Showing posts with label * మతం. Show all posts
Showing posts with label * మతం. Show all posts

Monday, August 28, 2017

బాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు కేవలం 10 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించడం న్యాయమైన తీర్పేనా?

baba-Ram-Rahim-receives-10-Years-Jail-Sentence-rachabanda
బాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆశ్రమంలో సాద్వీలుగా కొనసాగుతున్న ఇద్దరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా హత్యారోపణలు ఉన్న గుర్మీత్ సింగ్ ను దోషిగా తేలుస్తూ మొన్న పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నాడు శిక్షను ఖరారు చేయని కోర్టు... ఏ తరహా శిక్ష వేయాలన్న విషయాన్ని నేటికి వాయిదా వేస్తూ తీర్పు  చెప్పింది. అయితే గుర్మీత్ ను దోషిగా తేల్చిన మరుక్షణమే అతడి అనుచర వర్గం ఉత్తర భారతంలో చేసిన ఆగడాలతో దేశం అట్టుడికిపోయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇక గుర్మీత్ అల్లరి మూకలు పాల్పడ్డ అచారకాలను అదుపు చేయలేకపోయారన్న ఆరోపణలతో ఏకంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి కేంద్రం చీవాట్లు కూడా పెట్టింది.

ఈ క్రమంలో మరోమారు అల్లర్లు  చెలరేగే ప్రమాదముందన్న భావనతో రోహ్ తక్ జైల్లోనే సీబీఐ ప్రత్యేక కోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యంత్రాంగం... అక్కడే శిక్షను ఖరారు చేసే ఏర్పాట్లను చేసింది. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో గుర్మీత్ కు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గుర్ దీప్ సింగ్ సంచలన తీర్పు వెలువరించారు. తీర్పు వెలువడిన వెంటనే రాక్ స్టార్ బాబాగా పేరుగాంచిన గుర్మీత్ బోరున విలపిస్తూ కోర్టు ప్రాంగణంలోనే కింద పడిపోయి తీవ్ర స్థాయిలో రోధించారట.  తాను ఏ తప్పూ చేయలేదని - నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. ఇక శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలులోనే  వైద్య పరీక్షలు నిర్వహించారు.

నిబంధనల ప్రకారం ఆయనకు సెల్ ను కేటాయించి శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. ఇదిలా ఉంటే... డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని - దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. అయితే అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి సీబీఐ తరఫు న్యాయవాది వాదన వైపు మొగ్గి గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 

Friday, January 8, 2016

యేసువారు నిజంగానే ఇండియా వచ్చారన్నది వాస్తవమా? కట్టుకధా?

సాక్ష్యం మేగజైన్ లో వస్తున్న బైబిల్ అంశాలకు కొంతమంది చాలా విలువైన సమాచారంతో కూడిన కొన్ని లింక్స్ అందించడం జరుగుతోంది. వాటిలో యేసు ఇక్కడి భారతదేశం వచ్చి తన తత్వ జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడని కధనాలు వ్రాసుకొచ్చారు. ఇవి ఎంతవరకూ వాస్తవికత కలిగియున్నాయి?

Thursday, December 24, 2015

"మత మార్పిడి వద్దు...మతి మార్పిడి ముద్దు" అనే నినాదం యొక్క వాస్తవికత ఏమిటి?

ఈమధ్య కాలంలో ఎక్కువుగా మనం చాలా నినాదాలు ఆటోల మీద మోటారు బైకుల మీద చూస్తున్నాము. "గొర్రెల కాపరి వద్దు,గోవుల కాపరే ముద్దు"అని, ఇంకా పరమత౦లో మోక్షం లేదు, స్వమతంలోనే మోక్షముందని" ఇలా ఎన్నో నినాదాలు చూస్తున్నాము. ఈ మధ్యే ఒక ఆటో పై "మత మార్పిడి వద్దు...మతి మార్పిడి ముద్దు" అనే నినాదం కనిపించింది. దాని వాస్తవికత వివరించగలరా?

Sunday, December 20, 2015

ఒక మతం వారి ఆహార నియమాలను మరొక మతం వారు నివారించాలని చూడడం సమంజసమా?

ఈమధ్య ఎక్కువుగా ఆవుమాసంపై జరుగుతున్న రగడ మనకందరికీ తెలిసిందే! ముస్లింలు ఆవులను భక్షిస్తే హిందువులు (అత్యధికులు) పూజిస్తారు. కాబట్టి గోవధ నిషేధ నినాదం అమలు చేయడం సాధ్యమా? మనం పూజిస్తున్నామని ఇతర మతస్తులను నివారింప చూడడం సమంజసమా?

Saturday, December 19, 2015

పురాణాలకు "పుక్కిటి పురాణాలు" అనే వాడుక ఎలా వచ్చింది?

అనేకమంది దృష్టిలో పురాణాలన్నీ ఊహాజనితమే, కల్పిత కధలే అనే భావన బలంగా ఉంది. నిజానికి కొన్ని పురాణాలు నమ్మదగ్గవైతే అత్యధిక పూరాణాలు మాత్రం కేవలం కల్పిత కధలని, మనిషి నీతిని నేర్వడమ్ కోసం వ్రాయబడినవని అంటారు. అందుకనే ఇవ్వన్నీ వింత,వింతగా ఆలోచనలకు నిలబడలేనట్టుగా అనిపిస్తాయి కాబట్టే వీటిని పుక్కిటి పురాణాలుగా పేర్కొంటున్నారని వాదన. నిజానికి వీటికి పుక్కిటి పురాణాలు అనే వాడుక ఎలా వచ్చింది?

Thursday, July 23, 2015

హిందూమతం పతనమవ్వడానికి కారణాలేమిటి? దానినెలా పరిరక్షించుకోవాలి?

ఈ అంశంపై ఇటీవలే ఆంధ్రజ్యోతి ఛానెల్లో వివిధ పీటాధిపతుల మధ్య మేధావుల మధ్య ఒక చర్చా కార్యక్రమం జరిగింది.వీలయితే ఈ లింక్ ద్వారా చూడవచ్చు. ఇక పై సమస్యలకు మీ అమూల్య మార్గదర్శకాలు అందించే ప్రయత్నం చేయండి.