Breaking News

ఆటోల సమస్యకు పరిష్కారం సూచించండి.

కప్పుడు ఆటో వాహనం వచ్చిన తరువాత ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉండేది. బస్సు దిగినా, ట్రైన్ దిగినా లగేజీతో ఇంటికి పోవడానికి ఎంతో వీలుగా ఉండేది. కాల క్రమేణా ఆటోల సంఖ్య పెరిగిపోవడమో, లేక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఆటో డ్రైవర్లలా మారడమో తెలియదు గాని ప్రయాణికులకు మాత్రం ఆటో ప్రమాదీకారిగా మారిపోయింది. ఆటో వాలాలందరూ ఒకలాంటి వారు మాత్రం కాదు. తమ ప్రయాణికుల పట్ల గౌరవభావంతోనూ, నమ్మకంగానూ, నిజాయితీగాను పని చేసే మంచివారు కూడా ఉన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, వృద్దులకు, వికలాంగులకూ ఉచితంగా సర్వీస్ అందించే గొప్ప మనస్సున్న వారు కూడా ఉన్నారు. అయితే అత్యధికులు ప్రమాదకరమైన వారే ఉన్నారు. ఒంటరిగా ఆడది ఆటో ఎక్కితే చాలు... అత్యాచారాలకు పాల్పడే వాళ్ళు కూడా ఉన్నారు. నిలువునా దోచుకునే వారు సైతం కూడా ఉన్నారు. రాను,రానూ వీళ్ళ నేరముల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం సూచించాలో తెలియజేయగలరు? ప్రయాణికుల భద్రతకు జాగ్రత్తలు సూచించగలరు?

4 comments:

  1. అన్ని ఆటోస్ GPS ఫీచర్ ఉన్న మీటర్ పెట్టాలి(ముంబైలో అమలు చేస్తున్నారనుకుంట). మీటర్ అనేది కచ్చితంగా ఉండేలా చేయాలి. డ్రైవర్ వివరాలు ఫోన్ నెంబర్ తో సహా డ్రైవర్ సీట్ వెనుక కనిపించేలా ప్రదర్శించాలి. అలానే ఆడవారు ఎక్కగానే ఆ ఆటో నెంబర్, డ్రైవర్ ఫోన్ నెంబర్ తమ తెలిసిన వారికీ SMS చేయాలి. ముఖ్యంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దారి చూసుకుంటూ ఉండాలి. తెలియని దారిలో తీసుకుని వెళ్తాను అంటే ఒప్పుకోకూడదు. ఇవన్ని ఒక్కరే ఆటోలో వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. షేర్ ఆటో కన్నా RTC బస్సు ప్రిఫర్ చేయటం మంచిది ఆడవారు ఒక్కరే ఉన్నప్పుడు.

    ReplyDelete
    Replies
    1. చాలా చక్కని పరిష్కారం! "రచ్చబండ"కు స్వాగతం...అశోక్ గారు!!

      Delete
    2. అశోక్ గారు చూపిన పరిష్కారాన్ని మించి మరొక పరిష్కారం నాకు కనిపించలేదు. చాలా భద్రతతో కూడిన పరిష్కారం చూపించారు. థాంక్స్.

      Delete
  2. మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.ఈ ఆటో డ్రైవర్లలో నూటికి 80% త్రాగుబోతులే ఉన్నారు. ఇంకా వీరి వలకు ఎక్కువుగా కాలేజీ యువతులే బలవుతున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.మిగతా జాగ్రత్తలు అశోక్ గారు చెప్పినట్టు ఫాలో అయితే చాలు.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్