Breaking News

విమానం తయారీ గూర్చి వేదాలలో నిజంగా ఉందా? సైన్స్ అండ్ వేదాస్ అనే అద్భుతమైన చర్చా వేదిక. దీనిపై మీ స్పందన ఏమిటి?


Is there really about the aircraft making of the Vedas? Science and Vedas is a wonderful discussion forum. What is your response on this? 

8 comments:



  1. ఇంకా హరిబాబు రా లే దే మి టి ?

    ReplyDelete
    Replies
    1. నాకిదే పనా?అన్ని బ్లాగులూ తిరిగి చూస్తా ఉంటే నా ఉజ్జోగం వూడుద్ది!

      Delete

    2. ఉజ్జోగం వుందా ?:)

      జిలేబి

      Delete
    3. నేనసలే వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామర్ని,నీచుట్టూ ఆగ్మెంటెడ్ రియాలిటీ మాయ కప్పేసి మియాన్మార్ రోహింగ్యా తీవ్రవాదుల మధ్యకి పోయి పడేలా చేస్తా!

      Delete
  2. వేదం అంటే జ్ఞానం.కేవలం ఓక వ్యక్తి యొక్క పరిమితమైన జ్ఞానం కాదు - కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఒక్కొక్క తరంలోని సమూహం మొత్తం ఆర్జించిన జ్ఞానాన్ని పెరుగు మీద తేలిన మీగడలా తేర్చి ఒకచోటికి చేర్చి తర్వాత తరానికి అందిస్తూ వచ్చిన జ్ఞానరాశి - ఇందులో లేనిది ఎక్కడా లేదు,ఇందులో ఉన్నదే అన్నింటా ఉన్నది!

    మొదట వేదాలు అయిదు అని చెప్పడమూ,తర్వాత కాలంలో నాలుగే అనడానికి ఒక కారణం ఇక్కడి నుండి మెసపొటేమియాకు చేరినజెండ్ అవెస్తా అని పరిశోధకులు చెబుతున్నారు.వేదం అంటే దేవుడు,పరలోకం,కర్మకాండలు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు.కానీ ఒక సమూహం యొక్క మొత్తం జ్ఞానరాశిలో అవి మాత్రమే ఉండవు కదా!వేదం బ్రాహ్మణులకి మాత్రమే పరిమితం అనేది కూడా అపోహయే!నేను ఇదివరకే నాపోష్టులో క్రీస్తు శకం 1వ శతాబ్ది కాలం నాడు కొందరు కమ్మ కులస్థులూ కోయ కులస్థులూ కూదా వేదం చదివి విప్ర,ద్విజ పదాలతో సంబోధించబడ్డారని చెప్పాను.క్రీస్తు శకం 17వ శతాబ్దిలో కూడా కొందరు బ్రాహ్మణేతరులు వేదం చదివి వాటి గురించి ఎన్నో గ్రంధాలు రాసిన దాఖలాలు ఉన్నాయి.ఎంతో విస్తారమైన వైదిక సాహిత్యాన్ని ఒక మనిషి గుర్తు పెట్టుకోవడం కష్టం గనక కొందరు కొందరు కలిసి ఒక్కో శాఖ వారు ఒక్కో భాగాన్ని అధ్యయనం చేస్తూ తర్వాత తరాలకు అందిస్తూ ఉంటే అందులో ఉన్న వృత్తివిద్యలని అభ్యసించినవారు వాటితో లాభాలు గడించి కృతజ్ఞతా సూచకంగా అధ్యయనం చేసేవారిని పోషిస్తూ ఉండేవారు.మొత్తం సమాజానికి జ్ఞానాన్ని అందించటం కోసం ఆ పనులు తామే చేస్తే తమకు వచ్చే లాభాలు వదులుకున్నవాళ్లని ఇవ్వాళ కంచె ఐలయ్య కూర్చుని తిన్నారని అంటున్నాడు.అలా చెయ్యకుండా వాళ్లే ఆ పనులు చేస్తూ వీళ్లకి నేర్పకుండా ఉంటే అప్పుడు బాగుండేదా!

    నేను ఇక్కడ మొత్తం నాలుగు వేదాలలోని ప్రముఖమైన విషయాలని లిస్టు ఇస్తున్నాను/అందులో ఈ బ్లాగు పోష్టులో వేసిన ప్రశ్నతో పాటు చాలా ప్రశ్నలకి జవాబులు వస్తాయి.ప్రతి వేదమూ మొదటి స్థాయిలో మండలాలుగా విభజించబడి ఉంటుంది.ప్రతి మండలంలోనూ కొన్ని సూక్తాలు ఉంటాయి.ప్రతి సూక్తంలోనూ కొన్ని శ్లోకాలు ఉంటాయి.వీటిని మంత్రాలు అని పిలుస్తారు.ఋగ్వేదంలోని వాటిని ఋక్కులు అనటం కూడా మామూలు.

    ఋగ్వేదం
    -------------
    1.బట్టలు నేయు విద్య(మం.2->సూ.3->ఋ.6)
    2.బండ్లు,రధములు నిర్మించు లోహపు పనులు చేయుట(మం.3->సూ.53->ఋ.19)
    3.లోహపు పనులు చేయు విధానము(మం.53->సూ.9->ఋ.5)
    4.బంగారు పని - స్వర్ణకార విద్య(మం.1->సూ.140->ఋ.10)
    5.యుద్ధవీరులకు కవచములు తయారుచేయుట(మం.2->సూ.39->ఋ.8)
    6.కవచములను ధరించు పద్ధతులు(మం.8->సూ.53->ఋ.2)
    7.భుజకవచముల నిర్మాన విధానములు(మం.4->సూ.34->ఋ.9)
    8.బంగారమును త్రవ్వి యెత్తెడి విధానము(మం.2->సూ.34->ఋ.3)
    9.సేనావ్యూహముల విభాగము,సంగ్రామ విధానములు,రధవిధానములు(మం.6->సూ.46->ఋ.10)
    10.ఉత్తమస్థానములు నిర్మించు విధానము(మం.2->సూ.41->ఋ.5)
    11.రాజ్పురుషులు ఏనుగులపై స్వారీ చేయు విధానము(మం.4->సూ.4->ఋ.1)
    12.కృషి విద్య(మం.4->సూ.57->ఋ.1,8)
    13.బావులను త్రవుట,నాగలి చేయుట,విత్తనములు చల్లుట మదలైన విధానములు(మం.10->సూ.101->ఋ.3,7)
    14.బావులను త్రవ్వెడి విధానము(మం.10->సూ.25->ఋ.4)
    15.బావుల నుండి నీరు తోడి పైరులకు పారించు విధానము(మం.10->సూ.93->ఋ.13)
    16.బంగారు నాణెములు చేయు విధానము(మం.10->సూ.99->ఋ.4)
    17.సముద్రముపై వోడలు నడుపు విధానము(మం.1->సూ.27->ఋ.2)
    18.పరదేశములకు సముద్రయాత్ర చేసి ధనము నార్జించు విధానము(మం.4->సూ.55->ఋ.6)
    19.శల్య విద్య - విరిగిన అంగములకు చేయు చికిత్స(మం.1->సూ.117->ఋ.13)
    20.గ్రుడ్డివారికి కృత్రిమ నేత్రములు ధరింపజేయు విధానము(మం.1->సూ.16->ఋ.16)
    21.ద్వాదస రాశుల వర్ణనము(మం.5->సూ.45->ఋ.78)
    22.ఆయనముల యొక్క కీలు,సూర్యగోళము యొక్క అక్షమును గురించిన వైవరాలు(మం.1->సూ.110->ఋ.2)
    23.సూర్యగ్రహణాదుల పూర్తి వివరాలు(మం.5->సూ.40)
    24.రైలును,టెలిగ్రామును చేయు విద్యల ప్రస్తావన(మం.1->సూ.161->ఋ.13)
    *మరియు "యువం వేదవే పురూవార మశ్వినా" అను మంత్రము నందు నౌ విమానాది విద్యలు చెప్పబడినాయి.
    సామవేదం
    --------------
    దీనిలో ఈశ్వర ప్రస్తుతి,భక్తి వేదాంతం నుంచి బ్రహ్మవిద్య వరకు గల విషయాలు చర్చించబడ్డాయి.లయాత్మకమైన మాధుర్యం చేత అత్యంత మధురమైన గానాన్ని సామగానంతో పోల్చడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.


    TO BE CONTINUEING

    ReplyDelete
  3. CONTINUEING FROM ABOVE
    అధర్వవేదం
    ==============
    ద్వితీయోసతృతీయశ్చ 13వ కాండ నుంచి సర్వే అస్మిక్ దేవాః 13వ కాండ వరకు బ్రహ్మవిద్యను గురించి చెబుతున్నాయి.
    ఆచార్య ఉపనయమానో ఇత్యాది 13వ కాండ బ్రహ్మచర్య విధి గురించి చెబుతున్నది,
    సాయంసాయం గృహపతిర్నో ఇత్యాది ప్రాచీదిదగ్ని రధిపతి వరకు గల మంత్రములు పూర్వోక్తరీత్యా భగవత్ప్రార్ధనావిధి గురించి చెప్పబడి ఉంది.
    ఇంద్రో జయాతి నపరాజయాతా ఇత్యాది పూర్వోక్తరీత్యా ధర్మవిధిః ఇయం నారీపతిలోకం వృణానా ఇత్యాధి పూర్వోక్తరీత్యా నియోగవిధి - నాకు నా అతి తక్కువ సంస్కృతపరిజ్ఞానం వలన ఇక్కడ దాంపత్యానికి సమబంధించినవీ స్త్రీపురుష సంబంధాలను గురించీ వ్యాఖ్యానించి ఉండవచ్చునని తెలుస్తున్నది.

    ఇది పూర్తి వేదసారం కాదు,కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే ఇక్కడ పొందుపర్చారు.నాలుగు వేదాలలోనూ ఉన్న మొత్తం విషయాన్ని రేఖామాత్రంగా చదవడానికే అపారమైన మేధోసంపత్తి గల ఒక వ్యక్తికి కనీసం 150 యేళ్ళు పడుతుంది - అందుకే మనవాళ్ళు "ఎవడు బతికాడు నూటయాభయ్యేళ్ళు!" అని అన్నారు.మరి ముష్టాఖ్ అహ్మద్ గారేమో వేదం మొత్తం చదివేసినంత ధీమాగా వేదంలో ఎక్కడా విగ్రహారాధన గురించి లేదు అని బల్లగుద్ది చెప్తున్నారు,వేదాన్ని తరతరాలకు అందించడానికి బాధ్యత తీసుకున్న బ్రాహ్మణులే ఒక్కొక్క శాఖ వారు ఒక్కొక్క భాగాన్ని మాత్రమే చదివి గురుంచుకోగలుగుతున్నారు.అక్కడ ఉన్నది అంతమాత్రమే కాదు.ప్రతి వేదానికీ ఉపాంగాలు ఉంటాయి.జ్యోతిషం,వాస్తు,సాముద్రికం వంటివి అలాంటి ఉపాంగాలు.అలాగే అనుబంధ సాహిత్యం లాంటి అరణ్యకాలు,ఉపనిషత్తులు కూడా వేదంలో ఒక భాగమే!


    ఇవ్వాళ వైదికకాలం అని చెబుతున్నది ఆ వైదిక సాహిత్యం పుట్టిన కాలం కాదు.దాన్ని గ్రంధస్తం చేసిన కాలం మాత్రమే!అప్పటికే ఎంతో విస్తారమైన జ్ఞానసంపద ఉన్నదంటే దాని అర్ధం ఏమిటి?తాను పుట్టటమే ఘనకార్యం అయినట్టు పుట్టిన రోజును తను గుర్తుంచుకుని పదిమందికీ గుర్తు చేసి హడావిడి చేసే అహంకారం అప్పటి వాళ్లకి లేకపోవటం వల్ల తమ వివరాలే ఎక్కడా రాసుకోలేదు,ఇంక ఈ సంస్కృతి ఎప్పుడు పుట్టిందో అ ఒక్క తేదీ ఎలా తెలుస్తుంది?ఆ సాహిత్యానికి వైదిక సాహిత్యం అని పేరు.దాన్ని బట్టి దీన్ని వైదికమతం అని పిలవకూడదు వైదిక ధర్మం అని మాత్రమే పిలవాలి - ఇతరులు ఏ ఉద్దేశంతో చెప్పినా హిందువులు అని కొత్తపేరు తగిలించి పిలుస్తున్న ఈ వారసత్వాన్ని పాటించే వారికి మతం లేదు!దేవుడు లేదనే నాస్తిక సిద్ద్గాంతాన్ని ప్రతిపాదించిన నిరీశ్వర సాంఖ్యాన్ని ప్రవచించిన కపిలమునిని గురంచి గీతలో "మునుల్లో నేను కపిలమునిని!" అని ప్రకటించాక దీన్ని దేవుడి చుట్టూ అల్లుకున్న మతాలతో ఎట్లా పోల్చాలి?దేవుడు లేడన్నా ఫర్వాలేదు,నీ ధర్మాన్ని మాత్రం వదలకు అని చెప్తున్నది మతం ఎట్లా అవుతుంది?ఇది నూటికి నూరుపాళ్ళూ భారతీయ పరంపరానుగతమైన సనాతన ధర్మం,ఈ మాటలో "భా" అనే అక్షరమూ "ధ" అనే అక్షరమూ పదే పదే పలికితే చచ్చిపోతామని భయపడినవాళ్ళు వాళ్లకి పలకడానికి వీలుగా పెట్టుకున్నదే హిందూమతం అన్న పేరు.గట్టిగా "కాదు,మమ్మల్ని హిందువులు అని పిలవకండి - భారతీయ సనాతన ధార్మికులు అని మాత్రమే పిలవండి!" అని అందామంటే దాన్ని పలకలేక మీరు పడే అవస్థలు చూడలేని దౌర్భాగ్యంతో తలలు బాదుకోవాల్సిన దురవస్థ మాది!ఎందుకొచ్చిన గోల?

    TO BE CONTINUED

    ReplyDelete
  4. CONTINUEING FROM ABOVE
    ఋగ్వేదం గురించి చెప్పిన చోట సూచనప్రాయంగా విమానాల ప్రసక్తి ఉన్నదని చెప్పాను.అది అక్కడ ఉందా లేదా అనే అనుమానం ఉన్నవాళ్ళు సంస్కృతం నేర్చుకుని పండితుల వద్దనుంచి స్వయంగా తెలుసుకోవచ్చు!"వాళ్ళెవళ్ళో విమానాలు కనుక్కున్నాక వీళ్ళు కొత్తగా శ్లోకాలు రాసి అక్కడ పెట్టలేదని గ్యారంటీ ఏమిటి?రైటు సోదరులు విమానం కనుక్కోవడానికి ముందే ఈ గ్రంధాల్లో ఇవి ఉన్నాయని చెప్పదానికి ఆధారాలు ఏమిటి?" అని అడిగితే నేను జవాబు చెప్పలేను - అది నా శక్తికి మించిన పని!

    ఒకసారి కనుక్కున్నవి ఇప్పటికీ ఎందుకు మిగల్లేదు అనే ప్రశ్నకి నా బుద్ధికి తోచిన జవాబు చెప్పగలను.కోడిగుడ్డుకి ఈకలు పీకినంత క్రూరంగా ఆలోచించకపోతే టెలిగ్రాం ఇవ్వలేకపోవడం గురించి చెప్పిన జవాబు సరిపోతుంది.భారతీయ వైజ్ఞానికులు ప్రతి విషయాన్నీ గణితశాస్త్రం యొక్క పరిజ్ఞానంతోనే వర్ణించారు,భూమి పుట్టిన వయస్సు,సూర్యచంద్ర గ్రహాదుల వ్యాసార్ధాలు వాటి దీర్ఘవృత్తాకారపు కక్ష్యల పరిధి వంటి స్థిరాంకాలను పాశ్చాత్య శాస్త్రజ్ఞులు యంత్రపరికరాలను ఉపయోగించి చెప్పినవాటితో సరిపోయేటంత నిర్దుష్టంగా చెప్పారు.కాలనిర్ణయంలో కూడా పరమాణువు నుంచి మహాయుగాల వరకు విస్తరించినది.కొందరు ఉత్సాహం ఎక్కువైనవాళ్ళు శ్రీరాముడు 8000 యేళ్ళ క్రితమే పుట్టాడని రామాయణంలోని సంఘటనలలో చెప్పబడిన గ్రహస్థితుల్ని ప్లానెటోరియం లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తేల్చి చెప్పాలని హడావిడి చేస్తున్నారు - అది కూడా తప్పే!ప్రస్తుతం మనం ఉన్నది కలియుగంలో కలియుగం మొదలై 5000 సంవత్సరాలు మాత్రమే అయింది.అంతకు ముందరిది కృష్ణుడు పుట్టిన ద్వాపరయుగం అవుతుంది తప్ప రాముడు పుట్టిన త్రెతాయుగం అవదు.ఈ యుగాల పరిమితి లక్షల మానవ వత్సరాల్లో ఉంటుంది.ద్వాపరానికి ముందరి త్రేతాయుగం నాటిది రామకధ!ప్రతి యుగానికీ మధ్యన పాక్షిక వినాశనం జరుగుతుంది.సూర్యుని తేజస్సు నశించి భూమి సమస్తం నీటిలో మునిగిపోయి ఉంటుంది.మళ్ళీ సూర్యుని నుండి వెలుగు మొదలు కాగానే సృష్టి అంతకుముందు ఎక్కద ఆగిందో అకక్డి నుంచి కొనసాగుతుంది.అలాంటి సందర్భాలలఓ ముందరి కాలంలో సృష్టించబడినవి అన్నీ మిగలకపోవచ్చు.త్రేతాయుగంలో జరిగినదని చెప్తున్న రామకధలో రావణునికి సంబంధించిన లంకలో ఒకచోట పుష్పకవిమానం మామూలు సమయంలో ఉంచిన ప్రదేశం,రిపేర్లు చెయ్యడానికి వాడిన ప్రదేశం అని రెండు స్థలాలను శ్రీలంక ప్రభుత్వమే గుర్తించి యాత్రాస్థలాలను చేసి చూపిస్తున్నది.రిపేర్లు చెసేదిగా చెప్పబడుతున్న స్థలం ఇప్పటి కార్ల షెడ్ల మాదిరి నేలంతా నల్లని మరకలతో ఉంటుందని చూసినవారు చెబుతున్నారు.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్