Breaking News

2018 ఎలక్షన్లలో కే.సి.యార్ ఓడిపొతే ఆంధ్రాకు ప్రయోజనమన్న వాదనలో వాస్తవమెంత?

2018 ఎలక్షన్లలో కే.సి.యార్ ఓడిపొతే ఆంధ్రాకు ప్రయోజనమన్న వాదనలో వాస్తవమెంత?


4 comments:

  1. 2018 (assembly) ఎన్నికలా, 2019 (Loksabha) ఎన్నికలా? ప్రయోజనం ఆంధ్ర రాష్ట్రానికా టీడీపీ పార్టీకా?

    ReplyDelete
  2. జై గారూ, ఇది అసంగతమైన ప్రశ్న అనుకుంటున్నాను.

    కేసీఆర్ గారి పాలన బాగుందని జనం అనుకున్న పక్షంలో వారికి గెలుపు లబిస్తుంది. ప్రక్కరాష్టం సుభిక్షంగా ఉండకూడదని ఆంధ్రులు ఏమాత్రమూ అనుకోరు.
    కేసీఆర్ గారి పాలన జనానికి నచ్చక ఆయన ఓడిపోతే పరిణామాల వలన తెలంగాణా రాష్ట్రానికి లాభనష్టాలేమిటన్నది కాలం తేలుస్తుంది. ఇక్కడ ఆంధ్రుల ప్రసక్తి అనవసరం అనుకుంటాను.

    కేసీఆర్ పాలనవలన తెలంగాణా అనే మిగులు రాష్ట్రం కాస్తా అప్పుల కుప్ప అవుతున్నదని వాదించే వారున్నారు. అది నిజమే ఐన పక్షంలో ఆయన మరలా అధికారంలోనికి వచ్చి తెలంగాణాను దివాళాతీయించకుండా చూసుకోవలసినది తెలంగాణా ప్రజలు. ఆంధ్రప్రజలకు లాభనష్టాలేవీ ఉండవిక్కడ.

    కొందరు మాత్రం అక్కడక్కడా, ఆంధ్ర అభివృధ్ధిపధంలో ఉన్నది, ఇక్కడ కేసీఆర్ తెలంగాణాను దివాళా తీయిస్తున్నారు కాబట్టి ఆంధ్రకే లాభం కేసీఆర్ మళ్ళా రావటం అనుకోవటం గమనార్హం. నిజానిజాలు పరమాత్ముడి కెఱుక. ఏది ఏలాగు జరిగేదీ కాలమే నిర్ణయిస్తుంది.

    రెండు రాష్ట్రాలూ అభివృధ్ధిలో పోటీపడటం అంతింమంగా ఉభయరాష్ట్రాలకూ లాభం - దేశానికీ లాభం.

    ఇకపోతే కేసీఆర్ ఓడిపోతే ఐనా, ఆయన తిట్ల ప్రవాహానికి బ్రేక్ పడుతుందేమో - అది మాత్రం ఆంధ్రులకు లాభమేను ఒకరకంగా. కసిపెరిగి ఆయన మరిన్ని తిట్లుతిట్టే అవకాశమూ ఉందన్నదీ నిజమే అని ఒప్పుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. జైగారూ! కేసీఆర్ తన బూతులు.. తెలంగాణా సంస్కృతి అని చెప్పుకుంటాడు. నిజంగానే మీ సంస్కృతి అదేనా?

      Delete
    2. @శ్యామలీయం:

      ఏ రాష్ట్రానికయినా లాభమో నష్టమో ఏదయినా అక్కడి నాయకుల వల్లనే జరుగుతుంది. కేంద్రంలో లేదా వేరే ఇంకో రాష్ట్రంలో పార్టీల గెలుపోటములు ఏమయినా ఒరిగేదీ లేదు పోయేదీ లేదు.

      ఈ విషయంలో మీరూ నేను ఒకటే మీరు మీ శైలిలో నేను నా పద్దతిలో చెప్తున్నామని అనిపిస్తుంది.

      దేశంలో ఉన్న 29 రాష్ట్రాలన్నీ ఒకరితో ఒకరు పోటీ పడితే అందరికీ మంచిది. ప్రత్యేకంగా ఒకరితోనే పోటీలు పోలికలు అనవసరం. ఉ. వ్యవసాయంలో పంజాబ్, పారిశ్రామికంగా గుజరాత్, విద్యాపరంగా కేరళ ముందంజలో ఉన్నాయి ఆయా రంగాలలో వారినే బెంచుమార్క్ పెట్టుకొని కృషి చేయాలి. (ఇదే నెగటివుగా తీసుకుంటే నేరాలలో బీహార్, వెనుకబాటులో ఒరిస్సా, కాలుష్యంతో ఢిల్లీ లాంటి వాటిని చూసి ముందు జాగ్రత్త పడాలి).

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్