Breaking News

ప్రధానిగా నరేంద్ర మోడి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అర్హులేనా?

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్తులు ఏమాత్రం అసలు బాగోలేదు. అభివృద్ధి కూడా కనిపించడం లేదు. చంద్రబాబు అమరావతిపైనా, నరేంద్ర మోడి ఇతర మత నిర్మూలనపైన మాత్రమే దృష్టి పెట్టారు. ఈరోజు ఒక వార్త తెలిసింది. నరేంద్ర మోడి గారు గూగుల్ యాడ్స్ సెన్స్ డబ్బులు ఆపేసారట. వాళ్ళు ఏమి చేసారు పాపం. ఎదో బ్లాగింగ్ ను వ్రుత్తిగానూ, Youtube ను తమ కళలకు వేదికగానూ చేసుకుని సంపాదించుకుంటున్నారు. విదేశాల నుండి ఇతర మతస్తులకు వస్తున్న ఫండ్స్ ను అడ్డుకోవడం కోసం వీళ్ళను కూడా నిరోధించడం న్యాయమా? దేశభక్తి ముసుగులో ఇతర మతస్తులను లేకుండా చేయాలనుకోవడం అన్యాయం కాదా? ఆంధ్ర పరిస్థితి అయోమయం.. ఎవరు ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్న నరేంద్ర మోడిని, ఇంత జరుగుతున్నా మద్దతు ఉపసంహరించుకోకుండా మోడిని పట్టుకు వేలాడుతున్న చంద్రబాబుని ఎలా నమ్మాలి? ఎలా సమర్ధించాలి? వీళ్ళిద్దరూ పరిపాలనకు అర్హులేనా?

6 comments:

  1. Don't blabber, show solid proof for you allegations.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. నరేంద్ర మోడి ఇతర మత నిర్మూలనపైన మాత్రమే దృష్టి పెట్టారు

    నమో గురించి అసత్యాలను ప్రచారం చేయటం మానుకోండి. విశ్వసనీయత కోల్పోవటమేకాక, ఇలారాసే వారి అజ్ణానాన్ని చూసి ప్రజలు నవ్వుకొంటారు. మత నిర్మూలన గురించి తెలుసుకోవాలంటే ఒకసారి పాకిస్థాన్ చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక్క బంగ్లాదేశ్ యుద్దం లోనే 30 లక్షల మంది హిందువులను చంపారు, ఇప్పటివరకు సుమారు ఐదుకోట్ల హిందువులు జాడ తెలియటం లేదని అమెరికా సెనెట్ లో ప్రస్థావించారు. అది మత నిర్మూలన అంటే.

    బంగ్లాదేశ్‌లో 1949 నుండి సుమారు 5 కోట్ల హిందువుల అదృశ్యం గురించి మాట్లాడుతూ నియర్ ఈస్ట్ మరియు సౌత్ సెంట్రల్ ఆసియాలో మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛకై హెచ్.ఆర్. 440 బిల్లును సమర్థిస్తున్న రిప్రసెంటెటివ్ డోల్డ్.

    https://www.youtube.com/watch?v=IkpBiKze4Ow

    ReplyDelete
  4. మూడు లక్షల మంది బెలుచిస్తాన్ వారిని చంపారని రాశారు. మరి మీరే విధంగా రియాక్ట్ అవుతారో!

    Bangladesh to Balochistan: Pakistan Army’s sordid record of ethnic genocide

    Like Bangladesh, the Baloch people need to keep alive their torch for freedom as they have done for the last six decades. More than 300,000 Balochis have lost their lives and another 25,000 are missing. It is a terrible price to pay for independence by the six million people of Balochistan. That is the only way of redeeming the sacrifices of its martyrs by an incessant freedom struggle

    http://www.dhakatribune.com/world/south-asia/2016/08/21/bangladesh-balochistan-pakistan-armys-sordid-record-ethnic-genocide

    ReplyDelete
  5. మొదీ గురించి అడిగితే, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంటావెంటి? నీకేమైనా మతి పొయిందా??

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్