Breaking News

ఈరోజుల్లో మనుషుల మధ్య కోపతాపాలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణాలేమిటి?


3 comments:

  1. కోపం ఎందుకు వస్తుంది? అంటే, సాధారణంగా కోరింది కోరినట్లు గా జరగకపోవడం, అనుకున్నది సమయానికి అవ్వక పోవడం, అహం దెబ్బ తినడం, తనకు వ్యతిరేకంగా సృష్టించబడిన వదంతుల్ని వినడం, తనకు దక్కాల్సిన హుక్కు దక్కకపోవడం, తృప్తి స్థానే తృష్ణ చోటు చేసుకోవడం, తీవ్రమయిన నిరాశనిస్పృహలకు లోనవ్వడం- మొదలగు కారణాల వల్ల కోపం కలుగుతుంది. సరయిన సమయం లో, సరయిన మోతాదులో, సరైన వారిపై, సరైన రీతిలో కోపాన్ని పదర్శించడం కూడా ఒక కళే. ఆ మాత్రం కోపాన్ని సయితం మనిషి ప్రదర్శించలేకపోతే అతను, అతనికి సంబంధించిన ప్రతిదీ చులకనై పోతుంది. అలా అని ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుండటం మంచిది కాదు. అలాంటి వ్యక్తికి స్వంత సంతానం కూడా జడుసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేకపోతు గాంభీర్యమూ కూడదు. గుంట నక్క వినయమూ వలదు. కోపాన్నిగానీ, హాస్యాన్నిగాని సహజశైలి లో ప్రదర్శించాలి.

    ReplyDelete
  2. ఈ మధ్య ఓ యూనివర్సిటీవారు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటో తెలుసా? ఓ సగటు వ్యక్తి జీవితకాలంలో నిద్రకి కావలసిన సమయాన్ని తీసేస్తే మిగిలిన కాలంలో సగం కాలం కోపంతో గడుపుతాడట. ఆశ్చర్యంగా అనిపించినా నిజం అదే. ప్రతీ చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం ఈమధ్యకాలంలో సాధారణంగా మారిందని, ఆ ప్రభావం  ఆరోగ్యంపై, రిలేషన్స్‌పై ముఖ్యంగా పిల్లల వ్యక్తిత్వంపై చాలా ఉంటోందని చెబుతున్నారు ఆ అధ్యయనకర్తలు. ఆ కోపానికి కారణాలు వెతకడం మొదలుపెట్టగలిగితే లేదా ఆ కోపాన్ని నిర్మాణాత్మకంగా మార్చుకోవడం అలవాటు చేసుకోగలిగితే ఎన్నో సమస్యలకి దూరంగా వుండొచ్చు.

    ReplyDelete



  3. 1 – షైతాను నుండి అల్లాహ్ శరణు కోరండి :

    దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం ఉపదేశించారు : “మనిషికి కోపం వచ్చినప్పుడు ‘అవుజుబిల్లాహ్’ అనాలి. ఇలా అంటే అతని కోపం చల్లారిపోతుంది.”  సహీహ్ అల్ జామి హదీస్ 695


    2 – మౌనంగా ఉండడం :

    దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంఉపదేశించారు :“మీలో ఎవరికైనా కోపం వస్తే మౌనం వహించండి.” సహీహ్ హుల్ జామి 693


    3 – కూర్చొండి లేదా పడుకోండి :

    అల్ ఇమామల్ ఖత్తాబి رحمهالله ఇలా అన్నారు:  నిలబడి ఉన్న వ్యక్తి చేయగలిగే పని కూర్చున్న వ్యక్తి అంత మంచిగా చేయలేడు. పడుకున్న వ్యక్తి ఇంకా ఏమి చేయలేడు. అందువల్లే దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం కోపం వచ్చినప్పుడు నిలుచున్న వ్యక్తిని కూర్చోమన్నారు.

    అప్పటికి కూడా కోపం తగ్గని పక్షంలో కూర్చున్న వ్యక్తిని పడుకోమన్నారు. ఇలా చేయని పక్షంలో అతడు ఏదైనా చేయరానిది చేసే అవకాశం ఉంది. మఆలిం అస్ సునన్ 5/141


    4 – చిరునవ్వు :

    అనస్ బిన్ మాలిక్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం:“నేను ఓ సారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో పాటు వెళుతుండగా ఓ పల్లెటూరి వాడు వచ్చి,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మెడపైఉన్న వస్త్రాన్ని గట్టిగా గుంజాడు. దాని మూలంగాదైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంమెడపై గుర్తు(గాట్లు)లు పడ్డాయి. ఆ తరువాత ఆ పల్లెటూరివాడు దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంను డబ్బులివ్వమని ఆజ్ఞాపించే ధోరణిలో అడిగాడు. దానిపైదైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం చిరునవ్వు చిందిస్తూ అతనికి కొంత డబ్బు ఇవ్వండని అన్నారు.” ఫత్హుల్ బారి10/375


    5 - దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం సలహాను గుర్తుంచుకోవడం :

    అబూ హురైరారజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “ఒక వ్యక్తిదైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు వచ్చి ‘నాకుఉపదేశించండి’ అని అన్నాడు.” దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం “కోపగించుకోకు” అని జవాబిచ్చారు. ఆ మనిషి ఎన్నో సార్లు అదే ప్రశ్న అడిగాడు. దానికి జవాబుగా దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం ‘కోపగించుకోకు’ అని అన్నారు. ఫత్ అల్ బారి 10/456


    మరో ఉల్లేఖనం ప్రకారం ఆ మనిషి ఏమన్నాడంటే, “దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం అదేశంలోని అంతరార్ధం ఏమిటంటే కోపమే అన్ని రకాల కీడులకు మూలం.” ముస్నద్ అహ్మద్ 5/373


    6 - తమనుతాము నియంత్రించుకునే వారిని గుర్తుంచుకోవడం :

    దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు : “ఇతరులను ఓడించేవాడు బలవంతుడు కాడు. తన కోపంపై నియంత్రణ గలవాడే అసలైన బలవంతుడు.” ముస్నద్ అహ్మద్ 2/236


    “విపరీతమైన కోపంలో మొహం ఎర్రబడి, నరాలు బిగుసుకుపోయినప్పుడు తన కోపాన్ని జయించేవాడే అసలు సిసలైన బలవంతుడు” అనిదైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం ప్రబోధించారు.సహీహ్ హుల్ జామి 3859


    7 – కోపాన్నిదిగమ్రింగేవారికి లభించే శుభాలు :

    దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంఅన్నారు: “కోపగించుకోకండి, స్వర్గం మీకు లభిస్తుంది.” సహీహ్ అల్ జామి 7374


    దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంఅన్నారు: “ఎవరికైతే తమ కోపాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉన్నప్పటికీ, కోపాన్ని అణచుకుంటాడో అతణ్ణి అల్లాహ్ తీర్పుదినాన మానవాళి అందరి ముందూ పిలిచి హూరును (దైవకన్యను) ఎన్నుకునే అవకాశం కల్పిస్తాడు.” అబూ దావూద్ హదీస్ 4777, సహీహ్ అల్ జామిహదీస్ 6518


    8 –అల్లాహ్ ను సంతోషపెట్టే కార్యాలలో కోపం అణచుకోవడం కూడా ఒకటి :

    “వారు కలిమిలోనూ, లేమిలోనూ(దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు. ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:134


    9 –ఖుర్ఆన్ ఆదేశాలకు సమర్పించుకోవడం :

    ఇబ్న్ అబ్బాస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం: “ఓ వ్యక్తి ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజిఅల్లాహుఅన్హుతో మాట్లాడడానికి వచ్చి ఇలా అన్నాడు, ‘ఓ ఇబ్న్ అల్ ఖత్తాబ్రజిఅల్లాహుఅన్హు మీరు మాకు సరిగ్గా ఇవ్వడం లేదు మరియు మా మధ్యలో న్యాయం చేయుట లేదు’. ఒమర్రజిఅల్లాహుఅన్హు కోపంతో అతనిపైదాడి చేయబోయారు. కాని అక్కడున్న అల్ హుర్ బిన్ ఖైస్రజిఅల్లాహుఅన్హు ఇలా అన్నారు: “ఓ విశ్వాసుల నాయకుడా! అల్లాహ్దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంతో ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు,‘(ప్రవక్తా!) మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధిస్తూ ఉండు.మూర్ఖులను పట్టించుకోకు.’ (ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:199), ఇతను ఒక మూర్ఖుడు.” ఈ ఖుర్ఆన్ వాక్యం విన్నాక ఉమర్రజిఅల్లాహుఅన్హు అక్కడే ఆగిపోయారు. ఎందుకంటే అయన చాలా దైవభీతిపరులు మరియు అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించేవారుకాదు. ఫత్ హుల్ బారి 4/304


    10 – కోపం వల్ల కలిగే నష్టాలను గుర్తుంచుకోండి :

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్