Breaking News

మనం ఎవరిని సమర్ధించాలి? కంచె ఐలయ్యనా? పరిపూర్ణానంద స్వామీజీనా?

 Who should we support? The Kancha Ilaiah? Is the Swapanananda Swamiji? మనం ఎవరిని సమర్ధించాలి? కంచె ఐలయ్యనా? పరిపూర్ణానంద స్వామీజీనా?

5 comments:

  1. తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
    తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
    తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
    చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

    ఈ ఐలయ్య ఒక మూర్ఖశిఖామణిలాగా వాదిస్తాడు. ఆయన అసలు ఎజండా ఎమిటీ అన్నది అందరికీ‌ తెలుసును. మూర్ఖులతో వాదించరాదని తెలిసి పరిపూర్ణానంద స్వామి ఆయనతో ఎందుకు వాదిస్తున్నారు! ఐలయ్యది మూర్ఖత్వం అని ఋజువు చేయాలి బహిరంగంగా - అలా ఆయన్ను ఓడించి నిరోధించాలని అనుకోవటం ఫలించేలా లేదు. ఎందుకంటే ఐలయ్యకు కావలసినది ప్రచారం - అది ఫేమ్‌ అందామా నొటోరిటీ అందామా - ఏదైనా ఒకటే. ఒక సినిమా ఉందను కోండి అది ఎంతో వివాదాస్పదంగా ఉందను కోండి ఏదో రకంగా, ఆ వివాదం కాస్తా పెద్ద చర్చకు దారి తీస్తే చాలు - అది ఎంత దరిద్రపు సినిమా ఐనా సరే బ్రహ్మాండంగా డబ్బు వసూలు చేసుకొంటుంది. ఇలా అతి తరచుగా చూస్తున్నాం‌ కదా. ఐలయ్య గారి ఎత్తుగడా అదే. ఎతో వివాదం వచ్చినా అయనకు కావలసిన ప్రచారం రెట్టింపవుతుందే కాని తరిగేదేమీ‌ లేదు. మధ్యలో మీడియావాళ్ళ హడావుడి ఒకటి - వాళ్ళ తాపత్రయం అంతా రేటింగ్ కోసం.

    ReplyDelete
    Replies
    1. అంటే మీ వుద్దేశ్యం కంచె ఐలయ్య దర్శకుడు రాంగోపాల్ వర్మను కాపీ కొడుతున్నాడంటారు.!

      Delete
  2. ఇదేమీ కొత్తగా వెలుగులోనికి వచ్చిన టెక్నిక్ కాదండీ.

    ReplyDelete


  3. మతమును తిట్టితి విగదా
    కతుకుచు కులమును కురచగ కసురన్నేలా !
    చతికిల బడినావు గదా !
    ఉతుకక వదులుదుర మరి జనులు యైలయ్యా !

    జిలేబి

    ReplyDelete
  4. I support ILAIAH,HE is fighting for the people who are avoided for 2000 years

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్