Breaking News

మన విద్యారంగం మరింత మెరుగుపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మన విద్యారంగం మరింత మెరుగుపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

"రచ్చబండ" చర్చావేదికలో పాల్గొనే వారందరికీ నమష్కారములు. పై ప్రశ్నను సంధించడానికి గల ముఖ్య కారణం ఈరోజు వాట్సాఫ్ లో నాకు ఈక్రింది మెసేజ్ వచ్చింది. అది చదివిన తరువాత నిజానికి మన విద్యావ్యవస్థను గూర్చిన ఆలోచన వచ్చింది. ప్రభుత్వ విద్యావ్యవస్థలు మసగబారిపోవడం, ప్రైవేట్ విద్యారంగాలు హెచ్చుమీరిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సామాన్య, మధ్య తరగతి వారికి విద్య అందని దాక్షలా తయారైపోయింది. ఇటువంటి పరిస్థుతుల రీత్యా మన విద్యావ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం ఆధారపడి ఉంది. దానికోసం పోరాడవలసిన బాధ్యత మనపై ఉంది. దీనికి మీరేమంటారు?


ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో  ప్రపంచంలోనే నెం.1 స్థాయిలో ఉంది అంత గోప్పేమి?
ఇక్కడి “ప్రతి పాయింటు”ను గమనిస్తే ఆ సామర్థ్యం ఎలా సాధ్యమైందో అర్థమౌవుతుంది.
చదవండి.....
•🍒 7ఏండ్లు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. ఇక్కడిలాగా 2.5 సం.లకే పిల్లలకు టార్చర్ మొదలవదు
• 🍒చిన్నప్పటినుండి తన ప్రతి కదలికనుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు
• 🍒7వ సం. నుండి 10వ సం. వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతాడు
• 🍒స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు & ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది
• 🍒స్కూల్లలో, విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడి ఉంటాయి
• 🍒13 సం. వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే వత్తిడి ఉండదు
• 🍒తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు
• 🍒ఇంటి పని ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో ఇంటిపని చేసుకోవచ్చు
• 🍒ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు
• 🍒ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు
• 🍒ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూల్లే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు
• 🍒ఫిన్లాండ్ లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు
• 🍒పరీక్షలు నిర్వహించని దేశాలనుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది
• 🍒ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది
• 🍒ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం
• 🍒ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు
• 🍒56 దేశాలనుండి 1500 మంది ప్రతి సం. ఫిన్లాండ్ కు వెళుతున్నారు
• 🍒అధిక మొత్తం విదేశి మారకం విద్యారంగ పర్యాటకులనుండే వస్తుంది
• 🍒ఫిన్లాండ్ లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి IAS or IPS తో సమానం
• 🍒ఫిన్లాండ్ లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర “ఉపాధ్యాయులదే” !!!!!!!
• 🍒దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు
•🍒 విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది
• 🍒వారికి 5సం. ఉపాధ్యాయ శిక్షణ, 6నెలలు సైన్యంలోను, ఒక సం. స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్ట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిస్థ, అగ్నిమాపక దళంలోను 6నెలలపాటు శిక్షణ. మొత్తం 7సం.ల శిక్షణ
అన్నింటికంటే  ముఖ్యవిషయం  ఫిన్లాండ్  పాఠశాలల్లో  "భగవద్గీత"ను  నేర్పుతున్నారు.

9 comments:

  1. మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌లకి ఎందుకు పంపించరు అని అడిగితే ఒకావిడ ఇలా సమాధానం చెప్పింది "గవర్నమెంట్ స్కూల్‌లో లేబర్‌వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువు అంత ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ పక్కన ఉంటే మా పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడుతారు" అని. వీళ్ళని చూస్తే చదువుల వల్ల మనం నేర్చుకునే సంస్కారం ఏమీ లేదని అర్థమైపోతుంది.

    ReplyDelete
    Replies
    1. నిజానికి ఈ రోజు సమాజంలో జరుగుతున్న నేరాలకు అత్యాచారాలకు ఎక్కువగా పాల్పడుతున్నది ధనవంతుల పిల్లలు మాత్రమే. పేద మధ్య తరగతి పిల్లలు నేరాలకు పాల్పడ్డం బహు అరుదు గానే ఉంది.

      Delete
    2. That's because of inequality before law.

      Delete
  2. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు.. తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్సులోనే చదివించాలని రూల్ పెట్టాలి.. ప్రైవేట్ స్కూల్సుకి ధీటుగా స్టాండర్డ్స్ మైంటైన్ చెయ్యాలి.

    ReplyDelete
  3. చై..నా.. లకు వన్ వే టికెట్ ఇచ్చి సైబీరియాకు పంపించేస్తే బాగుపడుతుంది.

    ReplyDelete
  4. చిరంజీవి గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలి ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి గవర్నమెంట్ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించాలి. అప్పుడే మన ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగుపడతాయి.

    ReplyDelete
  5. గవర్నమెంట్ టీచర్లే తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించడానికి ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చదివించడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రభుత్వ టీచర్లే ఇలా ఉంటే ఎలా? వారు పనిచేసే స్కూల్ లలో తమ పిల్లల విషయంలో నమ్మకం లేకపోతే... ఇక వారు విద్య చెప్పే పిల్లలకు ఎలా నమ్మకం కలిగించగలరు? నిజానికి మన విద్యారంగం మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే దేశ అభివృద్ధికి ప్రధానం అవుతుంది.

    ReplyDelete
  6. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయంటే పేదవారే కారణం. వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు వేలకు వేలు ఫీజులు కట్టి చదివించలేక ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. కొంతమందైతే తమ పిల్లలను మధ్యాహ్న భోజనం కొరకు పంపుతున్నట్లు ఒక టీచర్ గారు స్వయంగా చెప్పారు. ఇటువంటివన్నీ ప్రభుత్వం గురించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మన విద్యా రంగం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్