తెలుగు బ్లాగు మిత్రులందరికీ స్వాగతం..సుస్వాగతం.
గౌరవనీయులైన తెలుగు బ్లాగు మిత్రులారా! ఈబ్లాగు ద్వారా అనేక అంశాలపై చర్చలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ రచ్చబండ ను స్థాపించాను.ఏదైనా అంశం పట్ల నల్గురూ కల్సి చర్చించగలిగినప్పుడే దాని యొక్క లోతుపాతులు తెలుస్తాయి. దాని యొక్క అసలు ప్రయోజనం మనిషికి అర్ధమవుతుంది. దాని అసలు ఉద్దేశ్యం నిరూపితమవుతుంది. దాని కారణంగానే ఈ రచ్చబండ బ్లాగు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో నేను నిర్వహించాలనుకుంటున్నాను. ఇప్పటికే "ప్రజ" అనే పేరుతో ఓ చర్చావేదికను పల్లా కొండలరావుగారు నడుపుతున్నారు. ఇది తప్ప మరో చర్చావేదిక తెలుగు బ్లాగుల ప్రపంచంలో లేదు. బహుశా ఈ రచ్చబండ రెండవదవుతుంది. ఏది ఏమైనా ఈ రచ్చబండ అందరికీ ఉపయోగపడాలని ఆశపడుతున్నాను.
చివరిగా ఓ విన్నపం.
గౌరవనీయులైన మీరందరూ దీనిని ముందుకు నడిపిస్తారని, అందరికీ ప్రయోజనకారిగా మార్చుతారని కోరుకుంటున్నాను.
చివరిగా ఓ విన్నపం.
- సమకాలీన పరిస్థితులకు తగ్గట్లున్న అంశాలనే ఎన్నుకుని చర్చలు నిర్వహిస్తే ఉపయోగం అని నా అభిప్రాయం.
- దయచేసి బ్లాగు మిత్రులు మీరు మంచి అంశాన్ని ఎన్నుకుని మా మెయిల్ sakshyamgroup@gmail.com కు పంపండి.
- ఈ రచ్చబండ లోని అంశాలపై చర్చించగలరు.మీ అభిప్రాయలు ఎంతోమందికి ఉపయోగపడవచ్చు.
- వివాదాలకు, దుర్విమర్శలకు ఈ రచ్చబండ పూర్తి వ్యతిరేకం అని గమనించగలరు.
గౌరవనీయులైన మీరందరూ దీనిని ముందుకు నడిపిస్తారని, అందరికీ ప్రయోజనకారిగా మార్చుతారని కోరుకుంటున్నాను.
ప్రత్యేక వందనాలతో..
మీ
సాక్ష్యం గ్రూప్
బ్లాగ్ వేదిక టీం.
No comments
కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్