Breaking News

అంతర్జాలంలో తెలుగు బ్లాగులను చదివేవారు, తెలుగు బ్లాగులను వ్రాసేవారు చాలా తక్కువే!అందులో ఆకట్టుకునే బ్లాగులుగాని చదివించే బ్లాగులు గాని మరీ తక్కువ! ఈ పరిస్థితిని మార్చాలంటే ఏమి చెయ్యాలి? మంచి, మంచి బ్లాగర్లు, వీక్షకుల సంఖ్య పెరగాలంటే ఏమి చెయ్యాలి?

ప్రశ్నను పంపినవారు: కె.యస్.చౌదరి. (కాకినాడ)

3 comments:

  1. ఈ ప్రశ్న ఉంచినందుకు అభినందనలు. చాలా చేయాలి:
    1) బ్లాగర్లు అవసరమైన సమాచారాన్ని అందించే మంచి పోస్టులు వ్రాయాలి.
    2) కష్టపడి వ్రాసినవాటిలో చదివిన వారు నచ్చినవాటికి ఓపిక గా కామెంట్లు వ్రాయాలి.
    3) కామెంట్లు వ్రాయకపోయినా ఫర్వాలేదు గానీ నిరుత్సాహపరచేలా కించపరచేలా శాడిజం తో కామెంట్లు చేయకూడదు.
    4) అటువంటివారికి అవి చూసినప్పుడు ఎవరైనా వెంటనే ఖండిస్తూ కామెంట్లు వ్రాయాలి.
    5) బ్లాగర్ల సమావేశాలు ప్రతి జిల్లాలో ఒకటి నెలకోసారి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు కాకున్నా రానున్న రోజులలలో సోషల్ మీడియాకు బ్లాగులకు ప్రాధాన్యత పెరుగుతుంది. బ్లాగులలో పోస్టులని చాలా పత్రికలు అచ్చు వేసుకుంటున్నారు.
    6) మంచి బ్లాగులను సమీక్షిస్తూ అగ్రిగేటర్ల వారు లేదా, బ్లాగర్ల సంఘం ( ఏర్పడాలి ) వారు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రోత్సాహకం అంటే డబ్బు లేదా వస్తువులే కానక్కర్లేదు.
    7) అజ్ఞాతలు , దొంగపేర్లతో పనిగట్టుకుని కామెంట్లు వ్రాసే రేగర్లను ( ఈ పదం కరెక్టేనా?) కలసి కట్టుగా ఎదుర్కోవాలి
    8) కొత్త బ్లాగర్లకు బ్లాగు టెక్నిక్స్ తెలుపుతూ ఆర్టికల్స్ వ్రాయాలి. ఈ పని అగ్రిగేటర్ల వారైనా, సీనియర్ బ్లాగర్లయినా చేయవచ్చు.
    9) కినిగె డాట్ కాం వారు తక్కువ ధరకు ఈ బుక్స్ అద్దెకు ఇవ్వాలి. అమ్మకం ధర వారిష్టం.
    10) తెలుగుకు సంబంధించిన టూల్స్ ఏమేమి ఉన్నాయి? తెలుగు టైపింగ్ వంటివి చిన్న విషయాలని మీకనిపించినా కొత్తవారికి అవి చాలా ఉపయోగపడతాయి కనుక పోస్టులుగా వ్రాయాలి.
    11) సోషల్ మీడియాకు నియంత్రణా మరియు ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలి.
    నాకు తెలిసినవి చెప్పాను. ఇలాంటివి చాలా చాలా చేయాలి. ఏమేమి చేయకూడదో కూడా చాలా చాలా ఉన్నాయి.

    ReplyDelete
  2. కొండలరావు గారు అన్నట్లు ఇది మంచి ప్రశ్న.
    ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను . క్రొత్త బ్లాగర్లు ధైర్యంగా మంచి టపాలు వ్రాసే వాతావరణం ఉండాలి . వ్రాసే టపాలు, వ్యాఖ్యలు ఇతరులను, సంస్కృతిని కించపరిచేలా ఉండకూడదు.

    క్రొత్త వారు ఇంగ్లీషులో టైపు చేసినంత సౌలభ్యంగా తెలుగులో చేయలేకపోతున్నారు. అందుకే కాపీ/ పేస్టు చేస్తున్నారు . వారికి తెలుగు టైపింగ్ పట్ల అవగాహన కల్పించాలి .
    తన మనసులో భావనను టపాగా వ్రాసేముందు బ్లాగర్ కామెంట్ల గురించి ఆలోచించడు అని నేను అనుకుంటున్నాను. అయినా ప్రోత్సాహం ఇవ్వాలి


    ReplyDelete
  3. కొండలరావుగారి అభిప్రాయంతోను, బ్లాగిల్లు శ్రీనివాస్ గారి అభిప్రాయంతోనూ నేను ఏకీభవిస్తున్నాను. తెలుగు బ్లాగర్లు,తెలుగు అగ్రిగేటర్లు కలిసి ఈ పనులను నిర్వహించి తెలుగు బ్లాగుల ఉనికిని కాపాడుతూ, వాటి ఉన్నతిని పెంచే ప్రయత్నం చేయాలి.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్