Breaking News

అవీ,ఇవీ,అన్నీ బ్లాగువారికి రచ్చబండ బ్లాగ్ పట్ల విచారం ఎందుకో?

బ్లాగ్ మిత్రుడు సాయికుమార్ గారు తన అవీ,ఇవీ,అన్నీ బ్లాగులో రచ్చబండ గురించి విచారకరం అని వ్రాసారు. దేనికి విచారమో, అసలు ఈయన సమస్య ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు.ప్రజ ,రచ్చబండ లాంటి చర్చా వేదికలు ఎన్నొ రావాలి. కొన్ని అంశాలపై చర్చలు చేయడం వలన కొంతవరకైనా నిజా,నిజాలు తెలుస్తాయి. వాటి వలన ప్రయోజనం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండానే నిష్ప్రయోజనం అంటే ఎలా? అగ్రిగేటర్లోని వ్యాఖ్యల స్థలానంతా ఈ చర్చావేదికలే మింగేస్తున్నాయి అంటున్నారు. ఇంతకు ముందు ప్రజ మాత్రమే ఉంది. ఈమథ్య అయితే రచ్చబండ వచ్చింది. ఇవి రెండూ తప్ప వేరే చర్చావేదికలే లేవు. అయినా అది వ్యాఖల స్థలమే కదా?అందులో ఏ బ్లాగులకు ఎక్కువమంది కామెంట్స్ పెడితే ఆ బ్లాగులే కనిపిస్తాయి.ఆ అగ్రిగేటర్లోని ముంగిలిలో కూడా ఇవే తాండవిస్తున్నాయా? ఏమిటి? అందులో రెండు పోస్టులు తప్ప ఎక్కువుగా ఎవరివీ కనిపించవు.అందులో ఈ చర్చావేదికలు ఆ స్థలానంతా ఆక్రమిస్తే బాధ పడినా అర్ధముంది. కేవలం వ్యాఖ్యల స్థలమే కదా! బాధెందుకు చెప్పండి. ఒకవేళ ఇతరులు చదివి వ్యాఖ్యలు పెడితేనే అవి చూసి ఆ బ్లాగులను చదువుతారా సార్? ఒకో టపా మీద ఒకొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇతరుల అభిప్రాయం చదివి మనం ఆ బ్లాగులను చదవకూడదు. అసలు ఆ బ్లాగ్ టపా ఉద్దేశ్యమేమిటో చదివి మన అభిప్రాయం వెలిబుచ్చాలి. కొన్ని అభిప్రాయాలు ఆ టపాల యొక్క ఉద్దేశ్యమేమిటో సరిగా అర్థం చేసుకోక పోవచ్చు కదా!ఒకవేళ అందులో వాఖ్యలు చదివినా తరువాత ఆ బ్లాగులను చూడవచ్చు. తప్పులేదు. అయితే అందులో ఎక్కువ వాఖ్యల బ్లాగులను తప్పు పట్టడం ఎందుకో మరి? బ్లాగిల్లు శ్రీనివాస్ గారు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అది మీ ఒక్కరికి నచ్చకపోతే తొలగించేయాల ఏమిటి? సర్ మీరు మీ బ్లాగును పాపులర్ చేసుకోవడం కోసం ఇతర బ్లాగులను నిందుస్తున్నారనిపిస్తోంది. 

5 comments:

  1. ఎవరేమన్ననూ...తోడు రాకున్ననూ.... పొరా బాబు పో .. నీ దారి నీదిలేరా! అన్న హీరో కృష్ణ పాట గుర్తుందా? మీరు చేసే పని మంచిదైనప్పుడు ఇలాంటివి సహజం. ఎదుటివాడి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి... అని ప్రేమ నగర్ సినిమాలో ఇంకో పాట ఉంది. వీలయితే. కామెంట్ పాలసీ నా కామెంట్స్ చదవండి. సాయి కుమార్ గారు తన అభిప్రాయాలను అగ్రిగేటర్ల వారికి పంపవచ్చు. ఇలా ఇంకొకరి బ్లాగులగురించి వ్రాయడం కుసంస్కారమే అవుతుంది. ఆయన చెప్పినవాటిలో మాత్రం కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అవి పరిష్కరించాల్సినది అగ్రిగేటర్లు మాత్రమే తప్ప బ్లాగర్లు కాదు. అలాంటప్పుడు బ్లాగర్లపై ఫలానా బ్లాగులో అంటూ ఆయాన పోస్టులు వ్రాయడం తప్పని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. సాయికుమార్ గారు కేవలం తన బ్లాగును పాపులర్ చేసుకోవడం కోసమే ఇతర బ్లాగులను విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇతరులెవరికీ లేని బాధ ఈయనకెందుకు కలుతుంది సర్. వారంలో ఒకరోజు తప్ప మిగతా రోజుల్లో బిజీ,బిజీ అని ఆయనే అంటున్నారు. ఎక్కువుగా తెలుగు బ్లాగులను ఆదరించేవారికి లేని బాధ వారంలో ఒకరోజు గడిపే ఈయనకెందుకో!మీరన్నది వాస్తవమే కొండలరావుగారు.మన పని మంచిదైనప్పుడు ఎవరెన్ని అన్నా పట్టించుకోవల్సిన అవసరం లేదు.కృతజ్ఞతలు సర్!!

      Delete
  2. పూర్వపు ఘర్షణా దినాలు వచ్చినవా :)

    ReplyDelete
    Replies
    1. ఒకరిద్దరు యుద్దం తీసుకురావడానికి ప్రయత్నించినా అది జరిగే అవకాశం రాదులెండి.

      Delete
    2. ఈ విషయంలో మీతో ఎకీభవిస్తున్నాను.

      నాగరికత (లేదా అభివృధ్ధికి) మూలం సంఘర్షణ. జీవానికి మౌలిక ఋజువు క్షోభ్యత. బ్లాగులోకం ఎన్నడో చచ్చినది. విమర్శను స్వీకరించలేని ఒక బ్లాగుతరం, విమర్శ ఎలా సున్నితంగా ఉండాలో నిర్దేశించే ఒక బ్లాగుతరం, నేను నచ్చకపోతే నాకు వ్యక్తిగతంగా చెప్పాల్సిందేతప్ప, నాతప్పును బాహాటపరచొద్దనే ఒక బ్లాగుతరం ప్రస్తుతం సిధ్ధించినది. ఎవరికి వారు ఒక narcissist. ఎవరికి వారు ఒక హిప్పోక్రేట్. బ్లాగులాళ్ళు ఏమైనా రాయొచ్చు. వారిని సరిదిద్దడమ్మాత్రం ప్రైవేటుగా జరగాలి. బ్లాగు అడ్మిన్ గారిని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం 'సభ్యత' మరియు 'సంస్కారము' కావు. the current blog world is not a place that would encourage Voltairs, Charvaka and Sophocles. What we are looking for in here is conformism not rationalism and clearly not skepticism.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్