం మర్చిపోయారు.భారతదేశాన్ని అలాంటి చెత్తలోకి నెట్టే ప్రయత్నమేమో మరి!
1. స్వలింగ సంపర్కం అమెరికాతో సహా అనేక దేశాలలో ఎప్పటి నుండో చట్టబద్దం 2. స్వలింగ వివాహం అమెరికాలో అనేక రాష్ట్రాలలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో ఇప్పటికే చట్టబద్దం
ప్రపంచం కుగ్రామం అయిందని మాట నిజమయితే ప్రస్తుత టపా రాసిన వారికి ఈ విషయాలు తెలిసే ఉండాలి. వారు ఇప్పుడే ఎందుకు పరిమాణాలు పరోక్ష ప్రభావం అంటున్నారు?
"విజ్ఞునులైన మనమందరమూ"
అమెరికా ఐరోపా వాళ్ళు కూడా విజ్ఞులే భాయిజాన్. మీకు నచ్చని & మీ గ్రంధం ఒప్పుకోదని మీరు అనుకుంటున్న విషయం ఆ దేశంలో చెల్లుబాటు అయినంత మాత్రాన వారు విజ్ఞులు కాకుండా పోరు.
"వారి కొడుకులలోనో, కూతుళ్ళలోనో, మనవళ్లలోనో లేక మానవరాళ్లలోనో ఆ దుష్క్రియ అలవాడితే అంతే సామాన్యంగా స్పందిచగలరా?"
ఇక్కడ సమస్య స్వలింగసంపర్కం కాదు, చట్టం & వ్యక్తిగత స్వేచ్చ. ఉ. మీ ప్రచారానికి ముగ్ధులై ఎవరయినా మతం పుచ్చుకున్నారని అనుకుందాం. వారి కుటుంబ పెద్దలు బాధ పడవోచ్చు కానీ మైనారిటీ తీరిన వారు సొంత నిర్ణయంతో చట్టబద్దమయిన చర్యను ఆపగలరా?
"ఆప్రాశ్చాత్య దేశాలలో పుట్టి ఉంటే వీళ్ళందరూ స్వలింగసంపార్కులయిపోదురు"
अब आगयेना अपनी औकाद पे!
వాదన వదిలేసి వ్యక్తిగత నిందలకు దిగడమేనా మీ మతాలు మీకు నేర్పించాయి?
చాలా సార్లు, చాలా మంది ... ఇదే పని నీ కూతురుకో, కొడుకుకో, తల్లికో లేదా చెల్లెలో చేస్తే అప్పుడు కూడా ఇలానే మాట్లడతావా.. అనో లేక, వారికి ఇలా జరిగితే నువ్వు అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా అనో అడగడం చూస్తూనే ఉంటాం. అది స్వలింగ సంపర్కం కావొచ్చు, సహజీవనం కావచ్చు లేకపోతే మరోకటి కావచ్చు. చర్చ విషయం మీద చేయకుండా, వ్యక్తిగత స్థాయిలోకి వచ్చి, ఆవ్యక్తిని ఇబ్బంది పెట్టడానికో లేక అవమానించడానికో ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అది సరికాదు..
సరే, వేసిన తరువాత సమాధానం ఎవరో ఒకరు ఇవ్వాలి కదా.. నేనిస్తాను తీసుకోండి.
ఒక వ్యక్తి, అతను మిస్టర్ X అనుకుందాం. అతను స్వలింగ సంపర్కాన్ని సమర్ధించాడు. అతని చెల్లెలు లేదా అక్కా లేక అమ్మా లేకపోతే తండ్రి లేక కుమారుడు లేక తమ్ముడు.. లాంటి కుటుంబ సభ్యులు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. అది మిస్టర్ Xకి తెలిసింది. ఇప్పుడు అతను ఏమి చేయగలడు ? అతను వ్యతిరేకించొచ్చు లేదా తన ఆదర్శాన్ని నమ్ముకుని వారిని సాదరంగా ఆహ్వానిచనూ వచ్చు. ఆహ్వానిస్తే All Is Well అందులో మాట్లాదుకోవడానికి ఏమీ లేదు. అదీ కాక ఇలాంటి ప్రశ్నలు అడిగేది కూడా, ఇదే పని తమ కుటుంబ సభ్యులు చేస్తే, పరువు పోతుందనో లేక వారి జీవితం నాశన మవుతుందనో భయపడతారే కానీ సమర్ధించరు అన్న ఊహతోనే వేయడం జరుగుతుంది.
సో, ఒకవేల మిస్టార్ Xకి తన కుటుంభ సభ్యులు స్వలింగ సంపర్కులు కావడం ఇష్టం లేకపోతే ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. అతను ఎవరు వారి అభిప్రాయాన్ని కాదనడానికి, వారి జీవితాన్ని నిర్దేశించడానికి? ఆయా కుటుంబ సభ్యులు మైనరిటీ తీరి, స్వంతంగా నిర్ణయాలు తీసుకునే వయస్సు వారికి ఉంటే, వారిని ఆపే హక్కు ఇతనికెక్కడిది? కేవలం వాల్లు అతని కుటుంభ సభ్యులైనంత మాత్రాన, తమ తమ ఇష్టాలను చంపుకోవాలా? వారికంటూ ఒక జీవితం ఉండదా? దానిలో వేలు బెట్టి, నువ్వు అలా ఉండకూడదు, ఇలానే ఉండాలి అనే అధికారం మిస్టర్ Xకు ఎవరిచ్చారు ?
దీన్ని భట్టి నేను చెప్పేదేమిటంటే.. మిస్టర్ X దాన్ని వ్యతిరేకించొచ్చు, కానీ తన అభిప్రాయాన్ని, ఇష్టాలనూ భలవంతంగా ఎవరిమీదా రుద్దలేడు. రుద్దకూడదు. అలా చేస్తే అది తప్పవుతుంది.
కాబట్టి, మిస్టర్ X వారి వారి నిర్ణయాలకి విలువిచ్చి ఊరుకోవడం మంచిది.
మిత్రులారా! మనం ధార్మికులం కనుక మన మంచి-చెడుల నిర్ధారణకు మన ధర్మశాస్త్రాలే ప్రామాణికం కావాలి. అవి వేటిని అనుమతిస్తున్నాయో వాటిని విధులుగా మరియు అవి వేటిని నిషేధిస్తున్నాయో వాటిని నిషేధితాలుగా అంగీకరించాలి. అయితే ఇక్కడ కొందరి సందేహం ఏమిటంటే- ఆ శాస్త్రాలు వందల, వేల సంవత్సరాలకు పూర్వం నాటివి కదా నేటి ఆధునిక కాలానికి వాటి అనుసరణ సాధ్యం కాదు కదా అన్నది! ఆ విషయము అర్థం కావాలంటే- మనిషికి సంబంధించిన రెండు విభాగాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది గమనించగలరు. 1. మనిషి మనస్తత్వము లేక స్వభావమునకు చెందిన విభాగము. ఇది భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతము. అంటే అది ఎప్పుడూ మారేది కాదు. 2. మనిషి భౌతిక వసతుల లేక అతని భౌతిక సౌఖ్యాల సామగ్రికి చెందిన విభాగము. ఇది భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతము కాదు. అంటే అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. మొదటి విభాగానికి సంబంధీచిన విషయాలు: హక్కులు-బాధ్యతలు, మంచి-చేడులు, న్యాయా-న్యాయాలు, వావి-వరసలు వగైరాలు ఎన్నటికీ ఎప్పటికీ మారనివి. ఈ విలువలూ భూతభవిష్యవార్తమాన కాలాలకు అతీతము. ఎందుకంటే- అతని మనస్తత్వము లేక స్వభావము కూడా భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతము కనుక! ధర్మశాస్త్రాల ప్రబోధనలు కేవలము ఆ విభాగానికి చెందిన విషయాలను గురించే చర్చిస్తాయి. కనుక వాటి ప్రభోధనలూ భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతముగానే ఉంటాయి. అంటే అవి ఎప్పుడూ మారానివిగానే ఉంటాయి. ఇక, రెండవ విభాగానికి సంబంధీచిన విషయానికి వస్తే... అతని భౌతిక వసతుల లేక అతని భౌతిక సౌఖ్యాల స్థితి ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఆది దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంటుంది. ఉండాలి కూడా! ఆ రంగానికి సంబంధించి ధర్మశాస్త్రాలు చర్చించవు. ఆటంక పరచవు. కానీ, ప్రోత్సహిస్తాయి. ధర్మశాస్త్రాల మౌలిక ప్రబోధన ఏమిటంటే- మనిషి వ్యక్తిగత జీవితములో నైతికతను సామూహిక జీవితములో మానవతను పాటించాలన్నదే! తద్వారా ఇహలోకంలో మానసిక-శ్యారీరక ఆరోగ్యమును మరియు సమాజములో గౌరవమరియాదలను సంపాదించుకొని పరలోకంలో ముక్తీమోక్షాలను సాధించుకోవాలన్నదే! గమనిక: ధర్మశాస్త్రాల ప్రబోధానలను గ్రుడ్డిగా కళ్లు మూకొని అనుసరించ వలసిన అవసరం లేదు. కావాలంటే వాటి సత్యతను హేతుబద్ధతను మీ సాధారణ బుద్ధి వివేచనల గీటురాయిపై గీటుపెట్టి పరీక్షించి మరీ చూచుకోమని వాటి ప్రదాత అయిన ఆ సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు అనుమతిని ఇస్తున్నాడు. కనుక ప్రస్తుత చర్చనీయాంశము అయిన ‘స్వలింగ సంపర్కం’ కానివ్వండి లేక మరొకేదైనా అంశము కానివ్వండి. దానిని ఒక్క ధర్మశాస్త్రాల ప్రబోధానల వెలుగులోనే కాక, సాధారణ మానవ వివేచన మరియు భౌతిక విజ్ఞాన శాస్త్ర వెలుగులోనూ పరిశీలిద్దాం. అలాంటి పరిశీలనకు మన ఉమ్మడి ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాలు పూర్తిగా ప్రోత్సహిస్తున్నాయి కూడా! కనుక ఇక మీదట మన చర్చను భౌతిక-ధార్మిక ఉభయ శాస్త్రాల ఆధారంగా సాగిద్దాం. దీనికి మీరేమంటారు మిత్రులారా!?
అదంతా చెల్లేది దారుల్ ఇస్లాం/హిందూ రాష్ట్ర లాంటి మతస్వామ్యాలలో. సెక్యులర్ దేశంలో చట్టాలు మతం వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి ఫలానా గ్రంధంలో ఏదో ఉందని కనుక అమలు చేసే తీరాలని అంటే కుదరదు.
గీత బైబుల్ ఖురాన్ గొప్పవా వీటిలో ఏది అత్యంత ఉత్తమం అనే చర్చ ప్రస్తుతానికి అనవసరం. చట్టానికి రాజ్యాంగాన్ని మించిన గ్రంధం లేదు.
జై జి గారికి వందనాలు! మా రాతలపై మీ స్పందనలను చూస్తుంటే... గతంలో మీకు ఎదురైన వ్యక్తుల లేక పుస్తకాల వాదనలను దృష్టిలో పెట్టుకొని మీరు మాటలాడుతున్నారే తప్ప, మేము చెబుతున్నా విషయాన్ని కనీసం గమనించటం లేదని అర్థం అవుతుంది. దయచేసి మేము చెప్పిన దానిని మీరు స్పందించిన దానిని మరొకసారి పోల్చి చూడండి అసలు ఏమాత్రమైనా పొంతన ఉందేమో!! మీరు “అదంతా చెల్లేది దారుల్ ఇస్లాం/హిందూ రాష్ట్ర లాంటి మతస్వామ్యాలలో” అనిమాత్రమే అన్నారు. కానీ, క్రైస్తవ మత స్వామ్యమైన దేవుని రాజ్యము గురించి కామెంట్ చెయ్యలేదు. ఇక, మీరు సెక్యులర్ చట్టాలు సెక్యులర్ చట్టాలు అని అంటున్నారే... అవి ఎవరివైనా సొంత ఆవిష్కరణలా? లేక ఆకాశం నుండి ఊడి పడ్డాయా? కాదు. వాటిని రెండు విధాలుగా రూపొందిచారు. 1. సర్వ సృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడు అనాదిగా ఇస్తూ వచ్చిన ధర్మ శాస్త్రాల ప్రబోధనల ఆధారముగా. 2. సర్వ సృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడు మనిషి స్వభావములో ప్రకృతి సిద్ధముగా పెట్టిన మంచి-చెడుల చైతనము ఆధారముగా. కనుక సెక్యులర్ చట్టాలు వంద శాతమూ లౌకికమూ కాదు. భౌతికమూ కాదు. కాబట్టి సెక్యులర్ చట్టాలు పరోక్షముగా దైవికమైనవే! కాబట్టి వాటిని పాటించే విషయములోనూ ధార్మికులూ నిబద్ధతను కనబరచాలి. అయితే అవి బాహ్యములో ప్రయోజనకరమైనవిగా కంబడుతూ అంతర్గతంగా ఏదో ఒక వర్గానికి నష్టము కలిగించ వచ్చుచును. అటువంటప్పుడు దానిపై చర్చించాలి. “ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి ఫలానా గ్రంధంలో ఏదో ఉందని కనుక అమలు చేసే తీరాలని అంటే కుదరదు”. అని మేమన్నట్లు మీరంటున్నారు. అలా మేము అనలేదన్నది మీరు గ్రహించాలి. “గీత బైబుల్ ఖురాన్ గొప్పవా వీటిలో ఏది అత్యంత ఉత్తమం అనే చర్చ ప్రస్తుతానికి అనవసరం. చట్టానికి రాజ్యాంగాన్ని మించిన గ్రంధం లేదు.” అని మీరు అనటానికి, ఉందని మేము అంటేగా! గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల మౌలిక సందేశం ఒక్కటే అన్నది మా వాదన. ఈ విషయాన్ని కాదనే వారిని అది నిరూపించే వరకు మేము ఏకీభవించము. ఈ సందర్భంగా ప్రధాన చర్చనీయాంశము- “వ్యక్తి స్వేచ్చ” అని కొందరు మిత్రులు అంటున్నారు. అది నిజమే దానిపై కులంకషంగా చర్చించవలసి ఉంది. ఆ “వ్యక్తి స్వేచ్చ” పరిమితులతో కూడి ఉండేదా? లేక విచ్చలవిడి స్వేచ్చా? అన్నదానిపైనా మనం చర్చిచాల్సి ఉంది. మన చర్చల అంతిమ లక్ష్యం విరాట్ వ్యక్తుల తయారీ, తద్వారా సుందర సమాజ నిర్మాణం. కనుక మనం ప్రేమ పూర్వకముగా మరియు ఆధార సహితముగా చర్చించుకుందాము.
దేవుని బిడ్డల రాజ్యం & జియోనిస్టు సామ్రాజ్యం కూడా మతస్వామ్యాలే, ఉదాహరణ కోసం రెండు చెప్పాను అంతే. మతగ్రంధాలు ఎక్కడినుండి ఊడబడ్డాయో సెక్యులర్ చట్టాలు ఎక్కడినుండి వచ్చాయో అప్రస్తుతం. ఫలానా గ్రందాల సారాంశం గురించి మీ అభిప్రాయం ఏదయినా అదీ ఇక్కడ అనవసరం.
ఫలానా మతంలో ఉంది కాబట్టి చట్టాన్ని ఒప్పుకోను ఆంటే కుదరదు. చట్టబద్దమయిన విషయాలను మతం/ధర్మం/ప్రకృతి/ఆచారం/దేవుడు/దయ్యం పేరుతొ అడ్డుకోవాలని ప్రయత్నించడం సబబు కాదు.
వ్యక్తిస్వేచ్చకు చట్టం ఒక్కటే పరిమితి. మిగిలిన అన్నీ అంగీకరించిన వారికే వర్తిస్తాయి.
మిత్రులు జై గారికి వందనములు! ప్రజాస్వామిక దేశాలలో సార్వత్రిక నియమ నిబంధనకు అంతిమ ప్రమాణంగా ఉండేది చట్టమే! ఇక మీరన్నట్టు మతం/ధర్మం/ప్రకృతి/ఆచారం/దేవుడు/దయ్యం వంటి వాటిపై విశ్వాసం ఎవరికి ఉందో అవి వ్యక్తిగతంగా వారికే వర్తిస్తాయి. దానిని మేము కాదనలేదు కదా! “చట్టబద్దమయిన విషయాలను అడ్డుకోవాలని ప్రయత్నించడం సబబు కాదు” అని మీరు మాకు సలహా ఇవ్వటానికి అడ్డుకోవాలని అసలు మేము అంటే కదా! మా విషయములో మీ ముందస్తు ఆలోచనల నుండి కాస్త బయట పడాలని సవినయముగా మిమ్మల్ని కోరుతున్నాము. రాజ్యాంగము అంతిమ లక్ష్యము సంక్షేమ రాజ్య నిర్మాణము. దాని కొరకు సమాజములో ఉన్న సామాన్య ప్రజలలో నుండి విద్యా-విజ్ఞానాల పరముగా నిష్ణాతులైన కొందరు ఒక “చిన్న సమూహము”గా ఏర్పడి చట్టములను-శ్యాసనములను రూపొందిస్తుంది. ఆ “చిన్న సమూహము”తోనే సకల దేశాల సాధారణ ప్రజాబాహూళ్యానికి ఘోరమైన నష్టాలు యాతనలు కలుగుతున్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం! ఎందుకంటే- “చిన్న సమూహము”చే సాధారణ ప్రజాబాహూళ్య సంక్షేమం పేరిట చేయబడే చట్టముల-శ్యాసనముల వలన అపార ప్రయోజనము ఆ “చిన్న సమూహము”నకే కలుగుతుంది. ఎవరి పేరిట చేయబడుతుందో వారికి మాత్రం నష్టమే సంభవిస్తుంది! కనుక పౌరసమాజానికి వాటిల్లుతున్న ఈ నష్టాన్నుండి కాపాడటానికి... ఆ “చిన్న సమూహము” పాల్పడుతున్న కుట్రలను భగ్నం చేసి, అందరికీ ప్రయోజనం చేకూరే విధమైన చట్టాలు-శ్యాసనములు అమలయ్యే విధంగా చూడవలసిన బాధ్యతను N. G. O. లు లేక పౌరసమాజానికి చెందిన ఉత్తములు వహించాలి కదా! ఉదాహరణకు: సరైన విద్యా-విజ్ఞానాలు లేని సామాన్య ప్రజలు అభం-శుభం ఎరుగని పిల్లలవంటివారు. వారి అలనా-పాలనను చూడవలసిన విద్యుక్తధర్మమును కలిగి ఉండేది... ఆ “చిన్న సమూహమే!” అది తన మరియు తన పాలితులు (సంతానం) సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో న్యాయవంతంగా తన పాత్రను నిర్వర్తిస్తే, సామాన్య ప్రజల పట్ల అది “సొంత తల్లి”గా పరిగణించ బడుతుంది. అలాకాక అది పాలితుల (సంతానం) కు వినాశనమును కలిగిస్తూ, కేవలం తన సంక్షేమం కొరకు మాత్రమే పనికివచ్చే చట్టాలు-శ్యాసనములు నిర్మిస్తూ ఉంటే, సామాన్య ప్రజల పట్ల అది “సవతి తల్లి”గా పరిగణించ బడుతుంది. ఈనాటి అధిక శాతం దేశాలలో “సవతి తల్లి” పాలనే జరుగుతుందన్నది మనందరికీ ఎరుకే! ఈ నేపధ్యములో అభం-శుభం ఎరుగని పిల్లలవంటి సామాన్య అమాయిక ప్రజల “వాస్తవ సంక్షేమం” కొరకు నడుం బిగించ వలసింది పౌరసమాజానికి చెందిన ఉత్తములైన N. G. O. లే కదా! అంటే, వీరు “సొంత తల్లి” పాత్రను పోషించాలి! మద్యము, జూదము, మత్తుపదార్ధాలు, నగ్నత్వము, విచ్చలవిడితనము, స్వలింగసంపర్కము వంటి అత్యంత వినాశనకరమైన వాటిని ఒకవేళ ప్రజలు కోరుకుంటే- అది, అభం-శుభం ఎరుగని పిల్లలు కత్తులను, సూదులను, వివిధ ఔషధాలను, విద్యుత్తీగలను చేతపట్టుకొని నోటిలో పెట్టుకోవటం వంటి అజ్ఞాన చేష్టలే! వాటిని వారించవలసిన బాధ్యత పాలకులైన ఆ చిన్నవర్గానిదే అవుతుంది. ప్రతి దేశ రాజ్యాంగమూ వాటిని నిర్బంధంగా నిషేదించాలనే శ్యాసిస్తుంది. కనుక ఆ చిన్న పాలక వర్గం ఒక కన్నతల్లిగా- ఆ దుష్కృత్యాల తీవ్రతను సామాన్య అమాయిక ప్రజల (సంతానము) కు ఎరుక పరచి, అంచేల వారీగా వాటి అలవాటును తగ్గించి, చివరకు వాటిని నిషేధించాలి. దానికి బదులు ఆ దుష్కృత్యాల దాహాన్ని ప్రజలలో తీవ్ర తరం చేస్తూ, ఆ చెడులను క్రమక్రమంగా పెంచుతున్నారంటే దానిలో ఎవరి “వినాశనం” మరియు ఎవరి “సంక్షేమం” దాగి ఉందో ఈ దుర్మార్గపు చెడుల పరివ్యాప్తిలో “వ్యక్తి స్వేచ్ఛ” ఉందో లేక బడాబాబుల “కుట్ర” ఉందో మీకు తేలియటం లేదా జైగారూ! ఇక, “వ్యక్తి స్వేచ్ఛ” విషయానికి వస్తే... మీరు సమర్ధిస్తున్న లేక మీరు కాపాడాలనుకుంటున్న “వ్యక్తి స్వేచ్ఛ” పరిమితులతో కూడి ఉండేదా? లేక విచ్చలవిడి “వ్యక్తి స్వేచ్ఛ?” దీనికి One word answer ఇవ్వండి! రేపు ఎవరైనా తల్లినిగాని చెల్లినిగాని కూతురినిగాని కామించి, వారితో సహజీవనం చేస్తామని కోరుకుంటే... మీరూ శ్యామలీయం, విశేషజ్ఞ, శుక్రా చార్య, శ్రీకాంత్ చారి గార్లు ఏమంటారు?
ముందు చట్టం ముందు అన్ని మతాల గ్రంధాలు నడవవని ఒప్పుకున్నందుకు థాంక్స్. ఇకపోతే మీరు వ్యతిరేకిస్తున్న స్వలింగాసంపర్కం భారత దేశంలో చట్టబద్దమా కాదా కూడా పరిశీలించండి. సంబంధం లేని ఇతర దేశాల గురించి మనకెందుకు?
అత్యధిక శాతం ప్రజలను సామాన్యులు, అజ్ఞానులు లేదా పసిమనస్కులు అంటూ కొట్టిపారేయడం, వారిని నా లాంటి ఉత్తములే కాపాడగలరని సొంతడబ్బా కొట్టడం విజ్ఞతను సూచించవు. వినమ్రత మించిన ఆభరణం లేదని ఒప్పుకోవడమే ఉత్తముల లక్షణం.
పోనీ వాదన కోసం మీరే కరెక్ట్ అనుకున్నా అమెరికా & ఐరోపా "అభం-శుభం ఎరుగని అజ్ఞానులను" వారు చదవని బ్లాగులలో వారికి తెలీని భాషలో రాసి ఎలా ఎరుక పరుస్తారు?
"వ్యక్తిస్వేచ్చకు చట్టం ఒక్కటే పరిమితి" అని అన్నాక మళ్ళీ one word answer ఎందుకు భాయిజాన్?
మీరు "వావి వరసలు" ప్రస్తావిస్తూ చాలెంజులు విసిరే ముందు ఇదే తరహా వాదనా పద్ధతులకు ముందే ఇచ్చిన సమాధానం చూస్తె బాగుండేది. ద్రౌపది గురించో, సవితి తల్లి కూతురుని పెళ్ళాడే పద్దతుల గురించో మీ అభిప్రాయం నేనూ అడగగలను కానీ అది నా పద్దతి కాదు.
ఇక వేరేవారు ఏమంటారో అని నన్ను అడగడం మీకు శోభించదు.
మిత్రులు జైగారికి వందనములు! మా ప్రస్తావిత విషయాలకు మీరు చేసే వక్రీకరణ మీరు మాతో సక్రమముగా మాటలాడటానికి ఇష్టపడటం లేదని, అక్కస్సుతో మాటలాడుతున్నారని పాఠకులకు స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. “అత్యధిక శాతం ప్రజలను సామాన్యులు, అజ్ఞానులు లేదా పసిమనస్కులు అంటూ కొట్టిపారేయడం, వారిని నా లాంటి ఉత్తములే కాపాడగలరని సొంతడబ్బా కొట్టడం విజ్ఞతను సూచించవు. వినమ్రత మించిన ఆభరణం లేదని ఒప్పుకోవడమే ఉత్తముల లక్షణం. పోనీ వాదన కోసం మీరే కరెక్ట్ అనుకున్నా అమెరికా & ఐరోపా "అభం-శుభం ఎరుగని అజ్ఞానులను" వారు చదవని బ్లాగులలో వారికి తెలీని భాషలో రాసి ఎలా ఎరుక పరుస్తారు?” అన్న మీ వ్యాఖ్యానం విషయంపై మాటలాడలేని మీ బలహీనతను చూపిస్తుంది. వివిధ పనుల కొరకు వివిధ వ్యక్తులను ఎన్నుకోవటం అన్నది ఒక సార్వత్రిక అనివార్య విషయం. తోటమాలి నుండి విమాన చోదకుడి వరకు, ఆఫీసు బోయ్ నుండి కలక్టర్ వరకు, గల్లీ లీడరు నుండి డిల్లీ లీడరు వరకు వారి వారి సమర్ధతల ఆధారంగానే వారి వారి ఎంపికలు, నియామకాలు జరుగుతాయి. అలాగే ఒక సాంఘీక వ్యవస్థ సక్రమంగా, సంక్షేమ భరితంగా నడవాలంటే... దానికి కావలసిన నియమ-నిబంధనలను, విధి-నిషేధాలను చేసేది మేధావులే గాని సామాన్యులు కాదుకదా! ఈ విభజన గురించి సోదాహరణంగా చెప్పిన దానిని మీరు తప్పుపట్టారంటే, మీరు మాపట్ల ఎంతటి ఉక్రోషానికి గురౌతున్నారో అర్థం అవుతుంది. “వ్యక్తి స్వేచ్ఛ” ముసుగులో మానవులను హీనులుగా నీచులుగా మార్చి, వారిపై తమ చిరకాల ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్న వారి కుట్రను గుర్తించక, తెలుసో తెలియాకో వారికి వత్తాసు పలుకుతున్న మీరూ మీమ్మల్ని ఏకీభవించే వారూ- “వ్యక్తి స్వేచ్ఛ”కు నిర్వచనం ఏమిటో దానికి ప్రాతిపాధిక ఏమిటో చెప్పండి. ఈ విషయములో తప్పించుకొనే ప్రయత్నం చేయకండి. న్యాయ దృష్టిగల ప్రజలు మన చర్చలను గమనిస్తున్నారు. పెద్ద ఎత్తున వారు కూడా చర్చించటానికి ముందుకు రానున్నారు. మిత్రులు జైగారూ విషయాన్ని విషయంగా ఏ విషయానికి ఆ విషయంగా మాటలాడుకుందాము.
అన్నట్లు మిమ్మల్ని మీరే "మేము" అని సంబోధించుకోవడం అహంభవం కాదని మీ అభిప్రాయమా? మీరు నైతిన నియమాలన్నీ భగవంతుడే ఇస్తాడన్న దగ్గర తప్పటడుగులు మళ్ళీమళ్ళీ వేస్తున్నారు. భగవంతుడన్నది (మీ)నమ్మకమ్మాత్రమే. అది నిజం కాదు.
నేను విషయం పరిధిని దాటలేదు. ఈ పరిధాలో నేను వేసిన ప్రశ్నలు (ఉ. అమెరికా క్రైస్తవ దేశమా? మన దేశంలో స్వలింగ సంపర్కం చట్టబద్దమా?) మీరు & మీ సమర్తకులు దాటవేశారు.
మీరు బహుజనులను అజ్ఞానులు, అభం శుభం తెలియని పసిపిల్లలు అనడం & వారిని "ఉత్తములు" ఉద్దరించాలనడం మీకు భావ్యంగా ఉందేమో మీ ఇష్టం.
వివిధ పనులు చేసే వారికి ఆ పని తాలూకా అర్హతలు తప్ప ఇంకేవీ ఉండాలని లేదు. ఆఫీసు బాయ్ అపార ధర్మకోవిదుడయినా చదువు లేక ఆ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఉమ్మీ అని పిలవబడ్డ వారు & వడ్రంగి పని చేసే వారు ప్రవక్తలు అయ్యారు కదా? వారు మేధావులు కాకపోయినా మానవాళికి సేవలు చేయలేదా?
నాకు మీ (అంటే అభిలాష్) ఘమండ్ చూస్తె బాధ కలుగుతుంది తప్ప మీ (అంటే మీ మతం వారి) మీద ఉక్రోషం లేదు. నాకు అన్ని మతాలూ సమానమే.
మద్యము, జూదము, మత్తుపదార్ధాలు, నగ్నత్వము, విచ్చలవిడితనము, స్వలింగసంపర్కము వంటి అత్యంత వినాశనకరమైనవని మీరు అన్నారు, వీటికి ఒక్క ఆధారము ఇవ్వలేదు. క్రైస్తవ ఆచారాలలో మధిర సేవిస్తారు, దేవతలు సురాపానం చేసే వారు, ధర్మరాజు జూదం ఆడారు, యోగి వేమన దుస్తులను త్యజించారు లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు స్వలింగాసంపర్కం పాపమని మీరు తరుచూ పేర్కొనే గీత, తోరా. బైబుల్, ఖురాన్ గ్రంధాలలో ఉందా?
వ్యక్తిస్వేచ్చ నిర్వచనం నేను ఇదివరికే ఇచ్చాను అడుగుతున్నారు కనుక మళ్ళీ ఇదుగో. ఒక మైనారిటీ తీరిన వ్యక్తి చట్ట వ్యతిరేకం కాని ఎటువంటి చర్యనయినా చేసే హక్కును వ్యక్తి స్వేచ్చ అంటారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం నిషిద్దం కనుక అక్కడ ఉండే వారి వ్యక్తిస్వేచ్చ దీన్ని కవర్ చేయదు కానీ నిషేధం లేని మహారాష్ట్రలో ఈ విషయంలో ఎవరి ఇష్టం వారిది.
The statement "I disagree with everything he says but will defend to my last breath his right to say it" summarizes the concept.
పెద్ద ఎత్తున వాదనకు ఎవరో రాబోతున్నారన్నారు. రానివ్వండి నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు.
"స్వలింగ సంపర్కం పట్ల కోరికతో ఆవురావురుమని ఉన్నారనిపిస్తోంది. ఖర్మకాలి భారతదేశంలో పుట్టారుగానీ ఆప్రాశ్చాత్య దేశాలలో పుట్టి ఉంటే వీళ్ళందరూ స్వలింగసంపార్కులయిపోదురు. ఇక్కడ గతి లేక సమర్ధించడంలో ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్యం? స్వలింగసంపర్కాన్ని సమర్ధింకడానికి సిగ్గు కూడా పడడం లేదు. "
"భారతదేశాన్ని అలాంటి చెత్తలోకి నెట్టే ప్రయత్నమేమో మరి!"
బాబూ అరవిందూ...
నీకు చెత్త అనిపిస్తే అది అందరిస్కీ చెత్త అనిపించాల్సిన అవసరంలేదు (లౌకికత్వాన్ని చెత్త అనుకొనేవాళ్ళ దృష్టిలో నువ్వొక నపుంసకుడివవ్వన్న విషయం తెలుసుకో). స్వలింగసంపర్కం అవమానకరమైన విషయంకాదు. నీకు అలా అనిపిస్తే అది అందరికీ అలాగే అనిపించాల్సిన అవసరంలేదు. కొందరికి పందినో/ఆవునో/దున్ననో/మాంసాహారాన్నో తినడం తప్పని అనిపించినంతమాత్రాన దాన్ని అందరూ అదే అభిప్రాయాన్ని కలిగుండాల్సిన అవసరంలేదు. మీకు నచ్చని సినిమా ఇంకొకరికి నచ్చినంతమాత్రాన మీరు మీ కుత్స్సిత అభిప్రాయాలతో మిగతావారినందరినీ వెధవలుగా జమకట్టడం తగదు. ఒకవేళ నేను స్వలింగ సంపర్కుడనైనా, నా కొడుకులో, కూతుళ్ళో స్వలింగ సంపర్కులైనా నేను (కనీసం గర్వించకపోయినా) అదేదో దాచుకోవలసిందిగా భావించను, అవమానకరంగా భావించను. వాళ్ళు దొంగలూ, తీవ్రవాదులూ ఐతే అవమానకరంగానీ, వాళ్ళకిస్ఠమొచ్చిన్న రీతిలో వాళ్ళు జీవిస్తున్నందుకు నేను అవమానకరంగా ఫీలవ్వాలసింది ఏమీలేదు.
మీరు ఖండించాల్సిందేమైనా ఉందంటే మీ అభిమాన ప్రవక్తగారి Pedophilic tendenciesని. ఇప్పుడు చెప్పండి మీకే ఒక కూతురుంటే, ఆమెకు తొమ్మిదవ వయసున్నప్పుడు ఒక ముప్పైయేళ్ళవాడితో పెళ్ళిచేస్తారా? ఇది perversionకాక మరింకేమితి?
మనదేశంలో (ఆమాటకొస్తే ప్రపంచంలో) మెజారిటీకి ఇస్లామంటే అసహ్యం. మీరు ముస్లిమైనందుకు ఎలా గర్వించగలుగుతున్నారు?
స్వలింగ సంపర్కాన్ని సమర్ధించే మిమ్మల్ని చూస్తే సిగ్గుపడాలి. మీరు అనుకున్నట్టు నోటి మాటలు కాదు.నిజ జీవితంలో పిల్లలు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అర్ధమవుతుంది. మనదేశమేమైనా ఆ దిక్కుమాలిన సంస్కృతి కలిగిన దేశమనుకుంటున్నారా? ఇక పోతే నేను ముస్లిం అయ్యిపోయానని ఎవరు చెప్పారు? ఇస్లాంకి నాకు,సంబంధమేమిటి? అసలు ఆ మతం గురించి నాకేమీ తెలియదు కాబట్టి ఏనాడూ ఆ మతం జోలికి వెళ్లలేదు. ఒక ముస్లిం వాదనను సమర్ధించినంత మాత్రాన ఆ మతంలోకి నెట్టేచి చూస్తున్న మీ యొక్క మేధావి తనానికి జోహార్లు. స్వలింగ సంపర్కం విషయంలో సిగ్గు వదిలేశాను,నాకు అవమానం కాదు గౌరవం అని ప్రకటించుకున్న మిమ్మల్ని నేను ఏమి అనగలను చెప్పండి విశేషజ్ఞగారు?
ముందుగా... నిన్న నేను చేసిన పరుషమైన వ్యాఖ్యలకు నన్ను క్షమించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను.
అరవింద్ గారు...
మీకు సిగ్గులేనితనం అనిపించింది ఇతరులకూ అలాగే అనిపించాల్సిన అవసరంలేదు. మీరు స్వలింగ సంపర్కాన్ని తప్పు అని ఎందుకు అనుకుంటున్నారో కొంచెం మీలోమీరు ఆలోచించుకొని జవాబు చెప్పగలరా? మీకు అసహ్యంగా అనిపించినందుకా? ఐతే మాంసభక్షణని అసహ్యకరమైనదిగా భావించేవాళ్ళు ఈదేశంలో కోకొల్లలు. మీరు కొండలరావుగారు అబ్బాయి అనుకుంటాను. కమ్యూనిష్టుగా ఉండటమే అత్యంత అసహ్యకరం అని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ఒక విషయాన్ని నేను వ్యతిరేకించాలంటే అందులో పీడన ఉండాలి. స్వలింగ సంపర్కం (అసలు సంపర్కం అనేదే) ఇఛ్ఛాపూర్వకంగా చేసేది. అది కేవలం ఇరువురికి పరిమితమైన చర్య. వారిద్దరిమధ్యలోకీ దూరే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుంది?
ఇహపోతే నా గురించి... "నాదాకా వస్తేగానీ" అంటూ నేను ఎదురుచూడను. నేను ఒకదాన్ని సమర్ధించాలంటే అది నా life styleలో భాగం కానఖ్ఖర్లేదు. ఒకరు (లేదా ఇద్దరు) చేస్తున్న పనివల్ల మిగిలినవారికి ఇబ్బందిలేకపోతే -మనోభావాలు మినహా-, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరంలేదని నేను అనుకుంటాను.
ఇకపోతె.. మీరు సంస్కృతి గురించి పెద్ద వ్యాఖ్యలే చేశారు. అంటే మీరు మతం గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారడం, అలామారిన మగాళ్ళు ఇంకొక మగాడికి పిల్లలను కనడం అనేది హిందూ మైధాలజీలో ఒక recurring theme. హరిహరసుతుడయ్యప్ప దేవునిగా పూజలందుకుంటున్నాడు. ఇద్దరు రాణుల సంభోగంచేత పుట్టిన భగీరధుడు (పద్మ పురాణం ప్రకారం) గంగను దివికి దించినవాడుగా మన్ననలందుకుంటున్నాడు. మన ప్రస్తుత సమాజంలోని అసహనం మన "సంస్కృతి"లో లేదు. కాబట్టి "సంస్కృతి", "సంస్కారం" లాంటి బరువైనమాటలను కేవలం పడికట్టుపదాలుగా వాడేవారు కొంచెం ఆలోచించుకోవలసినది. స్వలింగ సంపర్కం ప్రాచీన గ్రీకులోనూ, ఇస్లామిక్ సంస్కృతికి ఆలవాలమైన ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్‌లలోనూ, బైబిల్‌లోనూ (ఆమాటకొస్తే ఈనాతికీ వాటికన్‌లోనూ) మనం విస్తృతంగా కనవచ్చు. కాబట్టి "సంస్కృతి" అన్మ్నపదం ఇక్కడ over kill.
అందుకే మనుషులకి ఇంటి పేర్లు పెట్టింది :)) నా కాలేజ్ రోజుల వరకు "అరవింద్" అంటే నేనొక్కడ్నే. ఇప్పుడిప్పుడే Parallel గా కనిపిస్తున్నారు. ఆ అరవింద్ నేను కాదండీ.
అభిలాషుగారి చచ్చుపుచ్చువాదలకి బ్లాగులో ఎవరో ఘాట్టి వాతలే వేస్తున్నారు. If I were he, I would expend my energies not be busted and thus would save my face/ass.
అభిలాష్ గారు పెట్టిన వాతలకే ఇంకా ఎవరూ తేరుకోలేదు. అలా,ఇలా ఛాలెంజులు చేసినవారు సైతం ఆయన దరిదాపులకు రావడమే మానేశారు.నోటి మాటలు,వాక్చాతుర్యం ఉంటే సరిపోదు.ఆయనతో పోరాడాలంటే శాస్త్రజ్ఞానం ఉండాలి.ఎవరో అంటూ మీరు ఆయన ఆర్టికల్స్ ని తప్పుదారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది.
మిత్రులు శుక్రాచార్యగారికి నమస్కారాలు! శాస్త్రీయ చర్చలో ధర్మగ్రంధాల “మూలము” (TEXT) నే ప్రామాణికముగా తీసికోవాలి. ఆ తరువాత అనువాదాన్నీ కొంతవరకు తీసుకోవచ్చు. “మూలము” (TEXT) తో ఘర్షించే వ్యాక్యానాలు ఏమాత్రమూ ప్రామాణికం కాజాలవన్నది మనలో ప్రతీఒక్కరూ గుర్తిచాలి శుక్రాచార్య గారూ! ఇక, పైన మీరు ఇచ్చిన వివరణ అంతా వ్యాక్యాన పూర్వకమైనదే కానీ, “మూలము” (TEXT) నుకు చెడినది కాదు! మీరు గానీ, ఇతరులు గానీ తప్పుడు వ్యాక్యానాలతో తప్పుడు విగ్రహారాధనను సమర్ధించుకోవాలే తప్ప విగ్రహారాధన ధర్మబద్ధమే అనటానికి వాంగ్మూలం (STATEMENT) రూపంలో ఒక్కగాని ఒక్క మంత్రం గాని, శ్లోకం గాని ఇప్పుడే కాదు ఎప్పటికీ చూపలేరన్నది మీ కొరకు ఒక కఠోరమైన సత్యం. తమ అసత్య విగ్రహారాధనను సత్యమని ధర్మ శాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల ద్వారా నీరూపించటానికి ప్రయత్నించే వారు అది- హిందూ-క్రైస్తవ-ముస్లిం లేక ఏ వర్గానికి చెందిన వారైనా సరే చివరికి ప్రజల మధ్య అభాసు పాలు కాక తప్పదు. ఈ క్రింది మంత్రం గురించి విగ్రహారాధన సమర్ధకులు ఏమంటారు? కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27 ఈ విధముగా ఏకేశ్వరోపాసనే చేయాలి. ఏవిధమైన విగ్రహారాధననూ చేయరాదు. అన్న విషయాన్ని “మేము” అంటే “నేను” కాదు. హిందూ-క్రైస్తవ-ముస్లిం తదితర వర్గాలకు చెందిన ఏకేశ్వరోపాసకులం! ధర్మ విరుద్ధ విగ్రహారాధనన చేసే మీకు, ఎవరో పండితులు చేసిన వ్యాఖ్యానాలను కాక, ధర్మ శాస్త్రాల “మూలము” (TEXT) ద్వారానే కాక, వాంగ్మూలం (STATEMENT) రూపంలోనూ చూపిస్తున్నామన్నది మీరు గ్రహించాలి. ఈ విధమైన ఆధార సహిత “వివరణ”ను “విమర్శ” అని అంటారా? భక్తులను స్వేచ్చాపరులుగా వివేచనాపరులుగా మలచే (కొందరు దుష్టబుద్ధిగాల పండితులచే ఉద్దేశ పూర్వకంగా దాచేసిన) వైదిక సమాచారాన్ని సర్వసామాన్యం చేయటం దుష్ప్రచారమా? శుక్రాచార్య గారూ! మా ఈ ప్రశ్నలకు పాఠకులు న్యాయంగా సమాధానం ఇవ్వాలి!
//ఇక, పైన మీరు ఇచ్చిన వివరణ అంతా వ్యాక్యాన పూర్వకమైనదే కానీ, “మూలము” (TEXT) నుకు చెడినది కాదు! //
నేను చాలా నయం, మీరైతే ఏకంగా శ్లోకాలనే మార్చేశారు. యోగషిఖోపనిషద్ లో ఆ శ్లోకం మీకు ఎక్కడ దొరికిందో చెప్పగలరా? పైన నేను యోగ షిఖోపనిషద్ లోని శ్లోకం యధాతధంగా ఇచ్చాను, ఏ సంస్కృత పండితుని దగ్గరకు వెల్లి మీరు దాన్ని అనువదిస్తారో మీ ఇష్టం. దాని నుండి మీరు మీ ఆర్టికలులో కోట్ చేసిన అర్థం ఎలా వస్తుందో చూపించండి చాలు !
ఇక వ్యాఖ్యాణాలు అన్నవి గాలిలోంచి తీసినవి కావు. ఆయా శ్లోకాల అర్థాలను విడమరిచి చెప్పినవి మాత్రమే. ఉదాహరణకు..
"There is no God, other than Allah. There is no prophet other than Mahammad" అనే వాఖ్యమును తీసుకోండి. కొంత మంది ఏమి చేస్తారంటే.. There is no god అనే వ్యాఖ్యాన్ని పట్టుకుని, ఖురాన్ దేవుడు లేడు అని చెప్పింది అంటారు. దాన్ని చదివి ఖురాన్ చదివిన వారు మొత్తం వాఖ్యమంతా ఇచ్చి, There is no god అంటే అర్థం దేవుడు లేడని కాదు, వాక్యం పూర్తిగా చూడండి అని చెబుతారు. నేను ప్రస్తుతం చేసిన పని కూడా అదే.
మీరు ఏదో ఒక శ్లోకం తీసుకుని దేవుడు నిరాకారుడు అని చెప్పారు. నేను దాని తరువాత వచ్చిన శ్లోకాన్ని కూడా చూపించి, నిరాకారుడే కానీ, makes use of all faces, heads and necks in this world అని చెప్పారు చూడండి అని చెబుతాను. దాన్ని మీకు ఇంకాస్త సులువుగా అర్థమవ్వడానికి.. ఆయన నిరాకారుడు కాబట్టే, ఏరూపములోకి అయినా రాగలడు అని చెబుతాను. అంతే తప్ప నేను శ్లోకాలను వక్రీకరించడం లేదు. పైన ఇచ్చిన శ్లోకాలను ఏ సంస్కృత పండితుడి దగ్గరకు వెలతారో మీ ఇష్టం, వెల్లి నేను చెప్పినది తప్పని నిరూపించండి. అంతే కానీ, నాపై అనవసర నిందారోపణలు చేయకండి.
హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు. నిరాకారుడు అని చెప్పిన వెంటనే .. దానికి వివరణ కుడా ఇచ్చుకున్నారు. ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్న వారే అభాసుపాలవుతున్నారు తప్ప మరేమీ కాదు.
మీరు ఏ మంత్రం ఆధారం సరిగా లేదని చెప్పారో దానిని గమనించి, మీకు తెలపగాలను. "There is no God, other than Allah అంటే- “ఏ దేవుడూ లేడు ఒక్క సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు తప్ప” అన్నది నిజమే. కాని, “There is no prophet other than Mahammad" అని మీరు పేర్కొన్నది మాత్రం పూర్తిగా తప్పు. అలాంటి పంక్తి యావత్ ఇస్లామీయ వాఙ్మయంలో ఎక్కడాలేదు! దీనికి ఖురాన్ చెప్పేదేమిటంటే- “There are number of prophets Mahammad is one of the prophets" అన్నది.
ఆయినా మీరు నాకు పైవిధమైన వివరణ ఇవ్వటానికి నేను ఈ విగ్రహారాధన ఇస్లాం ప్రకారం తప్పు, మీరు ఎందుకు చేస్తున్నారూ? అని నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు కదా శుక్రాచార్య గారూ!
అయితే ఈ ప్రశ్నను అమాయిక ముస్లిములతో విగ్రహారాధన చేయిస్తూ వారిని దోచుకుంటున్న వంచకులైన ముల్లాలకు వేస్తున్నాను. అలాగే యేసు దేవుడు, మరియమ్మ దేవత అని ఒక్కగాని ఒక్క “పదం” పూర్తి బైబిలు గ్రంధంలో కనీసం మచ్చుకైనా లేకపోయినప్పటికీ అమాయిక క్రైస్తవ ప్రజానీకాన్ని ఈ విగ్రహారాధనను అడ్డం పెట్టుకొని అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్న క్రైస్తవ బోధకులనూ ప్రశ్నిస్తున్నాను.
అయితే అన్నిరకాల విగ్రహారాధనలను ఒక్కపెట్టున ఖండించి, కేవలం ఒకే ఒక్క ఏకేశ్వరోపాసనను సుస్పష్టంగా బహిరంగంగా సమర్ధిస్తున్న ఈ క్రింది మంత్రం గురించి మీ వ్యాఖ్యానం ఏమిటో చెప్పలేదు.
కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27
పై మంత్రం ఇస్తున్న సమాచారాన్ని కాస్త జాగ్రత్తగా గమనించగలరు. ఒకటి- ప్రథమ పురుషములో సాక్షాత్తు సర్వేశ్వరుడే స్వయంగా మాటలాడటం. రెండు- “ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు” భ్రమకు గురిచేసే ఒక దుష్టశక్తి పేరే “మాయ”. ఆ “మాయ” కలిపించే భ్రమకు గురైన వారే ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధనను చేయిస్తారని చెప్పటం. మూడు- వారు ఆ ధర్మ విరుద్ధ చేష్టకు పాల్పడటానికి గల కారణం పొట్టకూటి కొరకు కాకుల మాదిరిగా తయారవటం. నాలుగు- ఈ విగ్రహారాధన ముక్తిని పొందనివ్వక జన్మల చక్రంలో నెట్టేస్తుందన్నది. ఐదు- సర్వోన్నతుడైన సర్వేశ్వరుడిని హృదయమందే అర్చించాలన్నది. ఆరు- బాహ్యార్చన చేయరాదన్నది. ఏడు- తద్వారా మాత్రమే మోక్షప్రాప్తి సిద్ధించగలదన్నది.
విగ్రహారాధన ధర్మ విరుద్ధం అనటానికి పై మంత్రం సరిపోదా శుక్రాచార్య గారూ! ఇలాంటి, ఇంకా తీవ్రంగా విగ్రహారాధనను ఖండిస్తున్న శ్లోకాలూ, మంత్రాలూ పాఠకుల ముందుకు రానున్నాయి.
మీరు రాసింది మీరే ఒక సారి చదువుకోండి. విగ్రహారాధన అనేది పునర్జన్మ, భోగకరిలకు కారణం అని చెప్పారు. అంతే కానీ, మహా పాపం నరకమునకు పోయెదరని చెప్పలేదు. హిందూ మతానికి, ఇస్లాముకు అదే తేడా. ఇస్లాం అయితే విగ్రహారాధన మహాపాపమని, నిషిద్దమని అంటుంది. కానీ, హిందు మతం దాన్ని అంగీకరిస్తుంది. ఈ ఉపనిషద్ లో కూడా అదే చెప్పడం జరిగింది. ఒకవేల భక్తుడు పునర్జన్మ అనేది లేకుండా ఉండాలనుకుంటే, ఆత్మను పూజించండి అని చెప్పబడి ఉంది. కానీ, నిషిద్దం.. చేయకండి అని చెప్పలేదు. ఇక్కడే కాదు, వేదాలలో కానీ, భగవద్గీతలో కానీ ఎక్కడా నిషిద్దం అని చెప్పలేదు. ఫలితాలు వేరుగా ఉంటాయి అన్నట్లుగా మాత్రమే చెప్పబడి ఉంది.
విశేషజ్ఞగారూ! నాకు కేవలం అభిలాష్ గారూ మాత్రమే గౌరవనీయులుకాదు. సాక్ష్యం తాలూకూ అన్నీ సర్వీసులలో పాల్గొన్న నా బ్లాగుల వీక్షకులందరి పట్ల నాకు గౌరవభావం ఉంది మీతో సహా. ఇకపోతే ఈ రచ్చబండ కేవలం విషయ అవగాహన కొరకు ఏర్పడిన చర్చా వేదిక మాత్రమే!
నిజమే “కాల్పనిక హిందూ మతా”నికి “కాల్పనిక ఇస్లాం మతా”నికి అలాగే “కాల్పనిక క్రైస్తవ మతా”నికి మీరు అన్నట్టు “తేడా ఉంటుంది”. ఎందుకంటే- వాటిని నిర్మించింది స్వార్ధ పారులూ సంకుచిత స్వభావులూ అయిన శాస్త్రులు. వారు ఆ మతాలను ప్రజల బ్రతుకులను నాశనం చేసి, తమ స్వలాభం కొరకు నిర్మించు కొన్నవి కనుక. కాని, నిస్వార్ధపరుడూ విశాలహృదయుడూ అయిన సర్వోన్నత సర్వేశ్వరుడు కేవలం “సకల మానవాళి విశాల హితం” కొరకు నిర్మించిన సనాతన ధర్మం-ఇస్లాం ధర్మం-క్రైస్తవ ధర్మం వివిధ భాషలనుబట్టి వివిధ పేర్లతో పిలువబడుతున్న ధర్మం అయితే ఒక్కటే! అందులో “తేడా ఉండదు”. ఆ “విశ్వజనీన ధర్మం” శాస్త్రాలలో ఉంది. ఆ ధర్మ శాస్త్రాలను దుష్ట బుద్ధిగల శాస్త్రులు సామాన్య ప్రజలకు అందకుండా మరుగు పరిచేసారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా ప్రజల ముందు కేవలం వాటి పేరు చెప్పి, తమ కాల్పనిక తప్పుడు బోధలు చెలామణీ చేస్తుకుంటున్నారు. సర్వజన హితకారి అయిన ఆ “విశ్వజనీన ధర్మం” బయటకు రావటం నేటి ఏ మత వర్గపు పండితునికీ ఇష్టం లేదు. ఆది కనుక బయటకు వస్తే ఈ దుష్ట పండితుల బండారం బట్టబైలు అయి వారు బజారున పడక తప్పాదు!
కనుక, మీ లాంటి ఉత్తములు మా హిందూ ధర్మం, మీ ఇస్లాం ధర్మం, వారి క్రైస్తవ ధర్మం వంటి వేర్పాటు వాదాన్ని తగ్గించాలే తప్ప పెంచకూడదు. మీరు ఈ క్రింది మంత్రంలోని అసలు విషయాన్ని దాటవేశారు.
కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27 సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు పై మంత్రంలో విగ్రహారాధనకు అనుమతి ఇస్తున్నాడా? నిషేధిస్తున్నాడా? విగ్రహారాధనను చేయించే వారు దుష్టశక్తి అయిన “మాయదారి మాయ”కు లోనైనా వారే అని సర్వేశ్వరుడు స్వయంగా చెబుతున్నది వాస్తవం కాదా? అలాగే ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధనను చేయించటానికి కారణం- పొట్టకూటికి కాకుల్లా మారటం అని సర్వేశ్వరుడే స్వయంగా చెబుతున్నది సత్యం కాదా? విగ్రహారాధకులకు ముక్తి లభించదు అని సర్వేశ్వరుడే స్వయంగా ప్రకటిస్తున్నది యథార్థం కాదా? ఈ క్రింది మంత్రం విగ్రహారాదకుల గురించి చెప్పే దానిని మీరు కాదనగలరా?
శివుడు (సర్వేశ్వరుడు) దేహమందుండగా, మూఢుడు తీర్ధమందు, దానమందు, జపమందు, యజ్ఞమందు కాష్ఠమందు, పాషాణమందు (విగ్రహమందు), సర్వేశ్వరుని చూచును. లోపలనున్న నన్ను (సర్వేశ్వరుని) వదలి బయటనున్న శివుని యెవడు సేవించునో వాడు చేతిలో (అన్నం) ముద్దను వదలి, మోచేతిని నాకినట్లే. యోగులు సర్వేశ్వరుని ఆత్మయందే చూతురు. ప్రతిమ (విగ్రహము) లందు కాదు. – దర్శోపనిషత్ 4:5
ఈ మంత్రం ప్రకారం విగ్రహారాధకులు చేతిలో ఉన్న అన్నం ముద్దను వదలి మోచేతిని నాకే మూఢులన్నది వాస్తవం కాదా? సర్వేశ్వరుని చూడవలసింది ఆత్మలోనే కాని, విగ్రహంలో కాదన్నది యథార్థం కాదా?
పాషాణమందు (విగ్రహమందు), సర్వేశ్వరుని చూచు వాడు మూఢుడు. దీనిని బట్టి- పండితులు ప్రజలచే విగ్రహారాధన చేయించేది వారిని ఎల్లప్పుడూ మూఢులుగా ఉంచటానికేనని అర్థం అవుతుంది. ఆత్మయందు సర్వేశ్వరుని చూచు వాడు యోగి. దీని ప్రకారం- ప్రజలచే విగ్రహారాధన మాన్పించి, వారిని ఎప్పటికీ యోగులుగా మార్చే ఉద్దేశ్యం పండితులకు లేదని సుస్పష్టం అవుతుంది.
మన దేశంలో హోమోసెక్స్‌ని సమర్థించేవాళ్ళు నిజంగా ఇంత మంది ఉన్నారా? చిన్నప్పుడు నేను నా కంటే వయసులో నాలుగేళ్ళు పెద్దైన అమ్మాయిని ప్రేమిస్తేనే మా బంధువులు అభ్యంతరం చెప్పారు. మన దేశంలో స్త్రీకి భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకునే హక్కు లేదు, స్త్రీకి ఆమె కంటే వయసులో చిన్నవాణ్ణి పెళ్ళి చేసుకునే హక్కూ లేదు. మీరేమో హోమోసెక్స్ చేసే హక్కు గురించి చర్చిస్తున్నారు. అమ్మాయి అందగత్తె అయితే, ఆమె భర్త చనిపోయిన స్త్రీ అయినా ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటారు, ఆమె అబ్బాయి కంటే నాలుగైదేళ్ళు పెద్దైనా పర్వాలేదనుకునేవాళ్ళు ఉంటారు. కానీ హోమోసెక్స్‌కి ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు బ్లాగుల్లో కాకుండా నిజజీవితంలో ఎక్కడైనా ఉన్నారా? మీలో ఎవడైనా "ఆడది దొరక్కపోతే మగాణ్ణి పెళ్ళి చేసుకుంటాను" అని నిజజీవితంలో commitment పెట్టుకోగలడా? ఆచరించని సూక్తులు అబద్దాలతో సమానమని బెంజమిన్ ఫ్రాంక్లీన్ ఊరికే అనలేదు.
అన్నా నీకో దండమే ! అందరి తరపునా నేను వకాల్తా పుచ్చుకోలేను కానీ, జెనరలుగా విషయం చెప్పగలను. చాలా మంది స్వలింగ సంపర్కుల హక్కులను సమర్ధిస్తున్నది వాళ్ళు స్వలింగ సంపర్కులు అయ్యుండబట్టి కాదు. తమ తోటి ప్రజల హక్కులను గౌరవించాలన్న చిన్న ఫీలింగ్ తోటి. నా వరకు నేను.. ప్రపంచములోని అమ్మాయిలందరూ చచ్చిపోయి, కేవలం మగాళ్ళు మాత్రమే మిగిలిన పరిస్థితి వచ్చినా .. హోమో సెక్సు జోలికి మాత్రం పోను. At the same time, ప్రపంచములో అందరూ భయపడుతున్నట్లు hetero sexual రిలేషన్స్ అంతరించి పోయినా, homosexuals హక్కులను అడ్డుకుంటామంటే వ్యతిరేకించకుండా ఉండలేను. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. లేదు, హోమోసెక్సువాలిటీని సమర్ధించాలంటే.. ఖచ్ఛితంగా హోమో సెక్సువల్ అయ్యుండాలి లేదంటే.. అవకాశం వస్తే అవ్వాలి అనుకుంటే.. మీ ఇష్టం. ఇంతే సంగతులు, చిత్తగించవలెను.
హోమోసెక్స్ చేసేవాళ్ళ హక్కుని అడ్డుకోవలసిన అవసరం నాకు లేదు. హోమోసెక్స్ చేసుకునేవాళ్ళు నా పక్కింటిలో ఉంటే వాళ్ళ మీద పోలీస్ స్తేషన్‌లో అసహజ లైంగిక చర్య అనే కేస్ పెట్టాలని కోరను. హోమోసెక్స్ చేసేవాళ్ళు తమ పని తాము చేసుకోకుండా, తమ హక్కులని గుర్తించాలి అంటూ అస్తిత్వవాదుల్లా పోరాటాలు చెయ్యడమే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వోహ్ లోగ్ చార్ దీవారోంకే అందర్ కర్నే వాలా కామ్‌కో చౌరస్తాయోఁమే జనతా కే సామ్‌నే publicity దేతే హై.
ఎవరు ఎవరి మధ్య లైంగీక సంబంధం పెట్టుకున్నా మీకు ఏ విధమైన అభ్యంత్రమూ లేదు. అలాంటి వారిని ఎవరైనా అడ్డుకుంటే అడ్డుపడటమే మీ జీవిత ధ్యేయం అంటారు మీరు. అంతే కాదా! అంటే లైంగీక సంబంధాలకు లింగ భేదం గాని వావివరసల భేదం గాని మీకు అక్కర లేదు. కనీసం ఏ పశువూ పాల్పడని నీచాటి నీచమైన స్వలింగ సంపర్కాన్ని మీరు నేడు సమర్ధిస్తున్నారు. రేపు ఎవరైనా ఒక పురుషుడు తన తల్లితోనో, చెల్లితోనో లేక సొంత కూతురితోనో లైంగీక సంబంధం పెట్టుకుంటే? అలాగే ఒక స్త్రీ తన తండ్రితోనో, అన్నతోనో లేక తన కొడుకుతోనో లైంగీక సంబంధం పెట్టుకుంటే? అలాంటి నీచ నికృష్ట, పశుప్రాయమైన చర్యలకు పాల్పడిన వారిని మేము అడ్డగిస్తే, అప్పుడూ మీరు మాకూ అడ్డుపడతారా? లైంగీక సంబంధాలకు ఏ ఇద్దరైనా ఒక్కటైపోవటానికి “పరస్పరం సమ్మతించటం” తప్ప మరొక “నియమము” మీ వద్ద ఏదీ లేదా శుక్రారాచార్య గారూ! లేదంటే లేదని, ఉందంటే అదేమిటో చూపగలరు.
శుక్రాచార్య, నీ వాదన శుక్రాచార్యుని ఒంటి కన్ను లాగే ఉంది. Subjectivityని వదిలి objectivity వైపు రా. నా దృష్టిలో పిన్ని వరస స్త్రీని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు కాబట్టి ఎవడైనా హిందూ సంప్రదాయాన్ని ధిక్కరించి తనకి పిన్ని వరస అయిన స్త్రీని పెళ్ళి చేసుకుంటే నేను అతనికి solidarity తెలుపుతాను. నా నిజ జీవితంలోనే పిన్ని వరసైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కాబట్టి అదే పని వేరేవాళ్ళు చేస్తే నేను అభ్యంతరం చెప్పను. కానీ హోమోసెక్స్ చేసేవాళ్ళ హక్కులు గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేమిటి? వాళ్ళు హోమోసెక్స్ చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు కానీ దానికి నా ఆమోదమో, ఇతరుల ఆమోదమో వాళ్ళకి అవసరం లేదు.
నీది ఒంటి కన్నో, మెల్ల కన్నో నాకు తెలియదు. సెక్స్ వాంఛలు అనేవి ఆడ-మగ మధ్య కలుగుతాయి తప్ప ఒక మతం ఏర్పాటు చేసిన వరసల ఆధారంగా కలగవు, హిందువులు ఏర్పాటు చేసిన గోత్రాల ఆధారంగా అయితే అంతకన్నా కలగవు.
ఇందాక నేను బయట ఉండడం వల్ల మైక్రోమాక్స్ ఫోన్‌లో తెలుగు వ్రాయలేక ఇంగ్లిష్‌లో వ్రాసాను. Incestని హిందీలో వ్యభిచార్ అంటారు. కానీ తెలుగులో వ్యభిచారం అనే పదాన్ని వేశ్యావృత్తి అనే అర్థంతో వాడుతారు. హిందీలో వ్యభిచార్ మరియు వేశ్యావృత్తి వేరువేరు అర్థాలు ఉన్న పదాలు. డబ్బులు తీసుకుని సెక్స్ చెయ్యడం సంస్కారం కాదు కనుక వేశ్యావృత్తిని నేను వ్యతిరేకిస్తాను. నిషిద్ధ వరసలవాళ్ళతో సెక్స్ చేసేవాళ్ళు డబ్బులు తీసుకుని అది చెయ్యరు కదా, దానిపై అభ్యంతరం ఎందుకు ఉండాలి?
ఒరేయ్ గాడిద! చౌదరీ! నీ ఖురాన్ ప్రకారం నిష్కల్మషమైన జంతువులు incestకి పాల్పడడం లేదూ? గుండెలమీద చెయ్యేసుకొని చెప్పు. మహమ్మద్ చేసినది incestకాదని ఒక అరబ్బుతోటి చెప్పించు. దాన్ని దాటవేసే నువ్వు నాకు నీతులు చెబుతావా?
tu kisi bhi carca mein hone laayak naheeN ho. ye maan kar hame tang karnaa chchoD do.
అభిలాషుగారు ఇంకేమీ దిక్కుతోచక moral black mailingకు దిగారన్నమాట! మరి అదే అభిలాషుగారు ప్రవక్తగారి దిర్నీతి గురించి, వారికి ప్రభువుగారు పలికిన వత్తాసు గురించి నోరెత్తరెందుకో! వారు అహ్మద్ చౌదరిగారు కనుకనా? వారికి సరిపడా balls లేకనా?
మతము, ధర్మము అనేవి కొందరు అగ్రకులస్తులు (అంటే దానికి కేవలం హిందువులే భుజాలు తడుముకోనఖ్ఖర్లేదు. మౌల్వీలూ, పాస్టర్లూ చేసే productive పని ఏమీలెదు. ఈ నాయాళ్లందరూ జనం సొమ్ముమీద తేర తిని బలిసిన నాయాళ్ళే) సృష్టించిన బూటకపు కానెప్టులు. ముస్లిములు, క్రైస్తవులూ యూదులను ఎలా చిన్నచూపు చూస్తారనది జగద్విదితం. హిందువుల సంగతి సరేసరి. ఇలాంటివాళ్ళు నైతికత గురించి ఫేకడం, మనం చదవడం, కామెంటడం.
ఈ వెధవ మతాలు తెగ అఫాలో అయిపోతున్న సమాజాల్లో మానవహక్కుల గురించి మనకు తెలిసినదే. ఇలాంటివాళ్లకు తోడుబోయిన అజ్ఞాని మనువుగాడొకడు. నాకనిపించేదేమిటంటే.. అన్ని మతాలూ ఓక్టే... అవి నిజాన్ని అంగీకరించవు. అలా అంగీకరించేకంటే.. ఒక దారి తెన్నులేని 'మానవ ప్రవృత్తికి భిన్నమైన' (ఈ మాట వాడింది మనువు గారే) పట్టుకొని వ్రేళ్ళాదుతాయి.
బాబూ నేను వందరూపాయల నోతుమీద సంతకం చేసి ఇవ్వగలను. ఇస మఝబ్ నాంకె చూతియాగిరీ జ్యాదాసెజ్యాదాతర్ తీస్ సాల్ తక్ చలేగా. ఉస్కే బాద్ ఇంకా మిజాజ్ వహీ హీఓగా జో అబ్ హోమోస్ కా హొరా.
అన్ని మతాలూ ఒకటి కాదు. హిందూ మతం కంటే ఇస్లాం చాలా నయం. ముస్లింలు, యూదులు స్త్రీకి భర్త చనిపోయిన మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. హిందువులలో అయితే స్త్రీకి భర్త చనిపోయిన పదో రోజే గాజులు పగలగొడతారు.
ఆ మధ్య తెలంగాణా ప్రభుత్వం తమ రాష్ట్రంలో భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీలు ఎంత మంది ఉన్నారో సర్వే చెయ్యాలనుకుంది. ప్రభుత్వం విధవా వివాహాల గురించి ఎంక్వైరీలు చేస్తోంది అంటూ తెలుగు దేశం నాయకులు అభ్యంతరం చెప్పారు, విధవా వివాహం అనేది వినకూడని పదం అన్నట్టు. ఉద్యోగం ఉన్న స్త్రీలకీ, రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీలకీ వితంతు ఫించన్ ఇవ్వరు కాబట్టి ప్రభుత్వం ఆ సర్వే చెయ్యాలనుకుంది కానీ తెలుగు దేశం నాయకులు విధవా వివాహం పేరే ఎత్తకూడదని అభ్యంతరం చెప్పారు. వీళ్ళ కంటే ముస్లింలు చాలా నయం కదా.
హిందూ హిపోక్రిసీ గురించి ఇంకో విషయం. భోగం స్త్రీకి గ్రామంలోని మగవాళ్ళందరూ మొగుళ్ళే. గ్రామంలోని మగవాళ్ళందరూ చనిపోయినా భోగం స్త్రీకి గాజులు పగలగొట్టరు కానీ ఒక భర్తని నమ్ముకున్న పతివ్రతకే గాజులు పగలగొడతారు. ఇలాంటి అనాగరిక ఆచారాలు ఉన్న మతాని వేరే ఏ మతంతోనూ పోల్చలేము.
This is mere perspective. I could recount a hundred ways where Islam is more restrictive than any other religion (in it's current practices). Also sir! the most judgmental guys I have encountered in my regular life are Muslims. All that these guys expect from a marital relationship is someone who would never oppose them and would willingly be subjugated to them -a sex slave. Not event the software and the creative world is an exception.
నేను పుట్టినది హిందూ కుటుంబంలో కనుక నేను సాంఘిక దురాచారాలని ఎక్కువగా గమనించినది కూడా హిందూ కుటుంబాలలోనే. ఒక హిందూ పురుషుడు భోగం స్త్రీ దగ్గరకి వెళ్ళి ప్రమాదకరమైన గుప్తరోగం అంటించుకోవడానికి సిద్ధపడతాడు కానీ విధవని పెళ్ళి చేసుకుని ఆమె పిల్లలకి తండ్రి కావడానికి మాత్రం వెనుకాడుతాడు.
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. .అయితే ఒకప్పుడు హిందూ స్త్రీలు పునర్వివాహానికి వెనుకాడే పరిస్తితి ఉండేది. ఇప్పుడది లేదు. ఇతర వర్గస్తులలాగే హిందువులు కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.
ఆ దేశ చట్టాల ప్రకారం ఏది చట్టబద్దం ఏది కాదో అక్కడి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు. బయటి వారు సమర్తిస్తే ఎంత వ్యతిరేకిస్తే ఎంత!
ReplyDeleteమీరు చెప్పినది వాస్తవమే అయినప్పటికీ దాన్ని ఆధారం చేసుకుని మిగతా దేశాలు కూడా ప్రభావితమవుతాయి కదా! ఇదే జరిగితే వినాశనమే! దేవుడు ఆది నుండి పురుషులనుగాను, స్త్రీలనుగాను సృష్టించాడు. ఈ స్వలింగ సంపర్కం ప్రకృతికే విరుద్ధం.ఇదొక వికృత చ్రేష్ట.దీనిని ప్రతీవక్కరూ ఖండించవలసిందే!
Deleteముందు మీరు కోరుకున్న షరియా చట్టాలు అమెరికాలో అమలులో లేవు అన్న విషయం గుర్తించండి. దేవుడు చేసాడని చెప్పబడుతున్న నియమాలు చట్టంలో చేర్చాలా వద్దా అన్నది ఆయా దేశాలు చూసుకుంటాయి. ఎక్కడో ఏదో దేశంలో ఇచ్చిన తీర్పులో "నమ్మకస్తులలో" ఫిత్నా వస్తుందనే భయం మీకెందుకు?
Deleteషరియా చట్టాలు గురించి నాకెందుకు? దేవుడి చట్టము అని మీరు చెప్పుతున్న విషయాలు ప్రధానంగా వారికే వర్తిస్తాయి అని గమనించ గలరు.ఎందుకు అంటే నేను పేరుకొన్న వాక్యం బైబిల్ లోనిదే గదా? అమెరికా క్రైస్తవ దేశం కాదా? స్వలింగ సంపర్కం గూర్చి లేనిపోని దరిద్రాన్ని గురించి ఇతరులకు ఆలోచన కలిగించడమే.
Deleteషరియా మీకు అక్కరలేదన్నందుకు సంతోషం.
Deleteఅమెరికా క్రైస్తవ దేశం కాదు సెక్యులర్ దేశం.
Article 6: No religious Test shall ever be required as a Qualification to any Office or public Trust under the United States
Tripoli treaty article 11: As the Government of the United States of America is not, in any sense, founded on the Christian religion; as it has in itself no character of enmity against the laws, religion, or tranquillity, of Musselmen; and as the said States never have entered into any war or act of hostility against any Mehomitan nation, it is declared by the parties that no pretext arising from religious opinions shall ever produce an interruption of the harmony existing between the two countries
Amendment 1: Congress shall make no law respecting an establishment of religion, or prohibiting the free exercise thereof
వేరే దేశంలో చట్టాలు గురించి తెలిసినంత మాత్రాన మనసు చలించే దుర్భర పరిస్తితిలో ఉన్న వారికి నా ప్రగాఢ సంతాపం. మనసు అదుపులో పెట్టుకోలేని దౌర్భాగుల గురించి తపన వలదు మిత్రమా.
జైగారూ,
Deleteమీ వాదన సమంజసంగా ఉందని నా అభిప్రాయం.
(షరా: ఈ మాటకు అర్థం రచ్చబండవారితో చర్చా గోష్టికి సమయం ఇవ్వటం కాదు.)
జై గారూ శాంతించండి...
Deleteప్రస్తుతం జీవిస్తున్న మేధావుల అభిప్రాయాలకూ, మనుషుల మనోభావాలకూ ఏ విలువా ఉండదు. అదే వేల సంవత్సరాల క్రిందట పుట్టిన నిశానీగాళ్ళు చేసిన అతీమతీ లేని చట్టాలనుమాత్రం నెత్తినపెట్టుకొని ఊరేగాలి. ఇంతకంటే మీరు ఎక్కువగా వాదిస్తే మీ తలకాయ తీసేస్తాము జాగ్రత్త. హన్నా!
వాడెవడో మీకు నచ్చనిది చేస్తే, మీపాటికి మీరు "పవిత్రం"గా మీ జీవితాలు వెలగబెట్టుకోవచ్చుకదా? వాడివల్ల ప్రభావితం కావలసిన తప్పనిసరి తద్దినం మీకేమీలేదే! అంటే ప్రక్కవాడు "మంచి" పనులు చేసినంతవరకే మనకూ "మంచి" పనులు చెయ్యాలనిపిస్తుందా?
స్వలింగ సంపర్కం ప్రకృతి విరుధ్ధమా? అలాగా? మీదగ్గరున్న ఆధారాలేమిటో -నమ్మకాలుకాదు- కొంచెం వివరిస్తారా? స్వలింగ సంపర్కపుగాధలు ఏమతంలో లేవు? నాతో చెప్పింతురేమయ్యా? వాడెవడో వాడికి నచ్చినట్లు జీవిస్తే మనకెందుకు చెప్పరానిచోట నొప్పిపుట్టాలి?
హిందువులు: దేవదత్ పట్నాయక్ రాసిన "Shikhandi : And Other Tales They Don’t Tell You" తో మొదలుపెట్టండి
Deleteముస్లిములు: Why am I not a Muslimతో మొదలుపెట్టి స్వలింగ సంపర్కం అరబ్బుదేశాల్లోనే ఎక్కువన్న విషయం ఎఱుకపడేంతవరకూ చదువుతుపొండి. అన్నట్లు.. సోడొమీ మొఘలువంశ పవిత్రాచారమని మీకు తెలుసా?
క్రైస్తవులు: మీకంత శ్రమఖ్ఖర్లేదు. మీరు క్షుణ్ణంగా బైబిల్ చదవండి చాలు.
మతాలు చెప్పినదాన్ని పరిపూర్ణంగా పాటించే వారు ఎవరు?
Deleteశుక్రాచార్యగారు: నిన్న వివరించడం మర్చిపోయాను. దేవదత్ పట్నాయక్ గారి పుస్తకంలో ఒకప్పుడు హిందువులు ఎంత సహనంగా ఉండేవారు అని వివరిస్తారు. పురుషదేవతలు స్త్రీరూపమెత్తి సంచరించడం, అలా సంచరిస్తూ ఇంకొక పౌరుషుని బిడ్డకు తల్లవ్వడం వంటి పనులను అప్పట్లో ఎవ్వరూ తప్పుగా భావించలేదు. కొండొకచో అలా పుట్టిన బిడ్డలుకూడా దేవతలుగానే పూజలందుకున్నారు.
Deleteఅంతటి సహనం ఇప్పుడు ఏమయ్యింది అన్నది నాప్రశ్న.
హిందూ మత గ్రంథాలపై దేవదత్ పట్నాయక్ ఇంటెర్ ప్రిటేషన్ సుపర్ ఫిషియల్. దేశం లో ఎంతో మంది గొప్ప రచయితలు ఉన్నా, జ్ణాన పీఠ అవర్డ్ లు పొందిన వారు ఉన్నా వారి గురించి చాలా మందికి తెలియదు.అదే మీడియా వారి హైప్ వలన చేతన్ భగత్ కి ఎక్కడలెని ప్రచారం, అతనొక గొప్ప రచయిత అయినట్లు బిల్డప్. అలాగే దేవదత్ కూడాను. ఆయనను హిందు మత మేధావులు ఎవరు గొప్ప జ్ణాని అని గుర్తించరు. హిందు మైథాలజిని ఇంగ్లిష్ లో రాసుకొనె ఒక సామన్య పండితుడు. ఆయన రాసినవి టైంస్ ఆఫ్ ఇండియాలో టైంపాస్ కి చదువుకోవచ్చు. అంతే. హిందువులు సహనం కోల్పోయినట్లు కమ్యునిస్ట్ మేధావుల ప్రచారం . అందులో వాస్తవం లేదు.
Deleteయుజి శ్రీరాం గారు,
Deleteమీ “హిందు మైథాలజి” గురించి కూడా ఓ ఫ్లాష్ న్యూస్…
my·thol·o·gy (noun)
1. a collection of myths
my.th (noun)
1. a traditional or legendary story, usually concerning some being or hero or event, with or without a determinable basis of fact or a natural explanation
2. any invented story, idea, or concept
3. an imaginary or fictitious thing or person.
4. an unproved or false collective belief that is used to justify a social institution.
@ఎడ్జ్, మీరు దేవదత్ ను కోట్ చేశారు.ఆయన పుస్తకాలలో హిందూ మైథాలజి గురించి రాస్తున్నాని ఆయనే చెప్పికొన్నాడు. కనుక నేను ఇక్కడ హిందూ మైథాలజిని రాయటం జరిగింది. కొనేళ్ల క్రితం సదరు దేవ్దత్ బ్లాగులో దానిని పట్టుకొని మీరెక్కడికో వెళ్లి పోయారు.
Deleteదేవదత్ ఒక కార్పోరేట్ బాయ్. బిగ్ బజార్ కిషోర్ బియని, దేవదత్ పట్నాయక్ తో కలసి పనిచేసిన వాళ్ల సెమినార్ కి అటెండ్ అవటం జరిగింది. ఆయన బోర్డ్ మీటింగ్ లో ఏవిధం గా వాల్యు యాడ్ చేస్తాడో చెప్పారు. ఆయన రాసిన పుస్తకాలు చదివాను. అతనితో కలసి పనిచేసిన వారి అనుభవాలు విన్నాను. ఆయన గురించి ఒక అవగాహన ఉంది.
మేధావులు అని ఎవరైతే చెప్పబడుతున్నారో వారిలోకన్నా "సామాన్య పండితు"లలోనే నాకు consistancy కనబడింది. మనరాస్ట్రంలోనే ప్రవచనాలపేర చక్రవర్తి బిరుదాంకుతులైన ఒక పెద్దాయన చెప్పేవి అటు నిఖార్సైన హిందువులు, ఇటు బుర్రపెట్టి independentగా ఆలోచించగలిగినవాళ్ళూకూడా జీర్ణించుకోలేరు.
Deleteమీరు మీ "మేధావుల" లిస్టొకటివ్వండి సార్. కొంచెం ఆసక్తిగా ఉన్నాను.
శ్రీరాం... EDGE వేరు నేను వేరు. మీ భ్రమలకు మిమ్మల్ని వదిలేస్తున్నాను.
Deleteదేవదత్ హిందూఇజాన్ని విమర్శించినట్లు నేనెక్కడా చదవలేదు. ఆయన పుస్తకాలు హిందూఇజమ్మీద నాకు సదభిప్రాయాన్నే కలిగించాయి. నావరకు నాకు ఒక పుస్తకాన్ని రాసేముందు అయన చేసే research నచ్చుతుంది. మీ అవగాహనను పంచుకొని మమల్ని convince చెయ్యగలరని ఆశిస్తూ...
విశేషజ్ఞ
@విశేషజ్ఞ విశేషజ్ఞ,
Deleteహిందూ మతములో సహనం ఏ కాలములో ఉండాల్సినది ఆ కాలములో ఉంటూనే ఉంది. ఒకప్పుడు పురుషులు ఎంతమందినైనా పెళ్ళిచేసుకోవచ్చు. ఆ కాళములోనే స్త్రీలు ఇలా సూర్యున్ని చూసి, చంద్రున్ని చూసి పిల్లలను కనేవారు. కాబట్టి, బ్యాలన్సయ్యేది. ఈ కాలములో అలా కాదు కదండి? మగాడు ఏకపత్నీ వ్రతుడిలా ఉండాల్సిందే. ఉండకపోతే నేరమంటుంది చట్టం. అప్పటికీ, స్త్రీ పతివ్రత అయ్యుండక్కర్లేదు. చట్టం ప్రకారం స్త్రీ అక్రమ సంబంధం కలిగి ఉండడన్ నేరం కాదు. ఇంతకంటే ... సహనం మనం ఎలా ఆశించగలం చెప్పండి??
సహనం హిందూ సమాజంలో మాత్రం ఉన్నదని నేను అనుకోవడంలేదు. వారు ఘనంగా రాసుకున్న పుస్తకాలలో ఉండుంటే ఉండొచ్చుగాక. హరిహరసుతుణ్ణి దేవునిగా కొలిచే హిందువులే స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తారు. కృష్ణుణ్ణి సైతం కొలవగల హిందువులే వాలెంటైన్స్‌డేని వ్యతిరేకిస్తూ కర్రచేతిలోకి తీసుకుంటారు. న్యూయియర్‌ను వ్యతిరేకింఛే మేధావులకు, యోగాకూడా ఒక కార్పొరేట్ సాంప్రదాయమేననీ, అదికూడా ఒక దినోత్సవమేననీ పట్టదు.
DeleteHinduism is not even a morsel better than Islam or Christianity. Unless we are freed from these doctrines, we will blow ourselves up and will serve ourselves up as good examples to other civilization that might be flourishing on other planetary systems.
నేను దాదాపుగా 14 సంవత్సరములనుండి CHURCH లో ప్రకటిస్తున్న అమెరికా క్రైస్తవ దేశం కాదు అని మరియు రోమన్ క్యాథలిక్కులు క్రైస్తవులు కాదని.అమెరికా 80 పెర్సెంట్ క్యాథలిక్ COUNTRY.రోమన్ క్యాథలిక్లకు క్రైస్తవులకు చాలా భేదం వుంది.గమనించగలరు.
DeleteJai,
ReplyDeleteIt’s always a pleasure to see ignorance being devastated with so much ease and clarity. Right on, brother!
చౌదరిగారు, మీకో ఫ్లాష్ న్యూస్… ఆమ్రికా క్రైస్తవ దేశం కాదు, భారద్దేశం హిందూ దేశమూ కాదు. రోజువారీ ధర్మశాస్త్రాల డోసు బాగా తగ్గించి, విజ్ఞానశాస్త్రాల మోతాదు కొద్దికొద్దిగా పెంచుకుంటూ పొండి. త్వరలోనే కోలుకుంటారు.
EDGE గారికి నమష్కారములు,
Deleteఒకటి తగ్గించి,మరొకటి పెంచడం అనేది ఏమి ఉండదు.రెండూ సమన్వయం కలిగే ఉంటాయి.
Really?? సమన్వయం??
Deleteఆమాటకి అర్ధం మీకు తెలీదని నాకు ఇప్పటిదాకా తెలీదు.
మీరాతలన్నీ అటూ ఇటూగాని రాతలు. మీరాతలు వేదజ్ఞులూ అంగీకరించరు. అటు ముస్లిములూ అంగీకరించరు. ఇహ మండి. అహమ్మద్ గారు వ్రాసే ఆంగ్ల "కవిత"ల్లో adjectiveకీ nounకీ తేడా కనబడదు. మళ్ళీ ఆయన అంత్య ప్రాసలోతప్పితే వేరే ఇంకే చందస్సులోనూ వ్రాయరు.
చాలా మంచిగా చెప్పారు Edge గారు.మీరన్నట్టు అమెరికా క్రైస్తవ దేశం కాదు, ఇండియా హిందూ దేశం కాదు.అయితే,మొదట వున్నది ధర్మశాస్త్రం,ఆ తర్వాతే విజ్ఞాన శాస్త్రం.ఇది నా అభిప్రాయము.
Deleteశ్యామళీయంగారు, విశేషజ్ఞ గారు స్వలింగసంపర్కం సమర్ధిస్తున్నారా? ఇది ప్రకృతి విరుద్ధం కాదంటారా?
ReplyDeleteశ్యామలీయం గారు "షరా: ఈ మాటకు అర్థం రచ్చబండవారితో చర్చా గోష్టికి సమయం ఇవ్వటం కాదు" అన్నారు. పైగా వారి వ్యాఖ్య నన్ను ఉద్దేశించి చేసారు తప్ప విశేషజ్ఞ విశేషజ్ఞ గారిని కాదు. వారిని ఈ చర్చలో ఈడ్చాలనే ప్రయత్నం ఎందుకండీ?
Deleteస్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధమే. కాని ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఎన్ని పనులు జరగడం లేదు?
Deleteరంజాన్ నెలలో, కొన్ని హిందూ, జైన పండగల్లో కడుపు మాడ్చుకుని ఉపవాసాలుండడం ప్రకృతి సహజమా?
కలుషితమైన జలాల్లొ భక్తి, బాప్టిజం పేరుతో మునగడం సరైన పద్ధతా?
పండగలకు, పబ్బాలకు ఆజాన్‌లకు, ప్రార్ధనలకు 10000 వాట్‌ల మైక్ సెట్లు పెట్టి ఊదరగొట్టడం సహజ ప్రకృతా?
ఒకే భార్య ఉండాలి అనడం, నలుగురివరకూ చేసుకోవచ్చనడం, వీటిలో ఏది ప్రకృతి సహజం?
బుర్ఖా ధరించాలనడం ఏవిధమైన ప్రకృతి న్యాయం?
ఇంకా మాతం చేసుకోవడం, శిలువ వేసుకోవడం, ఇలా ఎన్నో కనపడతాయి.
వీటన్నిటికీ వర్తించని ప్రకృతి సహజత్వం దీనికే ఎందుకు అడ్డు వస్తుంది?
శ్యామలీయంగారిని ఈడ్చాల్సిన అవసరం దేనికి జై గారు.వారు చర్చలలో పాల్గొని మరిన్ని విషయాలు తెలియజేస్తే అందరికీ ఉపయోగం.అయినా సరైన చర్చకు వస్తున్నప్పుడు ఆయన ప్రక్కకు వెళ్లిపోవడం షరా మామూలే గదా సర్?
Deleteశ్రీకాంతచారిగారు..మీరు పేర్కొన్నవాటిలో అన్నీ ప్రకృతికి విరుద్ధంగా జమకట్టలేము సర్!
Deleteఅన్నీ కాదు అంటే కొన్ని అవుననేగదా? మరి వాటిని మతం ఎందుకు అంగీకరించింది?
Deleteసమాజ పరిణామ క్రమానికి అనుగుణంగా కొన్ని మార్పులు జరుగుతూనే వుంటాయి. మతానికి అనుగుణంగా ఉంటే ఒకలాగ, లేకుంటే మరొకలాగ వ్యాఖ్యానించడం తగదు.
స్వలింగ సంపర్కం ప్రకృతి విరుధ్ధమనే అభిప్రాయానికి మీరెలా వచ్చారో తెలుసుకోవచ్చా? స్వలింగ సంపర్కం జంతుప్రపంచంలో కనబడే విషయమే (ఇప్పుడది జంతు ప్రవృత్తి అంటూ చెప్పకండి దయచేసి). ఒకవేళ ఇది అసహజమే అనుకున్నా అరవయ్యేఖ్ళ్ళ షేకులు పదమూదు పద్నాలుగేళ్ల పిల్లల్ని పెళ్ళిచేసుకొనడమేమిటి? ఇదిమాత్రం ప్రకృతి సహజమేం? ఆదర్శపురుషుడు పన్నెండేళ్లపిల్లతో సంభోగంచెయ్యడమేమిటి? అదిమాత్రం ఆదర్శమేం?
ReplyDeleteనేను సమర్ధిస్తున్నది వ్యక్తి స్వేఛ్ఛను. స్వలింగసంపర్కులేమీ తలుపులు మూసుకొని ఎక్కడ దోపిడీలు చేద్దాం, ఎక్కడ బాంబులు పెడదాం అని మల్లగుల్లాలు పడడంలేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతికితే మనకు కలిగే నష్టమేమీలేదు. వాళ్లందరూ మనకు నచ్చినవిధంగానే బ్రతకాలని బెదిరించడానికి మనకున్న హక్కేమిటి అధికారమేమిటి? ఇంకొకరి జీవితాన్నీ, అలవాట్లనీ శాశించాలన్న ఈ 'కుతి' ఏమిటి? మెజారిటీల అలవాట్లే ప్రకృతి సహజమాఇనవా? అసలు ప్రకృతి సహజం అన్నదాన్ని ఎలా నిర్వచిస్తారు?
"నేను సమర్ధిస్తున్నది వ్యక్తి స్వేఛ్ఛను. స్వలింగసంపర్కులేమీ తలుపులు మూసుకొని ఎక్కడ దోపిడీలు చేద్దాం, ఎక్కడ బాంబులు పెడదాం అని మల్లగుల్లాలు పడడంలేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతికితే మనకు కలిగే నష్టమేమీలేదు. వాళ్లందరూ మనకు నచ్చినవిధంగానే బ్రతకాలని బెదిరించడానికి మనకున్న హక్కేమిటి అధికారమేమిటి? ఇంకొకరి జీవితాన్నీ, అలవాట్లనీ శాశించాలన్న ఈ 'కుతి' ఏమిటి? మెజారిటీల అలవాట్లే ప్రకృతి సహజమాఇనవా? అసలు ప్రకృతి సహజం అన్నదాన్ని ఎలా నిర్వచిస్తారు?"
DeleteWell said!
"నేను సమర్ధిస్తున్నది వ్యక్తి స్వేఛ్ఛను. స్వలింగసంపర్కులేమీ తలుపులు మూసుకొని ఎక్కడ దోపిడీలు చేద్దాం, ఎక్కడ బాంబులు పెడదాం అని మల్లగుల్లాలు పడడంలేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతికితే మనకు కలిగే నష్టమేమీలేదు. వాళ్లందరూ మనకు నచ్చినవిధంగానే బ్రతకాలని బెదిరించడానికి మనకున్న హక్కేమిటి అధికారమేమిటి? ఇంకొకరి జీవితాన్నీ, అలవాట్లనీ శాశించాలన్న ఈ 'కుతి' ఏమిటి? మెజారిటీల అలవాట్లే ప్రకృతి సహజమాఇనవా? అసలు ప్రకృతి సహజం అన్నదాన్ని ఎలా నిర్వచిస్తారు?"
DeleteWell said!
నేను సింపుల్ గా ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నాను.ప్రపంచ దేశాలన్నీ కలసి ఈ స్వలింగ సంపర్కుల మీద ఏళ్ల తరబడి ఎన్ని చర్చలు జరిపిన,రాబోవు రోజులలో అన్ని దేశాలలో వారికొరకు చట్టం తీసుకు రావటాన్ని ఎవరు ఆపలేరు.అటువంటిది ఇక్కడ చర్చ చేసి ఉపయోగమేమిటి?
Deleteచౌదరిగారు,
ReplyDeleteస్వలింగ సంపర్కం ప్రకృతి సహజమా కాదా అని తెలుసుకోవాలంటే చదవాల్సింది ధర్మశాస్త్రాలు కాదు… జీవశాస్త్రము, పరిణామ సిద్ధాంతం లాంటి విజ్ఞాన శాస్త్రాలు. కొంచం జటిలమైన విషయం, మీకు ఆసక్తి ఉంటే తప్పక చర్చిద్దాం.
ఈ లోపు మీబోటి మేధావులు మాబోటి సామాన్యులు అందరము ఖచ్చితంగా అంగీకరించే ఒక సులభమైన విషయం… పురుషాంగానికి శిశ్నాగ్రచర్మము(foreskin on penis) పుట్టుకతో అతి సహజంగా వచ్చింది కదా. మరి, మీ ధర్మశాస్త్రం ప్రకారం ఆ శిశ్నాగ్రచర్మాన్ని కోసేస్తారెందుకు? అది ప్రకృతి విరుద్ధం కదా?
You nailed it bro!
DeleteWhy doesn't the Maker who is so obsessed with the foreskin make the man without it?
Kudos to you!
అమెరికాలో స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేయడం సమర్ధనీయమేనా?
ReplyDeleteసమర్ధనీయమే.
“సమర్ధనీయమే.”
Deleteబాగా చెప్పారు :)
Just for the sake of clarity:
అమెరికాలో స్వలింగ సంపర్కం కొత్తగా ఇప్పుడే ఏమి చట్టబద్ధం చేయబడలేదు, అదెప్పటినుంచో ఉన్నదే. స్వలింగ వివాహాలు చట్టబద్ధమే అని supreme court ఇప్పుడు స్పృష్టం చేసింది.
స్వలింగ సంపర్కుల వివాహాలు కూడా అనేక అమెరికా రాష్ట్ర్రాలలో (మరియు ఎన్నో ఐరోపా దేశాలలో) చట్టబద్దమే. ప్రస్తుతం చర్చిస్తున్న తీర్పు అమెరికా దేశమంతటికీ వర్తిస్తుంది తప్ప ఇతరత్రా కొత్తేమీ కాదు.
Deleteనేను,బైబిలులో దేవుని మాటను బట్టి చెప్తున్నాను.స్వలింగ సంపర్కాన్ని మొట్ట మొదట వ్యతిరేకించి దేవుడే..మానవుడు కాదు.ఈ స్వలింగ సంపర్కమే కాకుండా జంతు సంపర్కము కూడా దేవుడు వ్యతిరేకించారు.అయితే ఇప్పుడు ప్రస్తుత స్థితి,బైబిలులో వ్రాయబడినట్టు మృత సముద్రము దగ్గర నున్న ఆనాటి సోదోమో గోమోర్రో అనే రెండు పట్టణాలు పూర్తిగా స్వలింగ సంపర్కులున్న పట్టణాలు.వాటిని దేవుడు అగ్నితో కాల్చి నాశనం చేస్తాడు.అయితే అక్కడ ఆ స్వలింగ సంపర్కుల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకున్న లోతు అనే పేరు కలిగిన నీతిమంతుడు మాత్రము దేవునిచేత రక్షించబడి ఆ పట్టణాలను వదిలి బయటకు వస్తాడు.ఓకే ఆ చాప్టర్ క్లోస్.ఇప్పుడు అవే పరిస్థితులు వస్తాయని యేసు క్రీస్తు ముందుగానే ప్రకటించాచు.లూకా 17:28 లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
Delete29 అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
30 ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును.
కాబట్టి,చర్చలతో ఈ అపవిత్ర కార్యాలు చట్టబద్దం కాకుండ మనము ఎవ్వరము ఆపలేము.మన ప్రయత్నాలు విఫలము అవుతాయి.మనం ఏమీ చెయ్యలేము.ఏమిజరగాలని వుందో అది జరుగుతుంది.
http://timesofindia.indiatimes.com/india/India-gets-first-radio-station-dedicated-to-gay-community/articleshow/23533372.cms
ReplyDeleteస్వలింగ సంపర్కంపై చర్చిస్తున్న మిత్రులందరికీ నమస్కారములు!
Deleteప్రస్తుత ప్రపంచం ప్రపంచీకరణ కారణంగా ఒక కుగ్రామంగా మారిపోయింది. కనుక ఏ మూలన ఏ కాస్త మంచి జరిగినా ఏ కాస్త చెడు సంభవించినా వాటి పరిణామాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరూ మేమూ మనమందరం కాస్త తక్కువో ఎక్కువో అనుభవించకతప్పడం లేదు కదా! కాబట్టి- విజ్ఞునులైన మనమందరమూ పరస్పరము వ్యంగ్యోక్తులు విమర్శ ప్రతివిమర్శలు లేకుండా చర్చించుకోవటంలో మన ఉమ్మడి ప్రయోజనం ఉందన్నది మనలో ఎవరికీ తేలియనిది కాదు. ఏ స్వలింగ సంపర్కం గురించి అతి సామాన్య విషయముగా కొంత మంది మాటలాడారో వారి కొడుకులలోనో, కూతుళ్ళలోనో, మనవళ్లలోనో లేక మానవరాళ్లలోనో ఆ దుష్క్రియ అలవాడితే అంతే సామాన్యంగా స్పందిచగలరా?
ఈ చర్చలో పాల్గొన్న మనం కొద్దిమందే కావచ్చు. కానీ మన ఈ చర్చలను చదివేవారూ మరియు వాటిని ప్రామాణికముగా తీసుకొని అనుసరించేవారూ వందల మంది ఉంటారు. కనుక మన చర్చలు నిర్మాణాత్మకముగానూ సందేశాత్మకముగానూ ఉంటే మనం వెచ్చించే సమయానికి అర్ధమూ పరమార్ధమూ ఉంటుందన్నది నా అభిప్రాయము. మన్నించగలరు. ముహమ్మద్. M. A. అభిలాష్. 9666 4888 77
ప్రస్తుత ప్రపంచం ప్రపంచీకరణ కారణంగా ఒక కుగ్రామంగా మారిపోయింది. కనుక ఏ మూలన ఏ కాస్త మంచి జరిగినా ఏ కాస్త చెడు సంభవించినా వాటి పరిణామాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరూ మేమూ మనమందరం కాస్త తక్కువో ఎక్కువో అనుభవించకతప్పడం లేదు కదా!
Deleteఏ స్వలింగ సంపర్కం గురించి అతి సామాన్య విషయముగా కొంత మంది మాటలాడారో వారి కొడుకులలోనో, కూతుళ్ళలోనో, మనవళ్లలోనో లేక మానవరాళ్లలోనో ఆ దుష్క్రియ అలవాడితే అంతే సామాన్యంగా స్పందిచగలరు.
సూపర్ చెప్పారు. పురుషుడు-పురుషుడు కి, అలాగే స్త్రీలకు స్త్రీలకు మధ్య లైంగిక సంబంధాల? పైన కామెంట్లు చేసిన వారందరూ (చౌదరీలాంటి స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకించేవారు తప్ప) స్వలింగ సంపర్కం పట్ల కోరికతో ఆవురావురుమని ఉన్నారనిపిస్తోంది. ఖర్మకాలి భారతదేశంలో పుట్టారుగానీ ఆప్రాశ్చాత్య దేశాలలో పుట్టి ఉంటే వీళ్ళందరూ స్వలింగసంపార్కులయిపోదురు. ఇక్కడ గతి లేక సమర్ధించడంలో ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్యం? స్వలింగసంపర్కాన్ని సమర్ధింకడానికి సిగ్గు కూడా పడడం లేదు. అభిలాష్ కామెంట్ ఆలోచనీయం. వీళ్ళ కూతుర్లో, కుమారులో స్వలింగ సంపర్కం కలిగి యుంటే గొప్పగా ప్రకటించుకుందురో, లేక కుమిలికుమిలి ఏడ్చుతూ కూర్చుందురో? పై కామెంట్లలో గొప్ప జ్ఞానులు అని చెప్పుకోడానికి ఊగుతున్నారే గాని ఇంగితజ్ఞానం గాలికొదిలేశామన్న విషయం మర్చిపోయారు.భారతదేశాన్ని అలాంటి చెత్తలోకి నెట్టే ప్రయత్నమేమో మరి!
1. స్వలింగ సంపర్కం అమెరికాతో సహా అనేక దేశాలలో ఎప్పటి నుండో చట్టబద్దం
Delete2. స్వలింగ వివాహం అమెరికాలో అనేక రాష్ట్రాలలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో ఇప్పటికే చట్టబద్దం
ప్రపంచం కుగ్రామం అయిందని మాట నిజమయితే ప్రస్తుత టపా రాసిన వారికి ఈ విషయాలు తెలిసే ఉండాలి. వారు ఇప్పుడే ఎందుకు పరిమాణాలు పరోక్ష ప్రభావం అంటున్నారు?
"విజ్ఞునులైన మనమందరమూ"
అమెరికా ఐరోపా వాళ్ళు కూడా విజ్ఞులే భాయిజాన్. మీకు నచ్చని & మీ గ్రంధం ఒప్పుకోదని మీరు అనుకుంటున్న విషయం ఆ దేశంలో చెల్లుబాటు అయినంత మాత్రాన వారు విజ్ఞులు కాకుండా పోరు.
"వారి కొడుకులలోనో, కూతుళ్ళలోనో, మనవళ్లలోనో లేక మానవరాళ్లలోనో ఆ దుష్క్రియ అలవాడితే అంతే సామాన్యంగా స్పందిచగలరా?"
ఇక్కడ సమస్య స్వలింగసంపర్కం కాదు, చట్టం & వ్యక్తిగత స్వేచ్చ. ఉ. మీ ప్రచారానికి ముగ్ధులై ఎవరయినా మతం పుచ్చుకున్నారని అనుకుందాం. వారి కుటుంబ పెద్దలు బాధ పడవోచ్చు కానీ మైనారిటీ తీరిన వారు సొంత నిర్ణయంతో చట్టబద్దమయిన చర్యను ఆపగలరా?
"ఆప్రాశ్చాత్య దేశాలలో పుట్టి ఉంటే వీళ్ళందరూ స్వలింగసంపార్కులయిపోదురు"
अब आगयेना अपनी औकाद पे!
వాదన వదిలేసి వ్యక్తిగత నిందలకు దిగడమేనా మీ మతాలు మీకు నేర్పించాయి?
@K.Aravind & M.A అభిలాష్,
Deleteచాలా సార్లు, చాలా మంది ... ఇదే పని నీ కూతురుకో, కొడుకుకో, తల్లికో లేదా చెల్లెలో చేస్తే అప్పుడు కూడా ఇలానే మాట్లడతావా.. అనో లేక, వారికి ఇలా జరిగితే నువ్వు అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా అనో అడగడం చూస్తూనే ఉంటాం. అది స్వలింగ సంపర్కం కావొచ్చు, సహజీవనం కావచ్చు లేకపోతే మరోకటి కావచ్చు. చర్చ విషయం మీద చేయకుండా, వ్యక్తిగత స్థాయిలోకి వచ్చి, ఆవ్యక్తిని ఇబ్బంది పెట్టడానికో లేక అవమానించడానికో ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అది సరికాదు..
సరే, వేసిన తరువాత సమాధానం ఎవరో ఒకరు ఇవ్వాలి కదా.. నేనిస్తాను తీసుకోండి.
ఒక వ్యక్తి, అతను మిస్టర్ X అనుకుందాం. అతను స్వలింగ సంపర్కాన్ని సమర్ధించాడు. అతని చెల్లెలు లేదా అక్కా లేక అమ్మా లేకపోతే తండ్రి లేక కుమారుడు లేక తమ్ముడు.. లాంటి కుటుంబ సభ్యులు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. అది మిస్టర్ Xకి తెలిసింది. ఇప్పుడు అతను ఏమి చేయగలడు ? అతను వ్యతిరేకించొచ్చు లేదా తన ఆదర్శాన్ని నమ్ముకుని వారిని సాదరంగా ఆహ్వానిచనూ వచ్చు. ఆహ్వానిస్తే All Is Well అందులో మాట్లాదుకోవడానికి ఏమీ లేదు. అదీ కాక ఇలాంటి ప్రశ్నలు అడిగేది కూడా, ఇదే పని తమ కుటుంబ సభ్యులు చేస్తే, పరువు పోతుందనో లేక వారి జీవితం నాశన మవుతుందనో భయపడతారే కానీ సమర్ధించరు అన్న ఊహతోనే వేయడం జరుగుతుంది.
సో, ఒకవేల మిస్టార్ Xకి తన కుటుంభ సభ్యులు స్వలింగ సంపర్కులు కావడం ఇష్టం లేకపోతే ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. అతను ఎవరు వారి అభిప్రాయాన్ని కాదనడానికి, వారి జీవితాన్ని నిర్దేశించడానికి? ఆయా కుటుంబ సభ్యులు మైనరిటీ తీరి, స్వంతంగా నిర్ణయాలు తీసుకునే వయస్సు వారికి ఉంటే, వారిని ఆపే హక్కు ఇతనికెక్కడిది? కేవలం వాల్లు అతని కుటుంభ సభ్యులైనంత మాత్రాన, తమ తమ ఇష్టాలను చంపుకోవాలా? వారికంటూ ఒక జీవితం ఉండదా? దానిలో వేలు బెట్టి, నువ్వు అలా ఉండకూడదు, ఇలానే ఉండాలి అనే అధికారం మిస్టర్ Xకు ఎవరిచ్చారు ?
దీన్ని భట్టి నేను చెప్పేదేమిటంటే.. మిస్టర్ X దాన్ని వ్యతిరేకించొచ్చు, కానీ తన అభిప్రాయాన్ని, ఇష్టాలనూ భలవంతంగా ఎవరిమీదా రుద్దలేడు. రుద్దకూడదు. అలా చేస్తే అది తప్పవుతుంది.
కాబట్టి, మిస్టర్ X వారి వారి నిర్ణయాలకి విలువిచ్చి ఊరుకోవడం మంచిది.
మిత్రులారా! మనం ధార్మికులం కనుక మన మంచి-చెడుల నిర్ధారణకు మన ధర్మశాస్త్రాలే ప్రామాణికం కావాలి. అవి వేటిని అనుమతిస్తున్నాయో వాటిని విధులుగా మరియు అవి వేటిని నిషేధిస్తున్నాయో వాటిని నిషేధితాలుగా అంగీకరించాలి. అయితే ఇక్కడ కొందరి సందేహం ఏమిటంటే- ఆ శాస్త్రాలు వందల, వేల సంవత్సరాలకు పూర్వం నాటివి కదా నేటి ఆధునిక కాలానికి వాటి అనుసరణ సాధ్యం కాదు కదా అన్నది! ఆ విషయము అర్థం కావాలంటే- మనిషికి సంబంధించిన రెండు విభాగాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది గమనించగలరు.
ReplyDelete1. మనిషి మనస్తత్వము లేక స్వభావమునకు చెందిన విభాగము. ఇది భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతము. అంటే అది ఎప్పుడూ మారేది కాదు.
2. మనిషి భౌతిక వసతుల లేక అతని భౌతిక సౌఖ్యాల సామగ్రికి చెందిన విభాగము. ఇది భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతము కాదు. అంటే అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది.
మొదటి విభాగానికి సంబంధీచిన విషయాలు: హక్కులు-బాధ్యతలు, మంచి-చేడులు, న్యాయా-న్యాయాలు, వావి-వరసలు వగైరాలు ఎన్నటికీ ఎప్పటికీ మారనివి. ఈ విలువలూ భూతభవిష్యవార్తమాన కాలాలకు అతీతము. ఎందుకంటే- అతని మనస్తత్వము లేక స్వభావము కూడా భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతము కనుక! ధర్మశాస్త్రాల ప్రబోధనలు కేవలము ఆ విభాగానికి చెందిన విషయాలను గురించే చర్చిస్తాయి. కనుక వాటి ప్రభోధనలూ భూత-భవిష్య-వార్తమాన కాలాలకు అతీతముగానే ఉంటాయి. అంటే అవి ఎప్పుడూ మారానివిగానే ఉంటాయి.
ఇక, రెండవ విభాగానికి సంబంధీచిన విషయానికి వస్తే... అతని భౌతిక వసతుల లేక అతని భౌతిక సౌఖ్యాల స్థితి ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఆది దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంటుంది. ఉండాలి కూడా! ఆ రంగానికి సంబంధించి ధర్మశాస్త్రాలు చర్చించవు. ఆటంక పరచవు. కానీ, ప్రోత్సహిస్తాయి.
ధర్మశాస్త్రాల మౌలిక ప్రబోధన ఏమిటంటే- మనిషి వ్యక్తిగత జీవితములో నైతికతను సామూహిక జీవితములో మానవతను పాటించాలన్నదే! తద్వారా ఇహలోకంలో మానసిక-శ్యారీరక ఆరోగ్యమును మరియు సమాజములో గౌరవమరియాదలను సంపాదించుకొని పరలోకంలో ముక్తీమోక్షాలను సాధించుకోవాలన్నదే!
గమనిక: ధర్మశాస్త్రాల ప్రబోధానలను గ్రుడ్డిగా కళ్లు మూకొని అనుసరించ వలసిన అవసరం లేదు. కావాలంటే వాటి సత్యతను హేతుబద్ధతను మీ సాధారణ బుద్ధి వివేచనల గీటురాయిపై గీటుపెట్టి పరీక్షించి మరీ చూచుకోమని వాటి ప్రదాత అయిన ఆ సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు అనుమతిని ఇస్తున్నాడు.
కనుక ప్రస్తుత చర్చనీయాంశము అయిన ‘స్వలింగ సంపర్కం’ కానివ్వండి లేక మరొకేదైనా అంశము కానివ్వండి. దానిని ఒక్క ధర్మశాస్త్రాల ప్రబోధానల వెలుగులోనే కాక, సాధారణ మానవ వివేచన మరియు భౌతిక విజ్ఞాన శాస్త్ర వెలుగులోనూ పరిశీలిద్దాం. అలాంటి పరిశీలనకు మన ఉమ్మడి ధర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాలు పూర్తిగా ప్రోత్సహిస్తున్నాయి కూడా! కనుక ఇక మీదట మన చర్చను భౌతిక-ధార్మిక ఉభయ శాస్త్రాల ఆధారంగా సాగిద్దాం. దీనికి మీరేమంటారు మిత్రులారా!?
అదంతా చెల్లేది దారుల్ ఇస్లాం/హిందూ రాష్ట్ర లాంటి మతస్వామ్యాలలో. సెక్యులర్ దేశంలో చట్టాలు మతం వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి ఫలానా గ్రంధంలో ఏదో ఉందని కనుక అమలు చేసే తీరాలని అంటే కుదరదు.
Deleteగీత బైబుల్ ఖురాన్ గొప్పవా వీటిలో ఏది అత్యంత ఉత్తమం అనే చర్చ ప్రస్తుతానికి అనవసరం. చట్టానికి రాజ్యాంగాన్ని మించిన గ్రంధం లేదు.
జై జి గారికి వందనాలు!
Deleteమా రాతలపై మీ స్పందనలను చూస్తుంటే... గతంలో మీకు ఎదురైన వ్యక్తుల లేక పుస్తకాల వాదనలను దృష్టిలో పెట్టుకొని మీరు మాటలాడుతున్నారే తప్ప, మేము చెబుతున్నా విషయాన్ని కనీసం గమనించటం లేదని అర్థం అవుతుంది. దయచేసి మేము చెప్పిన దానిని మీరు స్పందించిన దానిని మరొకసారి పోల్చి చూడండి అసలు ఏమాత్రమైనా పొంతన ఉందేమో!!
మీరు “అదంతా చెల్లేది దారుల్ ఇస్లాం/హిందూ రాష్ట్ర లాంటి మతస్వామ్యాలలో” అనిమాత్రమే అన్నారు. కానీ, క్రైస్తవ మత స్వామ్యమైన దేవుని రాజ్యము గురించి కామెంట్ చెయ్యలేదు. ఇక, మీరు సెక్యులర్ చట్టాలు సెక్యులర్ చట్టాలు అని అంటున్నారే... అవి ఎవరివైనా సొంత ఆవిష్కరణలా? లేక ఆకాశం నుండి ఊడి పడ్డాయా? కాదు. వాటిని రెండు విధాలుగా రూపొందిచారు.
1. సర్వ సృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడు అనాదిగా ఇస్తూ వచ్చిన ధర్మ శాస్త్రాల ప్రబోధనల ఆధారముగా.
2. సర్వ సృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడు మనిషి స్వభావములో ప్రకృతి సిద్ధముగా పెట్టిన మంచి-చెడుల చైతనము ఆధారముగా.
కనుక సెక్యులర్ చట్టాలు వంద శాతమూ లౌకికమూ కాదు. భౌతికమూ కాదు. కాబట్టి సెక్యులర్ చట్టాలు పరోక్షముగా దైవికమైనవే! కాబట్టి వాటిని పాటించే విషయములోనూ ధార్మికులూ నిబద్ధతను కనబరచాలి. అయితే అవి బాహ్యములో ప్రయోజనకరమైనవిగా కంబడుతూ అంతర్గతంగా ఏదో ఒక వర్గానికి నష్టము కలిగించ వచ్చుచును. అటువంటప్పుడు దానిపై చర్చించాలి.
“ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి ఫలానా గ్రంధంలో ఏదో ఉందని కనుక అమలు చేసే తీరాలని అంటే కుదరదు”. అని మేమన్నట్లు మీరంటున్నారు. అలా మేము అనలేదన్నది మీరు గ్రహించాలి.
“గీత బైబుల్ ఖురాన్ గొప్పవా వీటిలో ఏది అత్యంత ఉత్తమం అనే చర్చ ప్రస్తుతానికి అనవసరం. చట్టానికి రాజ్యాంగాన్ని మించిన గ్రంధం లేదు.” అని మీరు అనటానికి, ఉందని మేము అంటేగా! గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల మౌలిక సందేశం ఒక్కటే అన్నది మా వాదన. ఈ విషయాన్ని కాదనే వారిని అది నిరూపించే వరకు మేము ఏకీభవించము.
ఈ సందర్భంగా ప్రధాన చర్చనీయాంశము- “వ్యక్తి స్వేచ్చ” అని కొందరు మిత్రులు అంటున్నారు. అది నిజమే దానిపై కులంకషంగా చర్చించవలసి ఉంది. ఆ “వ్యక్తి స్వేచ్చ” పరిమితులతో కూడి ఉండేదా? లేక విచ్చలవిడి స్వేచ్చా? అన్నదానిపైనా మనం చర్చిచాల్సి ఉంది. మన చర్చల అంతిమ లక్ష్యం విరాట్ వ్యక్తుల తయారీ, తద్వారా సుందర సమాజ నిర్మాణం. కనుక మనం ప్రేమ పూర్వకముగా మరియు ఆధార సహితముగా చర్చించుకుందాము.
అభిలాష్ భాయి,
Deleteదేవుని బిడ్డల రాజ్యం & జియోనిస్టు సామ్రాజ్యం కూడా మతస్వామ్యాలే, ఉదాహరణ కోసం రెండు చెప్పాను అంతే. మతగ్రంధాలు ఎక్కడినుండి ఊడబడ్డాయో సెక్యులర్ చట్టాలు ఎక్కడినుండి వచ్చాయో అప్రస్తుతం. ఫలానా గ్రందాల సారాంశం గురించి మీ అభిప్రాయం ఏదయినా అదీ ఇక్కడ అనవసరం.
ఫలానా మతంలో ఉంది కాబట్టి చట్టాన్ని ఒప్పుకోను ఆంటే కుదరదు. చట్టబద్దమయిన విషయాలను మతం/ధర్మం/ప్రకృతి/ఆచారం/దేవుడు/దయ్యం పేరుతొ అడ్డుకోవాలని ప్రయత్నించడం సబబు కాదు.
వ్యక్తిస్వేచ్చకు చట్టం ఒక్కటే పరిమితి. మిగిలిన అన్నీ అంగీకరించిన వారికే వర్తిస్తాయి.
మిత్రులు జై గారికి వందనములు!
Deleteప్రజాస్వామిక దేశాలలో సార్వత్రిక నియమ నిబంధనకు అంతిమ ప్రమాణంగా ఉండేది చట్టమే! ఇక మీరన్నట్టు మతం/ధర్మం/ప్రకృతి/ఆచారం/దేవుడు/దయ్యం వంటి వాటిపై విశ్వాసం ఎవరికి ఉందో అవి వ్యక్తిగతంగా వారికే వర్తిస్తాయి. దానిని మేము కాదనలేదు కదా!
“చట్టబద్దమయిన విషయాలను అడ్డుకోవాలని ప్రయత్నించడం సబబు కాదు” అని మీరు మాకు సలహా ఇవ్వటానికి అడ్డుకోవాలని అసలు మేము అంటే కదా! మా విషయములో మీ ముందస్తు ఆలోచనల నుండి కాస్త బయట పడాలని సవినయముగా మిమ్మల్ని కోరుతున్నాము.
రాజ్యాంగము అంతిమ లక్ష్యము సంక్షేమ రాజ్య నిర్మాణము. దాని కొరకు సమాజములో ఉన్న సామాన్య ప్రజలలో నుండి విద్యా-విజ్ఞానాల పరముగా నిష్ణాతులైన కొందరు ఒక “చిన్న సమూహము”గా ఏర్పడి చట్టములను-శ్యాసనములను రూపొందిస్తుంది. ఆ “చిన్న సమూహము”తోనే సకల దేశాల సాధారణ ప్రజాబాహూళ్యానికి ఘోరమైన నష్టాలు యాతనలు కలుగుతున్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం! ఎందుకంటే- “చిన్న సమూహము”చే సాధారణ ప్రజాబాహూళ్య సంక్షేమం పేరిట చేయబడే చట్టముల-శ్యాసనముల వలన అపార ప్రయోజనము ఆ “చిన్న సమూహము”నకే కలుగుతుంది. ఎవరి పేరిట చేయబడుతుందో వారికి మాత్రం నష్టమే సంభవిస్తుంది! కనుక పౌరసమాజానికి వాటిల్లుతున్న ఈ నష్టాన్నుండి కాపాడటానికి... ఆ “చిన్న సమూహము” పాల్పడుతున్న కుట్రలను భగ్నం చేసి, అందరికీ ప్రయోజనం చేకూరే విధమైన చట్టాలు-శ్యాసనములు అమలయ్యే విధంగా చూడవలసిన బాధ్యతను N. G. O. లు లేక పౌరసమాజానికి చెందిన ఉత్తములు వహించాలి కదా!
ఉదాహరణకు: సరైన విద్యా-విజ్ఞానాలు లేని సామాన్య ప్రజలు అభం-శుభం ఎరుగని పిల్లలవంటివారు. వారి అలనా-పాలనను చూడవలసిన విద్యుక్తధర్మమును కలిగి ఉండేది... ఆ “చిన్న సమూహమే!” అది తన మరియు తన పాలితులు (సంతానం) సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో న్యాయవంతంగా తన పాత్రను నిర్వర్తిస్తే, సామాన్య ప్రజల పట్ల అది “సొంత తల్లి”గా పరిగణించ బడుతుంది. అలాకాక అది పాలితుల (సంతానం) కు వినాశనమును కలిగిస్తూ, కేవలం తన సంక్షేమం కొరకు మాత్రమే పనికివచ్చే చట్టాలు-శ్యాసనములు నిర్మిస్తూ ఉంటే, సామాన్య ప్రజల పట్ల అది “సవతి తల్లి”గా పరిగణించ బడుతుంది. ఈనాటి అధిక శాతం దేశాలలో “సవతి తల్లి” పాలనే జరుగుతుందన్నది మనందరికీ ఎరుకే! ఈ నేపధ్యములో అభం-శుభం ఎరుగని పిల్లలవంటి సామాన్య అమాయిక ప్రజల “వాస్తవ సంక్షేమం” కొరకు నడుం బిగించ వలసింది పౌరసమాజానికి చెందిన ఉత్తములైన N. G. O. లే కదా! అంటే, వీరు “సొంత తల్లి” పాత్రను పోషించాలి!
మద్యము, జూదము, మత్తుపదార్ధాలు, నగ్నత్వము, విచ్చలవిడితనము, స్వలింగసంపర్కము వంటి అత్యంత వినాశనకరమైన వాటిని ఒకవేళ ప్రజలు కోరుకుంటే- అది, అభం-శుభం ఎరుగని పిల్లలు కత్తులను, సూదులను, వివిధ ఔషధాలను, విద్యుత్తీగలను చేతపట్టుకొని నోటిలో పెట్టుకోవటం వంటి అజ్ఞాన చేష్టలే! వాటిని వారించవలసిన బాధ్యత పాలకులైన ఆ చిన్నవర్గానిదే అవుతుంది. ప్రతి దేశ రాజ్యాంగమూ వాటిని నిర్బంధంగా నిషేదించాలనే శ్యాసిస్తుంది. కనుక ఆ చిన్న పాలక వర్గం ఒక కన్నతల్లిగా- ఆ దుష్కృత్యాల తీవ్రతను సామాన్య అమాయిక ప్రజల (సంతానము) కు ఎరుక పరచి, అంచేల వారీగా వాటి అలవాటును తగ్గించి, చివరకు వాటిని నిషేధించాలి. దానికి బదులు ఆ దుష్కృత్యాల దాహాన్ని ప్రజలలో తీవ్ర తరం చేస్తూ, ఆ చెడులను క్రమక్రమంగా పెంచుతున్నారంటే దానిలో ఎవరి “వినాశనం” మరియు ఎవరి “సంక్షేమం” దాగి ఉందో ఈ దుర్మార్గపు చెడుల పరివ్యాప్తిలో “వ్యక్తి స్వేచ్ఛ” ఉందో లేక బడాబాబుల “కుట్ర” ఉందో మీకు తేలియటం లేదా జైగారూ!
ఇక, “వ్యక్తి స్వేచ్ఛ” విషయానికి వస్తే...
మీరు సమర్ధిస్తున్న లేక మీరు కాపాడాలనుకుంటున్న “వ్యక్తి స్వేచ్ఛ” పరిమితులతో కూడి ఉండేదా? లేక విచ్చలవిడి “వ్యక్తి స్వేచ్ఛ?” దీనికి One word answer ఇవ్వండి!
రేపు ఎవరైనా తల్లినిగాని చెల్లినిగాని కూతురినిగాని కామించి, వారితో సహజీవనం చేస్తామని కోరుకుంటే... మీరూ శ్యామలీయం, విశేషజ్ఞ, శుక్రా చార్య, శ్రీకాంత్ చారి గార్లు ఏమంటారు?
అభిలాష్ భయ్యా,
Deleteముందు చట్టం ముందు అన్ని మతాల గ్రంధాలు నడవవని ఒప్పుకున్నందుకు థాంక్స్. ఇకపోతే మీరు వ్యతిరేకిస్తున్న స్వలింగాసంపర్కం భారత దేశంలో చట్టబద్దమా కాదా కూడా పరిశీలించండి. సంబంధం లేని ఇతర దేశాల గురించి మనకెందుకు?
అత్యధిక శాతం ప్రజలను సామాన్యులు, అజ్ఞానులు లేదా పసిమనస్కులు అంటూ కొట్టిపారేయడం, వారిని నా లాంటి ఉత్తములే కాపాడగలరని సొంతడబ్బా కొట్టడం విజ్ఞతను సూచించవు. వినమ్రత మించిన ఆభరణం లేదని ఒప్పుకోవడమే ఉత్తముల లక్షణం.
పోనీ వాదన కోసం మీరే కరెక్ట్ అనుకున్నా అమెరికా & ఐరోపా "అభం-శుభం ఎరుగని అజ్ఞానులను" వారు చదవని బ్లాగులలో వారికి తెలీని భాషలో రాసి ఎలా ఎరుక పరుస్తారు?
"వ్యక్తిస్వేచ్చకు చట్టం ఒక్కటే పరిమితి" అని అన్నాక మళ్ళీ one word answer ఎందుకు భాయిజాన్?
మీరు "వావి వరసలు" ప్రస్తావిస్తూ చాలెంజులు విసిరే ముందు ఇదే తరహా వాదనా పద్ధతులకు ముందే ఇచ్చిన సమాధానం చూస్తె బాగుండేది. ద్రౌపది గురించో, సవితి తల్లి కూతురుని పెళ్ళాడే పద్దతుల గురించో మీ అభిప్రాయం నేనూ అడగగలను కానీ అది నా పద్దతి కాదు.
ఇక వేరేవారు ఏమంటారో అని నన్ను అడగడం మీకు శోభించదు.
మిత్రులు జైగారికి వందనములు!
Deleteమా ప్రస్తావిత విషయాలకు మీరు చేసే వక్రీకరణ మీరు మాతో సక్రమముగా మాటలాడటానికి ఇష్టపడటం లేదని, అక్కస్సుతో మాటలాడుతున్నారని పాఠకులకు స్పష్టంగా బహిర్గతం చేస్తుంది.
“అత్యధిక శాతం ప్రజలను సామాన్యులు, అజ్ఞానులు లేదా పసిమనస్కులు అంటూ కొట్టిపారేయడం, వారిని నా లాంటి ఉత్తములే కాపాడగలరని సొంతడబ్బా కొట్టడం విజ్ఞతను సూచించవు. వినమ్రత మించిన ఆభరణం లేదని ఒప్పుకోవడమే ఉత్తముల లక్షణం.
పోనీ వాదన కోసం మీరే కరెక్ట్ అనుకున్నా అమెరికా & ఐరోపా "అభం-శుభం ఎరుగని అజ్ఞానులను" వారు చదవని బ్లాగులలో వారికి తెలీని భాషలో రాసి ఎలా ఎరుక పరుస్తారు?” అన్న మీ వ్యాఖ్యానం విషయంపై మాటలాడలేని మీ బలహీనతను చూపిస్తుంది.
వివిధ పనుల కొరకు వివిధ వ్యక్తులను ఎన్నుకోవటం అన్నది ఒక సార్వత్రిక అనివార్య విషయం. తోటమాలి నుండి విమాన చోదకుడి వరకు, ఆఫీసు బోయ్ నుండి కలక్టర్ వరకు, గల్లీ లీడరు నుండి డిల్లీ లీడరు వరకు వారి వారి సమర్ధతల ఆధారంగానే వారి వారి ఎంపికలు, నియామకాలు జరుగుతాయి. అలాగే ఒక సాంఘీక వ్యవస్థ సక్రమంగా, సంక్షేమ భరితంగా నడవాలంటే... దానికి కావలసిన నియమ-నిబంధనలను, విధి-నిషేధాలను చేసేది మేధావులే గాని సామాన్యులు కాదుకదా! ఈ విభజన గురించి సోదాహరణంగా చెప్పిన దానిని మీరు తప్పుపట్టారంటే, మీరు మాపట్ల ఎంతటి ఉక్రోషానికి గురౌతున్నారో అర్థం అవుతుంది.
“వ్యక్తి స్వేచ్ఛ” ముసుగులో మానవులను హీనులుగా నీచులుగా మార్చి, వారిపై తమ చిరకాల ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్న వారి కుట్రను గుర్తించక, తెలుసో తెలియాకో వారికి వత్తాసు పలుకుతున్న మీరూ మీమ్మల్ని ఏకీభవించే వారూ- “వ్యక్తి స్వేచ్ఛ”కు నిర్వచనం ఏమిటో దానికి ప్రాతిపాధిక ఏమిటో చెప్పండి. ఈ విషయములో తప్పించుకొనే ప్రయత్నం చేయకండి. న్యాయ దృష్టిగల ప్రజలు మన చర్చలను గమనిస్తున్నారు. పెద్ద ఎత్తున వారు కూడా చర్చించటానికి ముందుకు రానున్నారు. మిత్రులు జైగారూ విషయాన్ని విషయంగా ఏ విషయానికి ఆ విషయంగా మాటలాడుకుందాము.
అన్నట్లు మిమ్మల్ని మీరే "మేము" అని సంబోధించుకోవడం అహంభవం కాదని మీ అభిప్రాయమా? మీరు నైతిన నియమాలన్నీ భగవంతుడే ఇస్తాడన్న దగ్గర తప్పటడుగులు మళ్ళీమళ్ళీ వేస్తున్నారు. భగవంతుడన్నది (మీ)నమ్మకమ్మాత్రమే. అది నిజం కాదు.
Deleteబ్రదర్ అభిలాష్:
Deleteనేను విషయం పరిధిని దాటలేదు. ఈ పరిధాలో నేను వేసిన ప్రశ్నలు (ఉ. అమెరికా క్రైస్తవ దేశమా? మన దేశంలో స్వలింగ సంపర్కం చట్టబద్దమా?) మీరు & మీ సమర్తకులు దాటవేశారు.
మీరు బహుజనులను అజ్ఞానులు, అభం శుభం తెలియని పసిపిల్లలు అనడం & వారిని "ఉత్తములు" ఉద్దరించాలనడం మీకు భావ్యంగా ఉందేమో మీ ఇష్టం.
వివిధ పనులు చేసే వారికి ఆ పని తాలూకా అర్హతలు తప్ప ఇంకేవీ ఉండాలని లేదు. ఆఫీసు బాయ్ అపార ధర్మకోవిదుడయినా చదువు లేక ఆ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఉమ్మీ అని పిలవబడ్డ వారు & వడ్రంగి పని చేసే వారు ప్రవక్తలు అయ్యారు కదా? వారు మేధావులు కాకపోయినా మానవాళికి సేవలు చేయలేదా?
నాకు మీ (అంటే అభిలాష్) ఘమండ్ చూస్తె బాధ కలుగుతుంది తప్ప మీ (అంటే మీ మతం వారి) మీద ఉక్రోషం లేదు. నాకు అన్ని మతాలూ సమానమే.
మద్యము, జూదము, మత్తుపదార్ధాలు, నగ్నత్వము, విచ్చలవిడితనము, స్వలింగసంపర్కము వంటి అత్యంత వినాశనకరమైనవని మీరు అన్నారు, వీటికి ఒక్క ఆధారము ఇవ్వలేదు. క్రైస్తవ ఆచారాలలో మధిర సేవిస్తారు, దేవతలు సురాపానం చేసే వారు, ధర్మరాజు జూదం ఆడారు, యోగి వేమన దుస్తులను త్యజించారు లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు స్వలింగాసంపర్కం పాపమని మీరు తరుచూ పేర్కొనే గీత, తోరా. బైబుల్, ఖురాన్ గ్రంధాలలో ఉందా?
వ్యక్తిస్వేచ్చ నిర్వచనం నేను ఇదివరికే ఇచ్చాను అడుగుతున్నారు కనుక మళ్ళీ ఇదుగో. ఒక మైనారిటీ తీరిన వ్యక్తి చట్ట వ్యతిరేకం కాని ఎటువంటి చర్యనయినా చేసే హక్కును వ్యక్తి స్వేచ్చ అంటారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం నిషిద్దం కనుక అక్కడ ఉండే వారి వ్యక్తిస్వేచ్చ దీన్ని కవర్ చేయదు కానీ నిషేధం లేని మహారాష్ట్రలో ఈ విషయంలో ఎవరి ఇష్టం వారిది.
The statement "I disagree with everything he says but will defend to my last breath his right to say it" summarizes the concept.
పెద్ద ఎత్తున వాదనకు ఎవరో రాబోతున్నారన్నారు. రానివ్వండి నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు.
"స్వలింగ సంపర్కం పట్ల కోరికతో ఆవురావురుమని ఉన్నారనిపిస్తోంది. ఖర్మకాలి భారతదేశంలో పుట్టారుగానీ ఆప్రాశ్చాత్య దేశాలలో పుట్టి ఉంటే వీళ్ళందరూ స్వలింగసంపార్కులయిపోదురు. ఇక్కడ గతి లేక సమర్ధించడంలో ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్యం? స్వలింగసంపర్కాన్ని సమర్ధింకడానికి సిగ్గు కూడా పడడం లేదు. "
ReplyDelete"భారతదేశాన్ని అలాంటి చెత్తలోకి నెట్టే ప్రయత్నమేమో మరి!"
బాబూ అరవిందూ...
నీకు చెత్త అనిపిస్తే అది అందరిస్కీ చెత్త అనిపించాల్సిన అవసరంలేదు (లౌకికత్వాన్ని చెత్త అనుకొనేవాళ్ళ దృష్టిలో నువ్వొక నపుంసకుడివవ్వన్న విషయం తెలుసుకో). స్వలింగసంపర్కం అవమానకరమైన విషయంకాదు. నీకు అలా అనిపిస్తే అది అందరికీ అలాగే అనిపించాల్సిన అవసరంలేదు. కొందరికి పందినో/ఆవునో/దున్ననో/మాంసాహారాన్నో తినడం తప్పని అనిపించినంతమాత్రాన దాన్ని అందరూ అదే అభిప్రాయాన్ని కలిగుండాల్సిన అవసరంలేదు. మీకు నచ్చని సినిమా ఇంకొకరికి నచ్చినంతమాత్రాన మీరు మీ కుత్స్సిత అభిప్రాయాలతో మిగతావారినందరినీ వెధవలుగా జమకట్టడం తగదు. ఒకవేళ నేను స్వలింగ సంపర్కుడనైనా, నా కొడుకులో, కూతుళ్ళో స్వలింగ సంపర్కులైనా నేను (కనీసం గర్వించకపోయినా) అదేదో దాచుకోవలసిందిగా భావించను, అవమానకరంగా భావించను. వాళ్ళు దొంగలూ, తీవ్రవాదులూ ఐతే అవమానకరంగానీ, వాళ్ళకిస్ఠమొచ్చిన్న రీతిలో వాళ్ళు జీవిస్తున్నందుకు నేను అవమానకరంగా ఫీలవ్వాలసింది ఏమీలేదు.
మీరు ఖండించాల్సిందేమైనా ఉందంటే మీ అభిమాన ప్రవక్తగారి Pedophilic tendenciesని. ఇప్పుడు చెప్పండి మీకే ఒక కూతురుంటే, ఆమెకు తొమ్మిదవ వయసున్నప్పుడు ఒక ముప్పైయేళ్ళవాడితో పెళ్ళిచేస్తారా? ఇది perversionకాక మరింకేమితి?
మనదేశంలో (ఆమాటకొస్తే ప్రపంచంలో) మెజారిటీకి ఇస్లామంటే అసహ్యం. మీరు ముస్లిమైనందుకు ఎలా గర్వించగలుగుతున్నారు?
స్వలింగ సంపర్కాన్ని సమర్ధించే మిమ్మల్ని చూస్తే సిగ్గుపడాలి. మీరు అనుకున్నట్టు నోటి మాటలు కాదు.నిజ జీవితంలో పిల్లలు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అర్ధమవుతుంది. మనదేశమేమైనా ఆ దిక్కుమాలిన సంస్కృతి కలిగిన దేశమనుకుంటున్నారా?
Deleteఇక పోతే నేను ముస్లిం అయ్యిపోయానని ఎవరు చెప్పారు? ఇస్లాంకి నాకు,సంబంధమేమిటి? అసలు ఆ మతం గురించి నాకేమీ తెలియదు కాబట్టి ఏనాడూ ఆ మతం జోలికి వెళ్లలేదు. ఒక ముస్లిం వాదనను సమర్ధించినంత మాత్రాన ఆ మతంలోకి నెట్టేచి చూస్తున్న మీ యొక్క మేధావి తనానికి జోహార్లు.
స్వలింగ సంపర్కం విషయంలో సిగ్గు వదిలేశాను,నాకు అవమానం కాదు గౌరవం అని ప్రకటించుకున్న మిమ్మల్ని నేను ఏమి అనగలను చెప్పండి విశేషజ్ఞగారు?
ముందుగా... నిన్న నేను చేసిన పరుషమైన వ్యాఖ్యలకు నన్ను క్షమించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను.
Deleteఅరవింద్ గారు...
మీకు సిగ్గులేనితనం అనిపించింది ఇతరులకూ అలాగే అనిపించాల్సిన అవసరంలేదు. మీరు స్వలింగ సంపర్కాన్ని తప్పు అని ఎందుకు అనుకుంటున్నారో కొంచెం మీలోమీరు ఆలోచించుకొని జవాబు చెప్పగలరా? మీకు అసహ్యంగా అనిపించినందుకా? ఐతే మాంసభక్షణని అసహ్యకరమైనదిగా భావించేవాళ్ళు ఈదేశంలో కోకొల్లలు. మీరు కొండలరావుగారు అబ్బాయి అనుకుంటాను. కమ్యూనిష్టుగా ఉండటమే అత్యంత అసహ్యకరం అని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ఒక విషయాన్ని నేను వ్యతిరేకించాలంటే అందులో పీడన ఉండాలి. స్వలింగ సంపర్కం (అసలు సంపర్కం అనేదే) ఇఛ్ఛాపూర్వకంగా చేసేది. అది కేవలం ఇరువురికి పరిమితమైన చర్య. వారిద్దరిమధ్యలోకీ దూరే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుంది?
ఇహపోతే నా గురించి... "నాదాకా వస్తేగానీ" అంటూ నేను ఎదురుచూడను. నేను ఒకదాన్ని సమర్ధించాలంటే అది నా life styleలో భాగం కానఖ్ఖర్లేదు. ఒకరు (లేదా ఇద్దరు) చేస్తున్న పనివల్ల మిగిలినవారికి ఇబ్బందిలేకపోతే -మనోభావాలు మినహా-, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరంలేదని నేను అనుకుంటాను.
ఇకపోతె.. మీరు సంస్కృతి గురించి పెద్ద వ్యాఖ్యలే చేశారు. అంటే మీరు మతం గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారడం, అలామారిన మగాళ్ళు ఇంకొక మగాడికి పిల్లలను కనడం అనేది హిందూ మైధాలజీలో ఒక recurring theme. హరిహరసుతుడయ్యప్ప దేవునిగా పూజలందుకుంటున్నాడు. ఇద్దరు రాణుల సంభోగంచేత పుట్టిన భగీరధుడు (పద్మ పురాణం ప్రకారం) గంగను దివికి దించినవాడుగా మన్ననలందుకుంటున్నాడు. మన ప్రస్తుత సమాజంలోని అసహనం మన "సంస్కృతి"లో లేదు. కాబట్టి "సంస్కృతి", "సంస్కారం" లాంటి బరువైనమాటలను కేవలం పడికట్టుపదాలుగా వాడేవారు కొంచెం ఆలోచించుకోవలసినది. స్వలింగ సంపర్కం ప్రాచీన గ్రీకులోనూ, ఇస్లామిక్ సంస్కృతికి ఆలవాలమైన ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్‌లలోనూ, బైబిల్‌లోనూ (ఆమాటకొస్తే ఈనాతికీ వాటికన్‌లోనూ) మనం విస్తృతంగా కనవచ్చు. కాబట్టి "సంస్కృతి" అన్మ్నపదం ఇక్కడ over kill.
@విశేషజ్ఞ
Deleteఇతను కొండలరావు గారబ్బాయి కాదనుకుంటా. వారి ఇనిషీయల్ (P ఫర్ పల్లా).
అందుకే మనుషులకి ఇంటి పేర్లు పెట్టింది :)) నా కాలేజ్ రోజుల వరకు "అరవింద్" అంటే నేనొక్కడ్నే. ఇప్పుడిప్పుడే Parallel గా కనిపిస్తున్నారు. ఆ అరవింద్ నేను కాదండీ.
Deleteఅభిలాషుగారి చచ్చుపుచ్చువాదలకి బ్లాగులో ఎవరో ఘాట్టి వాతలే వేస్తున్నారు. If I were he, I would expend my energies not be busted and thus would save my face/ass.
ReplyDeleteఅభిలాష్ గారు పెట్టిన వాతలకే ఇంకా ఎవరూ తేరుకోలేదు. అలా,ఇలా ఛాలెంజులు చేసినవారు సైతం ఆయన దరిదాపులకు రావడమే మానేశారు.నోటి మాటలు,వాక్చాతుర్యం ఉంటే సరిపోదు.ఆయనతో పోరాడాలంటే శాస్త్రజ్ఞానం ఉండాలి.ఎవరో అంటూ మీరు ఆయన ఆర్టికల్స్ ని తప్పుదారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది.
Deleteచౌదరిగారూ..
ReplyDeleteఈడెవడో శుక్రాచార్యుడంటబ్బా... మీ గౌరవనీయుడూ, మేధావీ, మహామహితాత్ముడు ఐన అభిలాషుడు వీడి ప్రశ్నలకు జవాబుచెబితే చూడాలనుంది.
శుక్రాచార్యగారికి క్షమాపణలతో...
మిత్రులు శుక్రాచార్యగారికి నమస్కారాలు!
Deleteశాస్త్రీయ చర్చలో ధర్మగ్రంధాల “మూలము” (TEXT) నే ప్రామాణికముగా తీసికోవాలి. ఆ తరువాత అనువాదాన్నీ కొంతవరకు తీసుకోవచ్చు. “మూలము” (TEXT) తో ఘర్షించే వ్యాక్యానాలు ఏమాత్రమూ ప్రామాణికం కాజాలవన్నది మనలో ప్రతీఒక్కరూ గుర్తిచాలి శుక్రాచార్య గారూ!
ఇక, పైన మీరు ఇచ్చిన వివరణ అంతా వ్యాక్యాన పూర్వకమైనదే కానీ, “మూలము” (TEXT) నుకు చెడినది కాదు!
మీరు గానీ, ఇతరులు గానీ తప్పుడు వ్యాక్యానాలతో తప్పుడు విగ్రహారాధనను సమర్ధించుకోవాలే తప్ప విగ్రహారాధన ధర్మబద్ధమే అనటానికి వాంగ్మూలం (STATEMENT) రూపంలో ఒక్కగాని ఒక్క మంత్రం గాని, శ్లోకం గాని ఇప్పుడే కాదు ఎప్పటికీ చూపలేరన్నది మీ కొరకు ఒక కఠోరమైన సత్యం. తమ అసత్య విగ్రహారాధనను సత్యమని ధర్మ శాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంధాల ద్వారా నీరూపించటానికి ప్రయత్నించే వారు అది- హిందూ-క్రైస్తవ-ముస్లిం లేక ఏ వర్గానికి చెందిన వారైనా సరే చివరికి ప్రజల మధ్య అభాసు పాలు కాక తప్పదు. ఈ క్రింది మంత్రం గురించి విగ్రహారాధన సమర్ధకులు ఏమంటారు?
కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27
ఈ విధముగా ఏకేశ్వరోపాసనే చేయాలి. ఏవిధమైన విగ్రహారాధననూ చేయరాదు. అన్న విషయాన్ని “మేము” అంటే “నేను” కాదు. హిందూ-క్రైస్తవ-ముస్లిం తదితర వర్గాలకు చెందిన ఏకేశ్వరోపాసకులం! ధర్మ విరుద్ధ విగ్రహారాధనన చేసే మీకు, ఎవరో పండితులు చేసిన వ్యాఖ్యానాలను కాక, ధర్మ శాస్త్రాల “మూలము” (TEXT) ద్వారానే కాక, వాంగ్మూలం (STATEMENT) రూపంలోనూ చూపిస్తున్నామన్నది మీరు గ్రహించాలి.
ఈ విధమైన ఆధార సహిత “వివరణ”ను “విమర్శ” అని అంటారా? భక్తులను స్వేచ్చాపరులుగా వివేచనాపరులుగా మలచే (కొందరు దుష్టబుద్ధిగాల పండితులచే ఉద్దేశ పూర్వకంగా దాచేసిన) వైదిక సమాచారాన్ని సర్వసామాన్యం చేయటం దుష్ప్రచారమా? శుక్రాచార్య గారూ! మా ఈ ప్రశ్నలకు పాఠకులు న్యాయంగా సమాధానం ఇవ్వాలి!
మితృలు అభిలాష్ గారికి నమస్కారం,
Delete//ఇక, పైన మీరు ఇచ్చిన వివరణ అంతా వ్యాక్యాన పూర్వకమైనదే కానీ, “మూలము” (TEXT) నుకు చెడినది కాదు! //
నేను చాలా నయం, మీరైతే ఏకంగా శ్లోకాలనే మార్చేశారు. యోగషిఖోపనిషద్ లో ఆ శ్లోకం మీకు ఎక్కడ దొరికిందో చెప్పగలరా? పైన నేను యోగ షిఖోపనిషద్ లోని శ్లోకం యధాతధంగా ఇచ్చాను, ఏ సంస్కృత పండితుని దగ్గరకు వెల్లి మీరు దాన్ని అనువదిస్తారో మీ ఇష్టం. దాని నుండి మీరు మీ ఆర్టికలులో కోట్ చేసిన అర్థం ఎలా వస్తుందో చూపించండి చాలు !
ఇక వ్యాఖ్యాణాలు అన్నవి గాలిలోంచి తీసినవి కావు. ఆయా శ్లోకాల అర్థాలను విడమరిచి చెప్పినవి మాత్రమే. ఉదాహరణకు..
"There is no God, other than Allah. There is no prophet other than Mahammad" అనే వాఖ్యమును తీసుకోండి. కొంత మంది ఏమి చేస్తారంటే.. There is no god అనే వ్యాఖ్యాన్ని పట్టుకుని, ఖురాన్ దేవుడు లేడు అని చెప్పింది అంటారు. దాన్ని చదివి ఖురాన్ చదివిన వారు మొత్తం వాఖ్యమంతా ఇచ్చి, There is no god అంటే అర్థం దేవుడు లేడని కాదు, వాక్యం పూర్తిగా చూడండి అని చెబుతారు. నేను ప్రస్తుతం చేసిన పని కూడా అదే.
మీరు ఏదో ఒక శ్లోకం తీసుకుని దేవుడు నిరాకారుడు అని చెప్పారు. నేను దాని తరువాత వచ్చిన శ్లోకాన్ని కూడా చూపించి, నిరాకారుడే కానీ, makes use of all faces, heads and necks in this world అని చెప్పారు చూడండి అని చెబుతాను. దాన్ని మీకు ఇంకాస్త సులువుగా అర్థమవ్వడానికి.. ఆయన నిరాకారుడు కాబట్టే, ఏరూపములోకి అయినా రాగలడు అని చెబుతాను. అంతే తప్ప నేను శ్లోకాలను వక్రీకరించడం లేదు. పైన ఇచ్చిన శ్లోకాలను ఏ సంస్కృత పండితుడి దగ్గరకు వెలతారో మీ ఇష్టం, వెల్లి నేను చెప్పినది తప్పని నిరూపించండి. అంతే కానీ, నాపై అనవసర నిందారోపణలు చేయకండి.
హిందూ మతములో విగ్రహాన్ని పూజించకు అని డైరెక్టుగా చెప్పిన శ్లోకం లేదు. నిరాకారుడు అని చెప్పిన వెంటనే .. దానికి వివరణ కుడా ఇచ్చుకున్నారు. ఏదో ఒక శ్లోకాన్ని Randomగా ఎంచుకుని, విగ్రహారాధన మహా పాపమని ఇస్లాం ప్రవచనాలకు హిందు ధర్మాన్ని తోడుగా తీసుకోవాలనుకుంటున్న వారే అభాసుపాలవుతున్నారు తప్ప మరేమీ కాదు.
Islam has 25 prophets. "Muhammad arrasoolullah" means "Muhammad is the messenger of God" but not "Muhammad is the only messenger of God".
Deleteమిత్రులు శుక్రాచార్య గారికి నమస్కారాలు!
Deleteమీరు ఏ మంత్రం ఆధారం సరిగా లేదని చెప్పారో దానిని గమనించి, మీకు తెలపగాలను. "There is no God, other than Allah అంటే- “ఏ దేవుడూ లేడు ఒక్క సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు తప్ప” అన్నది నిజమే. కాని, “There is no prophet other than Mahammad" అని మీరు పేర్కొన్నది మాత్రం పూర్తిగా తప్పు. అలాంటి పంక్తి యావత్ ఇస్లామీయ వాఙ్మయంలో ఎక్కడాలేదు! దీనికి ఖురాన్ చెప్పేదేమిటంటే- “There are number of prophets Mahammad is one of the prophets" అన్నది.
ఆయినా మీరు నాకు పైవిధమైన వివరణ ఇవ్వటానికి నేను ఈ విగ్రహారాధన ఇస్లాం ప్రకారం తప్పు, మీరు ఎందుకు చేస్తున్నారూ? అని నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు కదా శుక్రాచార్య గారూ!
అయితే ఈ ప్రశ్నను అమాయిక ముస్లిములతో విగ్రహారాధన చేయిస్తూ వారిని దోచుకుంటున్న వంచకులైన ముల్లాలకు వేస్తున్నాను. అలాగే యేసు దేవుడు, మరియమ్మ దేవత అని ఒక్కగాని ఒక్క “పదం” పూర్తి బైబిలు గ్రంధంలో కనీసం మచ్చుకైనా లేకపోయినప్పటికీ అమాయిక క్రైస్తవ ప్రజానీకాన్ని ఈ విగ్రహారాధనను అడ్డం పెట్టుకొని అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్న క్రైస్తవ బోధకులనూ ప్రశ్నిస్తున్నాను.
అయితే అన్నిరకాల విగ్రహారాధనలను ఒక్కపెట్టున ఖండించి, కేవలం ఒకే ఒక్క ఏకేశ్వరోపాసనను సుస్పష్టంగా బహిరంగంగా సమర్ధిస్తున్న ఈ క్రింది మంత్రం గురించి మీ వ్యాఖ్యానం ఏమిటో చెప్పలేదు.
కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27
పై మంత్రం ఇస్తున్న సమాచారాన్ని కాస్త జాగ్రత్తగా గమనించగలరు. ఒకటి- ప్రథమ పురుషములో సాక్షాత్తు సర్వేశ్వరుడే స్వయంగా మాటలాడటం. రెండు- “ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు” భ్రమకు గురిచేసే ఒక దుష్టశక్తి పేరే “మాయ”. ఆ “మాయ” కలిపించే భ్రమకు గురైన వారే ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధనను చేయిస్తారని చెప్పటం. మూడు- వారు ఆ ధర్మ విరుద్ధ చేష్టకు పాల్పడటానికి గల కారణం పొట్టకూటి కొరకు కాకుల మాదిరిగా తయారవటం. నాలుగు- ఈ విగ్రహారాధన ముక్తిని పొందనివ్వక జన్మల చక్రంలో నెట్టేస్తుందన్నది. ఐదు- సర్వోన్నతుడైన సర్వేశ్వరుడిని హృదయమందే అర్చించాలన్నది. ఆరు- బాహ్యార్చన చేయరాదన్నది. ఏడు- తద్వారా మాత్రమే మోక్షప్రాప్తి సిద్ధించగలదన్నది.
విగ్రహారాధన ధర్మ విరుద్ధం అనటానికి పై మంత్రం సరిపోదా శుక్రాచార్య గారూ! ఇలాంటి, ఇంకా తీవ్రంగా విగ్రహారాధనను ఖండిస్తున్న శ్లోకాలూ, మంత్రాలూ పాఠకుల ముందుకు రానున్నాయి.
మీరు రాసింది మీరే ఒక సారి చదువుకోండి. విగ్రహారాధన అనేది పునర్జన్మ, భోగకరిలకు కారణం అని చెప్పారు. అంతే కానీ, మహా పాపం నరకమునకు పోయెదరని చెప్పలేదు. హిందూ మతానికి, ఇస్లాముకు అదే తేడా. ఇస్లాం అయితే విగ్రహారాధన మహాపాపమని, నిషిద్దమని అంటుంది. కానీ, హిందు మతం దాన్ని అంగీకరిస్తుంది. ఈ ఉపనిషద్ లో కూడా అదే చెప్పడం జరిగింది. ఒకవేల భక్తుడు పునర్జన్మ అనేది లేకుండా ఉండాలనుకుంటే, ఆత్మను పూజించండి అని చెప్పబడి ఉంది. కానీ, నిషిద్దం.. చేయకండి అని చెప్పలేదు. ఇక్కడే కాదు, వేదాలలో కానీ, భగవద్గీతలో కానీ ఎక్కడా నిషిద్దం అని చెప్పలేదు. ఫలితాలు వేరుగా ఉంటాయి అన్నట్లుగా మాత్రమే చెప్పబడి ఉంది.
DeleteMohammad (peace be upon him) is *not* just "one of the prophets". According to 33:40, he is the last of the prophets (seal).
Deleteవిశేషజ్ఞగారూ! నాకు కేవలం అభిలాష్ గారూ మాత్రమే గౌరవనీయులుకాదు. సాక్ష్యం తాలూకూ అన్నీ సర్వీసులలో పాల్గొన్న నా బ్లాగుల వీక్షకులందరి పట్ల నాకు గౌరవభావం ఉంది మీతో సహా. ఇకపోతే ఈ రచ్చబండ కేవలం విషయ అవగాహన కొరకు ఏర్పడిన చర్చా వేదిక మాత్రమే!
Deleteశుక్రారాచార్య గారికి మీకు నమస్కారాలు!
Deleteనిజమే “కాల్పనిక హిందూ మతా”నికి “కాల్పనిక ఇస్లాం మతా”నికి అలాగే “కాల్పనిక క్రైస్తవ మతా”నికి మీరు అన్నట్టు “తేడా ఉంటుంది”. ఎందుకంటే- వాటిని నిర్మించింది స్వార్ధ పారులూ సంకుచిత స్వభావులూ అయిన శాస్త్రులు. వారు ఆ మతాలను ప్రజల బ్రతుకులను నాశనం చేసి, తమ స్వలాభం కొరకు నిర్మించు కొన్నవి కనుక. కాని, నిస్వార్ధపరుడూ విశాలహృదయుడూ అయిన సర్వోన్నత సర్వేశ్వరుడు కేవలం “సకల మానవాళి విశాల హితం” కొరకు నిర్మించిన సనాతన ధర్మం-ఇస్లాం ధర్మం-క్రైస్తవ ధర్మం వివిధ భాషలనుబట్టి వివిధ పేర్లతో పిలువబడుతున్న ధర్మం అయితే ఒక్కటే! అందులో “తేడా ఉండదు”. ఆ “విశ్వజనీన ధర్మం” శాస్త్రాలలో ఉంది. ఆ ధర్మ శాస్త్రాలను దుష్ట బుద్ధిగల శాస్త్రులు సామాన్య ప్రజలకు అందకుండా మరుగు పరిచేసారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా ప్రజల ముందు కేవలం వాటి పేరు చెప్పి, తమ కాల్పనిక తప్పుడు బోధలు చెలామణీ చేస్తుకుంటున్నారు. సర్వజన హితకారి అయిన ఆ “విశ్వజనీన ధర్మం” బయటకు రావటం నేటి ఏ మత వర్గపు పండితునికీ ఇష్టం లేదు. ఆది కనుక బయటకు వస్తే ఈ దుష్ట పండితుల బండారం బట్టబైలు అయి వారు బజారున పడక తప్పాదు!
కనుక, మీ లాంటి ఉత్తములు మా హిందూ ధర్మం, మీ ఇస్లాం ధర్మం, వారి క్రైస్తవ ధర్మం వంటి వేర్పాటు వాదాన్ని తగ్గించాలే తప్ప పెంచకూడదు. మీరు ఈ క్రింది మంత్రంలోని అసలు విషయాన్ని దాటవేశారు.
కొందరు పండితులై ఉన్ననూ నా మాయచేత మోహితమైన చిత్తము కలవారై, అంతటనిండియున్న ఆత్మానగునన్ను పొందజాలక కేవలము ఉదరమును (పొట్టను) నింపుకొనుటకై కాకుయవలే అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (భక్తుడు) శిలామయములను, లోహమయములను, మణిమయములను, మృత్తికామయములను అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కావున అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షకామియగు యతి (భక్తుడు) తన హృదయ స్థితుడగు పరమాత్మనే పూజింపవలయును గాని బాహ్య అర్చనాను చేయరాదు. –మైత్రేయోపనిషద్ 2:26, 27
సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు పై మంత్రంలో విగ్రహారాధనకు అనుమతి ఇస్తున్నాడా? నిషేధిస్తున్నాడా? విగ్రహారాధనను చేయించే వారు దుష్టశక్తి అయిన “మాయదారి మాయ”కు లోనైనా వారే అని సర్వేశ్వరుడు స్వయంగా చెబుతున్నది వాస్తవం కాదా? అలాగే ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధనను చేయించటానికి కారణం- పొట్టకూటికి కాకుల్లా మారటం అని సర్వేశ్వరుడే స్వయంగా చెబుతున్నది సత్యం కాదా? విగ్రహారాధకులకు ముక్తి లభించదు అని సర్వేశ్వరుడే స్వయంగా ప్రకటిస్తున్నది యథార్థం కాదా? ఈ క్రింది మంత్రం విగ్రహారాదకుల గురించి చెప్పే దానిని మీరు కాదనగలరా?
శివుడు (సర్వేశ్వరుడు) దేహమందుండగా, మూఢుడు తీర్ధమందు, దానమందు, జపమందు, యజ్ఞమందు కాష్ఠమందు, పాషాణమందు (విగ్రహమందు), సర్వేశ్వరుని చూచును. లోపలనున్న నన్ను (సర్వేశ్వరుని) వదలి బయటనున్న శివుని యెవడు సేవించునో వాడు చేతిలో (అన్నం) ముద్దను వదలి, మోచేతిని నాకినట్లే. యోగులు సర్వేశ్వరుని ఆత్మయందే చూతురు. ప్రతిమ (విగ్రహము) లందు కాదు. – దర్శోపనిషత్ 4:5
ఈ మంత్రం ప్రకారం విగ్రహారాధకులు చేతిలో ఉన్న అన్నం ముద్దను వదలి మోచేతిని నాకే మూఢులన్నది వాస్తవం కాదా? సర్వేశ్వరుని చూడవలసింది ఆత్మలోనే కాని, విగ్రహంలో కాదన్నది యథార్థం కాదా?
పాషాణమందు (విగ్రహమందు), సర్వేశ్వరుని చూచు వాడు మూఢుడు. దీనిని బట్టి- పండితులు ప్రజలచే విగ్రహారాధన చేయించేది వారిని ఎల్లప్పుడూ మూఢులుగా ఉంచటానికేనని అర్థం అవుతుంది.
ఆత్మయందు సర్వేశ్వరుని చూచు వాడు యోగి. దీని ప్రకారం- ప్రజలచే విగ్రహారాధన మాన్పించి, వారిని ఎప్పటికీ యోగులుగా మార్చే ఉద్దేశ్యం పండితులకు లేదని సుస్పష్టం అవుతుంది.
మన దేశంలో హోమోసెక్స్‌ని సమర్థించేవాళ్ళు నిజంగా ఇంత మంది ఉన్నారా? చిన్నప్పుడు నేను నా కంటే వయసులో నాలుగేళ్ళు పెద్దైన అమ్మాయిని ప్రేమిస్తేనే మా బంధువులు అభ్యంతరం చెప్పారు. మన దేశంలో స్త్రీకి భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకునే హక్కు లేదు, స్త్రీకి ఆమె కంటే వయసులో చిన్నవాణ్ణి పెళ్ళి చేసుకునే హక్కూ లేదు. మీరేమో హోమోసెక్స్ చేసే హక్కు గురించి చర్చిస్తున్నారు. అమ్మాయి అందగత్తె అయితే, ఆమె భర్త చనిపోయిన స్త్రీ అయినా ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటారు, ఆమె అబ్బాయి కంటే నాలుగైదేళ్ళు పెద్దైనా పర్వాలేదనుకునేవాళ్ళు ఉంటారు. కానీ హోమోసెక్స్‌కి ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు బ్లాగుల్లో కాకుండా నిజజీవితంలో ఎక్కడైనా ఉన్నారా? మీలో ఎవడైనా "ఆడది దొరక్కపోతే మగాణ్ణి పెళ్ళి చేసుకుంటాను" అని నిజజీవితంలో commitment పెట్టుకోగలడా? ఆచరించని సూక్తులు అబద్దాలతో సమానమని బెంజమిన్ ఫ్రాంక్లీన్ ఊరికే అనలేదు.
ReplyDelete@MARXIST HEGELIAN,
ReplyDeleteఅన్నా నీకో దండమే ! అందరి తరపునా నేను వకాల్తా పుచ్చుకోలేను కానీ, జెనరలుగా విషయం చెప్పగలను. చాలా మంది స్వలింగ సంపర్కుల హక్కులను సమర్ధిస్తున్నది వాళ్ళు స్వలింగ సంపర్కులు అయ్యుండబట్టి కాదు. తమ తోటి ప్రజల హక్కులను గౌరవించాలన్న చిన్న ఫీలింగ్ తోటి. నా వరకు నేను.. ప్రపంచములోని అమ్మాయిలందరూ చచ్చిపోయి, కేవలం మగాళ్ళు మాత్రమే మిగిలిన పరిస్థితి వచ్చినా .. హోమో సెక్సు జోలికి మాత్రం పోను. At the same time, ప్రపంచములో అందరూ భయపడుతున్నట్లు hetero sexual రిలేషన్స్ అంతరించి పోయినా, homosexuals హక్కులను అడ్డుకుంటామంటే వ్యతిరేకించకుండా ఉండలేను. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. లేదు, హోమోసెక్సువాలిటీని సమర్ధించాలంటే.. ఖచ్ఛితంగా హోమో సెక్సువల్ అయ్యుండాలి లేదంటే.. అవకాశం వస్తే అవ్వాలి అనుకుంటే.. మీ ఇష్టం. ఇంతే సంగతులు, చిత్తగించవలెను.
హోమోసెక్స్ చేసేవాళ్ళ హక్కుని అడ్డుకోవలసిన అవసరం నాకు లేదు. హోమోసెక్స్ చేసుకునేవాళ్ళు నా పక్కింటిలో ఉంటే వాళ్ళ మీద పోలీస్ స్తేషన్‌లో అసహజ లైంగిక చర్య అనే కేస్ పెట్టాలని కోరను. హోమోసెక్స్ చేసేవాళ్ళు తమ పని తాము చేసుకోకుండా, తమ హక్కులని గుర్తించాలి అంటూ అస్తిత్వవాదుల్లా పోరాటాలు చెయ్యడమే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వోహ్ లోగ్ చార్ దీవారోంకే అందర్ కర్నే వాలా కామ్‌కో చౌరస్తాయోఁమే జనతా కే సామ్‌నే publicity దేతే హై.
Deleteఅయ్యా శుక్రారాచార్య గారూ! మీకు నమస్కారాలు!
Deleteఎవరు ఎవరి మధ్య లైంగీక సంబంధం పెట్టుకున్నా మీకు ఏ విధమైన అభ్యంత్రమూ లేదు. అలాంటి వారిని ఎవరైనా అడ్డుకుంటే అడ్డుపడటమే మీ జీవిత ధ్యేయం అంటారు మీరు. అంతే కాదా! అంటే లైంగీక సంబంధాలకు లింగ భేదం గాని వావివరసల భేదం గాని మీకు అక్కర లేదు. కనీసం ఏ పశువూ పాల్పడని నీచాటి నీచమైన స్వలింగ సంపర్కాన్ని మీరు నేడు సమర్ధిస్తున్నారు. రేపు ఎవరైనా ఒక పురుషుడు తన తల్లితోనో, చెల్లితోనో లేక సొంత కూతురితోనో లైంగీక సంబంధం పెట్టుకుంటే? అలాగే ఒక స్త్రీ తన తండ్రితోనో, అన్నతోనో లేక తన కొడుకుతోనో లైంగీక సంబంధం పెట్టుకుంటే? అలాంటి నీచ నికృష్ట, పశుప్రాయమైన చర్యలకు పాల్పడిన వారిని మేము అడ్డగిస్తే, అప్పుడూ మీరు మాకూ అడ్డుపడతారా? లైంగీక సంబంధాలకు ఏ ఇద్దరైనా ఒక్కటైపోవటానికి “పరస్పరం సమ్మతించటం” తప్ప మరొక “నియమము” మీ వద్ద ఏదీ లేదా శుక్రారాచార్య గారూ! లేదంటే లేదని, ఉందంటే అదేమిటో చూపగలరు.
శుక్రాచార్య, నీ వాదన శుక్రాచార్యుని ఒంటి కన్ను లాగే ఉంది. Subjectivityని వదిలి objectivity వైపు రా. నా దృష్టిలో పిన్ని వరస స్త్రీని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు కాబట్టి ఎవడైనా హిందూ సంప్రదాయాన్ని ధిక్కరించి తనకి పిన్ని వరస అయిన స్త్రీని పెళ్ళి చేసుకుంటే నేను అతనికి solidarity తెలుపుతాను. నా నిజ జీవితంలోనే పిన్ని వరసైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కాబట్టి అదే పని వేరేవాళ్ళు చేస్తే నేను అభ్యంతరం చెప్పను. కానీ హోమోసెక్స్ చేసేవాళ్ళ హక్కులు గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేమిటి? వాళ్ళు హోమోసెక్స్ చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు కానీ దానికి నా ఆమోదమో, ఇతరుల ఆమోదమో వాళ్ళకి అవసరం లేదు.
Deleteస్వలింగ సంపర్కాన్ని సమర్ధిస్తే, (Incest) రక్తసంబందీకుల మధ్య సంపర్కాన్ని కూడా సమర్ధించాలా !?
Deletehttp://sukracharyatherakshasguru.blogspot.in/2015/07/incest.html
నీది ఒంటి కన్నో, మెల్ల కన్నో నాకు తెలియదు. సెక్స్ వాంఛలు అనేవి ఆడ-మగ మధ్య కలుగుతాయి తప్ప ఒక మతం ఏర్పాటు చేసిన వరసల ఆధారంగా కలగవు, హిందువులు ఏర్పాటు చేసిన గోత్రాల ఆధారంగా అయితే అంతకన్నా కలగవు.
Deleteఇందాక నేను బయట ఉండడం వల్ల మైక్రోమాక్స్ ఫోన్‌లో తెలుగు వ్రాయలేక ఇంగ్లిష్‌లో వ్రాసాను. Incestని హిందీలో వ్యభిచార్ అంటారు. కానీ తెలుగులో వ్యభిచారం అనే పదాన్ని వేశ్యావృత్తి అనే అర్థంతో వాడుతారు. హిందీలో వ్యభిచార్ మరియు వేశ్యావృత్తి వేరువేరు అర్థాలు ఉన్న పదాలు. డబ్బులు తీసుకుని సెక్స్ చెయ్యడం సంస్కారం కాదు కనుక వేశ్యావృత్తిని నేను వ్యతిరేకిస్తాను. నిషిద్ధ వరసలవాళ్ళతో సెక్స్ చేసేవాళ్ళు డబ్బులు తీసుకుని అది చెయ్యరు కదా, దానిపై అభ్యంతరం ఎందుకు ఉండాలి?
Deleteఒరేయ్ గాడిద! చౌదరీ! నీ ఖురాన్ ప్రకారం నిష్కల్మషమైన జంతువులు incestకి పాల్పడడం లేదూ? గుండెలమీద చెయ్యేసుకొని చెప్పు. మహమ్మద్ చేసినది incestకాదని ఒక అరబ్బుతోటి చెప్పించు. దాన్ని దాటవేసే నువ్వు నాకు నీతులు చెబుతావా?
Deleteవిశేషజ్ఞ...నీవు ఆడదానివో,మగాడివో తెలియదుగాని ముందు మాటలాడే సంస్కారం నేర్చుకో! అంతకు మించి ఎక్కువుగా ఎంత చెప్పినా నీకు వేస్టే !
Delete@MARXIST HEGELIAN
ReplyDeleteనహీన్ హే భాయ్, వొహ్ లోగ్ రస్తే మైన్ యె సబ్ కర్నా నహిన్ చాహ్తె హై. కానూన్ ఐస హై కి, ఉన్ లోగ్ యే సబ్ బంద్ హుయె దర్వాజె కె పీచె భి నహిన్ కర్ సక్తే. పతా చలేగా తో మిలేగీ బహుత బడీ సజా, పెహ్లే సమాజ్ సె ఫిర్ కానూన్ సె. ఇస్లియే యే లోగ్ చుప్కె చుప్కె జిందగీ జీతే హై ! యేస నహిన్ హోనా హై.
చార్ దీవారోంకే అందర్ కర్నేవాలా కామ్‌కే బారేమే సారా శహర్‌కో కైసా పతా చలేగా, బినా హంగామా సే! చార్ దేవారోంకే అందర్ వ్యభిచార్ (incest) భీ హో సక్తా. బినా కోయీ బతాయా, ఉస్కే బారేమే కిసీకో కుఛ్‌భీ పతా నహీఁ చలేగీ.
ReplyDeletepraveen...
ReplyDeletetu kisi bhi carca mein hone laayak naheeN ho. ye maan kar hame tang karnaa chchoD do.
అభిలాషుగారు ఇంకేమీ దిక్కుతోచక moral black mailingకు దిగారన్నమాట! మరి అదే అభిలాషుగారు ప్రవక్తగారి దిర్నీతి గురించి, వారికి ప్రభువుగారు పలికిన వత్తాసు గురించి నోరెత్తరెందుకో! వారు అహ్మద్ చౌదరిగారు కనుకనా? వారికి సరిపడా balls లేకనా?
మతము, ధర్మము అనేవి కొందరు అగ్రకులస్తులు (అంటే దానికి కేవలం హిందువులే భుజాలు తడుముకోనఖ్ఖర్లేదు. మౌల్వీలూ, పాస్టర్లూ చేసే productive పని ఏమీలెదు. ఈ నాయాళ్లందరూ జనం సొమ్ముమీద తేర తిని బలిసిన నాయాళ్ళే) సృష్టించిన బూటకపు కానెప్టులు. ముస్లిములు, క్రైస్తవులూ యూదులను ఎలా చిన్నచూపు చూస్తారనది జగద్విదితం. హిందువుల సంగతి సరేసరి. ఇలాంటివాళ్ళు నైతికత గురించి ఫేకడం, మనం చదవడం, కామెంటడం.
ఈ వెధవ మతాలు తెగ అఫాలో అయిపోతున్న సమాజాల్లో మానవహక్కుల గురించి మనకు తెలిసినదే. ఇలాంటివాళ్లకు తోడుబోయిన అజ్ఞాని మనువుగాడొకడు. నాకనిపించేదేమిటంటే.. అన్ని మతాలూ ఓక్టే... అవి నిజాన్ని అంగీకరించవు. అలా అంగీకరించేకంటే.. ఒక దారి తెన్నులేని 'మానవ ప్రవృత్తికి భిన్నమైన' (ఈ మాట వాడింది మనువు గారే) పట్టుకొని వ్రేళ్ళాదుతాయి.
బాబూ నేను వందరూపాయల నోతుమీద సంతకం చేసి ఇవ్వగలను. ఇస మఝబ్ నాంకె చూతియాగిరీ జ్యాదాసెజ్యాదాతర్ తీస్ సాల్ తక్ చలేగా. ఉస్కే బాద్ ఇంకా మిజాజ్ వహీ హీఓగా జో అబ్ హోమోస్ కా హొరా.
అన్ని మతాలూ ఒకటి కాదు. హిందూ మతం కంటే ఇస్లాం చాలా నయం. ముస్లింలు, యూదులు స్త్రీకి భర్త చనిపోయిన మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. హిందువులలో అయితే స్త్రీకి భర్త చనిపోయిన పదో రోజే గాజులు పగలగొడతారు.
ReplyDeleteఆ మధ్య తెలంగాణా ప్రభుత్వం తమ రాష్ట్రంలో భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీలు ఎంత మంది ఉన్నారో సర్వే చెయ్యాలనుకుంది. ప్రభుత్వం విధవా వివాహాల గురించి ఎంక్వైరీలు చేస్తోంది అంటూ తెలుగు దేశం నాయకులు అభ్యంతరం చెప్పారు, విధవా వివాహం అనేది వినకూడని పదం అన్నట్టు. ఉద్యోగం ఉన్న స్త్రీలకీ, రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీలకీ వితంతు ఫించన్ ఇవ్వరు కాబట్టి ప్రభుత్వం ఆ సర్వే చెయ్యాలనుకుంది కానీ తెలుగు దేశం నాయకులు విధవా వివాహం పేరే ఎత్తకూడదని అభ్యంతరం చెప్పారు. వీళ్ళ కంటే ముస్లింలు చాలా నయం కదా.
హిందూ హిపోక్రిసీ గురించి ఇంకో విషయం. భోగం స్త్రీకి గ్రామంలోని మగవాళ్ళందరూ మొగుళ్ళే. గ్రామంలోని మగవాళ్ళందరూ చనిపోయినా భోగం స్త్రీకి గాజులు పగలగొట్టరు కానీ ఒక భర్తని నమ్ముకున్న పతివ్రతకే గాజులు పగలగొడతారు. ఇలాంటి అనాగరిక ఆచారాలు ఉన్న మతాని వేరే ఏ మతంతోనూ పోల్చలేము.
DeleteThis is mere perspective. I could recount a hundred ways where Islam is more restrictive than any other religion (in it's current practices). Also sir! the most judgmental guys I have encountered in my regular life are Muslims. All that these guys expect from a marital relationship is someone who would never oppose them and would willingly be subjugated to them -a sex slave. Not event the software and the creative world is an exception.
DeleteHinduism is worse but Islam is not better
నేను పుట్టినది హిందూ కుటుంబంలో కనుక నేను సాంఘిక దురాచారాలని ఎక్కువగా గమనించినది కూడా హిందూ కుటుంబాలలోనే. ఒక హిందూ పురుషుడు భోగం స్త్రీ దగ్గరకి వెళ్ళి ప్రమాదకరమైన గుప్తరోగం అంటించుకోవడానికి సిద్ధపడతాడు కానీ విధవని పెళ్ళి చేసుకుని ఆమె పిల్లలకి తండ్రి కావడానికి మాత్రం వెనుకాడుతాడు.
Deleteమీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. .అయితే ఒకప్పుడు హిందూ స్త్రీలు పునర్వివాహానికి వెనుకాడే పరిస్తితి ఉండేది. ఇప్పుడది లేదు. ఇతర వర్గస్తులలాగే హిందువులు కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.
Deleteస్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించ నక్కర్లేదు. అలాగని నిషేధించాల్సిన/ అడ్డుపడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళని కూడా నార్మల్ గా చూసి గౌరవించవచ్చు.
ReplyDelete