Breaking News

దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు సమంజసమా?

ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్‌ తాజా కేలండర్‌లో గాంధీకి బదులుగా ప్రధాని మోడీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి అనిల్ విజ్ స్పందించారు. "ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్‌ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమైపోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు" అని విజ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసం?

4 comments:


  1. చాలా విచారించాల్సిన విషయం :)

    జిలేబి

    ReplyDelete


  2. ఓ బోడిగుండు తాతా !
    నీ బొమ్మను నోట్ల పై గనిన కారణమై
    మా భారతదేశ కరె
    న్సీ బరువే తగ్గెనంట! నిజమా చౌద్రీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రెండాకులెక్కువ తె(బ)లిసిన హరియాణా అ నిల్ వీజీ
      రెండొందల శాతమెక్కువగ నమ్మబలికె, 'వలదిక గజిబిజి
      గుండు తాతే రూకల గుండు నిండుగ గీసెన'టంచు విప్పి పజిల్
      రండహో నమ్ముడు, ఇక మోది నేత గుండేయడు తుండు సుమీ?
      :)

      Delete
  3. సామంజస్యం గురించి ఎందుకు లెండి. ఆపాటి ఆలోచన కలవాళ్ళుంటే మనరాజకీయరంగం ఇంత కళ్ళుకుళ్ళుగా ఎందుకుంటుంది? తమవల్లే దేశం పరువుపోతోందని తెలుసుకోవటం వాళ్ళ వల్లకాదు పైగా తామేదో దేశాన్ని ఉధ్ధరించేస్తున్నామనుకుంటూ అవాకులూ చెవాకులూ‌ మాట్లాడుతారు. వాళ్ళని చూసి జాలిపడాలో, వాళ్ళపాలబడిన దేశాన్ని చూసి జాలిపడాలో, వీళ్ళ పుణ్యమా అని కునారిల్లుతున్న దేశప్రజను చూసి జాలిపడాలో అన్నది బోధపడకుండా ఉంది.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్