Breaking News

మతమని దేనినంటారు? ధర్మమని దేనినంటారు?


16 comments:


  1. మతమని దేని నంటారు ? ధర్మమని దేని నంటారు ?

    జవాబు: రచ్చని మతమంటారు ; బండ ని ధర్మ మంటారు :)

    జిలేబి

    ReplyDelete
  2. మతం అని తెలుగులో అంటారు. ధర్మం అని హిందీలో అంటారు.
    హిందీలో మత్ అంటే ఓటు అనే అర్థంలో వాడతారు. మత్‌దాన్ అంటే ఓటింగ్.

    ReplyDelete
  3. Semanticsలో హిందీకీ, తెలుగుకీ మధ్య చాలా తేడా ఉంది. హిందీలో ఉద్యోగ్ అంటే పరిశ్రమ, ఉద్యోగపతి అంటే పారిశ్రామికవేత్త. వాళ్ళు employeeని కర్మీ లేదా కర్మచారీ అంటారు.

    ReplyDelete
  4. జిలేబి గారు కరెక్టు. ధర్మము బండలాగా మారనిది. మతమనగా అభిప్రాయము, నమ్మకము.

    ReplyDelete
  5. నేను కూడా జిలేబిగారి యొక్క, పునర్వసుగారి యొక్క అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  6. నమ్మకాలూ,అభిప్రాయాలూ కాలంతో పాటు మార్చుకోవలసి వస్తే ధర్మం బండరాయిలాగే నిలచి ఉంటుందా ?

    ReplyDelete
    Replies
    1. థర్మంలో కొన్ని ప్రధాన ప్రిన్సిపల్స్ ఆజ్ఞాలుంటాయి. అవి ఎప్పటికీ మారవు. అయితే వాటి అనుచరణ కాలానుగుణంగా మారవచ్చు. మారాలి కూడా! దాని కారణంగా థర్మమ్ మారిపోయినట్టు కాదు నీహారికగారు.

      Delete
    2. ఉదాహరణకు ఆదికాలం నుండీ భగవంతుడు ఒక్కడే, ఆయననే వేడుకోవాలనేది థర్మంలోని ప్రధానమైన ఆజ్ఞ. ఇది ఎప్పటికీ మారాదు. అయితే వేడుకొనే విషయంలో ఆరాధనా పద్ధతులు, సమయాలు మారవచ్చు. దానికారణంగా థర్మమ్ మారిపోయినట్టు కాదు.

      Delete
    3. "ఆదికాలం"

      అంటే ఎమిటి? క్రీ.పూ. రెండువేలు? నాలుగువేలు? పద్నాలుగువేలు? జనాబ్... ఇస్లాంలోకూడా అల్లాకు పూర్వం అల్లత్ అనే ఒక ఆడదేవత, ఆవిడ పరివారం పూజలందుకొనేవారు. మొట్టమొదటిదేవత అమ్మతల్లి/ఇష్తర్/ఆదిపరాశక్తి ఇలా ఆడదేవతలే. ఏకీశ్వరోపాసన చాలా latest trend.

      మీరు ఖురానే చరిత్ర అనే భ్రమలోంచి బయటకురావాల్సుంది.

      Delete
  7. మతం లో కొన్ని నమ్మకాలు మార్చుకోవాలి.మారను అంటే ధర్మాన్ని తప్పవలసివస్తుంది.అపుడు రచ్చ రచ్చే కదా ?

    ReplyDelete
    Replies
    1. మతం మానవ అభీష్టాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాడు మనిషి. నిజానికి మతానికి, థర్మానికి ఏ విధమైన సంబంధం లేదు. ఎప్పటికీ థర్మమ్ థర్మమే! అసలు రచ్చంతా మతంలోనే ఉంది. ఈ ఏర్పాటువాదాలు, చిన్నా,పెద్దా కులం గోత్రం అన్నీ మతం నుండే పుట్టుకొచ్చాయి. ఒకొక సిద్ధాంతంతో ఒకొక్క గ్రూప్ తయారై విభిన్న నమ్మకాలు ఏర్పరుచుకుంది. అయితే థర్మము విశాలమైనది.సమానత్వం కలిగినది. మనిషి వీటి రెండిటినీ కలగాపులగం చేసేశాడు.

      Delete
  8. మతం అనేది దేవుడు,పరలోకం,పాపపుణ్యాలు - వీటి గురించి చెప్పేది.
    ధర్మం అనేది మనిషి,ఇహలోకం.మంచిచెడులు - వీటి గురించి చెప్పేది.

    ReplyDelete
    Replies
    1. మతంలో దేవుడు,పరలోకం,పాపపుణ్యాలు ఉన్నప్పటికీ ఇవ్వన్నీ మనిషి థర్మములో నుండే దిగుమతి చేసుకుని దానికి మతమని పేరు పెట్టుకున్నాడు. థర్మమనే మాటకు కరెక్ట్ నిర్వచనం ఈశ్వరాజ్ఞ(దైవాజ్ఞ). మనిషి దైవాజ్ఞలకనుగుణంగా నడుచుకోవడమే థర్మము. శాస్త్రానుగుణమైన నమ్మకాలు ఏర్పరుచుకోవడమే థర్మము.ఇది దైవ అభీష్టానికి తప్ప మానవ అభీష్టానికి వర్తించదు.

      Delete
  9. నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెబుతాను వినండి (చదవండి?)

    ధర్మం... వ్యభిచారం తప్పని చెబుతుంది. మతం... తప్పు చేయనందుకు ప్రతిఫలంగా స్వర్గంలో అప్సరసలు/హూర్‌లు/వేశ్యలు ప్రతిఫలంగా దొరుకుతారని చెబుతుంది. ఏది నెనుచేస్తే తప్పో అది ప్రవక్తలు/దేవుళ్ళు చేసినప్పుడు దేవుదు ప్రవక్త/దేవుడు ని (convenientగా) సమర్ధించేస్తాడు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మొదటగా రామాయణం చరిత్రకాదు.

      రాముడి ఏకపత్నీవ్రత్యం కధకు అవసరమైన conviniece తప్ప మరొకటి కాదు. సీతారాముల (అనుమానపు) దాంపత్యం అంత ఆదర్శవంతమైనదేమికాదు. రాముడు అన్నింటికన్న ఎక్కువగా ప్రేమించినది తన reputationను మత్రమే.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్