ఇతర బ్లాగులను విమర్శిస్తూ "టపాలు" వ్రాయడం సమంజసమేనా?
ఈమధ్య కొంతమంది బ్లాగర్లు, ఇతర బ్లాగుల యొక్క ఉనికిని తట్టుకోలేకో, ఉన్నతిని సహించలేకో అతి దారుణంగా విమర్శించడాలు ప్రారంభిస్తున్నారు. మొన్న ఒకరు "ప్రజ" బ్లాగును, నిన్న "రచ్చబండ" బ్లాగును, రాజకీయబ్లాగులను విమర్శిస్తూ టపాలు వ్రాయడం మీకందరికీ విదితమే! దాని ప్రభావం "ప్రజ" బ్లాగు "పల్లె ప్రపంచాని"కి డైవర్ట్ అవ్వడం, శ్యామలీయం గారిలాంటి కొంతమంది ప్రముఖులు చర్చావేదికలకు, రాజకీయ బ్లాగులకు దూరంగా ఉంటానని ప్రకటించడం జరిగిపోయాయి. ఇలా ఒకరికొకరు విమర్శించుకుంటూ టపాలు వ్రాయడం ప్రారంభిస్తే ఇక తెలుగు బ్లాగుల ప్రపంచానికి పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం లేదంటారా? కొంతమంది బ్లాగర్లు ఇతర బ్లాగులను టార్గెట్ చేసి, విమర్శిస్తూ "టపాలు" వ్రాయడం సమంజసమేనంటారా?
సరయిన పద్ధతి కాదు. నాకు తెలిసి కొన్ని ఫేక్ బ్లాగులు, ఫేక్ పేర్లతో కామెంట్లు వస్తున్నాయి గమనించగలరు. శ్యామలీయం గారిపై కామెంటినవారూ ఫేకే. అది ఆయన గమనించలేదు. ఒక వ్యక్తి కావాలని ఇదంతా చేస్తున్నట్లనిపిస్తోంది. నా అభిప్రాయం సరయినదా? కాదా? అనేది నిర్ధారించుకోవలసి ఉన్నది.
ReplyDeleteఫేక్ పేర్లతో కామెంట్లు పెడుతున్న విషయం. ఒకే వ్యక్తి వివిధ పేర్లతో బ్లాగులను రాస్తూ విమర్శించడం నాకెప్పుడో అర్ధమయ్యింది సర్.అది ఎవరో కూడా చూసాయగా తెలిసింది.మరింతగా నిర్ధారించుకుని బయట పెట్టాలా? వద్దా? అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇతర బ్లాగులను విమర్శించడం ఏమాత్రం ఆహ్వానించదగ్గ పని కాదు. ఏమైనా సూచించాలనుకుంటే చక్కగా సూచించవచ్చు.ఆయా బ్లాగర్ దృష్టికి తీసుకు వెళ్లి చర్చించవచ్చు.తప్పులుంటే సరిచేసే ప్రయత్నం చేయవచ్చు.ఒప్పులుంటే ప్రోత్సాహించవచ్చు.అంతే కాని ఇలా బ్లాగులలో ఘోరంగా విమర్శించడం సరైన పద్ధతి కాదు.
Deleteమీరు విమర్శను గాలికొదిలి విమర్శకులపై యుధ్ధం ప్రకటిస్తున్నారు. పైపెచ్చు విమర్శకే కళ్ళాలు బిగించజూస్తున్నారు. పరిధులు నిర్ణయించజూస్తున్నారు.
Deleteముబారక్ హో!