యేసువారు నిజంగానే ఇండియా వచ్చారన్నది వాస్తవమా? కట్టుకధా?
సాక్ష్యం మేగజైన్ లో వస్తున్న బైబిల్ అంశాలకు కొంతమంది చాలా విలువైన సమాచారంతో కూడిన కొన్ని లింక్స్ అందించడం జరుగుతోంది. వాటిలో యేసు ఇక్కడి భారతదేశం వచ్చి తన తత్వ జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడని కధనాలు వ్రాసుకొచ్చారు. ఇవి ఎంతవరకూ వాస్తవికత కలిగియున్నాయి?
మా ఊర్లో తిమ్మన్న అంజనం వేస్తే ఏదైనా కనపడాల్సిందే, కాని పాపం పోయాడు, వాని కోడుకు వేస్తాడేమో కనుక్కొని అంజనం వేయించి యేసు వచ్చాడొ లేదో కనుక్కుంటాను. ఏసు మాట ప్రభువుకెరుగు , మొన్న వేలంకని కి వెల్లాను, అక్కడ సుప్రసిద్ధమైన ఏసు దేవాలయము(కొందరు చర్చి అందురు) కలదు, అచట ఒక పాల వాడికి మేరీ మాత దర్శన మిచ్చిన దని ప్రతీతి, ఇప్పటికీ అక్కడ రెండు చక్కనైన మేరీ మాత మరియు పాల వాడి విగ్రహంబులు కలవు, అవి చూచుటకు భహుముచ్చటముగా నుండును, ఆ మందిరము సమీపము లోనే ప్రభువు యొక్క ముఖ్య మందిరము కలదు, అందున కాసేపు ప్రభువు ధ్యానించి, పాల బావి యందు ఒక ముడుపు కట్టి, పక్కనే ఉన్న ఒక పేద్ద హాలు యందు జరుగుతున్న ప్రార్థనలను విని ముచ్చటనొంది వాటిని విన గోర అటు యేగితిని, అచట ఒక ఫాదరుగా పిలువబడు పండితుండొకడుండెను, ఆతండు అరవ యాసయందు ఆంగ్లమును మిళితం చేసి భహు చక్కగా మాటలాడుచుండెను, నేను, స్వగతమున భళా రా పండితుడా నీ గ్నానం అని అనుకొంటిని. ఇంతలో వాడు రొట్టె ముక్కలను భక్తుల నోటి యందు పెట్టనారంభించెను, నేను కూడ స్వతః భోజన ప్రియుండగుట చేత, అంత వరకు ఆతని ఉపన్యాసం విని ఉండుట చేత ఇదియునూ ఉపన్యాసమున యొక భాగమని తలంచి వరుసను పాటించి పండితుని చేరి బాల కృష్ణుడు యశొదమ్మ ఎదుట తెరిచినట్టి విదంభున నోరు తెరచితిని, నెను బాల కృష్నుడిని తలిచిన వాడు నికృష్టుని తలిచెనో ఏమో, ఆంగ్లమందు నన్ను యేమో ప్రశ్నించెను, చుట్టుతా ఉన్న శబ్దముల వలన నేను వాని మాటలను గ్రహించనైతిని, ఎమియూ చెప్పకున్న సరిగాదు యని తలను సగము ఉత్తర దక్షినము , సగము తూర్పు పడమరలు తిప్పితిని, పండితుడు నాకన్నా గడుగ్గాయిలా ఉన్నాడు, చేయి ని ద్వారము వైపు చూపెను, అటు నుండె వచ్చినాడనని శెలవిచ్చితిని, అటులనె యేగుమని, నీకు రొట్టె ముక్క యందదని పండితుడు శెలవిచ్చెను, నేను నా మిత్రుడిని ఈ విషయమై విచారింపగా, కాథలిక్కులు యనబడు జాతులు ఆ రొట్టెలకు అనర్హులు యని శెలవిచ్చెను, నెను ఔరా శైవ వైష్ణవములు కలిసినా ఇవి కలువలేదా అని అచ్చెరువొందితిని,
ReplyDeleteసారంశము, ఏసు వచ్చెనో లేదో తిమ్మడి కొడుక్కి కొడుకు చేతిలోని అంజనానికి తెలుసు, కాని ప్రభువు కన్నా ముందే మేరీ మాత వెలంకన్ని కి వచ్చినది అని తెలుస్తోంది.
పాఠకులు, వెలంకని తమిళనాట నాగపట్టనం సమీపన కలదని తెలుసుకొగోరడమైనది, వెలంకని చూడ దగ్గ యాత్రా స్థలము, స్థల మహత్యము అక్కడే ప్రార్థనా స్థలమందు తెలుసుకోగలరు, ఇచటకు దగ్గరలోనే, చింబరము, కుంభకోనము, తంజావూరు, శ్రీరంగము కలవు. పచ్చావరమను విహార స్థలము కూడా కలదు.
ROFL!
DeleteRPFL!
ఏసు వారేమిటి ! ఇండియా రావట మేమిటి ! ఇవన్నీ ఒట్టి కట్టు కథలుస్మీ !
ReplyDeleteఈ కథలకి మూలాలూ లేవు; అంతా ఊహా గానాలే ! ఏసు ప్రభువే ఇండియా వచ్చి ఉంటె అప్పుడే దేశం లో క్రైస్తవం నెలకొల్ప బడి ఉండాలి గదా ? లేదే !
ఇట్లాంటి కట్టు కథలని నమ్మి మీరు ఈ లాంటి ప్రశ్నలడగడం ఎంత వరకు సబబు ?
జిలేబి