Breaking News

సమాజంలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధానకారణం ఏమిటి?


7 comments:

  1. ఆడపిల్లలు పుడితే భారంగా భావించడం, ఇంకా వాళ్ల చదువులు, సంధ్యలు వృధాగా భావించడం, వారి పెళ్లిలకు అయ్యే కట్నకానుకల భయాలకు తల్లిదండ్రులు లోనవడం, వారి రక్షణ ఏర్పాట్లు ఇబ్బందిగా అనిపించడం...ఇవ్వన్నీ చూస్తే ఆడపిల్లలను కనే కంటే మగపిల్లలే బెస్ట్ అనే దౌర్భాగ్యపు స్థితికి ఈనాటి సమాజం దిగజారిపోయింది.ఇవన్నీ స్త్రీల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలే!

    ReplyDelete
  2. జాగ్రత్తగా గమనిస్తే మన తెలుగురాష్ట్రాలలో ఈ సమస్య లేదు. ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనూ తమిళనాడులోనూ ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలలో ఈ సమస్య కొద్దిగా తలెత్తడానికి కారణం - అవి ఉత్తర భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు కావడం. తెలుగురాష్ట్రాలలో ఇద్దరు పిల్లలూ ఆడపిల్లలే అయిన కుటుంబాలెన్నో! కొన్ని కుటుంబాలలో ముగ్గురాడపిల్లలు కూడా కనపడుతున్నారు. ఇద్దరూ మగపిల్లలే ఉన్న తెలుగు కుటుంబాలు మాత్రం చాలా చాలా అరుదు. This is my personal observation.

    ReplyDelete
    Replies
    1. తమిళనాడు పరిస్తితి బాగానే ఉన్నట్టుందండీ. యూపీ, పంజాబ్ & హర్యానాలలో సమస్య తీవ్రంగా ఉంది.

      Delete
    2. మహోజస్ గారు ఎందుకో ఈ సమస్య మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కువుగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఎక్కువుగా అగ్ర కులాలలో ఉంది. చాలా మంది అబ్బాయిలకి పెళ్లిళ్లు కూడా కావడం లేదు.

      Delete
    3. @K.S.Chowdary,
      అబ్బాయిలకు పెళ్లి కాకపోతే నష్టమేమిటి? ?

      Delete
    4. Sriram గారు మీ ప్రశ్న చాలా వింతగా ఉంది.ఈ ప్రశ్న వెనుక అంతరార్థం నాకు బోధపడలేదు.

      Delete
  3. పెళ్ళిళ్ళకీ, ఆడ జనాభా పరిమాణానికీ సంబంధమేమీ లేదని నేననుకుంటున్నాను. మన దేశంలో పెళ్ళికి జనం పెట్టుకునే parameters చాలా ఎక్కువ. అందం, కులం, శాఖ, ప్రాంతం, కట్నం అని బిగదీసుకు కూర్చుంటారు. అందువల్ల పెళ్ళిళ్ళు కావు. ఈమధ్య వీటికి తోడు - చదువూ, జీతం డిమాండ్లు కూడా తోడయ్యాయి. ఇంకొంతమందైతే తమ కాబోయే వధువుల్ని "సోషల్ గా (సిగ్గులేకుండా) ఉండగలవా?" అని అడుగుతున్నారు.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్