Breaking News

రామాయణం మనకి ఎలా ఆదర్శం?

రామాయణం మనకి ఎలా ఆదర్శం?

Rama,_Sita,_Lakshmana.jpg
ఈమధ్య మాత్రమే కాదు ఎప్పటినుండో రామాయణం మీద తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినీ యాక్టర్ కత్తి మహేష్ కూడా "శ్రీరామచంద్రుడను దగుల్బాజీ అని, సీతమ్మవారు రావణుడి దగ్గరుంటేనే సుఖపడేది" అంటూ అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేసాడు. ఇలా ఎందరో రామాయణం మీద విరుచుకు పడుతూనే ఉన్నారు.



గతంలో మన రాజ్యాంగ నిర్మాత డా||బి.ఆర్. అంబేద్కర్ గారు కూడా తన "రాముని,కృష్ణుని రహస్యాలు" అనే పుస్తకంలో ప్రధానంగా రాముడి మీదే ఘాటు విమర్శలు చేసారు.
రాముని,కృష్ణుని రహస్యాలు

ఇది ఎంతవరకూ పోయిందంటే రామాయణం ద్వారా మనం నేర్చుకోవాల్సింది? తెలుసుకోవాల్సింది ఏమీ లేదని, పరాయి వాడి భార్యను మరొకడు వచ్చి ఎత్తుకుపోవడం నేర్చుకోవాలా?, విడిపించుకున్న భార్యను అనుమానించడం నేర్చుకోవాలా? లేక చాడీలు విని నిండు గర్భినిని అన్యాయంగా అడవి పాలు చేయడం నేర్చుకోవాలా? లేక తన స్వార్ధం కోసం మరొకడి శత్రువుని దొంగచాటుగా దెబ్బ తీయడం ఎలాగో నేర్చుకోవాలా?... ఇలా అనేకమైన ప్రశ్నలను విమర్శకులు రామాయణం సంధిస్తూనే ఉన్నారు.

వీటన్నింటి రామాయణాన్ని నిశితంగా పరిశోధన చేసిన మేధావులు ముందుకొచ్చి సమాధానాలు ఇవ్వాలి. విమర్శకుల నోళ్ళు మూయించాలి. లేకపోతే పై ప్రశ్నే మిగిలిపోతుంది. దీనికి మీ సమాధానం ఏమిటి?

46 comments:


  1. బుచికోయమ్మ బుచికి

    ReplyDelete
  2. "సినీ యాక్టర్ కత్తి మహేష్"

    ఆయన నటుడు కాదు, విమర్శకుడు (critic)


    "డా||బి.ఆర్. అంబేద్కర్ గారు కూడా తన "రాముని,కృష్ణుని రహస్యాలు" అనే పుస్తకం"

    పుస్తకం పేరు "Riddles in Hinduism". The Riddle of Rama and Krishna అన్నది ఇందులో ఒక అధ్యాయం.

    Riddle అంటే రహస్యం అనే తర్జుమా సరికాదేమో?

    ReplyDelete
    Replies
    1. నాలుగైదు సినిమాల్లో నటించినట్లున్నాడు కూడా లెండి, జై గారూ.

      Delete
    2. అలాగా, థాంక్స్ సార్. అర్జంటుగా అవేమిటో కనుక్కొని చూసే వరకు నాకు నిద్ర పట్టదు :)

      Delete
    3. హృదయ కాలేయం లో నటించారు.పెసరట్టు,ఎడారి వర్షం సినిమాలకు దర్శకత్వం వహించారు.గొప్ప మేధావికూడా....విమర్శక సూపర్ స్టార్ !

      Delete
  3. అసలు ఇబ్బందేంటంటే, ఒరిజినల్ (వాల్మీకి) రామాయణంలో భాగంకాని ఉత్తర రామాయణంలో స్టొరీలని పట్టుకుని వాల్మీకి రాముడి కేరెక్టర్ని విశ్లేషించడం.
    .
    రాముడి పట్టాభిషేకంతో వాల్మీకి రామాయణం ముగుస్తుంది. ఆ తరవాత వృత్తాంతమంతా ఉత్తరకాండ, అంటే దాంట్లో ఉన్నది రాముడు 2.0 - సీతను అడవుల్లో వదిలెయ్యడం, లవకుశులు గట్రా! - ఒరిజినల్ రాముడికి పూర్తిగా భిన్నం.
    .
    నేనిప్పుడు మిలేనియల్ కాండ అని రామాయణంలో కొత్త అధ్యాయం వ్రాసేసి దాంట్లో ఒక మోటార్ సైకిల్ని పెట్టి రాముడొక గొప్ప మోటార్ సైకిల్ రైడర్, రాముడి కాలంలోనే మోటార్ సైకిళ్ళున్నాయి అంటే ఎంత ఛండాలంగా ఉంటుందో, ఉత్తరకాండలోని రాముడిని పట్టుకుని వాల్మీకి రామాయణంలో రాముడిని విమర్శిస్తే అంతే ఛండాలంగా ఉంటుంది.
    .
    వాల్మీకి రామాయణంలో రాముడు ఉత్తముడైన సాధారణ మానవుడు (అందులో ఒక నెగెటివ్ షేడ్ యుద్ధం తరవాత సీతతో దురుసుగా ప్రవర్తించిన పద్ధతి), ఉత్తరకాండలో కర్కశుడు (2.0), తులసీదాస్ రామాయణంలో సూపర్ హీరో (3.0) , కల్పవృక్షంలో దేవుడు (4.0), మరో వీధిరామాయణంలో చవట (19.0 లేక 20.0). అందుచేత రాముణ్ణి విశ్లేషించేముందు ఏ వెర్షన్ గురించి వ్రాస్తున్నారో చెప్తే ఏ గొడవా ఉండదు. అది చెప్పకపోతే నూటికి తొంభైమంది వాల్మీకి రామాయణమనే అనుకుంటారు (బై డీఫాల్ట్)!

    ReplyDelete
    Replies
    1. డా. అంబేడ్కర్ వ్యాసం (అధ్యాయం?) స్పష్టంగానే ఉందండీ. వెర్షన్, అధ్యాయం & శ్లోకం రెఫరెన్సులు అన్నీ ఇచ్చారు.

      నాకు తెలిసి కువెంపు (శూద్ర తపస్వి), మైకేల్ మధుసూదన్ దత్త్ (మేఘ్నదా బధ) త్రిపురనేని (శంబూక వధ) పుస్తకాలు కూడా క్లీన్ గానే ఉన్నాయి.

      These works broadly stayed faithful to the original with respect to facts. You can disagree with their interpretation but not sourcing or scholarship.

      ఇబ్బందల్లా రంగనాయకమ్మ తోనే: చారానా చికెన్ బారానా మసాలా అన్నట్టు సొంత కామెంటరీ తెగ రాసేసింది. She tries to compensate her poor storytelling skills by twisting facts & adding "liberal" doses of vitriol.

      Delete
    2. The issue here is not about the scholarship andi. Its about the stuff which is part of the original Ramayan.

      For instance, Rama sending Seetha off to the woods, seetha getting pregnant, Laba&Kusha story, Sambhooka incident are not a part of Valmiki’s version.

      Delete
    3. Why does it matter? Why should we be limited to Valmiki's version? We believe in Ramarajya and would like to usher that in but stick to Valmiki. Why is that?

      Delete
    4. Because when one says Ramayana it refers to Valmiki’s Ramayana just like when one says Sholay, it refers to GP Sippy’s.

      The point is about reference. Say you are refering to some XYZ’s Ramayana and as per that Rama is do and so, nobody will have a problem. You cant write your own character and attribute it to Valmiki.

      Delete


    5. మా లక్కు పేట రౌడీ
      జాలము లో కాలు బెట్టె జా జా చౌద్రీ
      కోలాటమ్ములు మొదలగు
      తాళము తకిటతధిమి మిధి తటకిత యగునే :)

      నారాయణ :)

      జిలేబి

      Delete
    6. All these "morals" are part of the folklore and are well accepted. As I has mentioned earlier, we wish to usher in the Ramarajya which according to you was not written by Valmiki (how about later day interpolations? no one could even be if the Valmiki Ramayana has indeed been written by Valmiki himself). I say it's just escapism to bring the name of Valmiki and try to defend a well accepted story.

      Delete
    7. Acceptance has nothing to do with originality. It doesnt matter whether you call it escapism or something else cuz it diesnt make an iota of sense to crticize an iriginal based on a sequel. I can also use a “better” word and call it hate-mongering manipulation to attribute something yo a character based on something written much much later.

      As Said earlier, if I depict Rama as a motocycle rider, spend a billion dollars to propagate it over the next 1000 years and make it part of the folklore, you dont call Valmiki’s Rama as a motorcycle rider.

      Delete
    8. If I create an id with the title "Unknown" after a couple of years and then post 20000000 comments, they cant be attributed to you, however good or bad they are.

      Delete
  4. వాల్మీకి రామాయణనికీ, ప్రస్తుత నైతికతకీ పొసగదు.

    రాముడి కధ ప్రస్తుతకాలానిదై ఉంటే, రాముణ్ణి మన IPC ప్రకారం జైల్లో పెట్టుండేవాళ్ళం. రామయణం నుంచి మనం నేర్చుకొనే మంచి ఏమీలేదు.

    ఇలాంటి పిచ్చి పుస్తకాలని ఉతకాల్సిన అవసరం ఉంది. అదే మహేష్ చేస్తున్నాడు.

    ReplyDelete
    Replies
    1. Top three things of Ramayan that are spplicable for the current day activities

      Top three qualities:

      1. Determination to meet the goal set by his leader (The king in this case) - Critical for the warriors

      2. Ability to work with Monkeys and Demons (Collaboration) and get the thing done. Very essential leadership quality

      3. Ability to be agile when the opponents use disproportionate powers. Extremely important for success.

      When Kathi talks about Rama leaving Sitaout he is not even refering to Valmiki Ramayan.

      Delete
    2. Also don't bother abut the justice and punish people even when they are innocent?
      Distrust your wife, brother, father and insult parents?
      Be fragile minded and be childish?
      Respect cast hierarchy and never bother about egalité or humanity?


      Let me ask you this finally... China doesn't have Ramayana, so does European countries and USA. What did they miss out? Did they turn our to be a failure? Despite having all these stories to preach morals, India is rife with crime and has been declared not-so-safe country right?

      Delete
    3. The first paragraph:

      If you are refering to Uttar Ramayan then its not Valmikis. If Rama 2.0 is fragile minded, so be it. Its a different version.

      Did I say they missed out on anything? Thry have their own books to learn from. If India uses Ramayan, US uses something else. There can be hundred books on every subject and each book is unique.

      By the way your comment was about what can be learnt from Ramayan as per the current day morals - and I listed out top 3.





      Delete
  5. ఈ బ్లాగు నిర్వాహకులకు కొన్నిచిన్న చిన్న సూఛనలు (వారు పట్టించుకుంటారన్న నమ్మకం ఆట్టే లేకపోయినా) చేస్తున్నాను. దీని అర్థం ఈ చర్చలో పాల్గొంటున్నానని కాదని గ్రహించగలరు.

    మొదటిది పేరు దాచుకొని అసమంజసమైన వ్యాఖ్యలను చేసే అవకాశం ఇవ్వకండి.
    రెండవది భావవ్యక్తీకరణస్వేఛ్ఛ అనేది నిర్నిబంధమైన దేమీ కాదు. అసమంజసమైన వ్యాఖ్యలు వ్రాసినవారిది ఎటువంటీ బాధ్యతారాహిత్యమో ఆవ్యాఖ్యలను ప్రచురించిన వారిదీ అంటే బాధ్యతారాహిత్యం అన్నది దయచేసి గమనించండి. చర్చల బ్లాగులు వేస్తున్న ఇలాంటి ప్రశ్నలు కొంతమంది నోటిదురదో చేతిదురదో వదుల్చుకుందుకు మాత్రం పనికివస్తున్నాయే కాని వీటివలన సామాజికప్రయోజనం ఏమీ సిధ్ధించటం లేదని అనుమానించక తప్పటం లేదు.

    ఒక వ్యక్తి మనకు ఆదర్శం కావటం అనేది మన సంస్కారం యొక్క స్థాయిని బట్టి కూడా ఉంటుంది. మన సంస్కారంలో ఉన్న చెడు హెచ్చు ఐతే మంచివాళ్ళ మనకు నచ్చరు. తద్విపర్యయమూ నిజమే.

    ReplyDelete
    Replies
    1. I would rather say, present the counter-logic. Kill them with your arguments. Just like Ranganayakamma has been proved to be an idiot, this can can be proved too.

      Delete

  6. UnknownJuly 8, 2018 at 3:44 AM
    వాల్మీకి రామాయణనికీ, ప్రస్తుత నైతికతకీ పొసగదు.

    Great statement!

    ReplyDelete
    Replies
    1. నైతికతలో ఎన్ని రకాలుఉన్నాయి?ప్రస్తుత నైతికత అంటే ఏమిటి?

      ఇప్పుడు కత్తి మహేష్ వ్యాఖ్యలు చేసిన ఉద్దేశం దగ్గిర్నుంచి మొత్తం రామయణంలో ముఖ్యమైన విషయం - ఒక స్త్రీ ఓక పురుషుడు కలిసి జీవించే వివాహవ్యవస్థలో దంపతులు ఎట్లా ఉండాలో సీతా రాముల ద్వారానూ ఎట్లా ఉండకూడదో శూర్పణఖా రావణుల ద్వారానూ చూపించడం జరిగింది అని నేను అనుకుంటూన్నాను - కాదా?వాళ్ళు రాజవంశీయులు అయోధ్యా నగరానికి ప్రభువులు కావటం వల్ల రాజధర్మాలు అదనంగా చర్చకి వచ్చాయి.కానీ కధలోని మౌలిక సంఘటనల నాటకీయత దాంపత్యధర్మానికి సంబంధించినది, కాదా?

      కాదని అంటే సరే గానీ అవునని అంటే, మరి గబుక్కున అది ఈ కాలానికి పొసగదు అన్నారంటే దానికి విరుద్ధమైన సామూహిక విశృంఖలత పొసగుతుంది అని మీరు చెబుతున్నట్టు మేము భావించవచ్చునా?

      Delete
  7. మొట్టమొదట అందరూ తెలుసుకోవాల్సిన విషయం కత్తి మహేష్ దగ్గిర్నుంచి ఇక్కడి అనామక వ్యాఖ్యాత వరకు ఎవరూ రామాయణం చదవ లేదు!

    వాలి వధ చెట్టు చాటు నుంచి దొంగఛాటుగా చెయ్యలేదు.ధనుష్ఠంకారం చేసుకుంటూ బయటికి వచ్చి యుద్ధం అపి చూస్తున్న వాలి గుండెల మీద బాణం నాటాడు.ఈ కుపండితులు రామాయణం చదవలేదు గాబట్టి ఆ ఒక్క డౌటునే పట్టుకుని వేళ్ళాడుతున్నారు గానీ సాక్షాత్తూ వాలియే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు "నన్నెందుకు చంపావు?" అంటూ.రాముడు అన్నింటికీ జవాబులు చెప్పాకనే నోరు మూసుకుని చచ్చాడు వాలి!

    riddles of rama పుస్తకంలో అంబేద్కర్ వాదన కూడా హుందాగా లేదు!రాముడు అక్రమసంతానం అయి వుండవచ్చు అనేలా మొదలుపెట్టాడు.దీని అర్ధం యేమిటి?రాముడు అక్రమసంతానం అయితే అవుగాక. దానికీ అతడి సుగుణాలకి గానీ దుర్గుణాలకి గానీ ఆ పుట్టుక కారణం అని అంబేద్కర్ చెబుతున్నట్టా?పుట్టుకని బట్టి ఆధిక్యత తెచ్చుకున్నారు అని బ్రాహ్మణుల్ని విమర్శించే అంబేద్కర్ రాముడిని అక్రమసంతానం అని ముద్రవేసి యేమి సాధించుదామని అనుకున్నాడు?ఆలోచించండి!

    కొంచెం హుందా అయిన భాషలో చేసినప్పటికీ అంబేద్కర్ విమర్శ కూడా నిష్పక్షపాతమైనది కాదు!ఒకరు చదవమంటే చదువుదామని ఈ భాగం తర్వాత ఆపేశాను గాబట్టి తర్వాత అంబేద్కర్ యేమి విశ్లేషణలు చేశాడో నాకు తెలియదు.

    TO BE CONTINUED

    ReplyDelete
  8. CONTINUING FROM ABOVE
    ఇంక యుద్ధకాండలో వచ్చే అగ్నిప్రవేశం గురించి నేను చాలా వివరంగా చర్చించి ఉన్నాను.అంత పెద్ద విశ్లేషణ ఇప్పుడు అనవసరం. దానికీ ఉత్తర రామాయణంలోని సీతా పరిత్యాగానికి ఉన్న సంబంధం వల్ల ఆ సన్నివేశం ప్రక్షిప్తమని పండితులు అంటున్నారు.ఆ మొత్తం సన్నివేశం రెండు సర్గలలో ముగిసిపోతుంది.ఆ రెండు సర్గలలో వాల్మీకి రచనా సంవిధానానికి భిన్నమైన ఒక వింత కనబడుతుంది!ఆ సన్నివేశంలో దేవతలు/దివ్యపురుషులు కనబడి రాముణ్ణి దేవాధిదేవుడిగా కీర్తించటం జరుగుతంది - ఇది రావణ సంహారం కోసం అవసరమైన మానవత్వానికీ వాల్మీకి మిగతా అన్నిచోట్లా మానవుడిగానే చూపించటానికీ పూర్తి విరుద్ధం!కాబట్టి ఇది ఉత్తర రామాయణం రాసిన తర్వాత దానికి సంబంధం కలపటం కోసం ఇరికించినది అని కొందరు పండితుల వాదన!అయితే, అప్పుడు 24,000 శ్లోకాలలో వెయ్యింటికి ఒకచోట గాయత్రీ మంత్రాక్షరాలు వచ్చే లెక్కని ఎలా తేల్చాలి ఆనే అనుమానం నాకే వస్తున్నది!అది వాల్మీకి ముందుగానే ప్లాన్ చేసుకుని రాస్తే జరిగిందా లేక ఆ లెక్కని చూపించటం కోసం ఇతరులు ప్రక్షిప్తాలని చేర్చారా?దానికి జవాబు చెప్పడం అసాధ్యం!!

    అవి ప్రక్షిప్తాలా మొత్తం రామకధలో అంతర్భాగాలా అన్నదానితో సంబంధం లేకుండానే యుద్ధకాండలోనూ ఉత్తర రామాయణంలోనూ రాముడి ప్రవర్తనలో ఏ దోషమూ లేదని చెప్పవచ్చును!ఇక్కడ రాముడిలో తప్పులు పడుతున్నవారిలో ఏవరూ అలాంటి నిజదారాహరణం లాంటి ఘాతుకం తమకి జరిగితే రాముడు చేసినట్టు చెయ్యనక్కరలేదు - ఎటూ మిత్రుడు కత్తి మహేష్ సలహా ఇచ్చినట్టు భార్యల్ని తిరిగి తెచ్చుకోవటానికి యుద్ధాలూ గట్రా చెయ్యకుండా వారి భార్యలకి అక్కడే ఉండి సుఖపడమని వార్త పంపిస్తే సరిపోతుంది. వారి భార్యలకీ సంతోషం కలిగించినట్లవుతుంది.రాముడు రాజు,రాజధర్మం అట్లాగె ఉంటుంది.ఇవ్వాళ మంత్రుల మీద ఆరోపణలు వస్తే రాజీనామా చెయ్యమని గోల చెయ్యడం లేదా?కారణం యేమిటి?ప్రభుత్వం నడపాలని అనుకున్నవాడు దేనికైనా సిద్ధపదాలి, ప్రజల విశ్వాసం పొందడం ముఖ్యం అనేది వీటన్నిటికీ మూలకారణం!ఆరోపనలు బలమైనవి అని తెలుస్తున్నా పదవిని పట్టుకుని వేళ్లాడుతూ రాజీనామా చెయ్యనివాళ్లని దాని గురించి ఉతికి ఆరెయ్యని వాడు ఎవదన్నా ఉన్నాదా ఇప్పూడు రాముణ్ణి విమర్శిస్తున్నవారితో అషా?ఇప్పుడు నా బ్లాగులోని కొత్త పోష్టులో రామయణం మూలప్రతినుంచి శ్లోకాలు ఎత్తి రాశాను.వాటి ప్రతిపదార్ధ తాత్పర్యాలు కావాలనే వదిలేశాను.సంస్కృతం నేర్చుకుని వాటిలో సీతని రాముడు అనుమానించి వెళ్ళగొట్టినట్టు ఉన్నదేమో చెప్పమనండి ఇక్కడి అనామకం గారిని!

    ఇంకా ప్రజల ఉద్దేశాల్ని చెప్పేవి చూస్తే వాళ్లు సీతని అనుమానిణారనేది కూడా అనుమానమే!వాళ్ల వాదన అంతా,"రేపెప్పుడన్నా మన పెళ్ళాలు తమ తిరుగుబోతు తనంతో కావాలనే ఎవడితోనో సుఖపడి వస్తే రాజుగార్ని ఆదర్సంగా తీసుకుని మారు మాట్లాడకుండా ఇంటికి తెచ్చేసుకోవాలా?" అనే విధంగా ఉన్నది.వాళ్ళ యేడుపంతా వాళ్ళ పెళ్లాల తిరుగుబోతుతనం గురించే!

    ఈ కధలో ఇప్పటికీ పనికొచ్చే విషయం ప్రజలకి ప్రభువు మీద తేలికతనం పుడితే రాజ్యం నడవదు - అరాచకం వస్తుంది అనేది.నిజంగా రాముడు సీత మీద అభిమానం లేకుండా అనుమానంతోనే గెంటేస్తే స్వర్ణసీతతో పనులు జరిపించుకోవాల్సిన అవసరం యేమిటి?రాముడు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఆడాళ్ళు కరువా!ఆ కామన్ సెన్సుతో కూడిన సందేహం కూడా రావడం లేదు కేవలం హిందూమతద్వేసం నిలువెల్లా నిండిన కుపండితులకి!

    సీత అగ్నిప్రవేశం నాటి రాముడి ప్రవర్తనకీ సీతా పరిత్యాగం నాటి రాముడి ప్రవర్తనకీ అతడు రాజు కావడమే కారణం!అతనొక మామూలు మనిషైతే మొదటి వనవాసమే దాపరించేది కాదు,ఇంక సీతాహరణమూ రామరావణయుద్ధమూ అగ్నిప్రవేశమూ సీతాపరిత్యాగమూ కూడా జరిగేవి కాదు కదా!రాజధర్మం ప్రకారం చేసినదాన్ని సామాన్యధర్మంతో అంచనా వెయ్యడమే బుద్ధి లేని పని.అయినా,గౌరవనీయుడైన వ్యక్తి నిష్పక్షపాత బుద్ధితో చేసిన విమర్శ అయితే పట్టించుకోవచ్చును గానీ చిట్ఫండ్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని జనాలు తన్నడానికి వస్తే పారిపోయి తప్పించుకుని తిరుగుతూ బతికిన దగుల్బాజీ మాట్లాడే చవకబారు వాగుడుకి హిందువులు గోల చెయ్యడం కూడా అనవసరమే!

    P.S:అనామకుల వారు ఎలాగూ చెప్పేసారు గదారాముడి కధతో అవసరం లేకుండా చైనావాళ్లు బతికేస్తున్నారు గదా ఇక్కడ మాత్రం దేనికి అని,కానీ వాళ్లు సంస్కారవంతు!తమకి అవసరం లేనిదాన్ని గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు.వాళ్ళు చేసినవన్నీ మీరూ చేయగలరా?

    ReplyDelete
    Replies
    1. @ హరిబాబు,

      "రేపెప్పుడన్నా మన పెళ్ళాలు తమ తిరుగుబోతు తనంతో కావాలనే ఎవడితోనో సుఖపడి వస్తే రాజుగార్ని ఆదర్సంగా తీసుకుని మారు మాట్లాడకుండా ఇంటికి తెచ్చేసుకోవాలా?"

      (మీరు తిన్నగా సమాధానం చెప్పండి.మళ్ళీ రామాయణం అంత పొడుగు వ్యాసం వ్రాయకండి.)

      నా మొదటి ప్రశ్న మీరయితే ఏం చేస్తారు ?

      Delete
    2. @neehaarika
      నా మొదటి ప్రశ్న మీరయితే ఏం చేస్తారు ?

      hari.S.babu
      నేను రాసినదాన్ని అక్షరం పొల్లుపోకుండా కొటేషన్లలో పెట్టి అడుగుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా తిరుగుబోతుతనమే అవుతుంది కదా,కాబట్టి నాకు ఎటువంటి గందరగోళమూ లేదు - స్వీకరించను!

      Delete
    3. 2. మీరు చెప్పిందే కత్తి మహేశ్ చెపితే నగర బహిష్కరణ చేసారు. మీరు తిరుగుబోతుతనం అనికూడా అన్నారు.మీరు చెప్పిందీ అతను చెప్పిందీ ఒకటి కాదా ?
      మీరు ఎలాంటివాళ్ళైనా జీవితాంతం భరించవలసిందేనా ? మీ నుండి తప్పించుకోడానికి మరో మనిషిని వెతుక్కుంటే తిరుగుబోతు అని అంటారా ? భరించలేని పరిస్థితిలో విడిపోవడమే పరిష్కారం అని రంగనాయకమ్మ కూడా చెప్పారు. సీత తన దగ్గరుండడం కొందరు భరించలేకపోయారు. రాజు కాబట్టి ప్రజల కోసం భార్యను విడువక తప్పలేదు.మీరు విడిచిపెడ్తే ఎవరూ ఏమీ అనరు.రాజు విడిచిపెట్టాడు కాబట్టి ఇపుడు విమర్శిస్తున్నారు.మీరేమో రాజు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లు ఇంట్లోకి తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు.నాకు క్లారిటీ రావడం లేదు.

      మీరు చెప్పేదీ, రాముడు చేసిందీ, కత్తి చెప్పిందీ ఒకటేలాగా ఉంది.ఎవడి దగ్గరుండాలో మీరెవరు నిర్ణయించడానికి ? సీతకి నిర్ణయాధికారం లేదా ? నేనయితే విడిచిపెడతాను అని మీరు అంటున్నారు. భర్తను వదిలి ఇంకొకరిని కోరుకున్నపుడే విడిపోయినట్లు కదా?

      వాల్మీకి రామాయణం కాకుండా లవకుశ సినిమానే ప్రామాణికంగా తీసుకున్నా సీత తిరిగి అయోధ్యకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒక విడిపోయిన జంట ఆరాధ్య దైవాలు ఎలా అయ్యారన్నది నా రెండవ ప్రశ్న!

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. మీరు గందరగోళంలో పడితే దానికి నా బాధ్యత ఏముంది?

      మీరు ఉదహరించిన భాగం సామాన్యప్రజల గొడవ!రాజధర్మం,సామాన్యధర్మం వేరుగా ఉంటాయనీ ఆ రెంటినీ ఒకే దృష్టితో చూడకూడదనీ కూడా చెప్పాను.ఇంకా క్లారిటీ రాలేదంటే అది నా తప్పూ కాదు,వాల్మీకి తప్పూ కాదు.

      మీరు అడిగినది రాముడి స్థానంలో నేను ఉంటే ఏమి చేస్తానని కాదు కదా!రాముడి స్థానంలో ఉంటే నేను కూడా రాముడు చేసిందే చేస్తాను.కత్తి మహెష్ దగుల్బాజీతనం అంటున్నది దానిని.దానిని వ్యతిరేకిస్తున్న నాకు అతను అన్నదే నేను అనటాన్ని అంటగడుతున్నారు - ఇది మర్యాద కాదు!రాజధర్మం ప్రకారం అది తప్పు కాదని చెప్పాను.ఇక సామాన్యులు తమ వీలుని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు!తన భార్య తిరుగుబోతు కాదు అని భర్త నమ్మినా లేదంటే తిరుగుబోతు అయినప్పటికీ తనకి వేరే గతి లేకపోయినా కూడా సుబ్బరంగా ఇంటికి తెచ్చుకోవచ్చు!మీరు పెట్టిన కండిషన్ ప్రకారమే ఆ అభార్య తిరుగుబోతు అవుతుంది కాబట్తి స్వీకరించను " అన్నాను.మీ వాదన ప్రకారమే చూసినా భర్త నచ్చక మరొకడితో వెళ్ళింది ఆమెకి ఉన్న స్వేచ్చ వల్లనే కదా!విడాకులు కోరాల్సిన బాధ్యత ఉన్నది అలా చెయ్యకుండా వెళ్ళిన ఆ భార్యకే కదా, భర్తకి ఆ గొడవలన్నీ దేనికి?

      నేను ఎలాంటివాడినైనా భరించాల్సిందేనని నేను అన్నానా?భరించలేకపోతే విడిపోవటానికి మార్గం ఉండగా కొంతకాలం మరొకడితో సుఖపడి బోరు కొట్టో అతను వదిలేస్తేనో నా దగ్గిరకి వచ్చింది యెవరు - తనే కదా!

      చూడండి!నాకు ఆ సమస్య రాదు.మిగిలినవి కూడా ఇటువంటి ప్రశ్నలు అయితే ఇంక ఆపెయ్యండి.సమాజంలో అందరికీ వర్తించే నైతికపరమైన ప్రశ్నలని వ్యక్తుల్ని నిలదీసేటట్టు అడగటం క్షమించరానిది.ఈ ధోరణి ప్రశ్నలు ఆపండి

      Delete
    6. @నీహారికJuly 10, 2018 at 4:05 AM
      వాల్మీకి రామాయణం కాకుండా లవకుశ సినిమానే ప్రామాణికంగా తీసుకున్నా సీత తిరిగి అయోధ్యకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒక విడిపోయిన జంట ఆరాధ్య దైవాలు ఎలా అయ్యారన్నది నా రెండవ ప్రశ్న!

      hari.S.babu
      స్వయాన రామభక్తుడైన బాపు మితిమీరిన రాంభక్తితో సంపూర్ణ రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని భ్రష్టు పట్టించాడు!ఇంక బాపులా రాంభక్తుదని గ్యారెంటీ లేని సి.పుల్లయ్య మసాలా కూరి హిట్ సార్ములా పిచ్చతో ఉత్తర రామాయణాన్ని భ్రష్టు పట్టించాడు!

      వాటి మూలంగానే కదా ఈ గొడవలన్నీ రేగుతున్నది - ఇంక వాటినే ప్రమాణం అనుకోవాలని అంటే ఇంక అయినట్టే!

      Delete
    7. @ హరిబాబు,

      రామాయణం మనకి ఎలా ఆదర్శం?
      చౌదరిగారు ఈ ప్రశ్న లేవనెత్తారు. మధ్యలో మీరే తిరుగుబోతు తనం గురించి మొదలెట్టారు. మొదలెట్టిందీ మీరే ఆపేదీ మీరేనా ? చాలెంజ్ సినిమాలో రావుగోపాలరావు గారిలా నువ్వు గెలిస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తాను అంటాడు కానీ ఓడిపోతే ఏం చేయాలో చెప్పడు. మీరైతే ఏం చేస్తారు అని నేనడిగినపుడు నువ్వైతే ఏం చేస్తావు అని అడిగిఉండవలసింది. (ఇపుడు అడిగినా నేను చెప్పను)
      మాటమెదిలితే బ్రాహ్మణుల గొప్పతనం గురించి డప్పు కొట్టే మీరు ఒక రాజు స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పమని అడిగితే నాకా పరిస్థితి రాదు అనేసారు. రాముడు మాత్రం తనకు ఆ పరిస్థితి వస్తుంది అని అనుకున్నాడా ? వెధవల కళ్ళు తన పెళ్ళాం మీద పడతాయని అనుకున్నాడా ? చౌదరి గారికే సమాధానం చెప్పలేని మీరు పొలిటికల్ అనలిస్ట్ ఎలా అవుతారు? తమిళనాడు లో ఆడవారికి చాలా గౌరవం ఇస్తారు. మీరు ఇలా తిరుగుబోతు అని మాట్లాడారంటే మిమ్మల్ని తమిళనాడు నుండి వెలివేస్తారు. అపుడు ఆంధ్రానే మీకు గతి ! మధ్యలో చేతులెత్తేసి "ఈ తరహా ప్రశ్నలు అడిగితే నేను చెప్పను" అని వింత వాదన ఒకటి. పోనీ మీకు రాదు సరే నీహారికేదో చక్కగా వాదిస్తుంది కదా అని నాకు సపోర్ట్ గా నిలబడతారా అంటే అదీ లేదు. ఎంతసేపూ బ్రాహ్మణులూ వారి గొప్పతనం అంటూ చెత్త మాటలు.
      రాముడైనా వశిస్టులమాట వాల్మీకి మాట విన్నాడా ? ఒక్కొక్కసారి ఎవరిమాటా వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ప్రతిదీ గీత గీసినట్లు జరగాలంటే జరగవు అవకాశం వచ్చినపుడు చేజిక్కించువాలి. నేనింతే...నేను మారను అంటారు. నేను గంగిగోవులాగా మారిపోయాను అని కూడా అంటారు. జన్మత: వచ్చినవి మారవు. మీరు మీలాగే ఉండండి. మీ భార్యనో కూతురినో రేపెప్పుడైనా ఏ వెధవైనా బాధపెడితే అపుడు స్పందిస్తారా ? ఈ పుస్తకాలూ ఈ రచనలూ చదివేదీ వ్రాసేదీ ఎందుకోసం? వాటిని చదివి మంచిని స్వీకరించి చేడుని విసర్జించమనే కదా ? మనకా పరిస్థితి ఎదురైతే మనమెలా ఉండాలి... ఉండకూడదు అనేవి నేర్చుకోడానికేగా ?
      నాకర్ధం అయినంతవరకూ సమాజం అంటూ ఒక గుంపుని ఏర్పాటుచేసుకున్నాక ఒకడి కుటుంబం జోలికి ఇంకొక(తె)డు వెళ్ళకూడదు. ఎవరైనా వెళితే వారి తాట తీసి ముక్కూ చెవులూ కోయాలి. అలా చేసినవాడిని ప్రోత్సహించాలి. కుటుంబం ఉంటేనే సమాజం ఉంటుంది. ముందు కుటుంబాన్ని కాపాడుకున్నాకే దేశం గురించి ఆలోచించాలి. కత్తి మహేష్ అడిగేది కూడా అదే ...కుటుంబాన్ని వదిలేసి నువ్వు దేశాన్ని ఉద్ధరించేది ఏమిటీ అని ! ఇపుడు ఉద్యోగాల పేరుతో ఆడవాళ్ళు బయటకొచ్చినతరువాత కుటుంబాల పటిష్టత గురించి ఇటువంటి చర్చలు జరగవద్దా ? చర్చలేవనెత్తినవాడిని బ్లాగు/నగర బహిష్కారం చేయాలా ?

      Delete
    8. చెప్పడానికి ఏముంది వినేవారుంటే ఎన్నో చెబుతారు
      పనికిరాని మాటలకి విలువలేదు కదాని వాగేస్తారు..
      విని వదిలివేయక పట్టించుకుంటే బ్రతుకలేవే మనసా!

      ప్రతి ఉషోదయానికీ రేయితో సంబంధం అంటగడతారు
      నువ్వెంత నీ ప్రాతివత్యమెంతని రోబోతో రంకుగడతారు
      మనుషులున్న లోకంతీరే ఇదని తెలుసుకోవే మనసా!

      మనల్ని మనమాడిపోసుకుంటే అవునని ఆసరా ఇస్తారు
      కాదని వాదించి గెలవాలి అనుకోకు తప్పులెంచుతారు..
      వీధి కుక్కలు మొరుగుతుంటాయి గుబులేలనే మనసా!

      నీతులు చెప్పే ప్రబుద్ధులెందరో గోతులు తవ్వుతుంటారు
      అవసరానికి అందితే చేతులు లేదా కాళ్ళు పట్టుకుంటారు
      పరులు అనేమాటలకి నీకళ్ళు తడుపుకునేడవకే మనసా!

      ఎంతటి మహానీయులైనా అందరినీ ఆనందింపజేయలేరు
      ఎవరికి ఎవరూ చివరికి ఎవరూ నీవారు కారు, రారు..
      మనకు సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటైనా చెయ్యవే మనసా

      Delete
  9. @Haribabu Suraneni:

    "అంబేద్కర్ విమర్శ కూడా నిష్పక్షపాతమైనది కాదు"

    ఖచ్చితంగా కాదు.

    అభిప్రాయాలలో నిష్పక్షపాతం అన్నది ఒక భ్రమ. అంబేడ్కర్ అయినా వేరే ఎవరయినా తమతమ దృక్పథంతోనే (POV) రాస్తారు.

    ReplyDelete
    Replies
    1. పుట్టుకతో వచ్చిన ఆధిక్యతని అడ్డం పెట్తుకున్ మమ్మని పుట్టుకని బట్టి అవమానించారు అని పోరాడుతున్న వ్యక్తి రాముడి పుట్టుకని గురించి అనుమానాస్పదమైన వ్యాఖ్యానం చెయ్యడం ఏ విధమైన నిష్పాక్షికత?

      అది వ్యక్తిత్వహననం కిందకి వస్తుంది!అంబేద్కర్ రామాయణాన్ని విమర్శించడం కోసమే ఆ పుస్తకం రాశాడని నాకు తెలుసు.నచ్చనిదాన్ని విమర్శించడం కోసం కూర్చున్నప్పుడు ప్రశంసలు కురిపించరనీ నాకు తెలుసు.కానీ తప్పులు పట్టడానికి ఎన్నుకున్న లాజిక్ ఎలా ఉండాలి?రాముడి మనస్తత్వాన్ని బట్టి అతని గునగణాలు నిర్ధారించాలి గానీ అతను అక్రమసంతానం అని నిరూపించాల్సిన అవసరం ఏమిటి?అంబేద్కర్ రాముడు అనే ఒక వ్యక్తిలో మంచిచెడుల్ని అంచనా వెయ్యడానికి పుట్టుక వల్ల వచ్చిన అక్రమసంతానం అనే విషయాన్ని లెక్కలోకి తీసుకుంటే బ్రాహ్మణులు పుట్టుకని బట్టి ఆధిపత్యాన్ని అధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడంలో తప్పు ఏముంది?

      తను ఏ ఉద్దేశంతో రామాయణాన్ని విమర్శించాలనుకున్నాడో దానికి విరుద్ధమైన వాదన సాక్షాత్తూ అంబేద్కరే చేస్తే అతను ఎవరిమీద దేనికోసం పోరాడుతున్నట్టు?చెప్పండి!

      Delete
    2. Tanks!I am not having any negative openion on ambedkar,By the religious and political environment of his time he might overlooked such sensitive points.Except such smaller mistakes Dr.Ambedkar is a very well balanced and unbiased in his opinions.

      Delete
  10. ఇక్కడి అనామకం గారికి చైనా గురించి తెలిసింది చాలా తక్కువ అని అనుకుంటున్నాను.ఎందుకంటే,ఇవ్వాళ పార్టీ చట్రంతో కమ్యునిష్టులు చలాయిస్తున్న అధికారంలో కమ్యూనిష్టు ఆదర్శమయిన వర్గరహితసమాజస్థాపనకి సంబంధించిన విషయం ఈషణ్మాత్రం కూడా లేదు.పరిపాలన మొత్తం వారి ప్రాచీన రాజవంశాలైన హ్యూన్ రాజుల తరహాలోనే సాగుతున్నది!ఇంక వారికి రామాయణం లేదు కదా అంటునారు, కమ్యూనిష్టులు చాలావాటిని ధ్వంసం చేశారు.రామకధ కూడా వారికి ముందర ప్రాచుర్యంలో ఉండి ఉండవచ్చును.రామకధ లేకపోవచ్చును గానీ కమ్యూనిష్టులు కూడా ధ్వంసం చెయ్యడానికి సాహసించనిది ఒకటి ఉంది అక్కడ - అదే కంఫ్యూసియస్ ఆలోచనా ధార!ఆ కంఫ్యూసియస్ ఆలోచనా ధార యెక్కడినుంచి వచ్చింది అని వెతికితే అప్పటికి మీ ఆరాధ్యదైవాలు హిందూమతమని పేరు పెట్టన్ సనాతనధర్మమే కంఫ్యూసియస్ భావధారకి మూలం అని తెలుస్తుంది!

    రాముడు పాటించినది సనాతనధర్మమే అయినప్పుడు అక్కడ అంఫ్యూసియస్ పుణ్యాన ఇప్పటికీ నిలబడి ఉన్నది రామాయణ ధర్మమే కదా!

    P.S:Katti mahesh never fulfll his goal whatever it may be - either money or popularity never comes in this way!As I knew that he is still commenting in vengence,I think he want to become a legend or martyr,But It also never happens.If he want to ive peacefully he must surrender by expressing apology.

    ReplyDelete
    Replies

    1. పాపం కన్ఫ్యూషియస్ :)


      జిలేబి

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. It's one of the pervert books to be rated on par with Quran and Bible. Rama is probably the worst fictional character that Hindu fiction has created. He was spineless, evil and a horribly racist ass.

    ReplyDelete
  13. >>రాముడి పట్టాభిషేకంతో వాల్మీకి రామాయణం ముగుస్తుంది.

    అక్కడితో ముగుసిపోతే... మరి వాల్మీకి రామాయణం తప్ప ఇంకోటి మాట్లాడొద్దు అనే ఈ సైకోలు.. "రామరాజ్యం" అంటూ మా దుంప తెంచుతారేమయ్యా??

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఇదీ అర్ధం గాలే?

      హ్యారీ పోటరు కధని రైటరే ఏడు భాగాల సీరీసు లెక్కన రాసుండ్లా!ఏల?ఖద పెద్దది గాన!ఇదీ అంతే నాయనా, నీకర్ధం గాక కంఫ్యూజ్ అవుతా వుండావు.

      సినేమాలకి దించాలనుకున్నప్పుడు అన్ని పార్టులూ ఒకే డైరెట్రు ఎత్తినాడా?అయినా, అన్నిట్లోనూ హ్యారీ పోటరూ హెర్మియోనూ ఒక్కలా అవుపడ్లే!సీరీసో సీక్వెలో నీకు ఏ మాట నచ్చితే ఆ మాట ఫిరాయించుకో - రాముడనే ఒక హీరో గారి అతి పేద్ధ కధని రెండు పార్టుల సీరీస్ అనుకుంటే మొదటి పార్టు వాల్మీకి రాశాడు,రెండో పార్టు బౌబూతి రాశాడు.

      హిందువులు వాళ్ళకోసం వాళ్ళు రాసుకున్న కధని వాళ్ళు చెప్పుకుంటే నీ దుంప తెగడం ఏమిటీ?రామాయణం విన్నవాళ్ళ దుంప త్యెంచుతామని మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్కు ఆర్డరు గానీ వేసిందా!

      ఇంకా అర్ధం గాలే!

      Delete
    3. ఒహో! వాల్మీకి తప్ప ఇంకో రామాయణం థూచ్ అన్న మీకు ఇప్పుడు బౌబూతి గుర్తొచ్చాడన్నమాట. చిరంజీవి దెబ్బ అలానే ఉంటూంది మరి..

      >>రామాయణం విన్నవాళ్ళ దుంప త్యెంచుతామని మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్కు ఆర్డరు గానీ వేసిందా!
      కాదు.. పాకిస్తాన్ నుంచి ఒచ్చి హిందువుల పేరుతో చలామణి ఔతున్న ఉగ్రవాద సైకో బాచ్చి తెంచుతుందిలే..

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్