Breaking News

పెళ్లి కాకుండా సహజీవనం చేయడం కరెక్టేనంటారా?


16 comments:

  1. బాబులూ... "ప్రజ", "రచ్చబండ" బ్లాగులు plauboy, penthouse, స్వాతి పత్రికలకేమాత్రమూ తీసిపోవు. వీతిని రాసేవాళ్ళకి ఏ విద్యార్హతలూ ఉండవు. ఉండకపోగా వీళ్ళు మతమౌఢ్యంలో పీకల్లోతు మునిగుంటారు (కమ్యూనిజమూ మతమేనండోయ్ - కావాలంటే ఈ విషయంలో ప్రవీణ్ అభిప్రాయాలని ఒక్కసారి గమనించండి). వీళ్ళేదో రాశారని, ఆవేశప్డి కామెంట్లురాసే నాలాంటివాళ్ళు పిచ్చిసన్నాసులు.

    గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. మీది ఏవిధమైన మౌఢ్యం అనాలి విశేషజ్ఞగారు? విద్యాహర్హతలు లేవని పైగా నిందలు..మీరేదో చదివిస్తే మేము చదవలేదనట్టు! ఒక అంశం పై చర్చ జరుగుతున్నప్పుడు దాని పరిధిలో నుండి బయటికొచ్చి కామెంట్లు పెట్టడం మీ అత్య్ధిక విద్యార్హతలకు నిదర్శనమా విశేషజ్ఞగారు?

      Delete
    2. క్షమించాలి.
      నా ఉద్దేశ్యం. ఏది తప్పు ఏది ఒప్పు అనేది socialagistల ఆధ్వర్యంలో జరగాలేతప్ప, దానికి ఒక మతావలంబనే ఒక అర్హతగా పరిగణించాలని నేను ఎన్నటికీ భావించను. కాబట్టే మీలాంటి ఈతరత్రా ఏ అర్హతా లేని వళ్ళపై నా చిన్నచూపు మరియు అవమానకర ధోరణి.

      నీహారికగారి ఈ ఒక్క అభిప్రాయంతో నూరుశాతం ఏకీభవిస్తున్నాను.

      Delete
  2. కరక్టే ! తప్పుకాదు.

    ReplyDelete
  3. సంప్రదాయబద్ధమైన వివాహ వ్యవస్థ ఉండగా దానిని విడనాడి సహజీవనం (డేటింగ్ ) వంటివి అంతమంచిది కాదని నా అభిప్రాయం. అయితే దీనితో మిగతావారు ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సహజీవనం అనేది కొన్నాళ్ళకు విచ్చలవిడి శృంగార వ్యవస్థగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు.

    ReplyDelete
    Replies
    1. సంప్రదాయాలు ఆచారాలు కాలక్రమేణా ఏర్పడతాయి. గతంలో పెళ్లిళ్లకు మాత్రమె ఉండిన లక్షణాలు (ఉ. పుట్టిన పిల్లల రక్షణ, వారసత్వ హక్కులు) ఇప్పుడు కొన్ని దేశాలలో మినహా సహజీవనానికి కూడా గుర్తించబడ్డాయి.

      ఇకపోతే విచ్చలవిడితనం, బహుభార్యాత్వం, గృహహింస, ఆధిపత్యం వగైరా అవలక్షణాలకు పెళ్లి అనే బంధం అవరోధం కాదు. దాంపత్యంలో అన్యోన్యత, పరస్పర గౌరవం, సమానత లాంటి వాటికి కావాల్సింది నిజాయితీ, పరస్పర అవగాహన & ప్రేమ మాత్రమె.

      Delete
  4. ఇది తప్పు ఇది ఒప్పు అని ఏదీ ఉండదు.ఇది నాకు నచ్చుతుంది,ఇది నాకు నచ్చదు అని మాత్రమే ఉంటుంది.ఇంట్లో నాన్నకూ/భర్తకూ నచ్చని పని చేయాలనుకుంటే ఇంట్లోనుండి బయటకు వెళ్ళి బ్రతకమంటారు.అలాగే వారిని కూడా బయటకు వెళ్ళి బ్రతకమంటే సరిపోతుంది.తల్లిదండ్రులు లేదా పిల్లలు ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు.వివాహ వ్యవస్థలోని లోపాలే సహజీవనానికి కారణాలు.లోపాలు సరిచేయకుండా కట్టుబాటు,నియంత్రణ,నియమాలు,క్రమశిక్షణ,పవిత్రత,పాతివ్రత్యం సాధ్యం కావు.

    ReplyDelete
    Replies
    1. Well Said, Niharika gaaru :-)

      Delete
    2. వివాహ వ్యవస్థలోని లోపాలే సహజీవనానికి కారణాలు.లోపాలు సరిచేయకుండా కట్టుబాటు,నియంత్రణ,నియమాలు,క్రమశిక్షణ,పవిత్రత,పాతివ్రత్యం సాధ్యం కావు. ఇది ముమ్మాటికీ కరెక్టే! అయితే లోపాలను సరిచేసి వివాహ వ్యవస్థను నిలబెట్టాలిగాని సహజీవనాన్ని ప్రోత్సహించకూడదు.

      Delete
    3. చౌదరి గారూ,

      1. ఏమిటా లోపాలు? వాటిని ఎలా సరిదిద్దాలి?
      2. పాతివ్రత్యం అంటే ఏమిటి? ఒకవేళ ఇది మహిళలను మాత్రమె కట్టడి చేసేటట్టయితే అలాంటి పద్దతి న్యాయమేనా?
      3. బహుభార్యాత్వం నిషేదించాలనే వాదన సరియేనా?
      4. విడాకుల చట్టంలో ఆడామగాలకు సమానత ఉండాలా? ఎలా సాదించాలి?

      Delete
  5. ఇప్పటివరకూ మగవారికి ఏ విధమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయో అటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఆడవారికీ ఉండాలి.
    తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరి పేరు ఉన్నా సరిపోతుంది,తండ్రి పేరే ఉండాలి అని వాదించకూడదు.
    ఏకపత్నీ(పతీ)వ్రతమయినా,బహుభార్యాత్వమయినా ఆంక్షలేమీ ఉండకూడదు.ఎవరి క(ఖ)ర్మకు వారినే బాధ్యులు చేసి వదిలేయాలి.
    భాగస్వామి ఎవరయినా విడాకులు కోరితే ముస్లిం ల లాగా మూడే ముక్కల్లో విడాకులిచ్చేయాలి.
    జనన దృవీకరణ పత్రం,మరణ దృవీకరణ పత్రాల్లాగే వివాహ,విడాకుల దృవీకరణ పత్రాలు అంతే వేగంగా ఆధార్ తో అనుసంధానిస్తూ ఇచ్చేయాలి.
    కట్నం తీసుకుంటే భరణం ఇవ్వాలి,ఆస్థి తీసుకుంటే ఆస్థి తిరిగి ఇచ్చేయాలి.ఇవేమీ మేము తీసుకోలేదు అంటే కట్టుబట్టలతో బయటకి వెళ్ళిపోవాలి.
    వివాహం తర్వాత సంపాదించిన ఆస్థులన్నీ భర్తకే ధారపోసి (భర్తే సంపాదిస్తే)సూర్యుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి.

    ReplyDelete
    Replies
    1. @నీహారిక:

      "భాగస్వామి ఎవరయినా విడాకులు కోరితే ముస్లిం ల లాగా మూడే ముక్కల్లో విడాకులిచ్చేయాలి"

      ఈ అవకాశం పురుషులకు మాత్రమేనండీ!

      Delete
  6. ప్రశ్నను మరో కోణంతో చూద్దాం. హిందూ సంప్రదాయంలో గుర్తింపు పొందిన అనేక వివాహ పద్దతులలో గాంధర్వ వివాహం కూడా ఒకటి. ఈ పద్దతి ఋగ్వేద కాలంలో ఎక్కువగా పాటించబడేదని అంటారు. ఋగ్వేద అథర్వణ వేదాలలో, మహాభారతంలో & మనుస్మృతిలో ఈ పద్దతి గురించి చెప్పబడి ఉంది. గాంధర్వ వివాహం చెల్లదన్న వాదనను కోర్టులు కొట్టేసాయి.

    పాశ్చాత్య దేశాలలో సైతం కామన్ లా వివాహం అనే సంప్రదాయం ఉంది. కొంతమేరకు ఇది గాంధర్వ వివాహం లాంటిదే.

    గాంధర్వ వివాహానికి & కామన్ లా పెళ్ళికి మతపరమయిన సెరిమనీ, తల్లితండ్రుల అనుమతి, ప్రమాణ స్వీకారం & సాక్ష్యులు అవసరం లేదు. యుక్తవయస్సు తీరిన వ్యక్తులు బుద్ధిపూర్వకంగా ఒకరినొకరు భాగస్వాములుగా ఒప్పుకుంటే చాలు.

    1. వీటికి సహజీవనానికి తేడా ఉందా?
    2. తేడాలు ఉన్నా అవి ప్రస్తుత చర్చకు సంబందించినవా?

    ReplyDelete
    Replies
    1. Do you think that Hindu law was ever uniform?
      http://praja.palleprapancham.in/2015/07/blog-post_34.html?m=1

      Delete
  7. @జై గారూ,

    పురుషులకే ఆ వెసులుబాటు ఉన్నా స్త్రీకే లాభం.ఇపుడు విడాకులు పెద్ద నేరమేమీ కాదు కదా ? భర్త ప్రక్కనే ఉండి రోజూ పోట్లాడుకునేకన్నా ఎవరికి వారు విడిపోవడమే మేలు. తెలంగాణా ఉద్యమం అదే నేర్పింది.

    గాంధర్వ వివాహం,సహజీవనం ఒకటి కావు.గాంధర్వమంటే భాగస్వాములిద్దరూ రహస్య దాంపత్య జీవనాన్ని కలిగిఉండడం.సహజీవనం అంటే ఫలానా వారితో శారీరిక సంబంధం కలిగిఉన్నాను అని ఒప్పుకోవడం.

    ReplyDelete
  8. డబ్బు కోసం విడాకులు తీసుకంటున్నారని విదాకుల్ని దూషించి మన వివాహవ్యవస్థ భద్రంగా ఉండాలని ఆశిస్తున్నానని సంకల్పాలు చెప్పిన నోటితోనే ఏటీయం లోనుంచి దబ్బులు తీసుకున్నంత తేలికగా విడాకులు రావాలని ఇక్కడ రెచ్చిపోవటం?యేది నీ అసలైన సిధ్ధాంతం?యెందుకీ రాధ్ధాంతం!పెళ్ళ్ళికెదిగిన కొడుకుని ఇంట్లో పెట్టుకున్న ఒక ప్రౌఢ ప్రపోస్ చెసినంత మాత్రాన శూర్పణఖ్కకి ముక్కూ చెవులూ కొయ్యాలా అని అడుగుతుంటే ఆవు చేలో మస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు పెళ్ళీడు కొచ్చిన నవోఢల్లో ఒకరు ఇంకొకరికి ఇద్దరబ్బాయిల పేర్లు చెప్పి వీళ్ళిద్దరిలో యెవరో ఒకర్ని నువ్వు లవ్ చేసితీరాలని రెచ్చిపోతున్నది.బాబరుకీ రాముడికీ సంబంధం ఉన్నప్పుడు ఈ రెంటికీ సంబంధం లేదా?ఉన్నదని ఒప్పుకుంటే ఆ అమ్మాయి చేసింది తప్పా ఒప్పా?తప్పయితే వాళ్లకి మంచి చెప్పగలిగే స్థానంలో ఉన్నట్టా తప్పు కాదంటే ఇంకా రెచ్చిపొమ్మని చీర్ లీదర్ పనులు చేస్తున్నట్టా?

    ఒక మాట కాదు,ఒక తీరు కాదు,ఒక సిధ్ధాంతం లేదు,ఓకే వాదనకి కట్టుబడరు,తమ మాటల్ని తామే ఖండించుకుంటారు - ఇలాంటివాళ్లతో వాదనలు చేసేవాళ్ళు నీదతో యుధ్దం చేసినట్టే!తమతో తామే వాదించుకుని తమను తామే వోడించుకుని మురిసిపోయే బహురూపులతోజరిగే వాదనలలో యెవరయినా యేమి వూదబొడుస్తారు?

    వివాహాన్ని విలువైనదిగా భావించేవాళ్ళు సహజీవనం గురించి ఆలోచించరు!సహజీవనం కోసం వెమర్లాడేవాళ్ళు ఈ చర్చల వైపుకి కనెసం రాను కూడా రారు,మరి యెందుకీ వృధా ప్రయాస?

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్