Breaking News

నిర్భయలాంటి ఆడపిల్లలకు సరైన న్యాయం చేసే స్థితిలో మన చట్టాలు లేవా?


14 comments:

  1. There are laws and they were implemented in Nirbhaya case and 7 culprits were awarded death sentence.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ఒక నేరానికి ఎన్నిసార్లు శిక్షించాలి?
    న్యాయం అంటే పగ తీర్చుకోవడమా!

    చట్టప్రకారం అప్పటికి మైనర్ అని తెలిసి దానికి సంబంధించి అధికారం ఉన్న సంస్థలకి అప్పగించి ఆ కాలం కూడా ముగిసిపోయి విడుదల అవుతున్న వాణ్ణి పట్టుకుని మళ్ళీ విచారన జరిపించి అవసరమైతే చట్టాల్ని సవరించి అయినా సరే కొత్త్తగా శిక్షించాలై అనటం వివేకం కాదు.కుటుంబీకులకి ఆక్రోశం ఉందవచ్చు,కానీ మిగిలిన వాళ్ళు ఆలోచించాల్సింది విచక్షణతో కదా!

    న్యాయస్థానాల్ని మన పగల్ని తీర్చే అడ్డాలుగా మార్చదలుచుకుంటే అసలు కోర్టుకు వెళ్ళడమే అనవసరం.ఏదైనా అత్యాచారం జరగ్గానే ఏదో ఒక మాఫియా లీదరుకి డబ్బిస్తే తెల్లారేసరికల్లా మనకి కావల్సింది జరిగిపోతుంది,ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ, బాగా చెప్పారు. క్షణికావేషాలతో ప్రతి ఘాతుకానికీ చట్టాలు మారుస్తూ పొతే వ్యవస్థ రూపు రేఖలే మారిపోతాయి.

      PS: నాకు తెలిసినంత మేరకు (I did not study in detail though) ప్రస్తుత చట్ట మార్పిడి బాలుల సంక్షేమ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధం. సదరు కన్వెన్షన్ భారత్ అమలు చేసింది కనుక ఈ మార్పు కోర్టులు కొట్టేసే అవకాశం ఉంది.

      Delete
    2. జై గారూ,
      నాకు అంతర్జాతీయ ఒప్పందాల గురించి పెద్దగ తెలీదు కానీ నేను విన్నంత వరకు మన దేశంలో మహిళల రక్షణకి ఉద్దేశించినవి, దురుపయోగమవుతున్నాయని పేరు తెచ్చుకుంటున్నవి ఐన గృహహింస చట్టం లాంటివి అంతర్జాతీయ మానవ హక్కులకు వ్యతిరేకంగానే ఉన్నాయని. అంటే నేరం రుజువయ్యేంతవరకు నిందితుడిగా కాక నేరస్తుడిగా భావించటం లాంటివి అనుకుంటా.

      మరి అవి చట్టాలుగా నిలబడగలిగినప్పుడు ఇది ఎందుకు నిలబడలేదు.

      Delete
    3. చైతన్య గారూ, ప్రస్తుత చట్ట మార్పును నేను పూర్తిగా చదవలేదు. అయితే 16 ఏళ్ళు దాటిన వారిని కొన్ని కొన్ని నేరాల విచారణలో బాలలుగా కాక వయోజనులుగా పరిగణించాలని చట్టం మార్చారని వార్తలు చూసాను. నాకు అర్ధం అయిన మేరకు ఇది అంతర్జాతీయ బాలల హక్కుల కన్వెన్షన్ (Convention on Rights of Child) సూత్రాలకు విరుద్ధం.

      మీరు చెప్తున్నది నిర్భయ చట్టం గురించి. ఇదీ నేను చదవలేదు కానీ అక్కడ ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించలేదని అనుకుంటా. ఎవిడెన్సు యాక్టులో కొన్ని మార్పులు చేసారు కానీ రుజువు అయితేనే నేరస్తుడు (presumption of innocence) సూత్రాన్ని ముట్టలేదు.

      Delete
    4. లేదండీ నేను చెప్తున్నది నిర్భయ చట్టం గురించి కాదు, గృహహింస చట్టం గురించి. దాంట్లో నేరం రుజువుకాక మునుపు కూడ నిందితుల్ని నేరస్తులుగానే పరిగణిస్తారని విన్నాను. "Accused until proven guilty" అనే అంతర్జాతీయ న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా ఈ చట్టంలో "Guilty until proven otherwise" అనేది ఫాలో అవుతున్నారని వ్యతిరేకిస్తున్నవారి వాదన. అది నిజమైన పక్షంలో అంతర్జాతీయ మానవహక్కుల సూత్రాలకి విరుద్దమైన చట్టమనేగా అర్థం. అది కోర్టులలో నిలబడలగలిగినప్పుడు ఈ కొత్త మార్పు మాత్రం ఎందుకు నిలబడదు అని నా అనుమానం.

      Delete
    5. గృహహింస చట్టం కానీ, 498Aలాంటి చట్టాలు కానీ, అంతర్జాతీయంగా ఆమోదించ బడిన మానవ హక్కులను ఉల్లంఘించేవే ! కానీ, మన దేశములో రాజ్యాంగం స్త్రీలకు, మైనారిటీలకు, వెనకబడిన వారికీ సంబందించి కొన్ని ప్రత్యేక చట్టాలు తీసుకు రావచ్చు అని పేర్కొంది. కాబట్టే ఈ 498A, గృహహింస లాంటి చట్టాలు రాజ్యాంగ బద్దమైనవే అవుతాయి. పురుష హక్కుల కార్యకర్థలు స్త్రీలకు సంబందించి ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలను సవాలు చేసినప్పుడు కోర్టులే ఈ విషయాన్ని చెప్పాయి.

      ఇక (సో-కాల్డ్)నిర్భయ చట్టం విషయానికి వస్తే .. ఇక్కడ మైనర్ బాలురకు సంబందించి జరుగుతున్న సవరణ కదా, వారు కూడా రక్షించ వలసిన వారి జాబితాలోకే వస్తారు కాబట్టి వారిని శిక్షించడం కుదరదు అనుకుంటా (ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే).

      Delete
  4. చైతన్య గారూ, మీ వ్యాఖ్య సరిగ్గా చూడక పొరబడ్డాను మన్నించండి.

    గృహ హింస చట్టం సెక్షన్ 32 (2) ఒకసారి చూద్దాం:

    Upon the *sole* testimony of the aggrieved person, the court *may* conclude that an offence under sub-section (1) of section 31 has been committed by the accused

    ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

    1. ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తిని ఈ సెక్షన్ కూడా నిందితుడనే అంటుంది కనుక మానవ హక్కుల ప్రకటన (Universal Declaration of Human Rights) ఉల్లంఘన జరగలేదు
    2. ఫిర్యాదీ మహిళ ఇచ్చిన వాజ్మూలం ఆధారంగా *మాత్రమె* తీర్పు చెప్పాలని కూడా లేదు. అన్ని ఆధారాలు (నిందితుని సాక్ష్యంతో సహా) పరిగణనలో తీసుకున్నాకే జడ్జీ తీర్పు చెప్పాలనే సాంప్రదాయానికి ఈ సెక్షన్ అడ్డంకి కాదు.
    3. ఇతర ఆధారాలు (ఉ. ప్రత్యక్ష సాక్షి) లేవు కనుక ఫిర్యాదీ వాజ్మూలం కొట్టేయాలన్న వాదనకు తెర దించడమే ఈ సెక్షన్ ముఖ్య ఉద్దేశ్యంగా తోస్తుంది

    The law does not contemplate a procedure whereby the indictee can be found guilty, convicted and sentenced on the sole testimony of the aggrieved person *without giving the indictee an opportunity to defend himself* and disprove the allegations raised against him. (2008 కుంజతిరి కేసులో కేరళ న్యాయస్థానం తీర్పు)

    But on a close reading of the various provisions in the Act, I find that merely because an aggrieved person mounts the box and states that the person shown as respondent in the cause title committed breach of protection order and thereby he committed the offence, the court cannot proceed against him (2009 సీమ కేసులో కేరళ న్యాయస్థానం తీర్పు, న్యాయమూర్తి మహిళ కావడం ఈ కేసులో విశేషం)

    ReplyDelete
  5. ఓకే. మీరిచ్చిన లా పరిభాష చూసి అర్థంకాక బుర్ర గోక్కుంటే లోనికి దిగిన అర్థమేమిటంటే, గృహహింస నిరోధక చట్టంలో కూడ మానవ హక్కుల ప్రకటనకి భంగం కలగలేదని (atleast in principle). అంతేనా, లేక నాకు తేడాగా అర్థమైందా. నేరం రుజువయ్యేదాక నిందితుడిగానే చూడాలని ఉందంటారు.

    అలా ఐతే పురుషహక్కుల కార్యకర్తలు రివర్సులో చెప్తున్నారు మరి.

    ౧) వాళ్ళ వాదన అసహేతుకమా?
    ౨) లేక చట్టం రాతలో మానవహక్కుల ప్రకటనకి అనుగుణంగానే ఉన్నా, అమలులో, స్పూర్తిలో విరుద్దంగా ఉందా?
    ౩) లేక నేను అర్థం చేస్కోటంలో పొరబడ్డానా?

    ReplyDelete
    Replies
    1. నా తెలుగు తర్జుమా వల్ల ఇబ్బంది ఉన్నట్టుంది కనుక ఇంగ్లీషులో జవాబిస్తాను.

      Courts usually refuse to rely solely on the complainant's testimony in the absence of other corroborative evidence. Defendants could often produce multiple testimonies & evidences. Obtaining a conviction was therefore very difficult even in genuine cases.

      Domestic Violence Act section 32 (2) tries to eliminate this procedural lacuna. The defendant is still presumed innocent till proven otherwise. The burden of proof is still with the accuser. The judge will still consider all evidence produced by both parties.

      The only difference is that the accused can't say "please acquit me as the prosecution has not produced any other evidence except the complainant's testimony".

      There is no violation of natural law, common principles or UDHR whatsoever.

      1. Yes they are wrong
      2. I understand there have been cases where women have resorted to extortion and/or blackmail with the connivance of police/politicians/goondas. Most of these cases are "settled" out of court.
      3. I believe you took the arguments of the "anti-feminists" at face value

      Delete
    2. జై గారు,
      ఓపిక చేస్కుని వివరించినందుకు థాంక్స్. క్రితం కామెంట్లో మీరు చెప్పిన భాష ప్రాబ్లం కాదు, చెప్పిన పాయింట్లకి కాంటెక్స్‌ట్ అర్థంకాక అర్థం చేస్కోలేకపోయాను. ఈసారి వివరంగ చెప్పారు, థాంక్స్.

      ఇకపోతే యాంటీ ఫెమినిస్టుల వాదన మరీ ఫేస్ వాల్యూతో తీస్కున్నా అన్నారు. నిజమే కావచ్చు, మానవ హక్కుల ప్రకటనకి, సహజ న్యాయ సూత్రాలకి విరుద్దంగా డ్రాఫ్ట్ చేయబడిందనే వాదన వాళ్ళదే. కాకపోతే దురుపయోగమవటానికి పరమ వీలుగా ఉందనే విషయం, బంధువుల్లో ఒకటి, మిత్రుల్లో ఒక కేసు చూసాక నాకు కలిగిన ఉద్దేశమే. ఇతర సాక్షాలు లేకపోయినా ఫిర్యాదీ వాగ్మూలం మాత్రమే పరిగణించి కేసు పెట్టడం, జరగలేదని నిరూపించే బాధ్యత మొత్తం నిందితుల పైనే పెట్టడం సహజ న్యాయసూత్రాలకి విరుద్దం కాదా అని నా అనుమానం. భార్యాభర్తల మధ్య నాలుగుగోడల మధ్య జరిగేదానికి ఆరోపించినవారు సాక్ష్యం చూపించలేరు నిజమే. నిందితులు మాత్రం ఎలా చూపించగలరు? మీ అభిప్రాయం తెల్సుకోవాలనుంది.

      నిర్భయ చట్టం గురించిన చర్చలో ఈ ప్రస్తావన మీద డిస్కషన్ అసంబద్ధమని అనిపిస్తే వేరే సందర్బంలో చర్చించుకోవచ్చు.

      Delete
    3. చైతన్య గారూ,

      "బంధువుల్లో ఒకటి, మిత్రుల్లో ఒక కేసు చూసాక నాకు కలిగిన ఉద్దేశమే"

      నిజమేనండి అయితే ఈ విషయంలో తగినంత caselaw & precedents రాలేదు కనుక ఆచరణ స్థాయి లోపాలు/మోసాలు కూడా చట్టపరమయిన fundamental defects అనిపిస్తున్నాయేమో?

      "భార్యాభర్తల మధ్య నాలుగుగోడల మధ్య జరిగేదానికి"

      సాధారణంగా ఇలాంటి కేసులలో అత్తామామలు (అప్పుడప్పుడు ఆడబిడ్డలు కూడా) కూడా నిందితులే. వీరందరూ భర్త వైపు సాక్ష్యం చెప్పడం కూడా సర్వ సాధారణం. అత్తారింట్లో ఉండడం మూలాన మహిళల వైపు ఇటువంటి సాక్ష్యాలు తీసుకు రావడం కష్టం. దీనితో level playing field చెడిందన్న అవగాహన/భావన రావడంతో గృహ హింస చట్టంలో ఈ మార్పు చేసారని నా అభిప్రాయం.

      జడ్జీలు మనుషులే అయినా ఎవరి సాక్ష్యం నిజమయిందో తెలుసుకోవడంలో వారికి కొంత శిక్షణ & అనుభవం ఉంటాయి. Secondary or corroborative evidence ద్వారా కొన్ని నిజాలు నిగ్గు తేలవచ్చు. ఉ. పెళ్లి అయిన వెంటనే భర్త ఇల్లు కారు వంటివి కొంటె కట్నం తీసుకొనే ఉంటాడని అనుకోవొచ్చు. గతంలో కాలేజీ రోజులలో చీటికి మాటికీ ఇతరులలో ఘర్షణ దిగే వాడని తెలిస్తే ఆయనకు హింసా ప్రవృత్తి ఉందని అనుకోవొచ్చు. రెండూ కలిపి చూస్తె ఇంకా కట్నం కావాలని హింసించాడన్న అభియోగం నిలబడే అవకాశం ఉంది. This standard of proof is called "preponderance of evidence".

      "డిస్కషన్ అసంబద్ధమని అనిపిస్తే"
      కొంత దారి మల్లినట్టే అనిపిస్తుంది కానీ బ్లాగు యజమాని అభ్యంతరం పెట్టలేదు కనుక ఇక్కడ దాకా సాగదీసాను. Maybe we stop now & resume at a more appropriate post.

      Delete
    4. Yeah, we should stop now. Anyway, got to know few new things, thanks.

      Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్