భారతదేశ ప్రజలలో పూర్తి సాకేంతిక సౌకర్యాలు కేవలం 30% ప్రజలకే అందుబాటులో ఉంటున్నాయి. మిగతా 70% మందికీ అవి అందుకునే పరిస్థితి లేదని కొన్ని సర్వేల రిపోర్ట్. ఇదే నిజమైతే అందరికీ అందుబాటులోకి రావాలంటే ఏమి చేయాలి?
పై ప్రశ్నను పంపినవారు: కిశోర్ (హార్డ్ వేర్ ఇంజినీర్ -కాకినాడ)
సాంకేతిక జ్ఞానం అటుంచితే ఇంకా మూఢత్వంతో మగ్గిపోతున్నారు. కనీస చైతన్యం లేకనే అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోతున్నారు. పాలకులు ప్రజలను ఓటర్లుగా కాక పౌరులుగా చూస్తే పరిస్తితిలో కొంత మార్పు వస్తుంది. ప్రజలను ఎడ్యుకేట్ చేయకుండా ఎన్ని పథకాలు పెట్టినా ప్రయోజనం ఉండదు. సాంకేతిక రంగంతో చాలా అద్భుతాలు చేయవచ్చు. అవినీతికి అడ్డుకట్ట వేయడంలో , సమాచారాన్ని అందించడం - సేకరించడం వంటివి స్పీడుగా చేయవచ్చు. ప్రతీ గ్రామానికి లేదా కొన్ని గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పరచి ప్రభుత్వమే ఓ కంప్యూటర్ ఎడ్యుకేషన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పరచాలి.
ReplyDeleteమీ ఆలోచనలు,సూచనలు చాలా చక్కగా ఉన్నాయి కొండలరావుగారు.నేను మిమ్మల్ని సమర్ధిస్తున్నాను. మీరన్నది నిజమే. ప్రజలలో చైతన్యం రావాలి.మూఢత్వం నశించాలి.మన దేశం సాంకేతికంగా ఇంకా బలంగా నిలబడితే ప్రపంచదేశాలు మన దేశం ముందు తలవంచాల్సిందే!
Delete