Breaking News

ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలొస్తే లాభమెవరికి?

ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలొస్తే  లాభమెవరికి?

20 comments:

  1. జగన్మోహన్ రెడ్డి గారికి ...

    అందుకని - ముందస్తు ఎన్నికలు - రావు. రావు గాక రావు.
    చంద్రబాబు గారికే గనుక అనుకూలంగా వుండి ఉంటే
    ఇప్పటి దాకా చడీ చప్పుడు లేకుండా వుండి ఉండేవారంటారా !?

    ReplyDelete
    Replies
    1. @ nmrao bandi గారూ! మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే పనులు (పధకాలు) చాలా ఆలస్యంగానే ప్రారoభించారు. ఇదంతా చూసి ప్రజలు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి గద..ఇదొక పన్నాగం అనుకుంటున్నారు. అన్నా కేంటీన్ల విషయంలో ప్రజల స్పందన ఇలానే ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఎలక్షన్లు వస్తే చంద్రబాబుకు మళ్ళీ అధికారం రావడం కల్లే! ఒకవేళ ఎలక్షన్లు వచ్చే ఏడాది వరకూ ఆగితే క్రమేపీ ప్రజల స్పందన ఆయన పనుల వైపు మరలి చంద్రబాబుకు సానుకూలత రావచ్చు అనుకుంటున్నాను. కాబట్టి ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు.

      Delete
    2. కే ఎస్ చోదరీ గారు,
      మీ వాదన సమంజసమే. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళు ప్రవేశ పెట్టే పథకాల్లో ఎంతో కొంత ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. సమస్యల్లా అమలులోనే. పథకాలకు కేటాయించబడిన నిధులు ప్రక్కదారి పట్టకుండా ప్రజలకు ఫలాలు చేరేట్లు చేసినప్పుడే అది సక్సెస్ అయ్యేది. అలా జరగనప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. ఏదో కంటి తుడుపుగా పధకాలు ప్రకటించి తూతూ మంత్రంగా జరిపిస్తే, ప్రభుత్వం ప్రయోజనం పొందకపోగా చెడ్డపేరు తెచ్చుకుంటుంది. ప్రచారానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రజావసరాల తీర్చడంలో లేదు అన్న ఆలోచన ప్రజలకు వస్తేనే చిక్కంతా. అన్న కాంటీన్ ల విషయమే తీసుకోండి. కాంటీన్ లను పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ చూడండి కాంటీన్ లు kfc ఔట్లెట్స్ లాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు, సర్వాంగ సుందరంగా
      తీర్చబడుతున్నాయి, ఒక్కోదానికి సుమారుగా 36 - 40 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్నారు. రాష్ట్రం మొత్తం కట్టబడే వందల కాంటీన్ లకు పెట్టుబడి యెంత అవుతోంది? వందల కోట్ల ఆ డబ్బుతో ఎంతెంత మంది కడుపు నింపవచ్చు. అంతగా ప్రజా ధనం నిరర్ధకమౌతున్నప్పుడు ప్రజలు పట్టించుకోరు, ఆలోచించరు అనుకోవడం - కళ్ళు మూసుకుని పాలు త్రాగే పిల్లి చందమె.
      పొతే క్రమేపీ ప్రజా స్పందన అనుకూలంగా మారుతుందా లేదా అనేది నిర్ణయించేది ఆఖరి రెండు మూడు నెలలే. వేచి చూద్దాం సర్ ... !

      Delete
  2. ప్రజలకేమీ లాభం లేదంటారా?

    ReplyDelete
    Replies
    1. Ramki S గారు నా దృష్టిలో లాభమనే మాట రాజకీయ నాయకులకు తప్ప ప్రజలకు లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే!

      Delete
    2. Ramky S గారు,
      ఎప్పుడైనా, ఎక్కడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వలన ప్రజలకు ఒరిగేదేముంటుంది?
      పాలిస్తున్న ప్రభుత్వమే మరలా అధికారంలోకి వచ్చిందనుకుందాం - అప్పుడు ఉండేది status quo నే కదా. పరిస్థితిలో ఉండే మార్పల్లా అక్కణ్ణుంచి మరో ఐదేళ్లు అదే ప్రభుత్వం నడవడం. కేవలం ఆరు నెల్లో
      లేక సంవత్సరమో ముందుగా ఎన్నికల్లో గెలిచి వాళ్ళు, మైండ్సెట్ మారకుండా, అదనంగా చూపించే లాభం ఏమీ ఉండదని నా నమ్మకం.
      క్రొత్త ప్రభుత్వమేర్పడిందనుకుందాం - అప్పుడు ఆ నూతన ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతుందా లేదా అన్నది కనీసం రెండు మూడేళ్లు ప్రభుత్వం నడిచాక గాని తెలవదు.
      ముందస్తు మూలంగా ఖచ్చితంగా ఓ నష్టం మాత్రం ఉంది. ఐదేళ్లకు గాను భాగింపబడ వలసిన ఎన్నికల నిర్వహణా వ్యయం , వందల కొట్ల ప్రజా ధనం, కుదింపబడిన కాలం మేరకు నష్టపరచబడినట్లే.
      పైన కే ఎస్ చౌదరి గారన్నట్లుగా "లాభమనే మాట రాజకీయ నాయకులకు తప్ప ప్రజలకు లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే!" ... ఇది మాత్రం సుస్పష్టం. లాభం ఎవరికైనా కావచ్చు - ప్రజలకు తప్ప ...

      Delete
  3. విడిపోయిన తరువాత చంద్రబాబు గారికి ఆంధ్రా ప్రజలు గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు. దానిని ఉపయోగించుకోవడంలో చంద్రబాబుగారు ఘోరంగానే విఫలమయ్యారు.

    ReplyDelete
    Replies
    1. @ K S Chowdary garu,

      చంద్రబాబు గారు ఉపయోగించుకోలేదని మీరెలా అంటున్నారు ? అధికారంలోకి రావడంతోనే హుద్ హుద్ తుఫాన్ వచ్చింది.తర్వాత మోదీ చెంబు పట్టుకొచ్చారు.చెంబుడు నీళ్ళతో ఏం చేస్తారండీ ? తర్వాత చీపురు చేతికిచ్చి ఊడవమన్నారు. ఊడవడంతోనే సరిపోతోంది. ఏదయినా చేయడానికి తైలం ఉండాలి కదా ? హైదరాబాద్ లాగా ఆదాయం వచ్చిపడుతుందా ?
      మీరసలు ఇపుడు ఆంధ్రా ఎలా ఉందో చూసారా ? చూడండి.

      https://youtu.be/u2_3kaXB53U

      Delete
    2. Forward from whatsapp...

      నువ్వు తెలుగు వాడివైతే, అందునా ఆంధ్రుడివైతే.. ఇది తప్పకుండా నీ భవిష్యత్తు. మీది కాకపోతే మీ పిల్లల, భావితరాల భవిష్యత్తు.

      చదువుతుండగానే రొటీన్ గా వినే మాట అన్నట్లు మీకనిపించవచ్చు. కానీ..

      ఒక వ్యక్తి ఆత్మస్థైర్యానికి, గుండె నిబ్బరానికీ, అచంచలమైన ఆత్మవిశ్వాసానికీ ఇది ప్రత్యక్ష సాక్ష్యం.

      ఆయన హైదరాబాద్ ని అభివృద్ధి చేసాను అంటే నవ్వాం.
      ఆయన సైబరాబాద్ ని సృష్టించానంటే నవ్వాం.
      ఆయన టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం కృషి చేసాను అంటే నవ్వాం.
      ఆయన అబ్ధుల్ కలాం పేరుని దేశ ప్రధమ పౌరుడికై సూచించాను అంటే నవ్వాం.

      ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా వీధుల్లో ఫైల్స్ చేతిలో పట్టుకొని ఐటీ కంపెనీల కోసం తిరిగాడు అంటే నమ్మలేదు.
      ఆయన వేసిన ఐటీ, బయోటెక్నాలజీ బీజాలు మొక్కలై, వట వృక్షాలై లక్షలాది మంది తెలుగు వారికి ఉపాధి, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తుంటే.. అవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తుంటే ఒప్పుకోవడానికి మనకి మనస్సు రాక మనం నిజమని తెలిసీ నమ్మలేదు.
      భాగ్యనగరంలో ఆయన వేసిన ఫ్లై ఓవర్ల మీద తిరుగుతూ ఆయన వేసాడంటే తెలిసీ నమ్మలేదు.
      షమ్షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు ఎక్కుతూ దిగుతూ దానికి ఆధ్యుడు ఆయనే అంటే మనం గుర్తించదల్చుకోలేదు.

      ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీ అని మనల్ని సన్మార్గంలో నడపాలని చూస్తే మాతో పని చేయిస్తావా అని ఆయన్ని దగ్గరుండి ఓడించాం.

      రాష్ట్ర విభజన అగ్ని ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే ఆయన సమ న్యాయం అంటే "రెండు కళ్ళ సిద్ధాంతం" అని నవ్వాం.

      తెలంగాణ ప్రజల మనోభీష్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన సమయాన తెలంగాణ రాష్ట్రం అన్నది ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆంధ్రులకు రాజధాని కావాలి. అభివృద్ధి చెందిన రాజధానికి నాలుగైదు లక్షల కోట్లన్నా ఖర్చవుతుంది అంటే ఆయన మాటలు మన చెవికెక్కలేదు.

      కొత్త రాష్ట్రాం, ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రం కాబట్టి కేంద్ర సహకారం అవసరం అని ఒక జాతీయ పార్టీతో జతకడితే విమర్శించాం.

      ఆ జాతీయ పార్టీ ఓట్ల రాజకీయాలతో మన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, మన లక్ష్యాలకు మనల్ని దూరం చేస్తున్న సమయాన నయానా భయానా వాళ్ళకి నచ్చజెబుతూ ముందు అన్ని ప్రాజెక్టుల అనుమతులు అయితే సాధిద్దాం, అసలు అనుమతులే రాకపోతే ఈ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అని పంటి బిగువున అవమానాల్ని భరిస్తూ కార్య సాధన వైపు అడుగులేస్తుంటే నలుగురం నాలుగు రాళ్ళు, సూటిపోటి మాటలు విసిరాం.

      నమ్మించి గొంతు కోసిన పార్టీపై ఒంటరిగా పోరాడుతుంటే మనకేమీ పట్టనట్లు మిన్నకుండి పోయాం.

      ఆంధ్రుల జీవనాడి పోలవరంని ఆఘమేఘాల మీద రాష్ట్రం డబ్బులతో నిర్మిస్తుంటే అందులో అక్రమాలు అని అడ్డు తగులుతున్నాం.

      పట్టిసీమని ఒట్టిసీమ అన్నాం, అమరావతిని భ్రమరావతి అన్నాం.

      ఆయన అనుభవమంత వయసులేని అక్రమార్కులూ అజ్ఞానులూ ఆయన్ని నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటే విని ఆనందించాం. వికృతానందం పొందాం.

      ప్రజాస్వామ్యబద్దంగా అధికార మార్పిడి జరిగినా ఇంకా వెన్నుపోటు అని అజ్ఞానంతో విమర్శిస్తున్నాం. అసలు ఆయన నోటితో అనని వ్యవసాయం దండగ అన్న పదాన్ని ఆయన నోట్లో కుక్కాం.

      ఇంత జరిగినా

      ఒక్కర్ని ఒక్క మాట అనడు, మాట తూలడు, మనిషి క్రుంగడు, మనకన్నా ముందు లేస్తాడు, మనం అంతా నిద్రించాక పడుకుంటాడు.

      పదవిలో ఉన్నా లేకపోయినా పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉంటాడు. ప్రజలతో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు.

      ఇంకా ఇదంతా నమ్మొద్దు అని, నమ్మినా నమ్మనట్లు ఉందాం అని కొందరి మనస్సుల్లో అనిపిస్తూ ఉంటుంది. పర్వాలేదు. అలాగే ఉండండి. ఆయన ప్రతి పనీ తెలుగువారందరికోసం. మన, పర అన్న భేధాలు మనకి ఉన్నాయి. ఆయనకు లేవు.
      ఎందుకంటే ఆయన సిసలైన తెలుగు బిడ్డ. తెలుగోడి ధైర్యం.

      మీది ఏ పార్టీ అయినా కావొచ్చు, ఏ కులం, మతం అయినా కావొచ్చు. మీరు ఆయన్ని ఇష్టపడకపోవచ్చు. కానీ.. ఒక్క సారి ఈ క్రింది వీడియో చూడండి.

      మళ్ళీ చెబుతున్నా ఇది మీ ఆంధ్రుల భవిష్యత్తు. అందుకే ఈ నలబై నిమిషాల వీడియోని బాత్ రూం లోనో, భోజనం చేస్తూనో, నిద్రకు ఉపక్రమించే ముందు బెడ్ రూం లోనో, క్యాబ్ లోనో బస్సులోనో ఆఫీసుకి వెళ్ళేటప్పుడో, ఆఫీసు నుండి వచ్చేటప్పుడో, భోజన విరామ సమయంలోనో.. ఎప్పుడో ఒకప్పుడు మీకు సరిగ్గా నలబై నిమిషాల సమయం దొరికినప్పుడు మొదటి నుండి చివరి వరకూ చూడండి.

      త్రివిక్రం చెప్పినట్లు ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు.. (ఇది ఇప్పటికే గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది).. ఆ అద్భుతం జరిగిపొయ్యాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.. (ఈ సారైనా జరిగిపొయ్యేదాకా కళ్ళు మూసుకోకుండా కింద వీడియో సహాయంతో మీ కన్న నేలపై అసలు ఏం జరుగుతుందో గుర్తించండి)

      ధన్యవాదములు.

      https://youtu.be/VuOpBVOToz0

      Delete
    3. బెంగుళూరులో కియోనిక్స్ సిటీ కట్టింది ఎవరు? సినిమాలలో నటిస్తూ ఆవారాగా తిరిగే ఎంజీయరును రాజకీయాలలో చేరమని చెప్పింది ఎవరు? హిప్పీ తిరిగుళ్ల స్టీవ్ జాబ్స్ వెన్ను తట్టి ఐటీ కంపెనీ పెట్టుకో పైకొస్తావని దీవించింది ఎవరు? వీపీ సింగును ప్రధానమంత్రి చేసింది ఎవరు? ఎవరో ఒకరు మంచి వ్యక్తి రాష్ట్రపతి పదవికి కావాలని అడిగితె రాంనాథ్ కోవింద్ పేరు సూచింది ఎవరు? ఊరికే ఖాళీగా ఉండే బదులు అమెరికాకు వెళ్లి చదువుకో ఎప్పుడో అప్పుడు గూగుల్ అధిపతివి కాగలవు అని ఆశీర్వదించింది ఎవరు?

      డోంట్ నో, నై మాలూం, తెరియాదు, గొత్తిల్లా!

      ప్రతీ ప్రశ్నలో ఒక్కటే ఒక్క పేరు మార్చి అడగండి, బొడ్డూడని బుడ్డోడు సైతం జవాబు చెప్పకపోతే పేరు మార్చుకుంటా బస్తీ మీ సవాల్! ఇదీ పచ్చకామెర్ల రొచ్చు ప్రచారాల ప్రభావం.

      Delete
    4. ఎవరినీ ద్వేషించకండి. ద్వేషించడం ఆరోగ్యానికి హానికరం.

      Delete
    5. మరేనండి ఇదేదో మోడీ & జగన్ గార్లను పొద్దస్తమానం తిట్టే వాళ్లకి చెప్తే బావుణ్ణు!

      Delete
    6. సకల జనులనూ ద్వేషించడం తెలంగాణా జన్మహక్కు !

      Delete
  4. గుదిబండ నన్ను బూతులు తిడతానే ఉంటాడూ. నేను మాలికకి రిపోర్ట్ చేస్తూనే ఉంటానూ.. "బుజ్జీ! చిట్టీ! అట్ట అనగాకమ్మా! తప్పుకదూ!" భర్ద్వాజ అంటానే ఉంటాడు.

    ఇదే సీను "రచ్చబండ"లో గానీ జరిగితేనా...

    అంతా విష్ణుమాయ..

    ReplyDelete
    Replies
    1. కామెడీ ఎంటంటే, నేను హరిబాబును "హరిబాబు గారూ" అని అనలేదని మాలిక కి హరిబాబు రిపోర్ట్ చేసుకున్నాడు..

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. దేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? సనాతన హిందూ విజ్ఞానం పరిపూర్ణమేనా?? my question

      Delete
    2. @Chiranjeevi Why?

      "ఆది అంతం లేని కాన్సెప్టే దేవుడు". హిందూ మతం పరిపూర్ణమైనదా .. అనే ప్రశ్నకు .. ముందు పరిపూర్ణం అంటే తమ దృష్టిలో ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది.

      Delete
    3. విష్వ వీ క్షణం!

      ఆదిలేని దేవుడు.. ఆదిమానవుడికెందుకు తెలియలేదు?

      ఏం కనిపెట్టినా మాదాంట్లో అవెప్పుడో ఉన్నాయ్ అని అంటుంటారుగా.. కనిపెట్టినవి, కనిపెట్టాల్సినవీ అన్నీ ఉన్న పరిపూర్ణమైనవా ఆ గ్రంధాలు??

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్