Breaking News

మతమార్పిడి నిరోధక బిల్లు తీసురావాలనుకోవడం సమంజసమా?

మన భారతదేశం అనేక సంస్కృతి,సంప్రదాయాలకు, అనేక మత భావాలకు నిలయం. ప్రపంచ పటంలో మనదేశానికి ఉన్న ఔన్నత్యం మరే దేశానికి లేదు. ఇక్కడ మతాల మధ్య ప్రేమ సామ రస్యాన్ని తీసుకు రావాలి తప్ప ఎవరికిష్టమైన వారి మతభావ స్వీకరణా నిరోధాన్ని తీసుకు రావాలనుకోవడం దేశ మత సామరస్యాన్ని నిర్మూలించడం కాదా? మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకురావాలనుకోవడం అన్యాయం కాదా?

31 comments:


  1. సమంజసము కాదు

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ గారూ. వాదనలలో చిక్కుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత జాగ్రత!

      Delete

    2. వాదన కోసమే అట్లా రాసేమండోయ్ శ్యామలీయం వారు !

      చూద్దాం ఎవరికీ ఎంత సత్తా ఉందొ ! సత్తే పే సత్తా ! ఎదరా మేలా ! మీరా మేమా ఈ రోజు ఇది 'తేలి' పోవాల్సిందే !!

      జిలేబి

      Delete
    3. చెప్పలేదండనక పొయ్యేరు
      జనులార మీరు ..........

      అందుకనే ఒక హెచ్చరికగా చెప్పటం జరిగిందండీ.
      మీ ఆనందాన్నెందుకు కాదనాలీ, కానివ్వండి.
      మీకు మాటలుపడేందుకు ఇబ్బందిలేకపోతే అనంతానంతంగా సాగే చర్చావేదికలతో మంచి కాలక్షేపమే కావచ్చును. శుభం భూయాత్॥

      Delete
  2. హిందూ సమాజాన్ని నాశనం చేయడానికిగాను కంకణం కట్టుకున్న కొన్ని శక్తులకు ఇది అడ్డుకట్ట కాగలదు . ఇది మన ప్రభుత్వం తీసుకోబోతున్న ఒక మంచి నిర్ణయం . దీన్ని ఆహ్వానిద్దాం
    జై గురుదేవ్

    ReplyDelete

  3. హిందూ సమాజాన్ని ఎవ్వరు నాశనం చేయ లేరు !

    ఈ దేశం అన్ని మతాల్ని తనలో ఇముడ్చు కున్న దేశం !

    ఇక ఇక్కడి ఇకి వచ్చిన ఇస్లాము కూడా సనాతన ధర్మ తాత్విక చింతన తో విలక్షణ మైన సూఫీ గా మార్పు తెచ్చు కొంది .

    కేరళా లో క్రైస్తువులు బొట్టు కుంకుమ, తాళి పెట్టు కుంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం !

    అట్లా ఈ దేశం ఒక మెల్టింగ్ పాట్ ! పాత కొత్తల మేళ వింపు

    జిలేబి

    ReplyDelete
  4. మత మార్పిడులు వుండాలి. అలాగే కుల మార్పిడులూ వుండాలి. ఎవరికి కావలసిన మతం, కులం వారు స్వీకరించే వెసులుబాటు వుండాలి. అలాగే నాస్తికులకు NOTA మతం, NOTA కులం కూడా వుండాలి. వీటన్నిటిన్నిటినీ నియంత్రించేందుకు కులాల, మతాల రిజిష్ట్రార్ ఆఫీసులు దేశమంటా తెరవాలి!

    ReplyDelete
  5. జిలేబి జి, హిందూ సమాజాన్ని ఎవ్వరు నాశనం చేయ లేరు అని స్వీపింగ్ స్టేటెమంట్ లు సరైన చరిత్ర తెలియకపోతే ఇస్తారు. అరిగిపోయిన కాంగ్రెస్ రికార్డ్ ను మరోకసారి వినిపించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

  6. హరి గారు,

    << మతాల రిజిష్ట్రార్ ఆఫీసులు దేశమంటా తెరవాలి!

    సెహ భేష్ ఐన మాట ! ఇంతే గాక ఈ మత ప్రాదిక పై మనకున్న మతాన్ని డీ మేట్ కూడా చేయ గలిగి ఉండాలి . అంటే సమయాన్కూలం గా వాటిని అమ్మేయ డాని కున్నూ, ఆ పై కొనుక్కోవడా ని కున్నూ వెసులు బాటు ఉండాలి. మార్కెట్టు ధర బట్టి వాటి అమ్మకం కొనుగోలు నిర్ణయింప బడాలి ! అప్పుడే వాటి కి సరి యైన మార్కెట్టు ధర , డిమాండ్ అండ్ సప్లయ్ మీద ఆధార పడి ధర పలుకును !

    జిలేబి

    ReplyDelete
  7. ఆయ్....ఇదొ సాని కొంపాయె అన్ని కలగలిపి ఉండొచ్చు .... ఎవ్వరైనా ఉండొచ్చు ....కానీ హిందువులుండొద్దు!!!!
    ఆన్ని రంగుల వారు ....ఆన్ని ప్రాంతలవారు ... ఆన్ని జాతులవారు ఉండొచ్చు ....హిందువులు మాత్రం వొద్దు!!
    హిందు ముత్తైదువలు కూడా పెట్టు కోనంత పే....ద్ద బొట్లు కమ్యునిస్టు బొమ్మలు పెట్టుకుంటారు అంత మాత్రాన ఈ దేశం లో వానకి గొడుగు పడతారా .... చైనా వాన కే గొడుగు వాడతారు!!.
    కేరళా కుట్లు దుబాయ్ వానకి గొడుగు పడతారు!!!.

    తప్పంతా హిందువులదే మరి....
    ఇద్దర్ని మించి కనొద్దు!...ఒక్కర్నిమించి కట్టుకోవద్దు ..... మతం మరండి జనభా తగ్గండి!!!
    సెక్యులర్ పేరు తొ అ ఔరంగ జేబు పని చేయండి!!!
    Bill is required to save Nation.

    ReplyDelete
  8. జిలేబి గారు,

    1. మతాల ఎక్స్చేంజి బోర్డులు ప్రతి నగరంలో పెట్టాలి.
    2. ఒక మతం మారింతర్వాత ఇంకోమతంలో చేరడానికి కనీసం వారం ఆగాలి.
    3. అలాగే ఒక కులంలోంచి ఇంకో కులంలోకి మారాలంటే నాలుగు రోజులు ఆగాలి.
    4. ఏ మతంలో నెలరోజులు ఉంటే వారికి ఆ మత పెద్దలు మత పింఛను ఇవ్వాలి.
    5. NOTA వారికి డబ్బులు గవర్నమెంటు వారే ఇవ్వాలి.

    ReplyDelete
    Replies
    1. మతాన్ని ఒక ప్రొడక్టుగా (viz insurance)గా పరిగణించి, ఏవైనా మభ్యపెట్టి మతమ్మార్చినప్పుడు, అలా మార్చినవారు తమ వాగ్దానాలను నిలుపుకోలేకపోతే దాన్ని breach of contractగా పరిగణించి prosecute చెయ్యగల హక్కును వినియోగదారుడికి (అనగా మతం మారేవారికి) కల్పించాలి.

      ఏది ఏమైనా ఒక మతంలోంచి ఇంకొక మతంలోకి మారగలగడాన్నీ/మార్చగలడాన్నీ ఒక హక్కుగానే పరిగణించాలి (it is after all onoe of the Four Freedoms)

      Delete

  9. ఈ విషయం చాలా జటిలమైనది,వివాదాస్పదమైనదీ,రెచ్చగొట్టేదీ ఐనదని తెలుసును.ఐనా నా అభిప్రాయాలను తెలియజేస్తాను.1.భావస్వేచ్చ,రాజకీయస్వేచ్చ లాగే మతస్వేచ్చ కూడా ఉండాలి.నాస్తికులు కూడా పూర్వం నుండీ ఉండేవాళ్ళు.ఒకప్పుడు బౌద్ధమతం మనదేశంలో ప్రబలంగాఉండేది.ఇప్పుడు హిందువులు ఎక్కువగా ఉన్నారు.ఆగ్నేయ ఆసియాలో కూడా ఒకప్పుడు హిందూమతం విస్తరించింది.మన దేశం మీద దండెత్తిన హూణులు,సిథియన్లు,శకులు,కుషాణులు హిందువులుగా మారిపోయారు.మతమార్పిడి,మతస్వేచ్చ లేకుండా ఇది ఎలా జరిగింది?రాను రాను హిందూమతం రిజిద్డ్ గా తయరై అశ్పృశ్యులనేపేరుతో ఒకవర్గాన్ని దూరం చేసుకొంది.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కులవివక్షత తగ్గించుకొని సమానత్వం పాటిస్తే ఇతర మతాలనుండి హిందూ మతంలోకి చాలామంది ప్రవేశించడానికి వీలుంది.అంతే కాదు ఇతరదేశాల్లో కూడాహిందూమతం వ్యాపించే అవకాశమూఉంది.
    మతస్వేచ్చ ఉండాలని,మతమార్పిడినిరోధక బిల్లు అనవసరమని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. *హిందూమతం రిజిద్డ్ గా తయరై అశ్పృశ్యులనేపేరుతో ఒకవర్గాన్ని దూరం చేసుకొంది*
      హిందు మతంపై ఇదొకప్పటి ఆరోపణ. బ్రిటిష్ వారి పాలనలో అన్ని లోపాలు హిందుమతం లోనే ఉన్నాయని ప్రచారం చేశారు. ప్రపంచంలో అన్ని మతాలలోను లోపాలు అనేవి ఉంటాయి. అయితే ఆ లోపాలను ఆయా మతాల వారు సరి చేసుకొంట్టున్నారా? లేదా? అని చూడాలి. ఆ కోణంలో చూస్తే ఇతరం మతాల తో పోలిస్తే హిందువులు వారి మతాలలోని లోపాలను అధిగమించటానికి ప్రయత్నం చేయటమేకాక, అందులో కొంత సఫలం అయ్యారు. ఇది గత 60ఏళ్లలో వచ్చిన మార్పులు చూస్తే తెలుసుతుంది. ఆ రోజుల్లో దళితుల కైతే ఆ కారణం చెప్పారు. మరి నేడు అగ్రవర్ణాలను ఎందుకు మతాంతీకరిస్తున్నట్లు? మతం మారిన తరువాత కొత్త మతంలో వారికి ఎందుకు సముచిత స్థానం కల్పించలేదు?

      అంటరాని కంపు భరించలేక అందులోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?
      http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_15.html

      ఎవరైనా వ్యక్తిగత సత్యాన్వేషణ లో భాగం గా ఏ.ఆర్. రహ్మాన్, నయనతార, జయసుధల వలే వారికి నచ్చిన మతాన్ని అవలంభించటం వేరు. దానికి అభ్యంతరం ఉండనవసరంలేదు. దినం మంచిదని తెల్లవార్దులు దొంగిలించినట్లు, పోలోమంటు మిషనరి సంస్థలు ఊర్లకు ఊర్లు కన్వర్ట్ చేయటం వేరు. ఇటువంటి వాటిని అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రైస్తవమతస్థులను వేరుగా, మిషనరిల ప్రపగండా, మతాంతీకరణ లను వేరుగా చూడాలి. మిషనరీ సంస్థల ఏక్టివిటీస్ ను ప్రశ్నించే వారికి, సెక్యులరిజం గురించి స్పీచ్ లు ఇవ్వటం ఆపాలి. ఈ మతాంతీకరణలు పాల్పడేవారు ఎక్కువగా పాశ్చ్యత్య దేశాల నుంచి వస్తున్నారు. అమెరికా, యురోప్ వంటి పాశ్చత్య దేశాలన్ని రాజ్యాంగంలో సెక్యులరిజం అని ప్రకటించుకొన్నాయిగదా ! ఈ దేశలవారు వేల కిలోమిటర్లు దాటి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి, మనదేశంలోకి వచ్చి మతాంతీకరణలు చేయవలసిన అవసరం ఏమిటి? సెక్యులర్ అని ఒకవైపు డబ్బా కొట్టుకొంట్టు, ఆ దేశాల వారు,ఈ దేశంలో మాతాంతీకరణలు చేయటమంటే వారు నిజంగా సెక్యులరిస్ట్ లేనా? అని ఆలోచించాలి. వీళ్ల మనుషుల దగ్గర నుంచి హిందువులు సెక్యులర్ ఉపన్యాసాలు వినటం అనవసరం.
      ప్రపంచంలో ఏ దేశంలోను మెజారిటి మతం, మైనారిటిలకు దడిసి, మత నిరోధక చట్టం బిల్లును ప్రవేశపేట్టాలని కోరుకొన్నట్లు చూశారా? భారతదేశంలో హిందువుల పరిస్థితిని వీరు అంతగా దిగజార్చారు.

      Delete
    2. గురుచరణ్ దాస్ ఈ rigidity విషయంలో జపాన్ దేశంలోని కులవ్యవస్థను, భారతదేశంలోని కులవ్యవస్థతో పోల్చిచూసి, భారతదేశంలోని కులవ్యవస్థ more rigid అన్న అభిప్రాయానికి వస్తారు. అలా రావడానికిగాను తనకున్న కారణాలను వివరిస్తారు. మీరు ఆయన అభిప్రాయాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం.

      Delete
  10. *హిందూమతం రిజిద్డ్ గా తయరై అశ్పృశ్యులనేపేరుతో ఒకవర్గాన్ని దూరం చేసుకొంది*
    హిందు మతంపై ఇదొకప్పటి ఆరోపణ..
    *క్రైస్తవమతం రిజిద్డ్ గా తయరై అశ్పృశ్యులనేపేరుతో ఒకవర్గాన్ని దూరం చేసుకొంటుంది*
    క్రైస్తవమతంపై ఇప్పటి ఆరోపణ..నా మీ కామెంట్...
    మన మేధావులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మారరు సరి కదా!మతల్నే rigid చేస్తారు..అందుకే అందులో కూడా "దళిత క్రైస్తవులు" అనేవర్గాలు ఏర్పడడం..
    కులాలు ఉన్నంత వరకు హిందూ మతం వర్ధిల్లుతుంది..
    అందుకే మనం హిందువుల పరిస్థితి గురించి అనత భయపడాల్సిన అవసరం లేదనుకుంటా?ఏమంటారు

    ReplyDelete
  11. సరిగ్గ గ్రహించావు. అసలు కారణం ఆ మతమార్పిడులు, ఇతర మతంలోని ఆంశాలను నచ్చి మానసిక పరివర్తన వలన జరగలేదు. అదొక రియాక్షనరి చర్య. బ్రిటీష్ వారి కాలంలో సందుచూసుకొని కొన్నిమతాలవారు ఎగదోశారు. కనుక మతం మారినా అదే స్ట్రక్చర్ కొనసాగుతూంది. అసలికి కుల సమస్య హిందూ మతపెద్ద సమస్యలా ప్రచారంచేసిన వామపక్ష మేధావులు, ఇతర మతలాలో ఆ సమస్య ఉంటే నోరుమెదపరెందుకు? పాకిస్థాన్ లో సైతం కులం ఎన్నికలలో ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా ఎవరైనా ఆ విషయం గురించి మాట్లాడుతున్నారా? పోని కులాన్ని వ్యతిరేకించిన వామపక్షలు వారు పాలించిన రాష్ట్రాలలో సైతం కులం ఎందుకు రూపుమాపలేకపోయారు? బెంగాల్ ఇంకా కాప్ పంచాయితీలు ఎందుకు ఉన్నాయి? ముప్పై ఏళ్లు వారు పాలించిన రాష్ట్రాలలో అవి కొనసాగుతున్నాయి. కుల నిర్మూలన కోసం వీరు తీసుకొన్నచర్యలు శూన్యం. వీరి ప్రాపగండా వలన కులం అంటే అది హిందు మతపు మాయని మచ్చ అయినట్లు ప్రచారంచేసి హిందువులను డిఫెన్స్ లో కి నెట్టారు. హిందువులు ఈ ప్రపగండా నమ్మి ఆత్మన్యున్యతకు గురయ్యేపరిస్థితి తీసుకొచ్చారు. వాస్తవానికి భారత ఉపఖండంలో ప్రతి మతంలోను కులాలు ఉన్నాయి. హిందువుల ఒక్కరిదే కాదీ సమస్య. దీనిని సాకుగా చూపుతూ మాతాంతీకరణలు చేస్తామంటే ఎలా సబబు అవుతుంది?

    Caste plays dominant role in Pak elections
    Shahid Khaqan Abbasi, a four-time Pakistan Muslim League (N) parliamentarian, downplays the importance of biradari (caste) factor in the May 11 elections and counts on his party's popularity to see him through. Yet as a hardnosed politician, he has the biradari breakup of his Murree-Kahuta constituency near Islamabad at his fingertips - Rajputs 30% and the rest Jats, Arians, Gujjars etc.

    http://timesofindia.indiatimes.com/world/pakistan/Caste-plays-dominant-role-in-Pak-elections/articleshow/19916533.cms

    ReplyDelete
  12. మీరు confuse కాకండి ..జనాలను చెయ్యకండి... హిందూ మతం అనే కాన్సెప్ట్ పురాతన కాలం లో లేదు ..అపుడు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క మతం ...
    ఇక ముస్లిం ,క్రైస్తవం లో ఉన్నవి వర్గాలు ,అంటే మన ఇండియా లో ఉన్నట్టు కుల వివక్షలు కావు...
    హిందూ మతం లో ఉన్నవాళ్ళే వెళ్లి వాటిని కుడా అలాగా చేస్తున్నారు...ఇక్కడ సమస్య డబ్బుల కోసం మతం లోకి వెళ్ళేవాడు ...వెళ్ళని ,ఎందుకంటే వాడు మతం కన్నా డబ్బుకే విలువ ఇస్తాడు ..అలంటి వాడి వాళ్ళ లాభం లేదు..కాని వివక్ష వళ్ళ వెళ్ళేవాడు మాత్రం ...మనకు నిజంగామైనస్... ఒక వేల వాళ్ళకు అక్కడ కూడా వివక్ష ఉంటె దానిని తొలగించుకోవడానికి వాళ్ళకి పొప్ /మత పెద్దలున్నారు...అందుకే కంప్లైంట్ చేస్తున్నారు?
    కాని ఇక్కడ ఎవరున్నారు...ఒక వేల వాళ్ళు హిందూ మతం లోకి వచ్చి నేను పై వర్ణం లో కి వెళ్తా అంటే అతనిని accept చేస్తారా? స్టాప్ థింకింగ్ rigid?ఇప్పటికైనా మారండి,ఎవరికీ నచ్చిన వాళ్ళు డబ్బులకోసమో ,బాధపడో,ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళనివ్వండి...

    ReplyDelete
    Replies
    1. http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_15.html
      పైన ఇచ్చిన లింక్ చదివితె క్రైస్తవ మతంలో కుల వివక్షత లేదని ఎలాచెప్పగలరు? ప్రతి సంవత్సరం ఎదో ఒక చర్చ్ లో పాస్టర్ పోస్ట్ దళితులకి ఇవ్వటంలేదని, అగ్రవర్ణల వారికి ఇస్తున్నారని వారు ధర్ణా చేసేవార్తలు పేపర్లలో వార్తలు వస్తుంటాయి. ఒక సారి గూగుల్ సర్చ్ వేసి చూసుకొండి, మీకే తెలుస్తుంది.
      * పొప్ /మత పెద్దలున్నారు...అందుకే కంప్లైంట్ చేస్తున్నారు?*
      వాళ్లు ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. వాళ్లేమైన సమస్యను పరిష్కరించ గలిగారా? అక్కడ పోప్ గారే ఆయన దగ్గర పనిచేసే వారు మాటవినటంలేదని తలపట్టుకొని కూచోన్నారు.
      Pope Francis launched a savage attack on Vatican bureaucrats yesterday, accusing them of becoming power-seeking, hypocritical schemers who believe themselves to
      be “immortal”, but suffer from “spiritual Alzheimer’s”.

      http://www.thetimes.co.uk/tto/faith/article4304967.ece

      Delete
    2. అగ్రవర్ణాలు అంటే ఎవరు ?ఇండియా నుండి వెల్లిన వాళ్ళే కదా?అంటే వీళ్ళు ఏమతం లోకి వెళ్ళిన వాళ్ళ ఐడియాలజీ ని మతం పైకి రుద్దేస్తారన్న మాట

      Delete
    3. అగ్రవర్ణాలు వేరే మతంలోకి వేళ్లినా వాళ్ల ఐడియాలజి రుద్దుతూంటే, మరి మా మతంలో వర్గాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు అంతా సమానం, కులం లేదని, చాలా అభ్యుదయ భావాల మతమైనట్లు డబ్బా కొట్టుకొని చేర్పించుకొనే ఆ మతపెద్దలు ఎమి చేస్తున్నట్లు? అది పూర్తిగా హైందవేతర మతాల వారి తప్పు. దానిని ఒప్పుకొనే ధైర్యం ఆ మతాలకు ఉన్నట్లు లేదు.

      Delete
  13. విషయమేమిటంటే ఈ మాతంతీకరణల వలన మన దేశంలో ని పేద ,కుల వృత్తులు చేసుకొనేవారిని పొట్టగొడుతున్నారు. విదేశి బహుళజాతి కంపెనిలు వాళ్లు నేరుగా తల దూర్చకుండా, చర్చ్ నిధులతో యం.జి.ఓ. లను స్థాపించి ఎమీ చేస్తున్నారో చదవండి. విదిశీ కంపెనిలకు ఉపయోగ పడేవారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకొంటే అది మైనారిటిల మీద దాడి లా ప్రచారం అవుతుంది. అందువలన మాతాంతీకరణలను ఆపాలి. 125 కోట్ల మంది దేశ జనాభాగల మనదేశం క్లో ఉద్యోగాలు సృష్ట్టించటం ఎంతో కష్టం తో కూడు కొన్నపని. విదేశి సంస్థలు బాలల హక్కులు, విద్యాహక్కు అంట్టు పైకి ప్రజలలో అవేర్ చేస్తున్నట్లు చేస్తూ, ఉన్న ఉద్యోగాలను పోగొడుతూంటే, పోగొట్టే వారెవరో తెలిసినా నిస్సహాయంగా ఉండిపోవలసి వస్తున్నాది. ఇక నైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాము.

    సత్యార్థి - సత్యాన్వేషణ
    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-satyarthi-satyanveshana-58014.html

    http://www.rediff.com/news/column/nobel-peace-prize-for-less-than-noble-reasons/20141027.htm

    ReplyDelete
  14. మీరు పంపిన లింక్ ఎందుకో తెలియలేదు..సత్యర్ది ఏమి చేసినా చెయ్యకపోయినా ...అమెరికా లో నిరుద్యోగం పెరగోద్దని చేసినా ...బాల కార్మిక వ్యవస్థ నిర్ములిన్చదానికే గదా?మీకు అది వద్దా?బాలలు కర్మికులుగానే ఉండాలా?వివక్ష ఉన్నపుడు జీవనప్రమాణాలు ఎలా మేరుగావుతాయో ?1991 లో పివి నరసింహారావు గారు ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టకపోతే నేడు మనం ఎంత వెనక ఉండేవాల్లమో కాదా ..ఇపుడు విదేశీ కంపెనీ ల కోసం మన ప్రభుత్వాలు తిరగడం లేదా?ఇవన్ని మీకు కనబడడం లేదా? కనీసం విదేశీ కంపెనీ లు మనషులకు ఆత్మ గౌరవాన్ని ఇస్తున్నాయి

    ReplyDelete
  15. కేసు టు కేస్ తీసుకొవాలి. మన ప్రభుత్వ అధికారులకు దేశ పరిస్థితులపై అవగాహన ఉంట్టుంది. కనుక వారు సత్యార్ధి చెప్పే మాటలను విని, అందులోని మర్మాలను, ప్రత్యామ్న్యాలు ఆలోచించి అతని మాట వినకుండా పక్కన పెట్టారు.
    మీలాంటి ప్రశ్నే ప్రసాద్ ని అడిగారు దానికి ఆయన ఇచ్చిన సమాధానమే నాదీను.
    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-1-58241.html
    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-2-58269.html
    బయటనుంచి చూస్తే బాలకార్మిక వ్యవస్థ చాలా తప్పనిపించవచ్చు. బాల కార్మికులలో చాలామంది ఇంట్లో తల్లిదండృలకు చేదోడు వాదోడుగా పని చేస్తూ పనిని నేర్చుకొంటారు కూడాను. ముఖ్యం గా నేత,కుట్టుపనులు, కలంకారి మొదలైనవి. వారి తల్లిదండృలు పిల్లలకు వారు శక్తిని బట్టిపని ఇవ్వటం జరుగుతుంది. నేడు పిల్లలను చదువుల పేరుతో మూడవఏటనుంచి ముప్పై యవ యేటవరకు విపరీతమైన ఒత్తిడి గురిచేస్తూ చదివిస్తున్నారు, మరి దానిలో పీడన లేదా? అది సరైన పద్దతేనా? రేపు ఈ చదువుకొన్న వారందరికి జాబ్స్ వస్తాయన్న గేరంటి ఎమిటి? ఇంత చేసి ఇప్పుడు మన వ్యాపారులు చెప్పే మాట ఎమిటి. ఈ విద్యార్దులంతా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు చదవాలని ఉపన్యాసాలు ఇస్తున్నారు. వారికి లాభాలు లేకపోయినా,తగ్గినా వెంటనే జాబ్స్ లో నుంచి తొలగిస్తున్నరు. ఇరవై ఐదేళ్ళు చదివి పదేళ్ళు పని చేయటం చాలా మంది అవుట్ డేటేడ్ అవురున్నారు. ఈ మధ్య ఒక టి.సి.యస్. జాబ్స్ నుంచి తొలగించింది. అదొక ఉదాహరణ. వీరిలో చాలా మంది కి ఉద్యోగాలైతే వస్తాయనుకోను.
    మీరు కొంచెం ఆలోచించండి.. కేసు టు కేస్ తీసుకోవలని మీకే అర్థమౌతుంది.

    ReplyDelete
  16. పెద్ద చదువులు చదువ్కొన్నాక ఉద్యోగం సంపాదించటమే జీవితధ్యేయం అయినపుడు. అది మార్కెట్ అవసరాలాకే చదవాలనుకొంట్టున్నపుడు .చిన్నపటినుంచి ఒక స్కిల్ నేర్చుకొనే బాల కార్మిక వ్యవస్థను పూర్తి దుర్మార్గమైనది గా చెప్పలేము. పైన వ్యాసంలో ప్రాసాద్ గారు రాసినట్లు బాలెన్స్ సాధించాలి.

    ReplyDelete
    Replies
    1. మీరు బాల కార్మిక వ్యవస్థ మరియు పని అనుభవం ఈ రెండు ఒకే లాగా చూస్తున్నారు ..మనం ఇంట్లో నేర్చుకొనే పని కి బాల కార్మికులుగా కర్మాగారాలలో చేసే పని కి తేడా ఉంది ..బడి లోనే వృత్తి విద్య నేర్చుకుంటున్నారు...కాని అక్కడ స్కిల్ తో పాటు మూర్తిమత్వం పెరుగుతుంది...మీరన్నట్టు కర్మాగారాలలో అది జరగదు ...అందుకే చదువు ముఖ్యం ...ఎవరైనా పని చెయ్యాల్సిందే ..కానీ దానికి కొన్ని ఉత్తమ మార్గాలు అవసరం ...సమయం కూడా అవసరం ...అపుడే జీవన ప్రమాణం పెరిగిపోద్ది..మీరన్నట్టు పిల్లల పై చదువుల ఒత్తిడి ఉంది ..కాని వాళ్ళు స్కిల్ నేర్చుకోవాల్సిన ప్రదేశం కర్మాగారం కాదు, సమయం పసిబాల్యం కాదు ..

      Delete
    2. శ్రీనుగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.

      Delete
    3. శ్రీను రాసిందే చర్చలలో అందరు అంగీకరించేది. చర్చించే వారంతా చివరికి వచ్చేది అదే నిర్ణయానికే. దానిని వ్యతిరేకిస్తే అటువంటి వారిని మానవత్వం లేదనుకొనే ప్రమాదం ఉంది. కాని భారత ఉపఖండంలో వాస్తవం వేరు. ఒకసారి జనసాంద్రత గలిగిన బెంగాల్, బీహార్,యు.పి. వంటి రాష్ట్రాలకు, పక్క దేశం బంగ్లాదేశ్ వాళ్లను చూస్తే వాస్తవం స్పష్టంగా అర్థమౌతుంది. అక్కడ ఎంతో మంది బాల కార్మికులు పని చేస్తూంటారు. ఎందుకు పనిచేస్తూంటారు అంటే వేరే మార్గంలేకనే. పూర్తిస్థాయి లో అంతర్జాతీయ చట్టాలను అమలు చేయటం మొదలుపెడితే ఉన్న ఉద్యోగంపోతుంది. కలం పోటుతో ఆ వ్యవస్థను రద్దుచేయటం పెద్ద కష్టంకాదు. తల్లిదండ్రులు పిల్లల బాధ్యతను మోసేపరిస్థితులు చాలా కుటుంబాలలో ఉండవు. ఒకవేళ ప్రత్యమ్న్యాయంగా ప్రభుత్వ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతల వారికి చేరే లోపు పరిస్థితులు ఎలా దారితీస్తాయో ఎవరు చెప్పలేరు. ఇటువంటి పథకాలు దశల వారిగా అమలుచేయాలి.

      Delete
    4. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సింది, నిర్మూలించగలిగేది నిరంకుశ చట్టాలద్వారాకాదు. కేవలం ఆయా బాలల (ఆచరణలో మొత్తం ప్రజల) జీవన ప్రమాణాలను మెరుగుపరిచి, కుటుంబాలల్కు తమ పిల్లలను కూడా పనిలో కుదిర్చితేగానీ రోజుగడవని పరిస్తితులనుండి తప్పించచడం, విద్యాప్రమాణాలనూ, job guarantyని పెంచడం ద్వారా మాత్రమే. పనిలోపనిగా ప్రతి పదవికీ (రాజకీయాలతీ సహా) విద్యార్హతను mandatory చెయ్యడంవల్లకూడా కొంత అదనపు ప్రయోజనం ఉండవచ్చు. అంతేగానీ కేవలం నిషేధాలవల్ల పని జరగదు. భారతదేశంలో నిషేధం అన్నది practically a joke.

      Delete
  17. మీరు రాసినదానిలో వ్యతిరేకించాల్సింది ఎమీలేదు. వాటికి బాల కార్మిక వ్యవస్థకి పని అనుభవం మొదలైనవార్టిని స్పష్టంగా నిర్వచించి ముందుకు తీసుకుపోవటం అనేది ముఖ్యం. అయితే మనదేశంలో రాష్ట్రలలో జనాభాలలో ఎంతో వ్యత్యాఅలు ఉన్నాయి. ఉదా నార్త్ వర్సెస్ సౌత్ తీసుకొండి. దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయటం లోఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. ఎంతోమంది ఈ అంశంపై ఎప్పటినుంచో పోరాడుతూ ఉన్నారు కదా! మరి ఇంకా వివాదాలు, ఆ వ్యవస్థ కొనసాగుతూండటం చూస్తునే ఉన్నాము. ఇదొక కంటిన్యుయస్ ప్రాసెస్.

    ReplyDelete
    Replies
    1. మనం ప్రపంచాన్ని ఒక్కసారి గా వసుదైక కుటుంబంగా మార్చలేము ...దేనికైనా కొంత ప్రాసెస్ అవసరం ..అందులో బాలల హక్కుల కోసం కొందరు నిస్వార్దంగా ,కొందరు స్వార్ధంగా పోరాడే వారు ఉంటారు..ఏదేమైనా బాలల హక్కులు కాపాడాల్సిందే..కొన్ని సమస్యలు జవాబు కనపడనివి ఉండొచ్చు ..కానీ జవాబు దిశలో నే ప్రయత్నం ఉండాలి..

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్