ప్రధానమైనవి హక్కులా? బాధ్యతలా?
హక్కుల కోసం వాదించేవారే..బాధ్యతల కోసం మాట్లాడేవారు బహు తక్కువమంది ఉన్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు, మామూలు వివాహాలు, ఆస్తి పంపకాలు..ఇలా ఒకటేమిటి...అనేక వాటిల్లో మన హక్కుల కోసం మనం పోరాడతామే గాని మనం నిర్వర్తించాల్చిన బాధ్యతలను మాత్రం గుర్తెరగము. నిజానికి తన బాధ్యతలను నిర్వర్తించిన వారికే హక్కు ఆశించే అవకాశం ఉంటుంది గాని బాధ్యతలను నిర్వర్తించని వారికి ఏవిధమైన హక్కు ఉండదు. దీనికి మీరేమంటారు?
👌👌👌👌👌
ReplyDeleteThankyou medam ji
Deleteబొమ్మా బొరుసా దేనిది పైచేయి?
ReplyDeleteమీ ప్రశ్న ఎందుకో కరెక్ట్ ఆనిపించడం లేదు శ్యామలీయం సర్.బాధ్యతలను నిర్వర్తించినవారికే హక్కు ఉంటుంది. బాధ్యత లేని హక్కు...నిజానికి హక్కేలా అవుతుంది? హక్కుంది గదాని బాధ్యతలు వదిలేస్తే ఎలా? పని చేసినప్పుడే కూలి అడిగే హక్కు ఉంటుంది. పనే లేనప్పుడు కూలి అడిగే హక్కేలా ఉంటుంది.ఇటువంట ప్పుడు బొమ్మా,బోరుసులా...బాధ్యతా,హక్కు ఎలా సమానమవుతాయి?
Deleteపని చేయగలిగి చేసే అవకాశం లేకపోవడం ఏమవుతుంది?
Deleteశ్యామలీయంగారు అడిగినది కూడా మంచి ప్రశ్నే...కాకపోతే సమాధానం చెప్పడం కష్టం. భార్యాభర్తలలో ఎవరిది పైచేయి అని అడిగితే ఏం సమాధానం వస్తుందో దీనికి కూడా అదే సమాధానం. మేం బొమ్మలం అని ముందుగానే చెప్పేస్తున్నా !
Deleteబొమ్మా బొరుసా దేనిది పైచేయి అంటే వాటిమధ్య అవినాభావసంబంధం ఉందని సూచించటమే నా ఉద్దేశం. భాద్యతలు అక్కరలేదు హక్కులే కావాలన్నా అసమంజసమే, హక్కులు ఇవ్వం భాద్యతలు మాత్రమే ఇస్తా మన్నా అసమంజసమే. వాటిలో ఇది ప్రధానం అది కాదు అని చెప్పకూడదు. నాప్రశ్న తప్పు అంటే కొంచెం వివరణ ఇచ్చానే కాని వాదనకు కాదు. నా మాట నచ్చకపోతే మన్నించాలి.
Deleteమొదట భాద్యత..తర్వాతే... హక్కు.
ReplyDeleteదురదృష్టం. ఒక్క భాధ్యతల సంఘం కూడా ఇక్కడ చూడలేము. సోమరిపోతుల రాజ్యం.
ఇతరుల హక్కులు నా బాధ్యతలు అని,
ReplyDeleteహక్కులు,బాధ్యతలు అనేవి అందరికీ కామన్ అయిన విషయాల్లోనే వీలౌతాయని,
జనాభాలో ప్రతీ ఒక్కరూ అనుకుంటే, కాదు కాదు, నమ్మితే కానీ ఈ ప్రశ్నకి జవాబు దొరకదేమో🤔🤔
👏👏👏👏👏
Delete
ReplyDeleteప్రణయ్ కాలం కత అయిపోనాది.
ఉప్పుడు బాధ్యత పై బాదుళ్ళ కాలం బిగిను :)
🤔
Delete