Breaking News

ప్రధాని నరేంద్ర మోడీ "ఆంధ్రా"పై కక్ష కట్టడానికి ప్రధాన కారణాలేమిటి?

ప్రధాని నరేంద్ర మోడీ "ఆంధ్రా"పై కక్ష కట్టడానికి ప్రధాన కారణాలేమిటి?


63 comments:

  1. అసలు నరేంద్ర మోడీకి ఆంధ్ర పై కక్ష ఉందని ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఆరోపణకు కనీస ఆధారాలయినా ఉన్నాయా?

    మోడీ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి రెండేళ్లు తప్ప మిగిలిన సమయంలో కేంద్రంలో వైరిపక్షం అధికారం ఉండేది. జ్యోతీ బసు నుండి సిద్దరామయ్య వరకు ఎందరో ముఖ్యమంత్రులకు కూడా ఇదే పరిస్థితి. వారెవరూ తమ వైఫల్యాలకు కేంద్రకక్ష/కుట్ర వగైరా కుంటిసాకులు చెప్పలేదు.

    చంద్రబాబు ఎన్నికలలో సొంతబలంతో ఎప్పుడూ గెలవలేదు. ఆగస్టు వెన్నుపోటు తరువాత కొద్ది నెలలు మినహాయిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితోనే కలిసి ఉన్నాడు. అంచేత ఈయనకు ఇది కొత్త అనుభవం.

    గత ఎన్నికలలో మోడీ ప్రభంజనం, పవన్ కళ్యాణ్ సాయం, ఇంటికో ఉద్యోగం తరహా గొంతెమ్మ వాగ్దానాలతో పాటు జగన్ చేసిన కొన్ని కీలక తప్పిదాల వలన చంద్రబాబు అత్తెసరు ఓట్లతో గద్దె ఎక్కాడు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ గుర్రం ఎగురదని గుబులు పట్టుకుంది కనుక కాకమ్మ ఖబుర్లు మొదలెట్టాడు. ఈయన గారు ఇన్నేళ్లు పెంచి పోషించిన పచ్చ మీడియా తానా అంటే తందానా వరుస ఎత్తుకుంది.

    జగన్ రుణ మాఫీ లేదా కాపు రిజర్వేషన్ హామీలు ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా 2014లో ముఖ్యమంత్రి అయేవాడు. తాజా ఇండియా టుడే సర్వే ప్రకారం 2019లో (మళ్ళీ తనంతట తానే చెడగొట్టుకోకపొతే) ఆయనకు తిరుగు లేదు.

    ReplyDelete
    Replies
    1. మోడీగారికి "ఆంధ్రా"పై కక్ష లేకపోతే "ప్రత్యేక హోదా" ఇవ్వమని ప్రజలందరూ అడిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. చంద్రబాబు పై ఉన్న కక్షను ఆంధ్రా ప్రజలపై చూపించడమేమిటి? కొన్ని రాష్ట్రాలకు భారీ బహుమతులు,రాయితీలు ప్రకటించి "ఆంధ్రా"ను పక్కన బెట్టడం కక్ష కాక మరేమిటి? రాష్ట్రం రెండు భాగాలైపోయి అన్ని ప్రభుత్వ ఆస్తులు తెలంగాణ స్వంతమయిపోయినప్పుడు "ఆంధ్రా"కు ఏం మిగలలేని దారుణ స్తితిలో ఉందన్న విషయం ప్రధాన మంత్రి మోడీ గారికి తెలియకుండానే ఉందా? ఆంధ్రాను వెన్నుపోటు పొడిచిన బిజెపిని ఆంధ్రాలోని పెద్దలే కొంతమంది నెత్తిన బెట్టుకోవడం కడు విచిత్రమా? దారుణమా?

      Delete
    2. నాదృష్టిలో కేంద్రంలో కాంగ్రెస్ రానంతవరకూ ఇక్కడ ఆంధ్రాలో 2019లో చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు.

      Delete
    3. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగానే పచ్చతమ్ముళ్లు వెంకయ్య నాయుడికి సన్మానం చేసిన వైనం మరిచారా? ప్రత్యేక ప్రతిపత్తి ("హోదా" కాదు) సంజీవని కాదని చంద్రబాబు అప్పుడే సెలవిచ్చారు.

      ప్రభుత్వ ఆస్తులు మొత్తం తెలంగాణకు ఇచ్చారన్నది పచ్చి (పచ్చ) అబద్దం. ఆస్తులు & అప్పులు (నిజానికి ఆస్తులకంటే అప్పులే ఎక్కువ ఉంటాయి) రెంటినీ గతంలో వాడిన ప్రాతిపదిక మీదే (అదికూడా కాంగ్రెస్ హయములోనే) విభజించారు.

      ప్రధాన మంత్రికి ఎన్నెన్ని పనులు ఉంటాయి, వారు ఎన్నెన్ని దేశాలు తిరగాలి, ఎన్నెన్ని దేశవిదేశ కార్యాలు చక్కబెట్టాలి? అవన్నీ మానేసి పొద్దస్తమానం చంద్రబాబు మీద కుట్రలు పన్నుతూ ఉండడానికి ఆయనకు సమయం ఎక్కడిది?

      కేంద్రంలో కాంగ్రెస్ ఆంధ్రాలో టీడీపీ గెలవాలని మీరు కోరుకోవడం మీ ఇష్టం. మోడీ గెలిస్తే ఆంధ్ర నాశనం అవుతుందని లేదా కేంద్రం పని కట్టుకొని ఎదో ఒక రాష్ట్రాన్ని ముంచుతుందని అనుకోవడం మాత్రం భ్రమ.

      Delete
    4. వచ్చే ఎన్నికలలో ఆంధ్రా ప్రజల చేత చంద్రబాబుకు ఎలాగూ సన్మానం తప్పదని అనుకుంటున్నాను. నాలుగేళ్ళు కాలయాపన చేసి ఇప్పుడు ముందుకు పరుగుదీసినంతమాత్రానా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇక అప్పులు ప్రక్కన బెడితే తెలంగాణాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులేవీ ఆంధ్రాలో లేవే? ఇదెలా నిజమవుతుంది? మోడీగారికి దేశ,విదేశాలు తిరగడమే గాని ఆంధ్రవైపునకు చూసే టైమే లేదా? ఎంత చిన్న చూపు? మరి ఆంద్రా బిజెపి నాయకులు ఏమి చేస్తున్నారు? వాళ్ళను,వీళ్ళను తిట్టడానికే గాని ఆంధ్రా గూర్చి పట్టించుకునే సమయం లేదేమో?

      మోడీ గారు నగ్గినంత మాత్రాన ఆంధ్రా నాశనమయ్యే సీను లేదు. కాకపొతే కేంద్ర ప్రయోజనాలు తగ్గిపోవచ్చు అంతే. మోదీగారి వలన దేశ ఆర్ధిక పరిస్థితే అధ్వానమయ్యిందని మేధావులే చెప్తున్నారు. ఇదంతా భ్రమ కాదు. మన కళ్ళతో మనం చూస్తున్న వాస్తవం.

      Delete
    5. చౌదరి గారూ,

      తెలంగాణ ఆంధ్ర ఆస్తి అప్పుల పంపకం గురించి మీరు స్వయంగా బిల్లు చదవండి, ఆ తరువాత చర్చించాలంటే నేను తయారు.

      మన్మోహన్ అయినా మోడీ అయినా దేశం మొత్తానికి ప్రధాని. ఒకే రాష్ట్రం మీద దృష్టి పెట్ట(లే)రు. మోడీ (ఉ.) మధ్య ప్రదేశ్ రాష్ట్రం వైపు చూసారా లేదా అన్నది ఎవరికి తెలీదు కాకపొతే అక్కడి వాళ్ళు కేంద్రం మీద పడి ఏడవడం లేదు.

      ఇటీవలి కాలంలో గుజరాత్ ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రదేశానికి (Dholera SIR) బోలెడంత డబ్బులు ఇచ్చారని, మాకేమో ఇయ్యలేదని పచ్చ మీడియా గగ్గోలు పెట్టిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి ఆ పథకం చాలా పాతది, మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మోడీ ముఖ్యమంత్రిగా దాని అంకురార్పణ చేసారు. ఇట్లాటి ఉదాహరణలు కోకొల్లలు.

      కేంద్ర రాష్ట్ర ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఉండదు. 29 రాష్ట్రాలు అన్నీ దేశంలో భాగాలే.

      మోడీ విధానాలు నచ్చిన మేధావులూ & నచ్చని వాళ్ళూ ఉన్నారు. మీకు ఏది కరెక్టనిపిస్తే అది మీ ఇష్టం. కాకపొతే అవి *దేశం మొత్తానికి* బాగున్నాయా లేదా అని చూడమని నా మనవి.

      Delete
    6. మోడీగారు వచ్చిన తరువాతే కొన్నాళ్లకు బిజెపి ఇమేజే పోయింది. వచ్చే ఎలక్షన్ లో గెలుపు బిజెపి సొంతమయ్యినా మోడీకి ప్రధాని కుర్చీ మాత్రం ఖచ్చితంగా దక్కదు. దానికి మోడీ పట్ల పార్టీ అంతర్గత కలహాలే కారణం కావచ్చును.

      Delete
  2. https://www.palleprapancham.com/truth-of-babli-case-non-bailable-warrant/

    ReplyDelete
    Replies
    1. కొండల రావు గారూ మీరిచ్చిన లింక్ ద్వారా మీ "పల్లె ప్రపంచం" అంతర్జాల పత్రిక"ను చూసాను. చాలా బాగుంది. నేను అందించాల్చిన తోడ్పాటును తప్పకుండా అందిస్తాను సర్. మీ కృషి అభినందనీయం.

      Delete
  3. ధక్షిన భారతీయులు ద్రవిడులనే చీప్ అభిప్రాయం తప్ప ఇంకొకటిలేదు. మోడీ ఎప్పుడూ మనల్ని కనీసం మనుష్యులుగా కూడా పరిగణించలేదు

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది 100% వాస్తవం. మన వాళ్ళందరూ దక్షిణ భారతదేశంగా విడిపోదామన్నంత వరకూ వచ్చారంటే వాళ్ల చిన్నచూపు చూడటం. సమన్యాయం చేయకపోవడమే. ఇటువైపు నుంచి పన్నుల రూపంలో పోతున్నదంతా అటువైపు వాళ్ళే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారన్న వాస్తవం ఎవ్వరూ కాదనలేరు కదా?

      Delete
    2. మీకు తెలుసో తెలీదో మోడీ ఉత్తరాది వారు కాదు.

      దయచేసి దేశ విచ్చిన్న ప్రచారానికి అడ్డకట్ట వేయండి.

      Delete

    3. ఓలమ్మో ఓలమ్మో అహ్మద్భాయీ అహ్మద్భాయీ యేంగోల్గప్పా గోల్గప్పా వేసేవోయి

      ఒక వైపు ఉర్రూత లూగించు చిరుజీవులు
      మరియొకవైపు టమ్ టమ్ అహ్మద్ భాయీ :(


      Delete
    4. >>మీకు తెలుసో తెలీదో మోడీ ఉత్తరాది వారు కాదు.

      ధక్షిణాదివాడైనా నా మాటమారదు. ద్రవిడులపై విషం చిమ్మేవాళ్ళు ధక్షిణంలో కూడాఉన్నారు. ఒక ప్రత్యేకమైన కులానికి బానిసలు వాల్లు.

      Delete
    5. చిరంజీవి గారూ, FYI మోడీ గారిది ఓబీసీ కులం.

      Delete
    6. >>ఇటువైపు నుంచి పన్నుల రూపంలో పోతున్నదంతా అటువైపు వాళ్ళే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారన్న వాస్తవం ఎవ్వరూ కాదనలేరు కదా?

      ఏ రాష్ట్రానికి వసూలైన పన్నులు, ఆరాష్ట్రంలోనే వాడాలనుకుంటే, ఇక దేశం అనే దానికి అర్ధంలేదు. వెనకబడిన రాష్ట్రాలకు ఆర్ధిక సహాయమందించడంలో భాగంగా మిగితా రాష్ట్రాల సంపాదన ఇవ్వవల్సి వున్నది

      Delete
    7. >>చిరంజీవి గారూ, FYI మోడీ గారిది ఓబీసీ కులం

      So what?? మోడీకి ఆంధ్రులమీద ద్వేషం/చులకనభావం లేదని చెప్పగలరా?

      Delete
    8. మోడీకి ఆంధ్రులపై ద్వేషం/చులకన ఉన్నాయనేందుకు ఒక్క ఆధారం చూపించండి.

      ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కడానికి మోడీ ప్రచారం అక్కరకు వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన మంచోడు, ఆ తరువాత ఎందుకో బాబుతో చెడింది కనుక ఇప్పుడు దుర్మార్గుడు అంటే ఎలా? పచ్చ చొక్కాలు రేపో మాపో రాహులుడిని మాత్రం ఇదే రకంగా ఆడిపోసుకోరని నాకయితే నమ్మకం లేదు.

      Delete
    9. >>ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కడానికి మోడీ ప్రచారం అక్కరకు వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన మంచోడు

      అవతలివాడు ఏమనుకుంటున్నాడో చదవగలిగే రోగం మీకు కూడా ఉందన్నమాట..


      >>మోడీకి ఆంధ్రులపై ద్వేషం/చులకన ఉన్నాయనేందుకు ఒక్క ఆధారం చూపించండి.

      నిజాయితీగా ఒప్పుకోడానికి మీరు సిద్దంగా ఉన్నారు అంటే.... చూపిస్తాను.. wil show u to night

      Delete
    10. >>పచ్చ చొక్కాలు

      గులాబీ కల్లజోడికి ఆంధ్రులంతా పచ్చచొక్కాలతో కనిపిస్తారా??

      Delete
    11. భారత దేశ విచ్చిన్నానికి ఏ భారతీయుడు అంగీకరించడు Jai Gottimukkala గారూ! కాకపొతే కొంతమంది స్వార్ధపరులైన రాజకీయనాయకులు తప్ప.ఏది ఏమైనా ఉత్తరాదివారికీ కలిగిన సౌకర్యాలు దక్షిణాదివారికి లేవు. ఉత్తరాదివారు ప్రతీ విషయంలోనూ ముందంజలోనే ఉన్నారు.

      Delete
    12. ఆంధ్రులంతా పచ్చచొక్కాలని నేనెప్పుడు అన్నాను? చంద్రబాబు మీద పల్లెత్తు మాట అన్న వారందరికీ గులాబీ కళ్ళజోడు, కాషాయ కషాయం, ఇటలీ తొత్తులు, కడప గూండాలు అంటూ ఎదో ఒక బిరుదు తగిలించడం పచ్చకామెర్ల సై"కిల్" బాచీకి మామూలే. తాజా ఇండియా టుడే సర్వే ప్రకారం ఆంధ్రులకు ఈ దశమగ్రహ గ్రహణం ఇంకొన్ని నెలలేలెండి!

      Delete
    13. @Gottimikkala: చిరంజీవి గారూ, FYI మోడీ గారిది ఓబీసీ కులం

      @me: So what?? మోడీకి ఆంధ్రులమీద ద్వేషం/చులకనభావం లేదని చెప్పగలరా?

      @gottimukkala: ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కడానికి మోడీ ప్రచారం అక్కరకు వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన మంచోడు, ఆ తరువాత ఎందుకో బాబుతో చెడింది కనుక ఇప్పుడు దుర్మార్గుడు అంటే ఎలా? పచ్చ చొక్కాలు రేపో మాపో రాహులుడిని మాత్రం ఇదే రకంగా ఆడిపోసుకోరని నాకయితే నమ్మకం లేదు.

      @me: గులాబీ కల్లజోడికి ఆంధ్రులంతా పచ్చచొక్కాలతో కనిపిస్తారా??

      @gottimukkala: ఆంధ్రులంతా పచ్చచొక్కాలని నేనెప్పుడు అన్నాను? చంద్రబాబు మీద పల్లెత్తు మాట అన్న వారందరికీ "గులాబీ కళ్ళజోడు", కాషాయ కషాయం, ఇటలీ తొత్తులు, కడప గూండాలు అంటూ ఎదో ఒక బిరుదు తగిలించడం పచ్చకామెర్ల సై"కిల్" బాచీకి మామూలే.

      @me:పైన వాటికి నాప్లేసులో మిమ్మల్ని, మీ ప్లేసులో నన్ను పెట్టి చదివిచూడండి. ఇప్పుడేమనిపిస్తుంది??

      మీరి ఔనన్నా, కాదన్నా "ఆంధ్రులంతా పచ్చచొక్కాలు" అని మీరు ఫీలౌతున్నది నిజం. మీ చివరి వ్యాఖ్య దాన్ని బయటపెడుతోంది. ఉధ్యమం ఐపొయిందనీ, కొత్త రాష్ట్రంలో బతుకుతున్నామని, ఇక అంధ్రులమీద పడి ఏడవకూడదనీ మీరెంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.

      Delete
  4. >>ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కడానికి మోడీ ప్రచారం అక్కరకు వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన మంచోడు

    ప్రధాని కుర్చీ ఎక్కిందే అబద్దాల వాగ్దానాలతో... ఆ అబద్దాలకోరు మీకల్లకి నీతిమంతుడేలా అయ్యాడో కాస్త శలవిస్తారా? అబద్దాలేం చెప్పాడూ ... అని మొదలెట్టకండి..

    ReplyDelete
    Replies
    1. మోడీగారు,ఆయన పార్టీ వాళ్ళు ఎంత నీతిమంతులో కర్ణాటక ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్ధులను చూస్తే మనకు అర్ధమయ్యింది గదా సర్!

      Delete
    2. అయ్యా మోడీ గారు మంచోడా చెడ్డోడా అని నేనేమీ అనలేదు. ఆయనతో అక్కర ఉన్నన్నాళ్ళు సీబీఎన్ చంద్రజ్యోతి తదితర పచ్చ మీడియా మోడీ ఇంద్రుడని చంద్రుడిని పొగిడిందని గుర్తు చేస్తే మీరు అపార్టం చేసుకున్నారు.

      నిన్నటికి నిన్న పచ్చబాబు అనుంగు సహచరుడు చా"కిరాయి"రేవు గారి ట్వీట్ చూడండి మీకే తెలుస్తుంది.

      https://twitter.com/chaakirevu/statuses/1042416413615390721

      Just 4 years back,
      Majority of the AP used to proud about #RSS4Bharat
      Now people feel that RSS also behind AP betrayal leaders & helpless. #APDharmaPoratam

      7:13 AM - 19 Sep 2018

      Delete
    3. >>నిన్నటికి నిన్న పచ్చబాబు అనుంగు సహచరుడు చా"కిరాయి"రేవు గారి ట్వీట్ చూడండి మీకే తెలుస్తుంది.

      ఇలాంటి తొక్కలో మాటలు మాట్లాడే తెలంగాణాబాచ్చి బ్ల్లాగులు కోకొల్లలు. ఇదిపట్టుకోని మీరు వెలాడుతున్నారంటే, మీ గులాబీకల్లాద్దలతో అందరినీ పచ్చగా చూస్తున్నారనే అర్ధం. Growup man..

      Delete
  5. @Chiranjeevi Y:
    @K.S.Chowdary:

    మోడీకి *ఆంధ్రుల*పై *ద్వేషం/చులకన* ఉన్నాయనేందుకు ఒక్క ఆధారం చూపించండి. నేను *నిజాయితీగా ఒప్పుకోడానికి* సిద్దం. మోడీ/బీజేపీల మంచిచెడులు/ఆలోచనాసరళి/విధివిధానాలు, కర్ణాటకలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, GST, demonetization, జశోదాబెన్ ఉదంతం, మోడీ అద్వానీకి ఎందుకు దండం పెట్టలేదు వగైరా విషయాలు ఈ చర్చకు అవసరం లేదు. Please provide one example (not opinion) showing evidence of Modi's alleged hatred of Andhra, thanks.

    ReplyDelete
    Replies
    1. కళ్ళముందు కనిపించేవి చాలు. స్పెషల్ స్టేటస్/స్పెషల్ పాకేజ్ చట్టబద్దత.

      Delete
    2. Modi and kcr had no evidence of alleged hatred of Andhra, thanks.

      Delete
    3. స్పెషల్ స్టేటస్ సంజీవని కాదని చంద్రబాబే అన్నాడు. కేంద్రం స్పెషల్ పాకేజీ ఇచ్చినందుకు కృతజ్ఞ్యతగా బీజేపీ & టీడీపీలు వెంకయ్య నాయుడికి సన్మానం చేసాయి. స్టేటస్ నిరాకరణ నిర్ణయాన్ని జగన్ వ్యతిరేకించాడు కనుక ఆయనను విశాఖ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసారు.

      మీరు ఇవన్నీ మరిచిపోయారా? ఆనాడు జగన్ & రఘువీరా మాట్లాడినప్పుడు మాటలు కొట్టిపారేసిన తెగులు తమ్ముళ్లు ఇప్పుడు రాగం ఎందుకు మార్చారు?

      పోలవరం కాంట్రాక్టర్ మార్చిన వెనువెంటనే టీడీపీ-బీజేపీ బంధం చెడింది, ఇది వాటా గొడవ కాదంటారా?

      Delete
    4. సన్మానాలు చేసిందీ,పాకేజీకి ఒప్పుకుందీ చంద్రబాబు ఐతే, దానికి నాకేం సంబందం? అందుకే మీకు చెప్పింది.... గులాబీ కళ్ళజోడులోనుంచి చూస్తే, అంతా పచ్చగా కనిపిస్తుంది అని.

      అస్సలు దీనికి... మొడీకి ఆంధ్రామీదున్న ప్రేమకేం సంబంధం? సంభందం అనుకుంటే స్పెషల్ పాకేజ్ కి ఎందుకు చట్టబధ్ధత కల్పించలేదు? విదేశాల్లో తిరుగుతూ బిజీగా ఉన్నాడు అనే జవాబు ఇచ్చి మళ్ళీ నవ్వులపాలుకాకండి.

      >>పోలవరం కాంట్రాక్టర్ మార్చిన వెనువెంటనే టీడీపీ-బీజేపీ బంధం చెడింది, ఇది వాటా గొడవ కాదంటారా?
      అందుకే మోడీ తన ప్రేమని లోపలేపెట్టుకోని, బయటకి చూపించుకోలేకపోతున్నాడు పాపం..

      అంతప్రేముంటే తెలంగాణాలో గెలిపించుకోండిగానీ ... ప్లీజ్.... మామీద ద్వేషంతో మోడీని మామీద రుద్దకండి

      Delete
    5. ఆంధ్రులు 2014లో అసమదీయ మీడియా ప్రచారాన్ని నమ్మి జగనన్నను ఓడించినందుకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికయినా కళ్ళు తెరిచారని ఇండియా టుడే సర్వే భోగట్టా, శుభం!

      Delete
    6. జైగారూ! మీరు కాస్త మోడీగురించి మాట్లాడండి.

      ఒక్క కేసీఆర్కి తప్ప అందరికీ తెలిసిపొయింది తెరాసా, బీజేపీ కలిసేఉన్నాయని.. జనాలకి "మోడీ మంచివాడు... ప్రేమామూర్తి" అని చెప్పడం ద్వారా... ఇప్పట్నుంచే సోపుఫాక్టరీ ఓపెన్ చేసుకుంటున్నారు.

      Delete
    7. బీజేపీ (లేదా కాంగ్రెస్) లోక్సభలో మెజారిటీ కంటే కొంచం తక్కువ సీట్లు తక్కువొస్తే తెరాస వారితో కలుస్తుంది ఇందులో సందేహం లేదు. తెరాసయే కాదు వామపక్షాలు & (ములాయం ఉన్నంత కాలం) సమాజ్వాదీ తప్ప దేశంలో అన్ని పార్టీలు ఇదే పని చేస్తాయి. ఇందుకు టీడీపీ వైకాపాలు కూడా మినహాయింపు కాదు.

      మీకు మోడీకి వ్యతిరేకం, మీ అభిప్రాయం మీది. నేను చెప్పేదల్లా ఒకటే: అయిష్టానికి కక్ష/ద్వేషం లాంటి ముసుగు వేసే గోబెల్స్ ప్రాపగాండా మత్తులో పడితే ప్రయోజనం ఉండదు.

      ఇదే చంద్రబాబు & ఆయన అనుచరగణం కొన్నేళ్ల కిందట సోనియా గాంధీ ఆంధ్రపై కక్ష కట్టిందని ఊరూరా దండోరా వేశారు. ఇప్పుడు పేరు మాత్రమే మార్చి మోడీ మీద అదే తరహా అభాండాలు వేస్తున్నారు. Sonia hates Andhra కథనం కాస్తా Modi hates Andhra అయింది తప్ప ఇంకే విషయం కొత్తది కాదు. అప్పుడు ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మిన ప్రజలు మళ్ళీ సరికొత్త చెప్పుడు మాటలు వినడం ఆశ్చర్యం.

      ఉన్నత పదవులలో ఉన్నవారు తప్పులు చేయవచ్చు, అలాగే వారి విధానాలు/సిద్ధాంతాలు కూడా తప్పు కావొచ్చు. మనకు నచ్చకపోతే రాజకీయంగా ఎదురుకోవాలి.

      తమ పనులన్నీ మానేసి బాబును ముంచాలనే ఏకైక లక్ష్యంతో పొద్దస్తమానం కుట్రలు & కుతంత్రాలు చేయాల్సిన ఆగత్యం మోడీ, సోనియా, కెసిఆర్, జగన్ ఎవరికీ లేదు. ఇది గ్రహిస్తే చాలు, ఆపై మీ ఇష్టం.

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. జైగారూ! చంద్రబాబు నాయుడు పొగిడాడూ.. తర్వాత తిట్టాడూ.." కాబట్టి మోడీ మంచోడా? మీరు సూటిగా సమాధానం చెప్పండి. రాజకీయ పార్టీల లెక్కలు చూపించి.... అందరూ పొగడాల్సిన ఖర్మ పట్టింది కాబట్టి... చిరంజీవి కుడా పొగాడాల్సిందే అంటే కుదరదుమరి.. మీకీ పాయింట్ బాగా అర్ధమైందనుకుంటాను..

      ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని వాగ్ధానం చేసినందుకే ఇక్కడి ప్రజలు ఓట్లేశారు. అంతేగానీ వాల్లు దుర్మార్గులు, భూతాలు.. అని చెబితే పడిపొయ్యి బట్టలు చించుకునే రకం కాదు మేము. చేసిన వాగ్ధానం నిలుపుకోనుగాక నిలుపుకోను అని చెప్పాకే మేము మోడీని విలన్లాచుస్తున్నాం. మళ్ళీ... పచ్చచొక్కాలు.. నెత్తినమోశారు అని "గులాబీ తెలంగాణా" పత్రిక ఓపెన్ చెయ్యకండి.

      >>తమ పనులన్నీ మానేసి బాబును ముంచాలనే ఏకైక లక్ష్యంతో పొద్దస్తమానం కుట్రలు & కుతంత్రాలు చేయాల్సిన ఆగత్యం మోడీ, సోనియా, కెసిఆర్, జగన్ ఎవరికీ లేదు.

      "తెలంగాణా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేతెలంగాణా" టైపులో ఇక్కడ "అంధ్రా అంటే బాబూ.. బాబు అంటే అంధ్రా" అని ఫీలయ్యే ముదిరిపోయిన వాల్లెవరూలేరు.
      కాబట్టి ఆ రాజకీయ ముచ్చట్లు ఆపి..మోడీకి ఆంధ్రామీద ప్రేముందో లేదో.. ఉంటే అలా మీకెందుకు అనిపించిందో చెప్పండి

      Delete
    11. "మోడీకి ఆంధ్రామీద ప్రేముందో"

      మోడీకి (లేదా సోనియాకి) ఆంధ్ర మీద ప్రేమ ఉండాల్సిన అవసరం ఏమిటి? 29 రాష్ట్రాలలో ఇదీ ఒకటి.

      మోడీకి (లేదా సోనియాకి) ఆంధ్ర అంటే ప్రత్యేకమయిన ద్వేషం/కక్ష లేదా ఇంకోటో ఎందుకు ఉంటుందన్నది నా ప్రశ్న.

      Repeating my comment just to highlight the point. తమ పనులన్నీ మానేసి బాబును ముంచాలనే ఏకైక లక్ష్యంతో పొద్దస్తమానం కుట్రలు & కుతంత్రాలు చేయాల్సిన ఆగత్యం మోడీ, సోనియా, కెసిఆర్, జగన్ ఎవరికీ లేదు.

      ఫలానా వాగ్ధానం చేసి నిలబెట్టుకోలేదు అనుకుంటే నిరసన తెలపండి, ఎన్నికలలో ఓడించండి లేదా ఉద్యమం చేయండి. ఇంతోటి దానికి ఐదేళ్లకు ఒకసారి పేరు మార్చి ద్వేషం/కక్ష అంటూ పొద్దుకూకులా ప్రచారం అవసరమా?

      Delete
    12. >>మోడీకి (లేదా సోనియాకి) ఆంధ్ర మీద ప్రేమ ఉండాల్సిన అవసరం ఏమిటి? 29 రాష్ట్రాలలో ఇదీ ఒకటి. ** ప్రత్యేకమయిన ద్వేషం/కక్ష లేదా ఇంకోటో**

      ఏదో చెస్తాననివాగ్ధానమిచ్చాక.. నువ్వు శతకోటిలింగాల్లో ఇంకో బోడిలింగం... నేను చెయ్యను ఫో... ఇదేనా మీరు చెప్పదలుచుకుందీ?

      అదే మాట అనుకోని "రాష్ట్రవిభజన ఇంతకుముందు చెయ్యలేదు కదా... అప్పుడు వోట్లేసి నిరసన తెలియజెయ్యకుండా.. నానా బూతులు ఎందుకు తిట్టారు?" మీపని అయ్యాక నీతి వాఖ్యాలు గుర్తొచ్చాయా? ఒక్కసారి వ్యాఖ్యలు పోష్టు చేశాకైనా "ఇలా మాట్ళాడానేంటి" ని గిల్టీఫీలింగు కూడా రావట్లేదా??

      >>Repeating my comment just to highlight the point.

      Repeating again and again. Just write it on ur wall and read it each and every time before posting nonsense... ఇది ఆంధ్రా.. తెలంగాణా కాదు.. ఇక్కడ రాష్ట్రమంటే ఒక్క వ్యక్తే ఉండడు.. ఇక్కడ రాష్ట్రమంటే ప్రజలు.. మీ గులాబీపత్రిక ఇక మూసేసుకోండీ.. నేను రాష్ట్రం గురించి మాట్లాడూతున్నాను.. మీరు బాబు గురించి మాట్ళాడుతున్నారు.. రేపు జగన్ వొచ్చినా..మీ వైఖరి మారదు.. మీ రాష్ట్రం మీకొచ్చేసింది.. ఇంకా మామీద విధ్వేషంతోనే బతుకు నెట్టకండి.. అది తప్ప మీకింకేం చాతకాదు అంటే ఎవడేం చెయ్యలేడు..

      >>ఫలానా వాగ్ధానం చేసి నిలబెట్టుకోలేదు అనుకుంటే నిరసన తెలపండి, ఎన్నికలలో ఓడించండి లేదా ఉద్యమం చేయండి.

      అవి కాక ఇంకేం చేశామో అది కూడా చెప్పండి?

      Delete
    13. ఇదే చంద్రబాబు & ఆయన అనుచరగణం కొన్నేళ్ల కిందట సోనియా గాంధీ ఆంధ్రపై కక్ష కట్టిందని ఊరూరా దండోరా వేశారు. ఇప్పుడు పేరు మాత్రమే మార్చి మోడీ మీద అదే తరహా అభాండాలు వేస్తున్నారు. Sonia hates Andhra కథనం కాస్తా Modi hates Andhra అయింది తప్ప ఇంకే విషయం కొత్తది కాదు. అప్పుడు ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మిన ప్రజలు మళ్ళీ సరికొత్త చెప్పుడు మాటలు వినడం ఆశ్చర్యం.

      This is true.

      Delete
    14. నీహారిక గారూ, ఈ విషయంలో మీరు నందు అర్ధం చేసుకున్నందుకు థాంక్సండీ.

      ఆనాడు సోనియా ఆంధ్రకు అన్యాయం/మోసం చేసిందని లేదా ఈనాడు మోడీ మాట తప్పారని అనడం మామూలుగా ఉండేది. ప్రతి నిర్ణయానికి ద్వేషం/కక్ష పులమడం మీదనే నా అభ్యంతరం.

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. జై గారూ, చిరంజీవి గారికీ, మీకూ మధ్య చర్చ ఆసక్తి కరంగా సాగుతోంది. కొంత కాలం నుండీ గమనిస్తున్నాను. మీరు మాట్లాడితే 'పచ్చ' అన్న విశేషణం వేస్తూ తెలుగుదేశం పార్టీని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు పార్టీల ప్రసక్తి లేకుండా సంయమనంతో విషయాలను మాత్రం స్పృశిస్తూ మాట్లాడతరన్న అభిప్రాయంతో ఉన్నా నింతకాలమూ. కాని మీరు రానురాను ధోరణిమారి చివరకు వైకాపా కార్యకర్త స్థాయిలో 'జగనన్నను ఓడించినందుకు తగిన శాస్తి జరిగింది' అంటూ మాట్లాడటం నిరాశ కలిగించింది. మీరు తెలంగాణా అభిమానులు - అరాష్ట్రనివాసులుగా ఆ అభిమానంతో మాట్లాడటం తప్పుకాదు. కాని పక్కరాష్ట్రం విషయంలో అసహనం ప్రదర్శించటం అసందర్భంగా ఉంది. 'జగనన్నను ఓడించినందుకు తగిన శాస్తి జరిగింది' అన్నారు కాని నిజానికి సుహృధ్బావంతో అనండి అప్పటి రాజకీయుల ఆలోచనఫలితంగా అనండి తెలంగాణాను కలుపుకొని విశాలరాష్ట్రంగా ఏర్పడటానికి ముందుకు రావటం అనే తప్పుకే తగిన శాస్తి జరిగింది అనుకుంటే తప్పులేదేమో ఆలోచించండి. మీ వంటి విషయజ్ఞత కలవారు పార్టీమనుషుల్లా మాట్లాడటం బాగోలేదండి.

    ReplyDelete
    Replies
    1. @ జై గారూ,
      శ్యామలీయం గారి మాటే నాదీనూ...ఈ మధ్య మీరు చాలా మారిపోయారు.మీరు చాలా సంయమనంతో వ్రాసేవారు.ఇపుడు అసహనంతో వ్రాస్తున్నారు. ఒక్కొక్కసారి నేను కూడా ఇలాగే వ్రాస్తుంటాను. మళ్ళీ గుర్తించి సరిచేసుకుంటాను.
      ఆలోచించండి.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. ఆంధ్ర రాజకీయాలు ఆంధ్రుల కోణంలోనే చూడాలి, నేను అలాగే చూశానని మాస్టారు & మేడం గార్లకు నా మనవి.

      జగన్ ఎదురుకున్న అవినీతి ఆరోపణలు, తలబిరుసు వ్యవహారం, నోటి దురుసు లాంటివాటితో పాటు మతం ఆయనకు మైనసులు.

      కాకపొతే కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. కేసులు పెడతారని తెలిసినా అధిష్టానాన్ని ఎదిరించాడు. సింగపూరు తలదన్నే రాజధాని కాదుకదా రుణమాఫీ లాంటి హామీలు చేయలేదు. తెలంగాణాలో నష్టం వస్తుందని తెలిసినా రెండు నాలుకలా ధోరణికి పోలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కల్లబొల్లి మాటలు పలకలేదు. ఇప్పుడు కూడా తమ పరిధిలో లేని కాపు రిజర్వేషన్ల గురించి నిర్దిష్ట హామీ ఇవ్వడం లేదు. ఈ విషయాలు కొంతలో కొంతయినా పరిణితి, నిలకడ, నేల విడిచి సాము చేయబోడన్న ఆశ & అకౌంటబిలిటీ సూచిస్తున్నాయి. On balance, I believe he may not be as terrible choice as motivated propaganda depicts him to be.

      నా ఈ అభిప్రాయం తప్పు కావొచ్చు: మీరు ఒప్పుకున్నా, విభేదించినా మీ ఇష్టం. నాకు దురుద్దేశ్యం లేదని మీరు నమ్మితే సంతోషం.

      Delete
    5. ఆరోగ్యశ్రీ,ఉచిత విద్యుత్తు,రుణ మాఫీ మొదలెట్టింది వారే...ఆయనని చూసే ఇతరులు కూడా మనసొమ్మేం పోయింది అని హొరెత్తుతున్నారు.

      ఎన్నికలముందు అప్పులగురించి ఒక్కరూ మాట్లాడరు.(పాకిస్తాన్ కూడా అప్పుల గురించి పొదుపు గురించీ ఇపుడు మాట్లాడుతున్నారు.)

      జగన్ అన్నకి అప్పులెన్నో తెలుసు అందుకే హామీలేమీ ఇవ్వడం లేదు.

      జగన్ అన్న,పవన్ అన్నా ఇద్దరూ ఒకటే చెపుతున్నారు.ఒకరికి అనుభం ఉంది ఒకరికి లేదు. జగన్ అన్నతో పోలిస్తే చంద్రన్న బెటర్ కాదా నిజాయితీగా మావైపు నిలబడి చెప్పండి.

      Delete
  8. నిజానికి నాకు మొదట్నుంచీ జైగారి వ్యాఖ్యల్లో మోడీ మంచోడు అని నిరూపించడంకన్నా.. అంధ్రాకీ "భలే ఐందిలే" అనే శునకానందమే కనిపించింది. "జగనన్నా.. జగనన్నా.." అనేది కూడా జగన్ మీద అభిమానంతో కాదు.. ఆంధ్రులని ఎగతాళి చెయ్యడానికి అదొక సాకు. అందుకే ప్రతి వ్యాఖ్యలో "మేం ప్రజలం... మోడీని ధ్వేషిస్తున్నాం... పార్టీలతో మాకు సంబంధం లేదు" అని ఎన్నిసార్లు చెప్పినా... మళ్ళీ మళ్ళీ... "బాబు అలాచేశాడూ.. జగనన్న ఇలా అయ్యాడు.." ఇది తప్పితే జైగారి నోటినుంచీ ఒక్క మ్ముక్కా బయటకి రాదయ్యే..

    "ఓట్లెయ్యకుండా... నిరసనలతో" అంటూ సుద్దులు చెప్పిన జైగారు.. వారు తెల్గాణా కోసం ఎలా నిరసనలు చేశారో మాట్ళాడితే..ఇక తల ఎక్కడపెట్టుకుంటారో....

    ReplyDelete
    Replies
    1. తెల్గాణా is type mistake

      Delete
    2. జైగారు నిష్క్రమించారనే అనుకుంటున్నాను.. పచ్చ, గులాబీ అంటూ మాట్లాడకుండా.. మోడీకి ఆంధ్రులంటే ద్వేషం లేదు అని అనేవాల్లు ఇంకెవరైనా ఉన్నారా?

      Delete
    3. నేను ఇక్కడే ఉన్నాను. శ్యామలీయం మాస్టారు & నీహారిక గార్లకు చెప్పిన జవాబు చదువుకోగలరు.

      Delete
    4. జైగారూ! ఇక్కడ జరగాల్సిన చర్చకూ, మీరు మాట్లాడే విధానానికీ ఏమాత్రం సంబంధంలేదు. దయచేసి గమనించండి.

      Delete
  9. శ్యామలీయం మాష్టారుగారు అన్నట్టు ముఖ్యంగా Jai Gottimukkala, Chiranjeevi Yగార్ల మధ్య చాలా చక్కని చర్చ జరిగింది. అసహనానికి,అహంకారానికి గురి కాకుండా సమన్వయంతో చర్చిస్తే చదూవరులకు చాలా చక్కని సమాచారం దొరుకుతుంది. ఈ ప్రయోజనార్ధము కోసమే "రచ్చబండ"ను స్థాపించడం జరిగింది.చర్చలు చక్కగా జరగాలని, దీని వలన చదూవరులకు లోతైన సమాచారం దొరకాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  10. @Chiranjeevi Y:
    @K.S.Chowdary:

    టపా శీర్షిక (ప్రశ్న) వేరేగా (ఉ. ఐదేళ్లు ఆంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని వాగ్దానం చేసిన బీజేపీ అధికారంలో వచ్చాక వెనక్కు పోవడానికి కారణాలు ఏమిటి) ఉండుంటే బాగుండేది. మీకు మీరే మోడీ గారికి ఆంధ్రులపై కక్ష అని నిర్ధారించేయడం పట్లనే నాకు ఇబ్బంది.

    ఇదే ఈ పరంపరలో నా చివరి వ్యాఖ్య. మీరు ఏమి జవాబు ఇచ్చినా మానినా నేను మాత్రం సమాధానం ఇవ్వను. ఇంకోసారి ఇంకెప్పుడయినా కొనసాగిద్దాం.

    ReplyDelete
    Replies
    1. నాకు ఈ టపా టైటిల్ పై ఏమాత్రం ఆక్షేపణలేదు. అది 100% నిజం. చర్చ జరగాల్సింది..జరుగుతున్నదీ ఆ ద్వేషం ఎందుకనే.. దాన్ని "ప్రత్యేక ప్రతిపత్తి" అనే ఏ ఒక్క విషయానికో లిమిట్ చెయ్యలేము..

      Delete
  11. మోడీకి ఆంధ్రులంటే ద్వేషం ఎందుకుంటుంది? చంద్రబాబు అంటే ఉందేమో! లేదా ఎత్తుగడల రీత్యా బాబే మోడీకి ద్వేషం ఉన్నాడని క్రియేట్ చేస్తున్నాడు. బాబు ఎత్తుగడలను తిప్పికొట్టడం లో బీ.జే.పీ, జగన్ ద్వయం ఫెయిల్ అవుతున్నారు. ఎ.పీ కి పదేండ్ల స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న బి.జే.పీ మాట తప్పినపుడు బాబు ప్యాకేజి మోజులో ..... అందులో తన వాటా లెక్కల్లో ..... ఉబ్బి తబ్బిబ్బై ప్యాకేజియే బంగారం..... స్టేటస్ దేనికీ అని ప్రపంచానికి మాంచి ఎకనామికల్ గీతా బోధ చేయలేదా...... బాబు .... మోడీ ట్రిక్కులు ..... జగనన్న ఎదురు చూపులతో.... పవనన్న గందరగోలంతో.... ఆంధ్రులకు ఒరిగేదేమీ కనబడడం లేదు. బాబు త్రిక్కులను ఎదుర్కోలేకపోతెనో...... జగన్ ఒళ్ళు బలుపు తగ్గకుంటేనో తప్ప ఎ.పీ లో వచ్చే ఎన్నికలలో అధికారం జగన్ దే. బి.జే.పీకి కావలసిందీ అదే. బీ.జే.పీ స్పెషల్ స్టేటస్ ఇవ్వదు. రాహుల్ మాట నిలుపుకోవాలంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ( కేంద్రంలో నైనా) రావాలి కదా?!

    ReplyDelete
    Replies
    1. >>బి.జే.పీ మాట తప్పినపుడు "బాబు ప్యాకేజి మోజులో"

      జైగారు, మీరు సెకండ్ ఆఫ్ మాత్రమేఎందుకు హైలెట్ చెయ్యాలనుకుంటున్నారు?


      Delete
    2. @ Kondala Rao Palla ...
      "బాబు ఎత్తుగడలను తిప్పికొట్టడం లో బీ.జే.పీ, జగన్ ద్వయం ఫెయిల్ అవుతున్నారు.."
      అక్షర సత్యం. modi is incapable of doing anything and / or any kind. even when the atmosphere is so ripe and hopeful, both are time and again getting failed to encash the situation. to some extent, jagan is better in the race.

      ఒక విషయం మాత్రం ఖచ్చితం ...
      రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాకు ఏమాత్రం డోకా ఉండదు ... ఎందుకనంటే కోల్పోయిన సామంత రాజ్యాన్ని ఎలాగోలా హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్ కి తప్పనిసరి. రాష్ట్రం లో వాళ్ళు ఎవరితో కలిసినా, అది వాళ్లకు
      లాభం, జేర్చుకున్న వాళ్లకు నష్టం. కానీ టీడీపీని చంకన మొయ్యడానికి ఎర్రి కాంగ్రెస్తప్ప ఎవ్వరు సిద్ధంగా లేరు. ఇరువురికీ గతిలేని పరిస్థితే.

      Delete
    3. @Chiranjeevi YSeptember 21, 2018 at 4:46 AM:

      "జైగారు, మీరు సెకండ్ ఆఫ్ మాత్రమేఎందుకు హైలెట్ చెయ్యాలనుకుంటున్నారు?"

      మీరు సంబోదించాల్సింది కొండల రావు గారిని. నేను నా "చివరి వ్యాఖ్య" ఇదివరకే రాసేసాను.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్