తత్త్వం అంటే...అర్ధం : తత్ + త్వం = తత్త్వం. తత్ అంటే - అది లేక ఆయన త్వం అంటే - నీవు. పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే నీవు దానిని (భగవంతుణ్ణి) తెలుసుకోవడమే తత్త్వం. ఈరోజు తత్త్వం పేరుతో చెలామణీలో ఉన్నదేది వాస్తవరూపం కాదు.
మన చుట్టూ జరిగే చర్యలు ఆకాశం, గాలి , నీరు , నిప్పు ఇతర ప్రక్రుతిలో జరిగే పరిణామాలను గురించిన ఆలోచనా విధానమే తత్త్వం. భగవంతుడున్నాడనుకునేవాడు, అతనే ఈ శృష్టికి మూలం, జరిగేదంతా అతడాడించే ఆట అనుకుంటాడు. నమ్మని వాళ్లు కార్యకారణ సంబంధాలను, ప్రకృతి లోని పదార్ధ గుణ ధర్మాలను గురించి తెలుసుకోవడానికి నిరంతరం జిజ్ఞాసతో ప్రయత్నిస్తూనే ఉంటాడు. తత్త్వశాస్త్రం ఈ రకంగా రెండు ధోరణులుగా చీలిపోయి ఉంది.
ప్రకృతిలోనే దేనిలోనైనా రెండు ఉన్నాయి. రెండింటి ఘర్షణ మరియు కలియికే ఉత్పత్తికి మూలం. అదొక భాగం. అయితే సర్వేశ్వరుడిని మనిషి సృష్టించుకున్నాడు తప్ప మనిషిని సర్వేశ్వరుడు సృష్టించలేదు. మనిషికి సృష్టికర్త ఉంటే వాడొక్కడే ఉండాలి. అయితే ప్రకృతి నియమాలు ఇంత పకడ్బందీగా విచిత్రంగా వింతగొలిపేలా పరస్పరం ఆధారితంగా ఎలా ఉన్నాయి? అనే సంభ్రమాశ్చర్యమాలనుండి మనిషి మనసును తొలిచే ప్రతి ప్రశ్నా తాత్త్వికమే. వీటికి మనిషి సంతృప్తి పడే రెండు సమాధానాలుకు కారణం తత్త్వం రెండు గా చీలిపోయింది. ఒకటి శాస్త్రీయం. రెండోది భావవాదం. భావవాదమూ ఓ శాస్త్రం కాకున్నా అదే ఎక్కువ మందిని ఆకర్శిస్తున్న, భయానికి జవాబునిచ్చే బలంగా నేటికీ ఉంటున్నది.
> తత్వం అంటే ఏమిటి?
ReplyDeleteతత్త్వం అని వ్రాయాలండీ.
కృతజ్ఞతలు శ్యామలీయం మాష్టారుగారు.
Deleteరామాయణాన్ని విరచించే శ్యామలీయంలాంటి గొప్పవాళ్లు తత్త్వం గూర్చి ఓ రెండు మాటలు చెప్పుంటే బాగుంటుంది.
ReplyDeleteజ్ఞానం కోసం అన్వేషణకి చేసే ఆలోచనా విధానమే తత్త్వం.
ReplyDeleteతత్త్వం అంటే...అర్ధం : తత్ + త్వం = తత్త్వం.
ReplyDeleteతత్ అంటే - అది లేక ఆయన
త్వం అంటే - నీవు. పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే నీవు దానిని (భగవంతుణ్ణి) తెలుసుకోవడమే తత్త్వం. ఈరోజు తత్త్వం పేరుతో చెలామణీలో ఉన్నదేది వాస్తవరూపం కాదు.
మన చుట్టూ జరిగే చర్యలు ఆకాశం, గాలి , నీరు , నిప్పు ఇతర ప్రక్రుతిలో జరిగే పరిణామాలను గురించిన ఆలోచనా విధానమే తత్త్వం. భగవంతుడున్నాడనుకునేవాడు, అతనే ఈ శృష్టికి మూలం, జరిగేదంతా అతడాడించే ఆట అనుకుంటాడు. నమ్మని వాళ్లు కార్యకారణ సంబంధాలను, ప్రకృతి లోని పదార్ధ గుణ ధర్మాలను గురించి తెలుసుకోవడానికి నిరంతరం జిజ్ఞాసతో ప్రయత్నిస్తూనే ఉంటాడు. తత్త్వశాస్త్రం ఈ రకంగా రెండు ధోరణులుగా చీలిపోయి ఉంది.
ReplyDeleteరెండూ ఏదికది చీలిపోయినప్పుడు తత్త్వశాస్త్రం ఎలా అవుతుంది. రెండూ అన్వహించుకోగలిగినప్పుడే తత్త్వశాస్త్రం యొక్క పూర్ణత కనిపిస్తుంది.
Deleteచీలిక లేదా కాంట్రడిక్షన్ ఉండకూడదన్న సిద్దాంతం సనాతన ధర్మంలో లేదు. ఇది గ్రంధ మతాల నుండి అరువు తెచ్చింది.
Deleteతమ అనుభవాల ద్వారా ప్రకృతిని అర్ధం చేసుకోవడానికి తత్త్వం (లేదా తత్త్వాలు) ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియకు సర్వేశ్వరుడు అనే థియరీ అవసరం లేదు.

ReplyDelete