Breaking News

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం?

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం? | Is there any conspiracy behind you in Jagan's murder?

జగన్ హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులెవరని మీ అభిప్రాయం?

7 comments:

  1. ఇంకెవరు పచ్చ కామెర్ల సై"కిల్" పార్టీ వాళ్ళే

    ReplyDelete
    Replies
    1. జై గారు మీకు చంద్రబాబు, టిడిపి వాళ్ళన్నా ఎందుకంత ద్వేషమో చెప్పగలరు? నిజానికి టిడిపి వాళ్ళకు జగన్ను హత్య చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జగన్ వలన టిడిపి వాళ్ళకు ఏమంత నష్టం కానీ ప్రమాదం కానీ లేవు. నాకు జగన్ పట్ల జరిగిన ఈ హత్య యత్నం అంత ఒక డ్రామా లాగా కనిపిస్తోంది. ఆల్రెడీ రాష్ట్రంలో చంద్రబాబును అన్ని వైపుల నుండి మూసేయాలని చూస్తున్నారు. ప్రజల దృష్టిలో కూడా చంద్రబాబును దుర్మార్గుడిగా ముద్ర వేయాలని విశ్వ ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏమంత జగన్ కు ప్రయోజనం కలిగించదు పైగా నష్టాన్ని చేకూర్చుతుంది.

      Delete
    2. ఆంధ్ర గురించి ఏ మాత్రం ఆలోచించని బిజెపినీ వెనకేసుకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బీజేపీతో చేతులు కలిపి జగన్ ఈరోజు చంద్రబాబును మంచి వేయాలనుకుంటే రేపు పొద్దున్న జగన్ కు కూడా బిజెపి చేతులో అదే పరిస్థితి ఎదురవుతుంది. మోడీ గారికి ఆంధ్ర అంటేనే ఇష్టం లేనప్పుడు జగన్ అంటే ఎలా ఇష్టపడతాడు? ఉపయోగించుకోవడానికే గాని అందులం ఎక్కించడానికి ఏ మాత్రం సహకరించడు. ఈ విషయం జగన్ అర్థం చేసుకుంటే మంచిది.

      Delete
    3. చౌదరి గారూ, వంగవీటి రంగాను హత్య చేయాల్సిన అవసరం కూడా లేదు, మరి చేసారు కదా.

      అసలు గత ఎన్నికలలో జగన్ సొంతంగా పోటీ చేస్తే మోడీ, పవన్ & యావత్ ఎల్లో మీడియా మద్దతుతో చంద్రబాబు అత్తెసరు ఓట్లతో గెలిచాడు. ఇప్పుడు చంద్రప్రభకు గ్రహణం పట్టింది, మోడీ వేవు తగ్గింది, పవన్ బాబు వేర్లు పడ్డారు, ఆంధ్రాలో కాంగ్రెస్ కూడా కొంచం పుంజుకుంది. ఒకరితో కలిసే అవసరం జగన్ గారికి ఎందుకు ఉంటుంది?

      జగన్ మోడీతో కలిశాడనే ప్రచారం వెనుక మైనారిటీ ఓట్ల తాపత్రయం తప్ప వాస్తవాలు ఏమున్నాయి?

      Delete
  2. స్థూలంగా ఎవరికి వారు తమ స్వభావాన్ని స్వీయ విశ్లేషణ చేసుకుంటే అంతిమంగా తేలేదేంటంటే తామనుకున్నదే పూర్తిగా కరెక్ట్ అన్న కంక్లూజన్. కరెక్ట్ కాదనుకున్నప్పుడు కూడా కులం, మతం, అభిమానం, పార్టీ వగైరాలు లోపలి కాన్సయిన్స్ ను, చదువుతో వచ్చిన జ్ఞానాన్ని, తార్కికతను, నొక్కి తొక్కేస్తున్న కలికాలం. దీనికెవరూ ఎక్సెప్షన్ కాదు. ఓ వెయ్యి మందిలో ఒకళ్ళో ఇద్దరో ఎక్సెప్షన్. ఇది పక్కా.

    సో, జగన్ ని సపోర్ట్ చేసే వాళ్లకు వైసీపీ వేపునుంచి తప్పులు పెద్దగా కనపడవు. అలాగే చంద్రబాబు ని సపోర్ట్ చేసే వాళ్లకు టీడీపీ లో తప్పులు అసలు కనపడవు. వాళ్ళ వాళ్ళ దృష్టి కోణం నుంచి చూసినప్పుడు - వైసీపీ కి ఇది పక్కా టీడీపీ స్కెచ్ లా కనబడుతుంది, టీడీపీ కి ఇది పక్క వైసీపీ స్కెచ్ లా కనబడుతుంది. దురదృష్టవశాత్తూ ఇప్పటి వ్యవస్థల్లో నిష్పక్షపాతంగా నిజ నిర్ధారణ చేసే సంస్థలేమీ లేవు. ఇక్కడ మనం తప్పనిసరిగా మిస్ అవ్వాల్సిన లాజిక్ ఒకటుంది. పార్టీలు మారినప్పుడు అదే వ్యక్తులకు తామన్న దానిపై అదే నిబద్దత ఎందుకుండదు అన్న సందేహం. దాన్ని మనము ఇంకో విధంగా, తప్పదు గనుక, సరిపుచ్చుకుందాం, ఈ విధంగా - వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే కరెక్ట్.

    రాజకీయవేత్తలు అధికార యంత్రంగాలనుఁ, అధికారులనూ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్న రోజులివి.
    వీధి గూండా పోలీసును కొడితే, పోలీస్ బాస్ లే వెళ్లి గూండాకు సారీ చెబుతున్న కాలం ఇది.. ఆ గూండా టీడీపీ వాడైతే వైసీపీ వాడికి జరిగింది అన్యాయం అనిపిస్తుంది. అదే, గూండా వైసీపీ వాడైతే అప్పుడు టీడీపీ వాడికి జరిగింది అన్యాయం అనిపిస్తుంది. ఇప్పటి కాలానుగుణంగా మనం కూడా అటైతే ఇటు రాసుకో - ఇటైతే అటు రాసుకో.
    ఎమ్మెల్యే కేసు పెట్టదలచుకుంటే పోలీస్ అధికారులే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కేసు నమోదు చేస్తూ - అదే ఓ సామాన్యుడు కేసు పెట్టటానికి పోలీస్ స్టేషన్ కి వస్తే - అవతలి వ్యక్తి ఎవరన్నది పూర్తిగా తెలుసుకుని, అవతలి వాళ్లకు తెలియజేసిన తర్వాత, తిరిగి కేసు పెట్టడానికి వచ్చిన వాడిపైనే కేసు రిజిస్టర్ చేస్తున్న రోజులివి. సాక్షాత్తూ హై కోర్ట్ లే ఎమ్మెల్యే లు గూండాల పైన చర్యలు తీసుకోమన్నా, ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయమన్నా పట్టించుకోని రోజులివి. పట్టని ప్రజలు ఎన్నుకుంటున్న ప్రజా రాజ్యలివి.

    ఈ పరిస్థితుల్లో ఏది న్యాయం, ఏదన్యాయం - ఏది మంచి, ఏది చెడ్డ - ఎవరు రైట్, ఎవరు రాంగ్ ...
    తీర్పిచ్చేదెవరు ? దాన్ని అసలు ఒప్పుకునే దెవరు?

    ధన మదం, భుజ బలం, అధికార మదం పూర్తిగా రైట్. మిగిలినదంతా అట్టర్ రాంగ్. అంతే.
    కాదని మీరంటే మీరంతే. నేనింతే ...

    ReplyDelete
    Replies
    1. సూపర్ సార్. మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. అంతే!

      Delete
    2. వచ్చే ఎలక్షన్ చాలా రసవత్తరంగా జరిగేలా ఉన్నాయి. ఆంధ్రాలో మరీ ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణలో మళ్లీ కెసిఆరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. మహా కూటమి ముందుకు రావడం కష్టమైన పనే. ఇక ఆంధ్రాలో అయితే మళ్ళీ tdp అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ తప్ప బిజెపి అధికారంలోకి రావడం చాలా కష్టం. అదే జరిగితే తెలంగాణలో కెసిఆర్ కు ఆంధ్రాలో జగన్ కు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్