స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎంతవరకూ సమంజసం?
తెలంగాణా ప్రభుత్వం స్వామీ పరిపూర్ణానందను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించింది. శ్రీరాముడిపై అనుషిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై ఉద్యమించిన స్వామీ పరిపూర్ణానందను ముందుగా హౌస్ అరెస్ట్ చేసి తరువాత ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసింది. దీనికి ప్రధాన కారణం స్వామి పరిపూర్ణానంద కత్తి మహేష్ వ్యవహారాన్ని మరింత ఉదృతం చేసి మత విద్వేషాలను రగిలించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎవరో ఒక అనామకుడు శ్రీరాముడిని విమర్శించడం వలన ఏమాత్రం ఆయన కీర్తి తగ్గిపోదని, గతంలోనూ ఎంతో మంది విమర్శించారని అయినంత మాత్రాన ఏ హిందువూ శ్రీరాముడిని వదిలేసారా? వదలలేదే? మరి స్వామి పరిపూర్ణానందకు ఎందుకింత ఆవేశం? ఆ విమర్శలను అక్కడితో వదిలేస్తే సరిపోయేది. కాని ఈ స్వామి పరిపూర్ణానంద చేస్తున్న పనుల వలన కత్తి మహేష్ హైలైట్ అవ్వడం "శ్రీరాముడు" ప్రజలలో చులకన అవ్వడం ఎక్కువ జరుగుతుంది. ఇప్పటికైనా స్వామి పరిపూర్ణానంద సమస్యలను ఉదృతం చేయడం మానుకోవాలంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని స్వామి పరిపూర్ణానందను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించి ఆంధ్రా(కాకినాడ ఆయన ఆశ్రమాని)కి పంపివేయడం జరిగిందని తెలుస్తోంది.

తెలంగాణా ప్రభుత్వం *నగర* బహిష్కారం ఎలా చేస్తుంది, చేస్తే *రాష్ట్ర* బహిష్కారం చేయాలి కదా.
ReplyDeleteమీడియా కథనాలతో ఎదో తికమక ఉంది. తెలంగాణాలో హైదరాబాదు తప్ప ఏమీ లేదని వీరి భావన కాబోలు!
ఇప్పుడు జరిగినది కూడా effectively రాష్ట్రబహిష్కారమే కదా. హైదరాబాద్ పొలిమేరలు దాటిన తరువాత ఏదో ఒక ఊరిలో విడిచిరాకుండా తీసుకువెళ్ళి, తీసుకువెళ్ళి పొరుగురాష్ట్రంలోని కాకినాడ వరకు తీసుకువెళ్ళారు కదా. చేస్తే రాష్ట్రబహిష్కారమే చెయ్యాలి గానీ నగరబహిష్కారం కాదు ... లాంటి నిబంధనేమన్నా ఉందంటారా? అయినా ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చెయ్యచ్చు - నగర...., రాష్ట్ర.... అనేముంది?
ReplyDeleteఅసలు బహిష్కారం సమంజసమా కాదా అన్నది ఈ బ్లాగర్ అడిగిన ప్రశ్న. ఏదో సినిమాలో చిరంజీవి “లెవెలైపోద్ది” అని డైలాగ్ అంటుంటాడు ... అది గుర్తొస్తోంది.
మూడు పాయింట్లు:
Delete1. "సమంజసమా కాదా": బహిష్కరణ అన్నది ఎప్పుడూ కరెక్ట్ కాదనేదే నా అభిప్రాయం. నేరమే అయితే కేసు పెట్టాలి, న్యాయస్థానంలో తేల్చుకునే హక్కు ఉంటుంది. బహిష్కరణ వేలి వేయడాలు లాంటివి ఇంకా ఈ ఆధునిక యుగంలో అవసరం కాదు.
2. "నిబంధనేమన్నా ఉందంటారా": jurisdiction చట్టంలో ముఖ్యమయిన కాన్సెప్ట్. ప్రకటన చేసింది నగర పోలీసు కమిషినర్ అనుకుంటా (డీజీపీ కాదు). మీడియాలో హైదరాబాదు-తెలంగాణా confusion ఎప్పుడు పోతుందో ఏమో?
3. "కాకినాడ వరకు తీసుకువెళ్ళారు": ఇక్కడే నాకు తిరకాసు. *రాష్ట్ర* బహిష్కరణ చేసినా పొలిమేర దాటిస్తే చాలు కదా. కాకినాడ (లేదా చిత్తూరు) నాకు అర్ధం కావడం లేదు. అసలు వారిది ఫలానా ఊరని ఎలా నిర్ధారించారో?
కులాలు, మతాలలోకి డీవియేట్ కాకుండా.. సబ్జెక్ట్ మీద మాత్రమే మంచి చర్చనడవడం ఈ మధ్యకాలంలో ఇప్పుడే చూస్తున్నాను
ReplyDeleteకత్తి మాట్లాడింది యాజిటీజ్గా ప్రసారం చేసిన చానల్లకి లేదా నగర భహిష్కరణ?
ReplyDelete